Intinti Gruhalakshmi Today Episode: లాస్య మరో కన్నింగ్ ప్లాన్.. కీలక నిర్ణయం తీసుకున్న అంకిత, శృతి

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి కింద పడిపోవడంతో నందూ తన ఫస్ట్‌ నైట్‌ను కూడా కాదనుకుని ఆమెను ఆస్పత్రికి తీసుకుని వస్తాడు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. సర్జరీ చేయాలని, దానికి రక్తం కావాలని చెబుతారు. అయితే, ఆ గ్రూప్ బ్లడ్ ఎక్కడా దొరకడం లేదని కూడా అంటారు. దీంతో నందూ తనది అదే గ్రూప్ అని రక్తదానం చేస్తాడు. దీంతో తులసికి సర్జరీ జరుగుతుంది. ఆ తర్వాత ఆమె కోలుకుంటుంది. ఇక, నందూపై కోపంగా ఉన్న లాస్య అతడితో వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో నందూ ఆమెకు ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చేస్తాడు.

కలవరించిన తులసి.. బాధపడ్డ ప్రేమ్

కలవరించిన తులసి.. బాధపడ్డ ప్రేమ్

తులసి సర్జరీ కోసం నందూ బ్లడ్ ఇవ్వడంతో ఆమె కోలుకుంటుంది. కానీ, ఆపరేషన్ జరిగి చాలా సమయం అవుతున్నా తులసి మాత్రం స్పృహలోకి రాదు. దీంతో అక్కడే ఉన్న ప్రేమ్ ఆమె బెడ్ దగ్గరకు వెళ్లి ఆందోళన చెందుతూ ఉంటాడు. అంతలో తులసి 'ఏమండీ.. గొడవలు వద్దండి' అంటూ తనలో తాను కలవరిస్తూ ఉంటుంది. అది చూసిన ప్రేమ్ బాధ పడుతూ ఏడుస్తుంటాడు. అనంతరం అక్కడకు డాక్టర్ అద్వైత కృష్ణ వస్తాడు. దీంతో అతడిని తన తల్లి గురించి అడుగుతాడు. అప్పుడతను 'కంగారు పడకు త్వరలోనే స్పృహలోకి వస్తుంది' అని బదులిస్తాడు.

తులసి కోసం మళ్లీ వచ్చేసిన నందూ

తులసి కోసం మళ్లీ వచ్చేసిన నందూ

డాక్టర్ అద్వైత కృష్ణతో ప్రేమ్ మాట్లాడుతుండగా నందూ అక్కడకు మళ్లీ వస్తాడు. దీంతో ఎందుకొచ్చావని ప్రేమ్ అతడిని ప్రశ్నిస్తాడు. అప్పుడతను 'రిసార్ట్‌లో ఉండలేకపోయాను. అమ్మకు స్పృహ వచ్చిందా' అని అడుగుతాడు. దీనికి ప్రేమ్ మీరే వెళ్లి చూడండి అంటాడు. దీంతో నందూ ఐసీయూలోకి వెళ్తాడు. అప్పుడు 'తులసి నిన్ను చాలా బాధపెట్టాను. విడాకులు తీసుకున్నా కూడా నువ్వు ఏనాడూ సంతోషంగా లేవు. నేను మారిపోయాను తులసి. అయినా నువ్వు నమ్మడం లేదు. విడాకులు తీసుకొని నేను ఏనాడూ సంతోషంగా లేను' అంటూ ఏడుస్తుంటాడు నందూ.

తులసికి అదొక్కటే మందన్న డాక్టర్

తులసికి అదొక్కటే మందన్న డాక్టర్

తులసి ఆస్పత్రి బెడ్ మీద పడి స్పృహలో లేకున్నా నందూ మాత్రం తన బాధను వెల్లగక్కుతాడు. ఆ తర్వాత డాక్టర్ అద్వైత కృష్ణ అక్కడకు వస్తాడు. దీంతో ప్రేమ్ అమ్మ స్పృహ లోకి వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడతను 'మీరు రియాల్టీని అర్థం చేసుకోవాలి. పేషెంట్ జబ్బు నుంచి 100 శాతం రికవరీ అవ్వాలంటే డాక్టర్ ట్రీట్‌మెంట్‌తో పాటు.. మెంటల్‌గా తను చాలా ఫిట్‌గా ఉండాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. తను రికవరీ అయ్యాక.. పాత గొడవలకు పాత విషయాలకు దూరంగా ఉంచండి. ఆమె ముందు గొడవలు పడకండి' అని సలహా ఇస్తాడు.

పరందామయ్య అలాగ.. లాస్య ఇలా

పరందామయ్య అలాగ.. లాస్య ఇలా


డాక్టర్ మాట్లాడి వెళ్లిన తర్వాత ప్రేమ్‌కు పరందామయ్య ఫోన్ చేస్తాడు. అప్పుడాయన 'ఒరేయ్ ప్రేమ్.. తులసికి ఎలా ఉందిరా? నేను అర్జెంట్ గా తనతో మాట్లాడాలి' అంటాడు. దీనికి ప్రేమ్ 'ఇప్పుడు మాట్లాడడం కుదరదు. చూడ్డానికి కూడా రావొద్దు. విజిటింగ్ అవర్స్ అయిపోయాయి' అంటాడు. మరోవైపు, ఒంటరిగా ఉన్న లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. నందూ లేడని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో భాగ్య వస్తుంది. అంతేకాదు, 'ఏంటి లాస్య.. ఏం చేస్తున్నావు? ఇప్పుడు కూడా బావ గారు లేరా' అని అడుగుతూ ఆమెను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

లాస్య కన్నింగ్ ప్లాన్.. వినేసిన శృతి

లాస్య కన్నింగ్ ప్లాన్.. వినేసిన శృతి

భాగ్య మాటలకు తనలో తాను రగిలిపోతూ ఉంటుంది లాస్య. అప్పుడు 'కొన్నింటిని చూసీ చూడనట్టు వదిలేయాలి భాగ్య.. కొన్ని రోజులు ఆగు.. అందరినీ నా చుట్టు ఎలా తిప్పుకుంటానో' అంటూ తన కన్నింగ్ ప్లాన్ గురించి భాగ్యకు వివరిస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న శృతి అవన్నీ విని సూపర్‌గా ఉన్నాయి నీ ప్లాన్స్ అంటుంది. అంతేకాదు, 'నువ్వు ఎవ్వరినీ ఏం చేయలేవు. పిచ్చి పిచ్చి మాటలు మానుకో' అంటుంది. అప్పుడు భాగ్య నీ అత్తనే ఎదురిస్తున్నావా అని అంటుంది. దీనికి శృతి 'ఏ లాస్య తన అత్తగారిని ఎదురించడం లేదా' అంటూ వెళ్లిపోతుంది.

కొడుకు ముందర భోరుమన్న నందూ

కొడుకు ముందర భోరుమన్న నందూ

హాస్పిటల్‌లో ఉన్న నందూ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్‌కు అన్ని విషయాలనూ షేర్ చేసుకుంటాడు. 'నా బాధ నీకు నాటకంలా అనిపించవచ్చు కానీ.. నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్‌లో ఉంది తులసి కోసం కాదు. నా బిడ్డ కోసం. వాడు దిగులుతో ఉన్నాడని.. వాడి బాధను పంచుకుందామని' అని చెప్పి భోరుమంటాడు. అప్పుడు ప్రేమ్ వచ్చి తండ్రి భుజంపై చేయి వేస్తాడు. దీంతో నందూ 'తప్పొప్పులు ఎంచుకుంటూ ఫోతే.. ఏ బంధం అయినా కొన్నాళ్లకు బలహీనం అవుతుంది. చేతులు కాలాక ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాను అని చెప్పి' ఏడుస్తాడు.

చేతులు కలుపుకున్న అంకిత, శృతి

చేతులు కలుపుకున్న అంకిత, శృతి

లాస్య ప్లాన్ గురించి వినేసిన శృతి.. అంకిత దగ్గరకు వస్తుంది. అప్పుడు 'అమాయకంగా నటిస్తూనే తులసి ఆంటి కాపురానికి లాస్య ఎసరు పెట్టింది. ఇప్పటికైనా ఎలాంటి గొడవలు చేయకుండా ఉండొచ్చు కదా. కానీ.. మన ఫ్యామిలీని ముక్కలు చేయాలని ప్లాన్ చేస్తోంది. మన ఫ్యామిలీ ముక్కలు కాకుండా ఉండాలంటే.. ముందు మనమంతా స్ట్రాంగ్‌గా ఉండాలి. మన మధ్య అస్సలు అపార్థాలు రాకూడదు' అంటుంది శృతి. దీంతో సరే అంటుంది అంకిత. అలా ఇద్దరూ చేతులు కలుపుకుని ఒక్కటవుతారు. దీంతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులంతా ఇది చూసి సంతోషిస్తారు. ఆ తర్వాత తులసి స్పృహలోకి వస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X