Intinti Gruhalakshmi Today Episode: తులసికి అత్యవసర ఆపరేషన్.. చివరి నిమిషంలో ఆమెను కాపాడిన నందూ
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లైన తర్వాత నందూ చాలా దిగాలుగా ఉంటాడు. దీంతో లాస్య అతడిని ఎందుకలా ఉన్నావని ప్రశ్నిస్తుంది. దీంతో ఇద్దరికీ కాసేపు వాగ్వాదం జరుగుతుంది. అనంతరం తన వాళ్లను ఏమైనా అంటే ఊరుకునేది లేదని.. అది మన రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపిస్తుందని నందూ బెదిరిస్తాడు. అనంతరం నందూ, లాస్య ఫస్ట్ నైట్‌కు ఏర్పాట్లు జరుగుతాయి. ఇక, గార్డెన్‌లో ఉన్న తులసి పాట పాడుతుంది. ఆ సమయంలోనే కింద పడిపోతుంది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతారు.

ఆస్పత్రిలో నందూ.. వెళ్లిపోమన్న ప్రేమ్
పాట పాడుతోన్న సమయంలో తులసి స్పృహతప్పి పడిపోవడంతో నందూ తన ఫస్ట్ నైట్‌ను వదిలేసి మరీ ఆమెను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. దీంతో లాస్యకు మెంటల్ ఎక్కిపోతుంది. మరోవైపు తులసికి ఏమైందో అని నందూ టెన్షన్ పడుతూ ఉంటాడు. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ సమయంలో నందూ 'ప్రేమ్.. ఇక్కడే ఉంటే నువ్వు టెన్షన్ తట్టుకోలేవు. రిసార్ట్‌కు వెళ్లు' అని అంటాడు. దీనికి అతడు 'మీ కొత్త భార్య మీకోసం వెయిట్ చేస్తుందేమో కావాలంటే మీరు వెళ్లండి' అంటూ బదులివ్వడంతో అతడు షాక్ అవుతాడు.

తులసి కోసం రక్తదానం చేసిన నందూ
స్పృహ తప్పి కింద పడిపోయిన తులసికి హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ అద్వైత కృష్ణ 'తులసికి తీవ్ర రక్తస్రావం అయింది. తనకు అర్జెంట్‌గా రక్తం కావాలి. కానీ, ఆ గ్రూప్ బ్లక్ ఎక్కడా దొరకడం లేదు. చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అది. అది దొరికితే వెంటనే ఆమెకు ఎక్కించాల్సి ఉంటుంది' అని అంటాడు. దీంతో నందూ 'నాదీ, తులసిది ఒకే బ్లడ్ గ్రూప్. ఆ రక్తం నేను ఇస్తాను. నా నుంచి తీసుకోండి డాక్టర్' అంటాడు. అందుకు అనుగుణంగానే వెంటనే నందూ రక్తం ఇస్తాడు. ఆ తర్వాత దాన్ని తులసికి ఎక్కించాలని అనుకుంటారు.

అద్వైతకు లాస్య ఫోన్.. ఆ విషయం చెప్పి
ఫస్ట్ నైట్ రూమ్‌లో నుంచి బయటకు వచ్చేసిన నందూను తలుచుకుంటూ కోపంతో రగిలిపోతుంది లాస్య. ఆ సమయంలో భాగ్యను తోడుగా ఉండమంటుంది. అప్పుడామె 'నీ ఫస్ట్ నైట్ రోజు నేను నైట్ అవుట్ చేయాల్సి వస్తోంది' అంటూ లాస్యపై సెటైర్లు వేస్తుంది. ఒక, ఉదయం అయ్యాక రెడీ అయి నందూకు ఫోన్ చేస్తుంది లాస్య. కానీ అతడు లిఫ్ట్ చేయడు. దీంతో డాక్టర్ అద్వైత కృష్ణకు ఫోన్ చేసి నందూ గురించి అడుగుతుంది. దీనికి అతడు 'తులసి ఎలా ఉందని అడుగుతావని అనుకున్నా. నందూ బ్లడ్ డొనేట్ చేస్తున్నాడు. మాట్లాడటం కుదరదు' అంటాడు.

అంకిత మాటలకు భాగ్య, లాస్య ఆశ్చర్యం
ఉదయాన్నే లాస్య రెడీ అయి నడుచుకుంటూ వెళ్తుంటుంది. అప్పుడామెను చూసిన అంకిత పిలుస్తుంది. దీంతో 'ఏంటి అంకితా? నేను ఏం చేస్తున్నానా? ఎలా ఉన్నానా? అని చూడమని నిన్ను రాయభారం పంపించారా' అని అడుగుతుంది. దీంతో అంకిత ఈ తొందరపాటు వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందని తిడుతుంది. దీంతో ఆమె వెళ్లిపోతుంది. ఆ తర్వాత భాగ్య ఎంట్రీ ఇచ్చి లాస్యకు అనుకూలంగా మాట్లాడుతుంది. దీంతో అంకిత ఆమెకు కూడా సరైనా సమాధానాలు చెప్పి నోరు మూయిస్తుంది. ఇలా ఇద్దరూ అంకిత మాటలకు ఆశ్చర్యపోతారు.

తులసి ఆపరేషన్ సక్సెస్.. కోలుకోవడంతో
నందూ రక్తం ఇవ్వడంతో తులసి ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది. దీంతో ఆమె ఆపరేషన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అవుతుంది. ఆ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు. తులసి ఆపరేషన్ సక్సెస్ కావడంతో బయటకు వచ్చిన డాక్టర్ అద్వైత కృష్ణకు అందరూ థ్యాంక్స్ చెబుతారు. దీంతో అతడు 'తులసికి నందూ రక్తం ఎక్కిస్తారు. తనను ఇక నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి' అని చెబుతాడు. తులసికి రక్తం ఇచ్చి వచ్చాక నందూ కాస్త నీరసంగా కనిపిస్తూ ఉంటాడు. దీంతో అలాగే రిసార్ట్‌కు వచ్చి సోఫాలోనే పడుకుండిపోతాడు.

నందూపై లాస్య సెటైర్లు.. అతడి జవాబు
నందూ సోఫాలో పడుకుని ఉండగా.. లాస్య వచ్చి 'తలనొప్పిగా ఉందా? నువ్వు నా గురించి ఆలోచించకపోయినా.. నేను నీ గురించి ఆలోచించాల్సిందే. మాజీ భార్యకు ప్రేమగా రక్తదానం చేసి వచ్చావు కదా. పాపం నీరసంగా ఉండి ఉంటుంది. ఎన్ని లీటర్లు ఇచ్చావు చెప్పు నందూ' అని వెటకారంగా అడుగుతుంది. దీంతో నందూ 'ఏంటి లాస్య? నువ్వు హాస్పిటల్‌కు వచ్చావా? బ్లడ్ ఇచ్చిన విషయం నీకు ఎవరు చెప్పారు' అని అడుగుతాడు. దీంతో డాక్టర్ చెప్పాడని అంటుంది. అప్పుడతను 'ఆస్పత్రికి రాకుండా మంచి పని చేశావ్. లేకుంటే రచ్చ అయ్యేది' అంటాడు.

లాస్యకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నందూ
లాస్యతో ముందు కామ్‌గా మాట్లాడిన నందూ.. ఆ తర్వాత స్వరం పెంచి మరీ ఆమెకు భయం చెప్పే ప్రయత్నం చేస్తాడు. 'ఇక నుంచి అయినా నీ బెదిరింపులు నా ముందు చూపించకు. ప్రతి విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు' అని వార్నింగ్ ఇస్తాడు. అలా ఇద్దరూ కలిసి కాసేపు పోట్లాడుకుంటారు. దీంతో కొత్తగా పెళ్లైన ఆనందం లాస్యలో కనిపించకుండా పోతుంది. మరోవైపు, తులసి ఆపరేషన్ సక్సెస్ అవడంతో పాటు ఆరోగ్యం కుదుటపడటంతో కుటుంబ సభ్యులు అందరూ సరదాగా కాసేపు గడుపుతారు. ఇలా ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications











