For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి టైమ్ వచ్చేసిందన్న డాక్టర్.. రిపోర్టును ఆమెకే ఇవ్వడంతో!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూతో పెళ్లి గురించి లాస్య, తులసి తొలిసారి క్లోజ్‌గా మాట్లాడుకుంటారు. ఆ సమయంలో లాస్య తన మనసు విప్పి మాట్లాడుతుంది. దీంతో తులసి ఎలాగైనా నందూతో పెళ్లి జరిపిస్తానని అప్పుడు ఆమెకు ప్రామిస్ చేస్తుంది. దీంతో లాస్య మనం ఫ్రెండ్స్‌లా ఉంటే ఎంతో బాగుండేదని అంటుంది. అనంతరం డాక్టర్ సునీత వచ్చి తులసికి వైద్య పరీక్షలు చేస్తుంది. అనంతరం అద్వైత కృష్ణ వచ్చి తులసి కుటుంబ సభ్యులు అందరినీ తిడతాడు. అప్పుడు మీరు చేసిన పని వల్లే ఇప్పుడు ఆమెకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటాడు.

  బట్టలు లేకుండా ఇలియానా ఫోజులు: అదొక్కటే అడ్డుగా పెట్టి.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  తులసికి క్యాన్సర్ అని చెప్పిన డాక్టర్

  తులసికి క్యాన్సర్ అని చెప్పిన డాక్టర్

  చాలా వైద్య పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ అద్వైత కృష్ణ రిపోర్టులు పట్టుకుని వస్తాడు. ఆ సమయంలో నందూను రమ్మని పిలిచి తులసికి గర్భాశయ క్యాన్సర్ ఉందని చెబుతాడు. దీంతో నందూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంతేకాదు, ఏం చేయాలో అర్థంకాక.. మరి తులసి రికవరీ అవుతుందా అని అడుగుతాడు. దీనికి డాక్టర్ అద్వైత కృష్ణ 'చెప్పలేను. నయం చేయడం చేయకపోవడం అన్నీ నిర్ణయించేది దేవుడు మాత్రమే. నేను కేవలం ప్రయత్నం మాత్రమే చేయగలను. నందూ ఇలా వచ్చి ఒక్కడ కూర్చో. టెన్షన్ పడకుండా నేను చెప్పేది విను' అని అంటాడు.

   నందూకు డాక్టర్ అద్వైత హితబోధన

  నందూకు డాక్టర్ అద్వైత హితబోధన

  తులసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. దీంతో డాక్టర్ అద్వైత కృష్ణ అతడిని ఓదార్చే ప్రయత్నం చేయడంతో పాటు కొన్ని జీవిత సత్యాలను చెబుతాడు. 'జీవితం అంటే ఏంటో ముందు అందరూ తెలుసుకోవాలి. మాకు తెలుసు.. ఆ ఆట ఏదో ఒక రోజు ముగిసిపోక తప్పదని. చూడండి నందూ.. ఈ శరీరం అనేది మనిషికి రెంటెడ్ హౌస్ లాంటిది. దానికి మనం ఓనర్లమని కాళ్ల మీద కాళ్లు వేసుకొని కూర్చుంటాం. కానీ.. ఏదో ఒక రోజున ఈ రెంటెడ్ హౌస్‌ను వదిలి వెళ్లిపోక తప్పదు. ఆ నిజాన్ని ముందే గ్రహిస్తే ఈ గోడవలేవీ ఉండవు' అంటాడు.

  Bigg Boss Elimination: 13వ వారం షాకింగ్ ఓటింగ్.. మొదటి రోజు అలా ఇప్పుడిలా.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు

  తులసికి ఫస్ట్ వార్నింగ్ వచ్చేసిందని

  తులసికి ఫస్ట్ వార్నింగ్ వచ్చేసిందని

  జీవిత సత్యాలు చెప్పిన అద్వైత కృష్ణ.. తులసి ఆరోగ్యం గురించి కూడా చెబుతాడు. 'తులసికి తన రెంటెడ్ హౌస్ వదిలి వెళ్లేందుకు మొదటి హెచ్చరిక జారీ అయింది. అంటే ఇది ప్రథమ దశ మాత్రమే. ఆమె విషయంలో నేను ఏ లోటూ లేకుండా నా ప్రయత్నం చేస్తాను. కానీ, మీరు కూడా మీ ప్రయత్నం చేయాల్సిందే. తనకు ఇప్పుడు మీ ప్రేమ, మీ కుటుంబం ప్రేమ కావాలి. ఆవిడకు బతుకు మీద ఆశ కల్పించాలి. తనకు బతకాలన్నా కోరిక పెరగాలి. అందుకోసం మీరు మీ కుటుంబమే అండగా నిలబడాలి. అవన్నీ జరగాలంటే మీరే దగ్గరుండి చేయాలి' అని చెబుతాడు.

  వాళ్ల మాటలు విన్న ప్రేమ్.. ఏడుస్తూ

  వాళ్ల మాటలు విన్న ప్రేమ్.. ఏడుస్తూ

  అద్వైత కృష్ణ మాట్లాడుతుండగా తులసికి క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందని నందూ అనబోతుండగానే ప్రేమ్ ఆ విషయం వింటాడు. దీంతో అతడు వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకెళ్తాడు. దీంతో నందూ కూడా అతడి వెనుక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆగమంటాడు. అనంతరం ప్రేమ్‌ను పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడు నందూ 'ఆ దేవుడు మీ అమ్మకు తీరని అన్యాయం చేశాడురా' అని ఏడుస్తాడు. దీనికి ప్రేమ్ 'ఆ దేవుడే కాదు ముందు మీరు చేశారు. ఆ దేవుడు చేయడా? అమ్మంటే అందరికీ చిన్నచూపే కదా. అన్నీ సమస్యలూ అమ్మకే' అని ఏడుస్తాడు.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన భూమిక: తడిచిన అందాలతో ఘాటుగా.. ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  మీరు ఎప్పుడైనా అమ్మనలా చూశారా

  మీరు ఎప్పుడైనా అమ్మనలా చూశారా

  తల్లి గురించి తెలిసి బాధలో ఉన్న ప్రేమ్.. తన తండ్రితో 'మీరు ఏనాడైనా అమ్మ సంతోషం గురించి ఆలోచించారా? మీరే కాదు ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. మనం ఎప్పుడూ అమ్మ గురించి పట్టించుకోకపోయినా తను మాత్రం మన గురించి ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా అమ్మ మాత్రం అందరితో మంచిగానే ఉంది. ఆఖరికి లాస్యతో కూడా అమ్మ స్నేహంగానే ఉంటోంది. అది నాన్న అమ్మంటే. అలాంటి అమ్మను మీరంతా కలిసి ఎంతో బాధ పెట్టారు. ఇప్పుడిలా అవడానికి కారణం అయ్యారు' అంటూ నిందిస్తాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  రిపోర్టులను తులసికి ఇచ్చిన ప్రేమ్

  రిపోర్టులను తులసికి ఇచ్చిన ప్రేమ్

  వెల్‌నెస్ సెంటర్‌లో అందరూ వైకుంఠపాళి ఆడుతూ ఉంటారు. కానీ, తులసికి మాత్రం రిపోర్టుల కోసం వెళ్లిన ప్రేమ్ ఇంకా రాలేదని టెన్షన్ ఉంటుంది. ఆ సమయంలోనే తులసి ఆట ఆడమని అందరూ పిలుస్తారు. కానీ, ఆమె వెళ్లదు. సరిగ్గా అప్పుడే ప్రేమ్ రిపోర్టులు పట్టుకుని అక్కడకు వస్తాడు. కానీ, వాటిని సస్పెన్స్‌గా ఉంచుతూ.. ఇంట్లో వాళ్లు ఎవరికీ ఇవ్వకుండా ఆటపట్టిస్తూ ఉంటాడు. దీంతో తులసి అందులో ఏముందో చెప్పమని అడుగుతుంది. దీంతో ప్రేమ్ వాటిని నేరుగా తులసికే ఇస్తాడు. వాటిని ఆమె చూస్తూ ఉంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 493: Doctor Advitha Krishna Confirms about Tulasi Cancer Stage. and He Told Some CAring Tips to Him. Then Nandhu Cried A lot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X