Don't Miss!
- News
father: ఆంటీ మీద అంకుల్ కు ఫుల్ డౌట్, అసలే రెండో భార్య, తండ్రిని వెంటాడి చంపేసి !
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Intinti Gruhalakshmi Today Episode: తులసికి మరో అవమానం.. అతడికి ప్రేమ్ వార్నింగ్.. గాయపడ్డ సామ్రాట్
ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే స్వీట్లు పట్టుకుని తులసి ఆ ఇంటికి వెళ్తుంది. కానీ, లాస్య మాత్రం ఆమెను లోపలికి రానివ్వకుండా అడ్డుకుని అవమానించి పంపేస్తుంది. దీంతో తులసి ఏడుస్తూ ఇంటికి చేరుతుంది. ఆమెను చూసిన సామ్రాట్ ధైర్యం చెప్పి ఓదార్చుతాడు. అంతేకాదు, ఏమైందో తెలుసుకుంటాడు.
ఆ తర్వాత తులసిని తీసుకుని సామ్రాట్ లాస్య ఇంటికి వెళ్తాడు. కానీ, అక్కడ వాళ్లను వెళ్లిపోమని లాస్య, నందూ గొడవ పడతారు. కానీ, తులసి మాత్రం అస్సలు వెళ్లేది లేదని ధీటుగా సమాధానం చెప్తుంది.
యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!

నందూ మాటలతో ప్రేమ్ కోపం
ఇంటికి వచ్చిన తులసి 'తల్లి కాబోతున్న నా కోడలితో కాసేపు సరదాగా గడపడానికి, గుండెకు హత్తుకోడానికి సమయం ఇవ్వండి' అంటుంది. అప్పుడు నందూ 'చూడు తులసి.. ఇప్పుడిప్పుడే మనుషులు కుదుటపడుతున్నారు. ఓ రకంగా ఇది నీ పుణ్యమే కాదనను. నువ్వు వెలిగిస్తోన్న దీపాన్ని నువ్వే ఆర్పేయకు. ప్రస్తుతం ఎవరి మనసులు మనశ్శాంతిగా లేవు. దయచేసి బయలుదేరు' అంటాడు. దీంతో ప్రేమ్‌కు కోపం వచ్చి ఇంకోసారి అమ్మను అవమానించాలని అనుకుంటున్నారా? నేను ఒప్పుకోను అంటూ కోప్పడతాడు. దీంతో నందూ అతడిని లోపలికి వెళ్లిపో అంటాడు.

తండ్రికి ఎదురు తిరిగిన ప్రేమ్
ఆ తర్వాత లాస్య 'శృతి ప్రెగ్నెంట్ అయిన విషయం నాకు బయటి వాళ్లు చెబితే తెలిసింది. అంతలా నన్ను పరాయి దానిలా చూస్తున్నారు. అందరి నోళ్లలోనూ తులసి మాత్రమే. ఇంక నా పరిస్థితి ఇంతేనా' అంటుంది. దీంతో ప్రేమ్ 'ఇంతే.. నీ మెంటాలిటీ ఇక్కడ అందరికీ సరిపడదు. నువ్వు మారినట్లు నటిస్తావు కానీ.. మారలేవు.. మారవు' అంటాడు. అప్పుడు నందూ 'నువ్వెవడ్రా మాట్లాడడానికి? ఇక్కడ పెద్దవాళ్లు మాట్లాడుతున్నారు కదా' అంటాడు. దీంతో ప్రేమ్ తండ్రికి ఎదురుతిరిగి సమాధానం చెప్తాడు. దీంతో తులసి అతడిని ఆపాలని చూస్తుంది.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

ప్రేమ్‌ను కొట్టబోయిన నందూ
ప్రేమ్‌ను ఆగమని తులసి చెప్పడంతో సామ్రాట్ 'ఆగండి తులసి గారూ. తను ఏదో మాట్లాడుతున్నాడుగా. నిజాలు చెప్పనివ్వండి' అంటాడు. దీంతో ప్రేమ్ 'అదే నీ ప్లేస్‌లో నేను ఉండుంటే.. నీ చేతిలో సారె పడేసిన వెంటనే వాళ్ల చెంప పగలగొట్టేవాడిని' అంటాడు. అంతలో నందూ వచ్చి ప్రేమ్‌ను కొట్టబోతాడు. దీంతో తులసి మధ్యలోకి వచ్చి నిల్చుటుంది. అయినా ప్రేమ్ ఆగకుండా తండ్రిని తిడుతూ ఉంటాడు. అప్పుడు మళ్లీ కొట్టేందుకు వస్తాడు. ఇంతలో సామ్రాట్ వచ్చి అడ్డు నిలబడతాడు. దీంతో నందూ అతడిపై కూడా ఫైర్ అవుతూ పక్కకెళ్లమంటాడు.

బాధగా వెళ్లిపోయిన తులసి
నందూ మాటలకు సామ్రాట్ 'నేను తప్పుకుంటే నీ పెద్దరికమే పోతుంది. దయచేసి కాసేపు నీ పంతాలను పక్కన పెట్టి లాస్యను దూరంగా తీసుకెళ్లు' అంటాడు. అప్పుడు లాస్య 'ఇంత వరకూ వచ్చిన తర్వాత నేను మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. నేను మాత్రం ఎక్కడికీ వెళ్లను' అంటుంది. అప్పుడు నందూ కూడా 'నువ్వు నాకు జాగ్రత్తలు చెబుతున్నావా? వాడిని నా మీదకు ఉసిగొల్పేలా హింట్లు ఇస్తున్నావా' అంటాడు. దీంతో తులసి 'సామ్రాట్ గారూ.. మనం ఇక్కడికి వచ్చింది సంతోషం కోసం. కానీ, ఇప్పుడలా లేదు. పదండి వెళ్లిపోదాం' అని వెళ్లిపోతుంది.
Bigg Boss 7: బిగ్ బాస్‌కు బాలయ్య షాకింగ్ కండీషన్స్.. నాగార్జునకు మరో దెబ్బ.. ఇండస్ట్రీలో కలకలం

నీ మూర్ఖత్వం వల్లే అంటూ
తులసి వాళ్లు వెళ్లిపోగానే నందూ 'చూశారా.. ఈ ప్రేమ్ పెద్దా చిన్నా లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో' అని అంటాడు. దీంతో పరందామయ్య 'వాడి ఆవేదనలో అర్థం ఉందిరా. కానీ, నీ మాటల్లోనే మూర్ఖత్వం ఉంది. నీ మూర్ఖత్వం వల్లే తులసిని దూరం చేసుకున్నాము. ఈరోజు మళ్లీ అలాంటి తప్పే చేశావు. శుభవార్త చెప్పిన కోడలి కోసం వచ్చిన తులసిని మళ్లీ ఏడ్చుకుంటూ వెళ్లేలా చేశావు. అదంతా ఇంటికి మంచిది కాదు' అంటాడు. దీంతో నందూ 'ఇదంతా నీవల్లే. శుభవార్తను అందరితో పంచుకోవచ్చుగా' అని కోప్పడతాడు. దీంతో శృతి ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అంటుంది. అప్పుడు ప్రేమ్ 'ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు మీ ఆలోచనలు మార్చుకుని శృతితో మాట్లాడండి' అంటాడు.

శృతికి సారీ చెప్పిన ప్రేమ్
లోపలికి వెళ్లిన వెంటనే ప్రేమ్ సారీ శృతి అంటాడు. అంతేకాదు, 'ఒక స్త్రీకి మొదటి సారి తల్లి అవుతున్నాను అని తెలిసిన క్షణాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఆ వార్త అందరికీ చెప్పి పండుగ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ, భర్తగా నా భార్యకు ఆ మధురమైన క్షణాలు లేకుండా చేశాను. పొంగిపోవాల్సిన సమయంలో కుంగిపోయేలా చేస్తున్నాను. ఆనంద భాష్పాలు రావాల్సిన నీ కంట కన్నీళ్లు వచ్చేలా చేస్తున్నాను. నీ భర్త నీ ముందు ఒక నిస్సహాయుడిగా, చేతకాని వాడిగా నిలబడ్డాడు' అంటాడు. దీనికామె నా దురదృష్టానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు ప్రేమ్ అంటుంది. దీంతో ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకోవడం వల్లనే నీకు ఈ దురదృష్టం కావచ్చు అంటాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ బాధ పడతారు.
కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!
చేయి కాల్చుకున్న సామ్రాట్
ఇంటికి వెళ్లిన తర్వాత తులసితో సామ్రాట్ 'మీ పిల్లలు మీకు దగ్గరవడం మీకు ఇష్టం లేదా' అని అడుగుతాడు. దీంతో తులసి 'ఉంది కానీ.. వాళ్ల నాన్నకు దూరం అవడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలు కేవలం నాతోనే ఉండాలి అని కోరుకొని ఉండి ఉంటే.. ఎప్పుడో అది సాధించుకునేదాన్ని. నేను యుద్ధమే చేస్తున్నాను కానీ.. ఆ యుద్ధం నాకోసం. నేను ఎదగడం కోసం అంతే తప్ప.. నా పిల్లల మనసులు గాయం చేయడం కోసం కాదు' అంటుంది. తర్వాత సామ్రాట్ కాఫీ చేయబోతూ చేయి కాల్చుకుంటాడు. దీంతో తులసి అతడిని చూసి చాలా బాధ పడుతుంది. ఇక, శృతి ప్రెగ్నెంట్ అయినందుకు సంతోషంగా ఉండకుండా గొడవ పడ్డామని నందూ బాధపడతాడు. దీంతో లాస్య అతడిని రెచ్చగొడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.