Intinti Gruhalakshmi Today Episode: లాస్యను పెళ్లి చేసుకున్న నందూ.. అందుకోసమే ఒప్పుకున్నా అనడంతో!

తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనపై నిందలు మోపిన లాస్యపై తులసి ఫైర్ అవుతుంది. అంతేకాదు, ఆమెకు వార్నింగ్ కూడా ఇస్తుంది. సరిగ్గా అప్పుడే నందూ.. తులసికి ఫోన్ చేయగా అతడిపై అరిచేస్తుంది. వెంటనే అక్కడకు రమ్మని కేకలు వేస్తుంది.

అది జరిగిన కొద్ది సేపటికి నందూ మండపం దగ్గరకు వస్తాడు. కానీ, లాస్యను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంటాడు. దీంతో వాళ్లిద్దరికీ పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు కోర్టుకు లాగుతానని, పరువు తీస్తానని బెదిరిస్తుంది. దీంతో తులసి మధ్యలోకి వచ్చి ఈ గొడవలు ఆపమని ఇద్దరికీ గట్టి వార్నింగ్ ఇచ్చేస్తుంది.

అందుకే బయటకు వెళ్లిపోయానంటూ

అందుకే బయటకు వెళ్లిపోయానంటూ

లాస్య, నందూ మధ్య జరుగుతోన్న గొడవతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. తనను పెళ్లి చేసుకోను అన్న నందూకు లాస్య వార్నింగ్ ఇస్తుంటుంది. అప్పుడతను 'నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. నీ ఇష్టం. జైల్లో పెట్టిస్తా అంటావా? పెట్టించు. కానీ నందూ మాత్రం తనకు నచ్చిన పనే చేస్తాడు. ఎవ్వరినీ లెక్కచేయడు. దాని కోసం చివరకు ప్రాణాలు వదులుకోవడానికి కూడా ఏమాత్రం భయపడడు. నీకు ఈ పెళ్లికి భయపడి పారిపోయానని అనుకుంటున్నావా? కాదు.. ఇక్కడ ఊపిరి ఆడక బయటికి వెళ్లాను' అని చెబుతాడు.

ఇష్టం లేదు అంటూనే పెళ్లికి సిద్ధంగా

ఇష్టం లేదు అంటూనే పెళ్లికి సిద్ధంగా

నందూ సీరియస్ అవడంతో లాస్య మాత్రం ఏమీ మాట్లాడదు. అప్పుడతను 'నేను కనిపించలేదనే ఇంత రచ్చ చేస్తావా? మా వాళ్లను బెదిరిస్తావా? నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి జరుగుతుంది లాస్య. కానీ, నీ మీద భయంతో కాదు.. నా కుటుంబం మీద ప్రేమతో. పూజారి గారు మంత్రాలు చదవండి' అంటూ పెళ్లికి రెడీ అవుతాడు నందూ. దీంతో లాస్య తెగ సంతోషిస్తుంది. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. అదే సమయంలో తులసికి మాత్రం ఏడుపు వస్తుంది. దీంతో అందరితో పాటు ఆమె కూడా అక్కడకు బాధగా వెళ్లిపోతుంది.

అవన్నీ గుర్తు చేసుకుని తులసి బాధ

అవన్నీ గుర్తు చేసుకుని తులసి బాధ

పెళ్లికి రెడీ అనడంతో నందూ, లాస్య వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తులసి.. గతంలో నందూతో తన పెళ్లి జరిగిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఒంటరిగా వెళ్లి ఒక చోట కూర్చొని బాధపడుతుంది. ఓవైపు నందూ, లాస్య పెళ్లి జరుగుతూ ఉంటుంది. మరోవైపు, తులసి బాధపడుతూ ఉంటుంది. ఆమెకు ఏం చేయాలో తోచదు. ఇంతలో నందూ.. లాస్య మెడలో తాళి కట్టేస్తాడు. దీంతో వాళ్లిద్దరి పెళ్లి అయిపోతుంది. అప్పుడు లాస్య ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తులసి మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది.

లాస్య నా తోడికోడలు అంటూ జవాబు

లాస్య నా తోడికోడలు అంటూ జవాబు

లాస్యను నందూ పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు మొత్తం బాధగా ఉంటో కూర్చుని ఉంటారు. అంతలోనే నందూ, లాస్య ఇంట్లోకి వస్తుంటారు. దీంతో అందరూ బటయకు వస్తారు. అప్పుడు అక్కడే ఉన్న భాగ్య 'హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టించి.. కోడలను ఇంట్లోకి ఆహ్వానించండి అత్తయ్య' అని అనసూయతో అంటుంది. దీంతో 'నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు అస్సలు ఇన్వాల్వ్ కావొద్దు' అంటూ అనసూయ సీరియస్ అవుతుంది. దీనికి 'నాకెందుకు సంబంధం లేదు? ఇప్పుడు లాస్య నా తోటి కోడలు' అంటూ గడుసుగా బదులిస్తుంది భాగ్య.

బాగుండేది మంగళసూత్రం కాదంటూ

బాగుండేది మంగళసూత్రం కాదంటూ

పెళ్లి చేసుకుని వచ్చిన నందూతో 'మనం ఇక్కడికి వచ్చింది మీ పెళ్లి చూడటానికి కాదు.. తులసి ఆరోగ్యం కోసం' అంటాడు పరందామయ్య. అలాగే, 'ఇది నాకు కోడలే కాదు. ఎవ్వరికైనా హారతి ఇస్తాను కానీ.. దీనికి మాత్రం ఇవ్వను' అంటుంది అనసూయ. అప్పుడు లాస్య తన మంగళసూత్రం ఎలా ఉందని తులసిని అడుగుతుంది. దీనికి తులసి 'బాగుండాల్సింది మంగళసూత్రం కాదు. నీ కాపురం' అంటుంది. దీంతో దాని మీద నీకు నమ్మకం లేదా అని లాస్య అడగ్గా 'నమ్మకం ఉండాల్సింది నాకు కాదు.. నీకు' అంటూ ఘాటుగా సమాధానం చెబుతుంది తులసి.

లాస్య సారీ.. వాళ్లు కంగ్రాట్స్ చెబుతూ

లాస్య సారీ.. వాళ్లు కంగ్రాట్స్ చెబుతూ

ఇక, లాస్య అనసూయకు క్షమాపణలు చెబుతుంది. 'నందూ కనిపించలేదని నేను మీతో అలా అన్నాను. ఎప్పటికైనా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్లం కదా. నేను చెడ్డదాన్ని కాదు అత్తయ్యా. నందూను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను' అంటుంది లాస్య. తర్వాత ఇద్దరూ వెళ్లి పరందామయ్య ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు 'ఒరేయ్ నందూ.. తప్పో ఒప్పో జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడైనా నిజాయితీగా ఉండు. లాస్యతో అయినా కరెక్ట్‌గా ఉండు' అంటాడు పరందామయ్య. తర్వాత అందరూ కంగ్రాట్స్ అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతారు.

భాగ్యకు తులసి వార్నింగ్ ఇవ్వడంతో

భాగ్యకు తులసి వార్నింగ్ ఇవ్వడంతో

ఇంట్లో అందరూ ఆలోచనలో ఉండగా అత్తయ్య అంటూ భాగ్య వచ్చి 'వాళ్లను చూస్తే జాలేస్తుంది. ఈరోజు కోపంలో ఉన్నారు కాబట్టి లాస్యను దూరం పెట్టారు. కోపం తగ్గాక లాస్యను దగ్గరికి తీసుకోరా? బావగారు కూడా చాలా బాధపడుతున్నారు' అంటుంది. అప్పుడు తులసి 'చూడు భాగ్య.. ఒక్కరిని సమర్థించాలని అనుకున్నప్పుడు మంచో చెడో వాళ్ల వెనుకే నిలబడాలి.

అంతే కానీ, వాళ్ల ముందో మాట.. వాళ్ల వెనుకో మాట మాట్లాడకూడదు. నాకు తెలుసు లాస్య వల్ల నీకు ఏదో కలిసి వస్తుందని నువ్వు తనను సమర్ధిస్తున్నావు. తనతో మంచిగా ఉంటున్నావు. మళ్లీ మా వల్ల ఏదైనా సమస్య వస్తుందేమోనని లాస్య మీద చాడీలు చెబుతున్నావు. అది పద్ధతి కాదు. ఇక్కడున్నవాళ్లం అలాంటి వాటికి దూరంగా ఉంటాం' అని వార్నింగ్ ఇవ్వడంతో ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X