Intinti Gruhalakshmi Today Episode: తిరిగొచ్చి మరో షాకిచ్చిన నందూ.. కోర్టుకు లాగి పరువు తీస్తానంటూ!
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. డాక్టర్ దగ్గరకు వెళ్లిన అద్వైత కృష్ణ, తులసి.. నందూ, లాస్య పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి అతడితో తన బాధలను చెప్పుకుంటుంది. అనంతరం వాళ్లిద్దరూ వెల్‌నెస్ సెంటర్‌కు చేరుకుంటారు. అప్పుడు లాస్య.. నందూ ఎక్కడ ఉన్నాడంటూ తులసిని ప్రశ్నిస్తుంది. తనకు తెలియదని చెప్పిన తులసిపై లాస్య తీవ్రంగా ఫైర్ అవుతుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. దీంతో తులసి, లాస్యకు బుద్ధి వచ్చే విధంగా మాట్లాడడంతో పాటు తన బలాన్ని కూడా ఆమెకు చూపుతుంది.

పెళ్లి పందిరి పీకి అవతల పాడేస్తానంటూ
తనపై కోప్పడిన లాస్యకు తులసి గట్టిగానే బదలు చెబుతుంది. ఆ సమయంలోనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని నలిపేస్తుంది. అంతేకాదు, 'ఈ చేతులకు కడుపు నిండా అన్నం పెట్టడం తెలుసు.. తింగరి వేషాలు వేస్తే కర్ర కాల్చి వాత పెట్టడమూ తెలుసు. నాది చపాతీలు చేసే చేయి.. నీది నెయిల్ పాలిష్‌లు పెట్టకునే చేయి. తీయ్ నా చేయిని విదిలించుకో. ఈ గొడవ ఇక్కడితో వదిలేద్దాం. ఇంకోసారి నీ నోరు లేచిందంటే.. మా వాళ్ల గురించి ఒక్క మాట మాట్లాడినా ఈ పెళ్లి పందిరే పీకి అవతల పడేస్తాను. అప్పుడు చేసుకుందువు గాని పెళ్లి' అంటూ గట్టిగానే హెచ్చరిస్తుంది తులసి.

తులసికి నందూ ఫోన్.. గట్టిగా అరుస్తూనే
లాస్యతో తులసి గొడవ పడుతోన్న సమయంలోనే నందూ ఆమెకు ఫోన్ చేస్తాడు. అప్పుడు తులసి 'ఎక్కడున్నారు మీరు? మీరు ఎక్కడున్నా నాకు అవసరం లేదు. వెంటనే మీరు ఇక్కడికి రండి' అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు నందూ తులసితో ఒంటరిగా మాట్లాడాలని అంటాడు. దీనికామె 'ఏది మాట్లాడాలన్నా ఇక్కడే. ముందు ఇక్కడికి రండి. మీ వల్ల నా వాళ్లు బాధపడుతున్నారు. ముందు ఇక్కడికి వచ్చేయండి' అని అంటుంది. అంతలో లాస్య.. తులసి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని నందూ ఎక్కడున్నావు అని అడుగుతుంది. దీంతో వెంటనే ఫోన్ కట్ చేస్తాడు నందూ.

తిరిగి వచ్చిన నందూ... ఇద్దరూ ప్రశ్నలు
ఫోన్ కట్ చేసిన తర్వాత అనసూయ 'నా నందూకు నిన్ను పెళ్లి చేసుకోవడమే కాదు.. నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు' అంటుంది. దీనికామె 'ఆరు నూరైనా.. నూరు ఆరైనా నందూ నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే' అంటుంది. ఇంతలో నందూ అక్కడికి తిరిగి వస్తాడు. దీంతో 'ఎక్కడికి వెళ్లారు? ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు?' అని అడుగుతుంది. ఇంతలో లాస్య వచ్చి 'ఏమైపోయావు నందూ? ఎక్కడికి వెళ్లావు? నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను ఏమైపోవాలి? పిచ్చి దానిలా ఈ రిసార్ట్ మొత్తం వెతుకుతున్నాను' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది.

పెళ్లి చేసుకోనని లాస్యకు చెప్పిన నందూ
ఎంత అడుగుతున్నా నందూ మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు అనసూయ 'అలా నోరు మూసుకొని నిలుచుంటావేంట్రా? ఏదో ఒకటి మాట్లాడు' అంటుంది. అప్పుడే లాస్య 'అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతోంది. రా నందూ వెళ్లి పెళ్లి చేసుకుందాం' అంటుంది. కానీ, నందూ మాత్రం రాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది. తర్వాత 'నందూ.. ఈ నాటకాలు చాలు పదా' అంటుంది. అయినా నందూ వెళ్లకపోగా.. ఆమె చేయిని తీసేస్తాడు. అలాగే, 'లాస్య.. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు' అంటాడు. అప్పుడంతా ఆనంద పడతారు.

కోర్టుకు లాగుతా.. పరువు తీస్తా అంటూనే
తర్వాత నందూ తనను వదిలేయమని అంటాడు. దీనికి లాస్య ఎందుకు చేసుకోవని ప్రశ్నిస్తుంది. అప్పుడతను ప్రస్తుతానికి సిద్ధంగా లేనని చెబుతాడు. దీంతో లాస్య 'నన్ను ప్రేమిస్తున్నావు కదా. విడాకులు కాగానే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా.. ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నావు? ఏం జరిగిందని పెళ్లికి సిద్ధంగా లేవు. నాకు సమాధానం చెప్పు. నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అన్నిసార్లు నువ్వు అనుకునేదే జరగదు. నేను అవ్వనివ్వను. నువ్వే కనుక నన్ను పెళ్లి చేసుకోలేదనుకో.. నేను వదిలిపెట్టను. కోర్టుకు లాగి నీ పరువు తీస్తా' అని బెదిరిస్తుంది.

నందూ, లాస్య గొడవ.. తులసి సీరియస్
ఎంత చెప్పినా నందూ సైలెంట్‌గా ఉండడంతో 'నువ్వు ఇప్పటి వరకు లాస్య ప్రేమను, పిచ్చితనాన్ని చూశావు. కోపం వస్తే ఏం చేస్తుందో కూడా చూస్తావు. ప్రేమతో ప్రాణాలు ఎలా ఇస్తుందో.. కోపం వస్తే ప్రాణాలు కూడా తీస్తుంది' అంటుంది లాస్య. ఇంతలో తులసి వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత 'మీరిద్దరూ చిన్నపిల్లలా? అందరూ చూస్తుండగా ఏంటి ఈ గొడవలు? మీరు పెళ్లి చేసుకుంటే చేసుకోండి లేకపోతే మానేయండి. అంతే కానీ, ఈ చిల్లర కొట్లాటలు ఏంటి? మీకు ఇష్టం లేకపోతే ముఖం ముందే చెప్పేయండి. కానీ, పారిపోతే వచ్చేదేముండదు' అంటుంది.

ఈమె కోసమే కదా నన్ను వదిలేశారంటూ
గొడవను ఆపిన తులసి.. నందూతో 'మా వాళ్లు ఏం తప్పు చేశారు? పొద్దటి నుంచి వాళ్లకు చంపుకు తింటోంది. మీ మధ్యలోకి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ, ప్రతిసారి మీరు నన్ను బలవంతంగా లాగుతున్నారు. విడాకులు కూడా ఇచ్చేశాను కదా. నా బతుకు నన్ను బతకనివ్వండి. మీరేం నిర్ణయమైనా తీసుకోండి. కానీ, నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఈవిడ వైపు చూడండి. తను నాకు ఏమాత్రం నచ్చలేదు. సభ్యత సంస్కారం లేదు. దిగజారిపోయి ప్రవర్తిస్తోంది. కానీ, మీకు ఈవిడ గారంటే చాలా ఇష్టం కదా. తన కోసం నన్ను మోసం చేశారు' అంటుంది.

ఎంత మందిని నాశనం చేస్తావు అంటూ
నందూకు ఓ రేంజ్‌లో క్లాస్ పీకిన తులసి.. ఆ తర్వాత లాస్యతో 'నువ్వు బలవంతంగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా.. రేపో మాపో ఆయన నిన్ను వదిలేసి పారిపోడని ఏంటి గ్యారెంటీ? అందుకే.. ప్రేమించడం నేర్చుకో. లాక్కోవడం కాదు. నీ స్వార్థం వల్ల ఎంతమందిని నాశనం చేశావు. కనీసం.. నువ్వు ప్రేమించిన ఆయనను అయినా నాశనం చేయకుండా వదిలేయ్' అంటుంది. ఆ తర్వాత నందూతో 'మీరు కూడా ప్రేమించినప్పుడు ఉన్నంత ధైర్యాన్ని.. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చూపించండి' అని సీరియస్ అవుతుంది తులసి. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











