twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: పెళ్లికి ముందు నందూ మిస్సింగ్.. తులసి కూడా కనిపించకపోవడంతో!

    |

    సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూసేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూతో పెళ్లి కోసం లాస్య ఎంతో ఆరాటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే అందరినీ తన పెళ్లి కోసం సిద్ధం చేయాలని అనుకుంటుంది. అందుకోసం అందరికీ బట్టలు తీసుకుని వస్తుంది. అప్పుడు వాటిని ఎవరూ తీసుకోరు.

    అనంతరం నందూ, తులసితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది చూసిన లాస్య అతడిపై తీవ్రంగా ఫైర్ అవుతుంది. ఆ తర్వాత తులసి సర్జరీ వాయిదా పడడంతో ఆమెను మరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేందుకు అద్వైత కృష్ణ ప్రయత్నిస్తాడు. దీనికి తులసి కూడా సహకరిస్తుంది.

    Bigg Boss: శ్రీరామ చంద్ర పరిస్థితి దారుణం.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు.. అలా చేస్తే ప్రమాదమేBigg Boss: శ్రీరామ చంద్ర పరిస్థితి దారుణం.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు.. అలా చేస్తే ప్రమాదమే

    పెళ్లికి ముందే డిసైడ్ అయిన నందూ

    పెళ్లికి ముందే డిసైడ్ అయిన నందూ

    తన పెళ్లికి సహకరించమని తులసిని లాస్య కోరుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఆ సమయంలో ఆమెలోని భయాన్ని గుర్తించిన తులసి.. 'నీకు ఎప్పుడూ నా గురించే ఆలోచనా? నందూ మాజీ భార్య గురించి కాదు.. ముందు నీ గురించి ఆలోచించుకో' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు నందూ పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు. కానీ, దీర్ఘంగా దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో నందూకు అర్థం కాదు. తులసే గుర్తుకు వస్తుంటుంది. ఆ సమయంలో నందూ పెళ్లికి ముందే ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని అనుకుంటాడు.

    మా బంధం ఎప్పుడో తెగిపోయిందిగా

    మా బంధం ఎప్పుడో తెగిపోయిందిగా

    మరోవైపు, తులసిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తానని చెప్పిన అద్వైత కృష్ణ ఆమె కోసం వేచి చూస్తుంటాడు. ఇంతలో తులసి అక్కడకు వస్తుంది. దీంతో లేట్ అయినందకు సారీ చెబుతుంది. అప్పుడతను 'నే మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే నందూ, లాస్య పెళ్లి మండపం నేనే తయారు చేయించాను కదా' అంటాడు. అప్పుడు తులసి 'మీకు నేను పేషెంట్‌ను మాత్రమే. కానీ, మీకు ఇక్కడ చాలా మందితో అనుబంధం ఉంటుంది కదా' అంటుంది. దీనికతడు ఇవన్నీ చూసి మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారని ప్రశ్నించగా.. మా బంధం ఎప్పుడో తెగిపోయిందంటుంది.

    Bigg Boss Winner: సన్నీ గెలుపుపై సరయు సంచలన పోస్ట్.. ఆ కంటెస్టెంట్‌కు అన్యాయం చేశారంటూ!Bigg Boss Winner: సన్నీ గెలుపుపై సరయు సంచలన పోస్ట్.. ఆ కంటెస్టెంట్‌కు అన్యాయం చేశారంటూ!

    అద్వైతకు థ్యాంక్స్ చెప్పిన తులసి

    అద్వైతకు థ్యాంక్స్ చెప్పిన తులసి

    ఒకపక్క పెళ్లి జరుగుతున్నా పాజిటివ్‌గా మాట్లాడుతున్న తులసి ప్రవర్తనను చూస్తూ అద్వైత కృష్ణ ఆశ్చర్యపోతుంటాడు. అప్పుడామె 'లాస్య, నందూ మధ్య ఎప్పుడో బంధం మొదలైంది. పెళ్లి అనేది కేవలం ఒక కృతువు మాత్రమే. ఏది ఏమైనా మీకే నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నన్ను రిసార్ట్ నుంచి బయటికి పంపిస్తున్నందుకు' అని అంటుంది. తర్వాత కాసేపు ఇద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్దామనుకుంటారు. అప్పుడు తులసి కృష్ణుడి బొమ్మను చూసి ఈ పెళ్లికి ఆయన వెనుకడుగు వేయకుండా ఉంటే చాలు అంటూ అక్కడి నుంచి కదులుతుంది.

    పెళ్లికి ముందు నందూ పరార్ అవగా

    పెళ్లికి ముందు నందూ పరార్ అవగా

    ఇక, నందూ, లాస్య పెళ్లికి సమయం దగ్గర పడుతుంది. పంతులు కూడా వచ్చి పనులు ప్రారంభిస్తాడు. అంతలో పెళ్లి కూతురుగా లాస్య రెడీ అయి అక్కడకు వస్తుంది. దీంతో భాగ్య ఆమెను చూసి ఎంతగానో సంతోషిస్తుంది. అంతేకాదు, 'కుందనపు బొమ్మలా ఉన్నావు.

    పెళ్లికి కావాల్సిన సమాన్లు అన్నీ సిద్ధం. పెళ్లి కూతురు కూడా సిద్ధం. ఇక పెళ్లి కొడుకు రావడమే ఆలస్యం' అంటుంది. అప్పుడు ముహూర్తానికి ఇంకో 10 నిమిషాలే సమయం ఉంది అంటాడు పంతులు. దీంతో నందూ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ, అతడు మాత్రం పెళ్లి మండపం దగ్గర కనిపించడు.

    Bigg Boss: షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్.. కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?Bigg Boss: షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్.. కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?

     గొడవ చేసిన లాస్య... వాళ్లంతా షాక్

    గొడవ చేసిన లాస్య... వాళ్లంతా షాక్

    వివాహానికి సమయం దగ్గర పడుతుండుతున్నా నందూ మాత్రం కనిపించడు. దీంతో లాస్య నేనే నందూను పిలుచుకొస్తాను అని నందూ నందూ అని గట్టిగా పిలుస్తుంది. అంతేకాదు, 'నందూ ముహూర్తం మించిపోతోంది. తొందరగా రా' అంటుంది. కానీ, అతడు మాత్రం రాడు. అప్పుడు ఇంటి ముందుకు వెళ్లి అనసూయతో 'అత్తయ్యా.. నందూను త్వరగా పంపించండి' అని అడుగుతుంది. దీనికి అనసూయ 'నేను పంపించాలా? పళ్లు రాలిపోతాయి' అని అంటుంది. దీంతో లాస్య.. నందూను వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఆమె ప్రవర్తనతో అంతా షాక్ అవుతారు.

    లాస్యపై ఫైర్ అయిన నందూ తల్లి

    లాస్యపై ఫైర్ అయిన నందూ తల్లి

    అనసూయ ఎంత చెబుతున్నా లాస్య మాత్రం వినిపించుకోకుండా ఇంట్లోకి వెళ్తుంది. కానీ, నందూ మాత్రం ఉండడు. దీంతో బయటకు వచ్చి ఇంట్లో వాళ్లను మళ్లీ ప్రశ్నిస్తుంది. దీంతో అనసూయకు చిర్రెత్తుకొస్తుంది. అప్పుడామె 'నన్ను అడుగుతావేంటే మాకేం తెలుసు.

    నీకు కనిపించకపోతే ఫోన్ చేసుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా? నందూ ఇంట్లో లేడు అంటే అర్థం కాదా' అంటూ ఫైర్ అవుతుంది. అయినా లాస్య వినకపోవడంతో 'నా కొడుకుకు, నీకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి అయ్యేదాకా ఇంట్లోకి అడుగు పెట్టావంటే అస్సలు మంచిగుండదు' అని అరుస్తుంది.

    RRR మూవీ సంచలన రికార్డు: ఇండియాలోనే ఏకైక సినిమాగా ఘనత.. వామ్మో ఆ దేశంలో కూడా ఈ రేంజ్‌లోనా!RRR మూవీ సంచలన రికార్డు: ఇండియాలోనే ఏకైక సినిమాగా ఘనత.. వామ్మో ఆ దేశంలో కూడా ఈ రేంజ్‌లోనా!

    తులసిపై లాస్య, భాగ్య అనుమానం

    తులసిపై లాస్య, భాగ్య అనుమానం

    పెళ్లికి సమయం దగ్గర పడుతున్నా నందూ రాకపోగా.. కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. దీంతో లాస్య పిచ్చెక్కిన దానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడే తులసి దగ్గరికి వెళ్లి ఉంటాడా అని అనుకుంటుంది లాస్య. దీనికి భాగ్య 'నీకో విషయం తెలుసా లాస్య. ఇక్కడ బావ గారు లేరు.. అక్కడ తులసి లేదు. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో' అని మరింతగా అనుమానిస్తుంది.

    తర్వాత దివ్య బయటికి వచ్చి ఏం జరుగుతుందో చూస్తుంది. 'నిజమే నానమ్మ.. డాడీ ఈ రిసార్ట్‌లో లేరు. డాడీకి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదట. తను టెన్షన్ పడుతుంది' అని అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు కూడా నందూకు ఫోన్ చేస్తుంటారు. కానీ, అతడు లిఫ్ట్ చేయడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 510: Doctor Advaitha Krishna Shocked by Tulasi Behaviour. After That Nandhu Escape From The House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X