Intinti Gruhalakshmi Today Episode: చివరి నిమిషంలో లాస్యకు షాకిచ్చిన నందూ.. తులసి నయా ప్లాన్‌ రెడీ

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూసేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూతో పెళ్లి కోసం లాస్య ఎంతో ఆరాటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే అందరినీ తన పెళ్లి కోసం సిద్ధం చేయాలని అనుకుంటుంది. కానీ, ఇంట్లో వాళ్లు ఆమెకు సహకరించరు. మరీ ముఖ్యంగా మంగళ స్నానం చేయించేందుకు లాస్య ఇంట్లో వాళ్లను పిలవగా.. వాళ్లంతా రామని చెబుతారు.

దీంతో లాస్యనే స్వయంగా స్నానం చేస్తుంది. అనంతరం నందూ దగ్గరకు వెళ్లి ఈ విషయం చెబుతుంది. తర్వాత నందూకు ఇంట్లో వాళ్లు స్నానం చేయించాలని రెచ్చగొడుతుంది. కానీ, ఎవరూ అందుకు ముందుకు రారు.

లాస్యకు మళ్లీ హ్యాండిచ్చిన ఫ్యామిలీ

లాస్యకు మళ్లీ హ్యాండిచ్చిన ఫ్యామిలీ

పెళ్లి సమయం దగ్గర పడడంతో పనులన్నీ చకచకా జరుగుతూ ఉంటాయి. అప్పుడే భాగ్య.. ఇంటికి వచ్చి అనసూయతో మాట్లాడుతుంది. సరిగ్గా అదే సమయంలో తన పెళ్లి కోసం కుటుంబ సభ్యులు అందరికీ బట్టలు తీసుకొస్తుంది. దీంతో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావంటూ అనసూయ ఆమెను అడుగుతుంది. తర్వాత నందూ కూడా ఇవన్నీ ఎందుకు అని అడుగుతాడు. దీనికి లాస్య పెళ్లి కదా అందుకే బట్టలు తెచ్చానని అంటుంది. భాగ్య కూడా ఏదో అనబోతుంది. కుటుంబ సభ్యులు అందరూ సీరియస్ గా చూస్తారు. ఒక్కరూ మాట్లాడరు. దీంతో ఆమె సైలెంట్ అయిపోతుంది.

పెళ్లి కోసం వాళ్లకు లాస్య బహుమతి

పెళ్లి కోసం వాళ్లకు లాస్య బహుమతి

లాస్య బట్టలు తీసుకు వచ్చిన తర్వాత అందరూ ఆమెను కోపంగా చూస్తూ ఉంటారు. భాగ్య సైలెంట్‌గా ఉన్నా లాస్య మాత్రం 'ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు? నలుగు పెట్టుకోవడం అంటే నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను. కానీ పెళ్లి అంటే అలా కాదు కదా. అందరూ ఉండాలి కదా. నా పెళ్లికి అందరూ ఇవే బట్టలు వేసుకొని రావాలి.

నందూ పెళ్లి కొడుకు ఫ్యామిలీతో పాటే బరాత్‌లో రావాలి. అందరినీ దగ్గరుండి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. ఇక నేను వెళ్తున్నా.. మీరు అందరూ తొందరగా రెడీ అవ్వండి. అత్తయ్య మీరు నా తోడు పెళ్లి కూతురు' అని అంటుంది.

తులసి దగ్గరకు వెళ్లిపోయిన నందూ

తులసి దగ్గరకు వెళ్లిపోయిన నందూ

లాస్య రెడీ అవడానికి వెళ్లగా.. నందూ మాత్రం తులసి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తులసిని ఒక్క నిమిషం అని పిలుస్తాడు. కానీ.. ఆమె మాత్రం మాట్లాడటానికి నిరాకరిస్తుంది. దీనికి ఎందుకలా దూరంగా వెళ్లిపోతున్నావని అడుగుతాడు. కానీ, తనకు ఇప్పుడు మాట్లాడటం ఇష్టం లేదంటుంది. అప్పుడు నందూ సరే.. నువ్వు మాట్లాడకపోయినా నేను చెప్పేది విను అంటాడు. అప్పుడు తులసి 'మన విడాకుల సమయంలో నేను కూడా ఇలాగే మాట్లాడాను. ఇలాంటి బాధే అనుభవించాను' అంటుంది. వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం లాస్య, భాగ్య చూసి షాక్ అవుతారు.

లాస్యను రెచ్చగొట్టెందుకు భాగ్య ప్లాన్

లాస్యను రెచ్చగొట్టెందుకు భాగ్య ప్లాన్

నందూ, తులసి మాట్లాడుకుంటుండగా చూసిన భాగ్య.. 'వావ్.. ఎంతైనా బావ గారు లక్కీ ఫెలో. ఓవైపు కాబోయే భార్య, మరోవైపు మాజీ భార్య. పెళ్లికి ముందు ఎవరైనా తనకు కాబోయే భార్యను చాటుగా కలుసుకొని తన అచ్చటా ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ, బావ గారు మాత్రం తన మాజీ భార్యతో ఆ ముచ్చట్లు తీర్చుకుంటున్నాడు. నాకు తెలిసి నీ పెళ్లి జరిగే దాకా నమ్మకం కుదరడం లేదు లాస్య' అంటూ చెబుతుంది. దీంతో లాస్య ఎంతగానో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత లాస్య.. నందూ అని పిలుస్తుంది. అప్పటికే తులసి వెళ్లిపోతుంది.

నందూపై లాస్య ఫైర్.. సైలెంట్‌గానే

నందూపై లాస్య ఫైర్.. సైలెంట్‌గానే

నందూ దగ్గరకు కోపంగా అరుస్తూ వెళ్లిన లాస్య 'ఇంకాసేపట్లో మన పెళ్లి గుర్తుందా? ఏ మురిపం అయినా.. ఏ ముచ్చట్లు అయినా నాతోనే. నువ్వు నాతోనే ఉండాలి. అవతల ముహూర్తం దగ్గర పడుతోంది. వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో నందు. బీ యాక్టివ్' అంటుంది లాస్య. దీనికి భాగ్య 'లాస్య బావ గారు చూశావా.. తన దగ్గర తప్పు లేకపోతే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అలా తలదించుకొని వెళ్తున్నాడేంటి' అని మళ్లీ రెచ్చగొడుతుంది. దీనికి లాస్య 'ఏం చేసినా.. ఇవాళ నా పెళ్లి జరగాల్సిందే. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లంతా నా ట్యూన్‌కు సెట్ కావాల్సిందే' అంటుంది.

మరో డాక్టర్ దగ్గరకు వెళ్లాలని తులసి

మరో డాక్టర్ దగ్గరకు వెళ్లాలని తులసి

నందూ వ్యవహరిస్తున్న తీరుకు తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు 'నన్నెందుకు ఈయన ప్రతి దాంట్లో లాగుతున్నాడు. నా మానాన నేను ఉంటే ఈ గొడవ నాకెందుకు. నేను ఇక్కడ ఉంటే నాకు ఇదే టెన్షన్. నేను ఇక్కడ ఉండను వెళ్లిపోతా' అంటూ బయటికి వెళ్లబోతుంది. ఇంతలో డాక్టర్ అద్వైత కృష్ణ ఆమెకు ఫోన్ చేస్తాడు. 'తులసి.. మీ ఆపరేషన్ ఇవాళ పోస్ట్ పోన్ అయింది కదా. రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ ఉంటుంది. వెంటనే డాక్టర్ సునీత ఒపినియన్ తీసుకుందాం. వెళ్దాం వస్తారా' అని అంటాడు. దీంతో సరే వాస్తానని రెడీ అవుతుంది తులసి.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
నందూ మనసు మార్చాలని తల్లి ప్లాన్

నందూ మనసు మార్చాలని తల్లి ప్లాన్

పెళ్లి పనులు చకచకా జరుగుతుండగా నందూకు ఏం చేయాలో అర్థం కాదు. తన రూమ్ లోకి వెళ్లి కొత్త డ్రెస్ వేసుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో అనసూయ అక్కడికి వస్తుంది. 'మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎందుకు ఈ పెళ్లి చేసుకోవడం? తులసి మెండితనం చేసిందని విడాకులు తీసుకున్నావు. లాస్య మొండితనం చేసిందని పెళ్లి చేసుకుంటున్నావు. నీకంటూ ఏ ఆలోచన లేదా' అంటుంది. తర్వాత కుటుంబ సభ్యులు అందరూ నందు దగ్గరికి వస్తారు. ఆ సమయంలోనే 'నీ మనసులో మాట లాస్యకు చెప్పే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకేం కాపురం చేస్తావురా' అంటుంది అనసూయ. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. దివ్య మాత్రం తండ్రిని హగ్ చేసుకుని బాధ పడుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X