Don't Miss!
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Intinti Gruhalakshmi Today Episode: తులసికి థ్యాంక్స్ చెప్పిన నందూ.. నన్ను క్షమించు అంటూ ఏడుస్తూ!
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన తల్లిని ఇంటికి వచ్చేలా చేసిన సామ్రాట్‌కు తులసి ఫోన్ చేసి ధన్యవాదాలు చెబుతుంది. దీంతో అతడు ఎంతో సంతోషంగా ఉంటాడు. అలాగే, తులసితో కలిసి తిరిగినవి అన్నీ గుర్తు చేసుకుని సంతోషిస్తాడు. ఆ సమయంలో వాళ్ల బాబాయి వచ్చి సామ్రాట్ ప్రేమలో పడ్డాడని అనుకుంటాడు.
మరోవైపు, తన దగ్గరకు వచ్చిన తల్లితో తులసి మనసు విప్పి మాట్లాడుతుంది. అలాగే, తన తండ్రి గురించి కూడా మాట్లాడుతుంది. ఇక, కాలేజ్ పార్టీలో డ్యాన్స్ వేయడానికి నేర్పించమని దివ్య తన వదినలు అంకిత, శృతిని కోరుతుంది.
బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!

వాక్‌మెన్ తీసుకొచ్చిన సామ్రాట్
తులసి, సరస్వతి ఇంట్లో ఉండగా ఓ పాట వినిపిస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరూ దాని కోసం వెతుకుతూ ఉంటారు. తన చిన్నతనంలో తల్లి పాడిన పాటను విని తులసి బాగా సంతోషిస్తుంది. అప్పుడు సరస్వతి వాక్‌మెన్‌ను చూస్తుంది. అనంతరం 'అవును.. ఈ వాక్ మెన్ ఇక్కడికి ఎలా వచ్చంది' అని అడుగుతుంది. దీంతో తులసి 'నాకు అదే అర్థం కావడం లేదు' అంటుంది. ఇంతలో సామ్రాట్ అక్కడకు ఎంట్రీ ఇస్తాడు. వచ్చి రావడమే 'వాక్‌మెన్ అంటే వాక్ చేసుకుంటూ దానంతట అదే రాదు కదా' అంటాడు. దీంతో అది సామ్రాట్ తెచ్చాడని అర్థం అవుతుంది.

నిన్ను దేవుడే అనాలా అంటూ
ఆ తర్వాత సామ్రాట్ 'మీకు ఇష్టమైన వాక్‌మెన్ మీదగ్గరే ఉంది. ఇక ఇద్దరూ సంతోషంగా పాత పాటలను వినండి' అంటాడు. అప్పుడు సరస్వతి 'చాలా సంతోషం బాబు. నా సంతోషమే కాదు.. నా బిడ్డ సంతోషాన్ని కూడా ఈ రూపంలో తీసుకొచ్చావు. ఈ విషయంలోనే కాదు.. చాలా వాటిలో తనకు అండగా ఉంటున్నావు. ఈ వయసులో విడాకులు తీసుకున్నా నా బిడ్డ జీవితం ఏమైపోతుందో అని అనుకున్నా.
ఆ కష్టం తెలియకుండా తన పెదాలపై చిరునవ్వు కనిపించేలా చేశావు. నిన్ను దేవుడు అనాలా.. ఇంకేమనాలో కూడా నాకు తెలియడం లేదు' అంటుంది. తర్వాత సామ్రాట్‌కు సరస్వతి కాఫీ తీసుకెచ్చేందుకు వెళ్తుంది. అప్పుడు తులసి అతడికి థ్యాంక్స్ చెబుతుంది. దీంతో సామ్రాట్ థ్యాంక్స్ వద్దు అంటాడు.
స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్ కూడా పైకి లేపేసి మరీ!

బిల్లులన్నీ కట్టాలి అని చెప్పి
ఇక, నందూ ఢీలాగా ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు లాస్య 'నేనేం చేసినా.. ఏం మాట్లాడినా నందూ నా వైపే మళ్లాలంటే నేను ఏం చేయాలి' అనుకుంటూ.. 'నందూ.. ఇంటర్వ్యూకు వెళ్లావు కదా.. రిజల్ట్ ఏమైంది' అని అడుగుతుంది. దీంతో నందూ జాబ్ వచ్చి ఉంటే నేను ఇలా ఉండను కదా అంటాడు. అప్పుడామె 'నీ జాబ్ గురించి మాట్లాడనులే.
కనీసం ఇంటి విషయం అయినా మాట్లాడొచ్చా' అంటుంది. దీంతో నందూ ఎవరి మీదైనా కంప్లైంట్ చేయాలా అని అడుగుతాడు. దీనికి లాస్య 'కంప్లయింట్ తప్పితే నాకేం పని లేదా. కారణం లేనిదే ఎవరి మీద అయినా ఎందుకు ఫిర్యాదు చేస్తాను? కరెంట్ బిల్లు కట్టాలి.. ఇంటర్నెట్ బిల్లు కట్టాలి.. ప్రాపర్టీ టాక్స్ కట్టాలి' అంటూ చెబుతుంది. దీంతో జాబ్ వచ్చే వరకూ మేనేజ్ చెయ్ అని అంటాడతను.

మగాళ్లు మొండివాళ్లు అంటూ
తులసి, సామ్రాట్ ఆఫీసులో బిజీగా ఉంటారు. అనంతరం తులసి.. సామ్రాట్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు అతడు నా గురించి ఏం మాట్లాడుతున్నారు ఆఫీసులో అని అడుగుతాడు. దీంతో 'నేను ఆఫీసుకు వచ్చింది పని చేయడానికి మాత్రమే. అందరి దగ్గరికి వెళ్లి మీ గురించి తెలుసుకోవడానికి మాత్రం కాదు. మీరు అద్భుతమైన బహుమతిని ఇచ్చినందుకు థాంక్స్. ఆడాళ్ల దగ్గర ఉన్న బలహీనత అదే.
మనసులో ఉన్న అనుభూతిని దాచుకోవడం చేతగాదు. కానీ, మగాళ్లు మొండోళ్లు. అస్సలు మనసులో ఏం దాచుకుంటారో అస్సలు బయట పడరు' అని అంటుంది.
నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!

రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అనగానే
తులసి మాటలకు సామ్రాట్ 'అందరు మగాళ్లను అంటున్నారా? లేక నన్నే అంటున్నారా' అని సూటిగా ప్రశ్నిస్తాడు. దీంతో తులసి మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటుంది. అనంతరం సామ్రాట్ 'ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చింనందుకు నాకు రిటర్న్ గిఫ్ట్ ఏం ఇవ్వరా? అంటే పార్టీ లాంటిది ఏమీ లేదా' అని అడుగుతాడు. దీంతో తులసి 'నేను మీ రేంజ్ పార్టీ ఇప్పించలేను. కానీ, ఆ రోజు లాంటి రోజ్ మిల్క్ పార్టీ ఇప్పిస్తా' అంటుంది. దీంతో సామ్రాట్ భయపడి వామ్మో నేను మళ్లీ అలాంటి పద్మవ్యూహంలోకి రాను అంటాడు. అప్పుడు తులసి లంచ్‌కు బయటకు వెళ్దాంలే అంటుంది.

వాళ్ల మాటల వినేసిన నందూ
బాక్సులో ఎన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయో అనసూయ చూస్తుంది. ఆ తర్వాత ఇవి రేపటితో అయిపోతాయి అంటుంది. దీంతో పరందామయ్య.. నందూకు చెప్పు అంటాడు. అప్పుడు అనసూయ 'వాడికి ఉద్యోగమే లేదు. మనకు ఇప్పుడు వాడు ఏం తెస్తాడు. ఉద్యోగం వస్తేనే మన కష్టాలు గట్టెక్కేది' అంటుంది. ఈ మాటలు విన్న నందూ 'అమ్మానాన్నలను తులసి దగ్గర ఉంచేయాల్సింది.
నా దగ్గర ఉంచుకొని బాధపెడుతున్నా' అని అనుకుంటాడు. ఇక పరందామయ్య 'మరి.. అభికో, ప్రేమ్‌కో చెప్పలేకపోయావా' అంటాడు. దీంతో అనసూయ 'వాళ్లకు చెబితే అప్పో సప్పో చేసి తెస్తారు. కానీ, దాని కోసం వాళ్లు ఎంత బాధపడతారో' అంటుంది. దీనికి పరందామయ్య అయితే వద్దులే.. కానీ, రోజూ మనం ట్యాబ్లెట్లు వేసుకున్నట్లు నటిద్దాం అంటాడు.
Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్

ట్యాబ్లెట్లు పంపించిన తులసి
నందూ వాళ్ల మాటలు వింటుండగానే కొరియర్ ద్వారా తులసి మందులు పంపుతుంది. అవి తీసుకున్న నందూ 'నేను ఇక్కడ ఉన్న నా తల్లిదండ్రులను చూసుకోలేకపోతోన్నా. నువ్వు దూరంగా ఉన్నా చూడగలుగుతున్నావు థ్యాంక్స్ తులసి' అని అనుకుంటాడు. తర్వాత వాటిని తన తల్లిదండ్రులకు ఇస్తాడు. అప్పుడు నందూ తెచ్చాడని వాళ్లు అనుకుంటూ ఉంటారు. అప్పుడు 'ఇవి తెచ్చింది తులసే. నేను మీకు మందులు కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించండి' అంటూ ఏడుస్తాడు. దీంతో వాళ్లు కూడా బాధ పడతారు. తర్వాత తులసి ఫోన్ చేసి మందులు పంపించానని పరందామయ్యకు చెబుతుంది. దీంతో వాళ్లు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఆమెతో మాట్లాడతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.