For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: ఒక్కటైపోయిన లాస్య, తులసి.. పెళ్లి గురించి ప్రామిస్ చేయడంతో!

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి కళ్లు తిరిగి పడిపోతుండగా నందూ ఆమెను పట్టుకుంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే గదిలోకి ఎంట్రీ ఇస్తుంది లాస్య. అప్పుడు తులసిని మంచంపై పడుకోపెట్టి.. నందూను బయటకు లాక్కుని వెళ్తుంది. అప్పుడు తమ పెళ్లి గురించి తేల్చి చెప్పమని నందూను లాస్య నిలదీస్తుంది.

  కానీ, అతడు మాత్రం పెళ్లి చేసుకోడానికి సమయం కావాలని అడుగుతాడు. అయినప్పటికీ లాస్య త్వరగా తేల్చుకోమని చెబుతుంది. అంతేకాదు, తులసి కావాలా? నేను కావాలా? నువ్వే డిసైడ్ చేసుకో అంటుంది. తర్వాత తులసి ఆమెకు అభయం ఇస్తుంది.

  Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు

  నందూను అసహ్యించుకుంటున్న లాస్య

  నందూను అసహ్యించుకుంటున్న లాస్య

  లాస్యను తన దగ్గరకు పిలిపించుకున్న తులసి.. ఆమెతో మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే 'పెళ్లి గురించి ఆయన ఏమంటున్నారు' అని లాస్యను అడుగుతుంది. దీంతో ఆమెకు చిరాకు వస్తుంది. 'చూడు తులసి.. నాకు నాకు నందు గురించి మాట్లాడాలంటేనే చిరాకు వేస్తోంది. ఆడవాళ్లమైన మనమే జీవితం గురించి ఇంత క్లారిటీతో ఉన్నప్పుడు తనెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు? ఒక్కోసారి నటిస్తున్నాడా లేక నిజంగానే కన్ఫ్యూజ్ అవుతున్నాడా అనిపిస్తుంది' అంటుంది లాస్య. అప్పుడు నందూ రియల్ అని వెనకేసుకుని వస్తుంది తులసి.

  మా పెళ్లిని నువ్వు అడ్డుకుంటున్నావా?

  మా పెళ్లిని నువ్వు అడ్డుకుంటున్నావా?

  లాస్య అన్న మాటలకు తులసి 'ఆయన ఎప్పుడూ నటించరు. మనసులో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతారు అంతే' అంటుంది. దీనికి లాస్య 'మరి నువ్వేమైనా నందూను అడ్డుకుంటున్నావా' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో తులసి 'ఆయనను నేను అడ్డుకోవడమా? నాకేం అవసరం. నాకు సంబంధమే లేదు' అని బదులిస్తుంది. అప్పుడు లాస్య.. నందూ ప్రవర్తన వల్ల తనకు పిచ్చెక్కుతోందని అంటుంది. దీనికి తులసి 'నీకే కాదు.. నాకు కూడా అలాగే ఉంది. ఈ సమస్య ఎంత త్వరగా తెగితే అంత మంచిది అనిపిస్తుంది' అని చెబుతుంది.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  మనం ఫ్రెండ్స్‌లా అయ్యేవాళ్లం అంటూ

  మనం ఫ్రెండ్స్‌లా అయ్యేవాళ్లం అంటూ

  తులసి మాటలకు లాస్య సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలోనే 'నందూ అంత త్వరగా తెగ్గొట్టడు కానీ.. మనం ఇలా మనసు విప్పి మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి కదా తులసి. మనిద్దరి మధ్య ఈ గొడవలే లేకపోతే మంచి ఫ్రెండ్స్ అయ్యేవాళ్లమేమో కదా' అంటుంది. దీనికి తులసి 'నువ్వేమో కానీ మొదటి నుంచి నేను నిన్ను ఒక స్నేహితురాలిగానే చూశాను. నాకు కూడా నువ్వు మంచి ఫ్రెండ్ అవుతావనుకున్నా కానీ.. ఆయన, నువ్వు కలిసి నా నమ్మకాన్ని కూల్చేశారు. ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను' అంటుంది. దీనికి లాస్య ఇరుక్కుంది మనమిద్దరం అంటుంది.

  నందూతో లాస్య పెళ్లి చేస్తానన్న తులసి

  నందూతో లాస్య పెళ్లి చేస్తానన్న తులసి

  తులసి మాటలకు సమాధానం చెబుతూ 'నందూను వెంటనే డిసిషన్ తీసుకొమ్మని అంటాను. పెళ్లి గురించి పక్కన పెడితే అసలు తను నీతో ఉంటాడో నాతో ఉంటాడో తేల్చుకోమంటాను' అని అంటుంది. అప్పుడు తులసి 'ఆయన నాతో కలిసి ఉండటం జరగని పని లాస్య. నా గురించి మర్చిపో. నందూ అనే వ్యక్తి కేవలం లాస్యతో మాత్రమే జీవితం పంచుకుంటాడు.. పంచుకోవాలి. అలా జరిగేలా చూసే బాధ్యత కూడా నాదే. దాని గురించి నువ్వేమీ దిగులు పడకు అంతా నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు' అని లాస్యకు భరోసా ఇస్తుంది తులసి.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  తులసికి టెస్టులు.. అద్వైత కృష్ణ ఇలా

  తులసికి టెస్టులు.. అద్వైత కృష్ణ ఇలా

  తులసికి పరీక్షలు చేసేందుకు డాక్టర్ సునీత వెల్‌నెస్ సెంటర్‌కు వస్తుంది. ఆ సమయంలోనే అభి దగ్గరకు వచ్చి తులసికి బయోప్సీ టెస్ట్ చేశాం అని చెబుతుంది. అప్పుడే డాక్టర్ అద్వైత కృష్ణ కూడా అక్కడకు వస్తాడు. 'ఆశలు వేరు వాస్తవం వేరు. ఒక మనిషిగా పేషెంట్ క్షేమంగా ఉండాలని అనుకోవాలి. మనకు చేతనైనంత చేయాలి. ఆ తర్వాత వాస్తవం ఏదైనా గ్రహించాల్సి ఉంటుంది' అని అంటాడు. టెస్టులు ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులంతా తులసి దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఫ్యామిలీ మెంబర్స్‌కు అద్వైత కృష్ణ క్లాస్

  ఫ్యామిలీ మెంబర్స్‌కు అద్వైత కృష్ణ క్లాస్

  తులసితో కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్న సమయంలో డాక్టర్ అద్వైత కృష్ణ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే 'మొత్తానికి మీకు ఇన్ని రోజులకు అర్థం అయిందా? మీరందరూ తులసి ఆరోగ్యం బాగు చేయాలనుకుంటున్నారా? ఇంకా కష్టపెట్టాలనుకుంటున్నారా' అని అడుగుతాడు. దీనికి పరందామయ్య 'అదేంటి బాబు అలా అంటావు. ఆమె మా గృహలక్ష్మి.

  ఆమెను కష్టపెట్టాలని ఎందుకు అనుకుంటాం' అంటాడు. అప్పుడాయన 'ఆమెను ప్రేమగా చూసుకుంటూ.. పాత గాయాలను తవ్వతూ తనను ఇంకా బాధపెడుతున్నారు. కాలంతో కలిసిపోయిన వాటిని మళ్లీ మళ్లీ గుర్తు చేయకూడదు' అని అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 492: Lasya and Tulasi Talked very Closely. Then Tulasi Did Promise to Lasya. After That Advaitha Krishna Fired on Family Members.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X