Intinti Gruhalakshmi Today Episode: తులసి కోలుకోలేదన్న డాక్టర్.. డిశ్చార్జ్ అయిన వెంటనే మరో షాక్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూడండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సర్జరీ తర్వాత తులసి ఆస్పత్రిలో కోలుకుంటూ ఉంటుంది. అప్పుడామె స్పృహలో లేకపోయినా నందూ వచ్చి తన మనసులోని బాధనంతా ఆమెకు చెప్పుకుంటూ ఏడుస్తాడు. ఆ తర్వాత తులసి త్వరగా కోలుకోవాలంటే గొడవలు పెట్టుకోకూడదని సూచిస్తాడు డాక్టర్ అద్వైత కృష్ణ. అనంతరం ప్రేమ్ ముందర తన బాధను చెప్పి ఏడుస్తాడు నందూ. ఇక, కుటుంబాన్ని విచ్చిన్నం చేయాలని లాస్య కన్నింగ్ ప్లాన్ రెడీ చేస్తుంది. అది విన్న శృతి.. అంకితకు చెబుతుంది. దీంతో ఫ్యామిలీ కోసం వాళ్లిద్దరూ చేతులు కలుపుతారు.

తులసి కోలుకోలేదని చెప్పేసిన డాక్టర్
ఆపరేషన్ అయిన తర్వాత తులసికి స్పృహ వస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న తన కొడుకు ప్రేమ్‌తో గెలిచానురా అని చిరునవ్వులు చిందిస్తూ అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న డాక్టర్ అద్వైత కృష్ణ 'మీ సర్జరీ సక్సెస్ అయింది కానీ.. మీరు పూర్తిగా కోలుకోవడానికి మాత్రం ఇంకా చాలా సమయం పడుతుంది' అని చెబుతాడు. దీనికి తులసి 'నా కుటుంబం కోసం.. నా కోసం నేను ఖచ్చితంగా కోలుకుంటాను' అని అంటుంది. అప్పుడు డాక్టర్ అద్వైత కృష్ణ 'కంగారు పడకండి.. ప్రాబ్లమ్ ఏం లేదు' అని అక్కడే ఉన్న నందూతో చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు.

బిల్ కడతానన్న నందూ.. డాక్టర్ అలా
డాక్టర్‌తో మాట్లాడుతోన్న సమయంలోనే నందూ 'తులసి సర్జరీకి బిల్లు ఎంతైందో చెబితే నేను కట్టేస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్ కట్టడం తన వల్ల కాదు కదా. అంతేకాదు, తాను దాచుకున్న డబ్బు కూడా పెద్దగా లేదు. అందుకే నేను పే చేస్తాను' అంటాడు. అప్పుడు డాక్టర్ అద్వైత కృష్ణ 'తులసికి, నాకు డీల్ కుదిరింది. తను ఇన్‌స్టాల్‌మెంట్స్ ద్వారా పే చేస్తానని చెప్పింది. తులసికి మీరు ఇప్పటికీ హెల్ప్ చేయాలనుకుంటున్నారు అది గ్రేట్. మీ సహాయం పక్కన పెడితే.. తన పిల్లల సాయం కూడా తీసుకోదు. తను ఇండిపెండెంట్ గా బతకాలని అనుకుంటోంది' అంటాడు.

అందరూ హ్యాపీగా.. వాళ్లిద్దరూ మాత్రం
ఆపరేషన్ తర్వాత తులసి కోలుకుందని తెలియడంతో ఇంట్లోని వాళ్లందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఒకరికి ఒకరు తమ ఆనందాన్ని పంచుకుంటూ గడుపుతారు. అంతేకాదు, తులసి కోసం ఏం చేసి పెట్టాలా.. ఎలాంటి ఏర్పాట్లు చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసిన లాస్య, భాగ్య మాత్రం తెగ కుళ్లుకుంటూ ఉంటారు. అప్పుడు భాగ్య 'వీళ్లంతా ఎంత సంతోషంగా ఉన్నారో.. వీళ్లు నిన్ను ఎక్కడ పట్టించుకుంటారు. వీళ్లంతా తులసికి వత్తాసు పలికేవాళ్లు. ఇక నీ వాల్యూ ఎక్కడ ఉంది' అంటూ లాస్యతో చెబుతూ ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది.

లాస్యను కాదని తండ్రి దగ్గరకు నందూ
తులసి కోసం ఆస్పత్రికి వెళ్లిన నందూ ఇంటికి తిరిగి వస్తాడు. దీంతో అతడు తన దగ్గరకే వస్తాడని లాస్య ఆరాటంగా ఎదురు చూస్తుంటుంది. కానీ, అతడు మాత్రం ఆమె దగ్గరకు రాకుండా తండ్రి పరందామయ్య దగ్గరకు వెళ్తాడు. దీంతో లాస్యకు మరింత కోపం వస్తుంది. దీనికితోడు పక్కనే ఉన్న భాగ్య 'బావ గారు కూడా నీ గాలి తీసేశాడు. కొత్తగా పెళ్లైన భార్యను వదిలేసి మాజీ భార్య కోసం తెగ తిరుగుతున్నారు. ఇప్పుడేమో నీ దగ్గరకు రాకుండా తండ్రి దగ్గరకు వెళ్లిపోయారు. ఈ బావగారు ఏంటో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు లాస్య' అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.

నందూను అలా హెచ్చరించిన తండ్రి
ఆస్పత్రి నుంచి వచ్చిన నందూతో పరందామయ్య కొన్ని జాగ్రత్తలు చెప్పాలని అనుకుంటాడు. ఇందులో భాగంగానే తన కొడుకుతో 'ఒక ఆడపిల్ల అన్ని వదులుకొని నీకోసమని నీ దగ్గరికి వచ్చింది. నీతో పెళ్లి కోసం అందరితో పాటు ఈ లోకానికి శత్రువుగా మారింది. లాస్యను ఇబ్బంది పెట్టకు. నువ్వేమీ చిన్నపిల్లాడివి కాదు. ఆలోచించుకో' అని హెచ్చరిస్తుంటాడు. దీంతో 'మీరు చెప్పింది నిజమే కానీ.. లాస్య చేసింది ముమ్మాటికీ తప్పు. మీతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. తన తప్పు తెలుసుకునే వరకు నేను ఇలాగే ఉంటాను' అని సమాధానం చెబుతాడు నందూ.
Recommended Video

ఇంటికి వచ్చిన తులసి.. అప్పుడే షాక్
తులసి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుంది. అప్పుడామెకు అద్వైత ఆల్ ది బెస్ట్ అని చెబుతాడు. దీనికి తులసి 'మనల్ని మనం నమ్ముకుంటే ఏదైనా సాధించగలం అన్న మీ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. బతకాలి అనే కోరికను పెంచింది' అని అంటుంది. అప్పుడు డాక్టర్ 'మీరే నా గురువు. మీ నుంచే నేను చాలా నేర్చుకున్నాను' అంటాడు. తర్వాత తులసి ఇంటికి తిరిగి వస్తుంది. దీంతో అందరూ బాగా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో తులసి గారంటే మీరేనా అని ఒక వ్యక్తి వస్తాడు. మిమ్మల్ని తీసుకురమ్మని దీపక్ గారు క్యాబ్ పంపించారనగా అంతా షాకవుతారు.


Click it and Unblock the Notifications











