For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: శృతి, ప్రేమ్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. నిజం తెలుసుకుని షాకైన లాస్య

  |

  ఎన్నో రకాల కొత్త కొత్త కార్యక్రమాలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన తులసితో లాస్య, నందూ గొడవ పడతారు. ఆ సమయంలో ప్రేమ్ మాటలకు నందూకు కోపం వస్తుంది. దీంతో అతడిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తులసి, సామ్రాట్ అడ్డుకుంటారు. తర్వాత తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనంతరం నందూను పరందామయ్య తిడతాడు.

  ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత తులసిని సామ్రాట్ ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. అనంతరం కాఫీ తీసుకొస్తానని వెళ్లి చేయి కాల్చుకుంటాడు. దీంతో తులసి బాధ పడుతుంది. ఇక, నందూను లాస్య మరోసారి తులసిపై రెచ్చగొడుతుంది.

  Kajal Aggarwal: భర్తతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. ఏకంగా పెదాలను లాక్ చేసి మరీ!

  తులసి దగ్గరకు వచ్చేసిన పిల్లలు

  తులసి దగ్గరకు వచ్చేసిన పిల్లలు

  సామ్రాట్‌కు చేయి కాలిన తర్వాత తులసి బాధ పడుతుంది. అలాగే, తన కొడుకు ప్రేమ్‌ను కూడా గుర్తు చేసుకుంటుంది. 'మీరు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు ప్రేమ్ గుర్తొచ్చాడు. వాడు కూడా అంతే.. నా పనులకు సహాయం చేస్తూ గ్యాప్ ఆఫ్ చేయడం వంటి పనులు చేసేవాడు. ఇప్పుడు వాడి అల్లరిని మిస్ అవుతున్నాను' అని సామ్రాట్‌కు చెప్తుంది. ఇంతలో అక్కడికి ప్రేమ్, శృతి, అంకిత, అభి, దివ్యలు వస్తారు. వచ్చీ రావడమే ప్రేమ్ అందుకే వచ్చాం మామ్ అంటాడు. వాళ్లను చూసి తులసి ఉబ్బితబ్బిబ్బవుతోంది. వాళ్లు కూడా తులసితో ప్రేమగా మాట్లాడతారు.

  సరదాగా మాటలు.. దివ్య పెళ్లిపై

  సరదాగా మాటలు.. దివ్య పెళ్లిపై

  అక్కడకు వచ్చిన తర్వాత అందరూ శృతి తల్లి కాబోతున్న ఆనందాన్ని నీతో పంచుకోడానికి వచ్చాం అని అంటారు. ఆ సమయంలో అంకిత 'శృతిని మీరు కన్నతల్లిగా చూసుకుంటూ డెలివరీ అయ్యే వరకూ పక్కనే ఉండాలి' అని అంటుంది. అలాగే, ప్రేమ్, అభి, దివ్యలు కూడా తలో మాట చెబుతారు. అప్పుడు తులసి 'నేను నీ కన్నతల్లిలా పక్కనే ఉండి చూసుకుంటాను సరేనా' అంటుంది. దీంతో దివ్య 'నువ్వు వీళ్లందరి డెలివరీలు చేసి నా వరకూ వచ్చే సరికి నడుము పట్టుకుని కూర్చుంటావేమో' అంటుంది. దీంతో అంకిత నీకు మేము ఉన్నాము కదా అంటుంది. తర్వాత అందరూ సరదాగా దివ్యకు పెళ్లి చేసేయాలి అని జోకులు చేసుకుంటారు.

  బ్రాలో షాకిచ్చిన డీజే టిల్లు హీరోయిన్: అలా తెగించి మరీ అందాల ఆరబోత

  మేము ఆయనకు మర్యాదివ్వం

  మేము ఆయనకు మర్యాదివ్వం

  అందరూ సరదాగా మాట్లాడుకుంటోన్న సమయంలోనే తులసి 'ఇంతకీ మీరు అందరూ ఇక్కడికి వస్తున్నట్టు మీ నాన్నకు చెప్పారా' అని ప్రశ్నిస్తుంది. దీనికి ప్రేమ్ 'ఆయన నీకు మర్యాద ఇవ్వనప్పుడు.. మేము ఆయనకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు' అంటాడు. దీంతో ఆమె 'తప్పురా అలా అనకూడదు. ఇలాంటి చిన్న విషయాలే పెద్దవై దూరాన్ని పెంచుతాయి. అందుకే కదా నేను తగ్గి ఉంటోంది' అంటుంది. అప్పుడు శృతి 'మీరు తగ్గినా ఆ లాస్య మాత్రం తగ్గడం లేదు ఆంటీ' అంటుంది. దీంతో తులసి తప్పు మనం చేయొద్దంటున్నా అంటుంది. తర్వాత సామ్రాట్ మీరంతా మాట్లాడుకుంటూ ఉండండి.. ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలా అన్నది నేను చూసుకుంటా అంటాడు.

  వాళ్లు లేకపోవడంతో లాస్య షాక్

  వాళ్లు లేకపోవడంతో లాస్య షాక్

  ఇక, నందూతో లాస్య 'నువ్వు ఇక్కడ కూర్చో. మనం పార్టీ చేసుకుందాం. అందరినీ పిలుస్తా' అంటూ ఇంట్లో వాళ్లను పిలవడానికి వెళ్తుంది. అప్పుడు నందూ 'లాస్య చాలా మారిపోయింది. ఇంట్లో వాళ్ల కోసం బాగా ఆలోచిస్తుంది' అని అనుకుంటాడు. అంతలోనే ఆమె కోపంతో తిరిగి వస్తుంది. వచ్చీ రావడమే ఇంట్లో ఎవ్వరూ లేరు అని నందూకు చెప్తుంది. అప్పుడతను ఇప్పటి దాకా ఇంట్లోనే కదా ఉన్నారు అంటాడు. దీంతో లాస్య 'ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం ఏంటి? ఇంటి బాధ్యతను మోస్తున్నాం కదా. కొద్దిగా అయినా విలువ ఇవ్వాలి కదా. వాళ్లకు సంపాదన లేదని అత్తయ్య, మామయ్యను వదిలేశామా' అని కోప్పడుతుంది. దీంతో నందూ మనసు బాలేక ఏటైనా వెళ్లారేమో అంటాడు. కానీ, లాస్య మాత్రం వాళ్లంతా తులసి దగ్గరకు వెళ్లారని అనుకుంటుంది.

  యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!

  ప్రేమ్, శృతిని సర్‌ప్రైజ్ చేస్తూ

  ప్రేమ్, శృతిని సర్‌ప్రైజ్ చేస్తూ

  శృతి, ప్రేమ్‌ను సర్‌ప్రైజ్ చేద్దామని ఇంట్లో వాళ్లు అనుకుంటారు. ఇందుకోసం వాళ్లిద్దరినీ ఒక గదిలో కొంతసేపు ఉంచి.. ఆ తర్వాత కళ్లు మూసి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చి కళ్లు తెరుస్తారు. వాళ్ల కోసం డెకరేట్ చేయడం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు సామ్రాట్ ఎలా ఉంది డెకరేషన్ అంటాడు. దీంతో ప్రేమ్ ఇదంతా ఇప్పుడు అవసరమా అంటాడు. అలాగే, శృతి కడా 'ఏదో సరదాగా సంతోషాన్ని పంచుకోవాలని ఇక్కడికి వచ్చాం. కానీ, ఇది ఊహించలేదు' అంటుంది. దీంతో తులసి ఇది మా సంతోషం అనుకో అమ్మ అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. అప్పుడు తులసి కేక్ ముందుగా శృతికి తినిపించి.. తర్వాత ప్రేమ్‌కు పెడుతుంది.

  దివ్యకు ఫోన్ చేసి తెలుసుకుని

  దివ్యకు ఫోన్ చేసి తెలుసుకుని

  లాస్య ఇంట్లో వాళ్లు ఎటు వెళ్లారు అని అనుకుంటుండగా పరందామయ్య వచ్చి కూర్చొంటాడు. అప్పుడామె మామయ్య.. టీ పెట్టమంటారా? అని అడగ్గా ఒక్క నిమిషం అమ్మ అంటూ జేబులో నుంచి ఒక చిట్టీ తీసి ఈరోజుకు కోటా అయిపోయింది అంటాడు. దీంతో పర్వాలేదు మామయ్య అంటుంది. కానీ, ఆయన మాత్రం వద్దమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ, పరందామయ్య అక్కడే ఫోన్‌ను వదిలేసి వెళ్లడంతో దానితో దివ్యకు కాల్ చేస్తుంది. అప్పుడు ఆమె మాటలతో తులసి ఇంట్లో ఉన్నట్లు లాస్య అర్థం చేసుకుని కోపం అక్కడి నుంచి వెళ్లిపోతోంది.

  గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

  నందూకు నిజం చెప్పిన లాస్య

  నందూకు నిజం చెప్పిన లాస్య

  ఇంట్లోని వాళ్లంతా తులసి దగ్గర ఉన్నారని తెలుసుకున్న లాస్య కోపంగా నందూ దగ్గరకు వెళ్లి 'ఈ ఇల్లును వదిలేసి మనం వెళ్లిపోదాం నందూ' అంటుంది. దీంతో ఏమైంది అని అడుగుతాడు. అప్పుడామె 'ఇంట్లోని వాళ్లంతా ఎక్కడికి వెళ్లారని అనుకుంటున్నావు' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ 'వాళ్లు ఏ రెస్టారెంట్‌కో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లి ఉండొచ్చు' అని అంటాడు. దీంతో లాస్య 'వెళ్లింది రెస్టారెంట్‌కు కాదు. తులసి ఇంటికి. అందరూ కలిసి అక్కడ పండుగ చేసుకుంటున్నారు. ఇది పక్కా న్యూస్' అంటుంది. దీంతో వాళ్లిద్దరూ కోపంగా తులసి ఇంటికి బయలుదేరుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 828: Tulasi Family Plans a Surprise for Prem and Shruthi. After That Lasya Tries to Manipulate Nandhu against Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X