For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి కోసం నందూ కీలక నిర్ణయం.. కడుపు నొప్పి అంటూ డ్రామా ఆడి!

  |

  తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రిపోర్టులను పరిశీలించిన డాక్టర్ అద్వైత కృష్ణ.. నందూను తన దగ్గరకు రమ్మని చెబుతాడు. ఆ తర్వాత తులసికి గర్భాశయ క్యాన్సర్ వచ్చిందని వివరిస్తాడు. అంతేకాదు, తులసి బతకాలంటే మీ కుటుంబం నుంచి ధైర్యంతో పాటు ప్రేమ కావాలని కొన్ని జాగ్రత్తలను వివరిస్తాడు. ఈ విషయం ప్రేమ్‌కు కూడా తెలుస్తుంది. దీంతో అతడు పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంటాడు. అంతలో నందూ అతడిని ఆపుతాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటారు.

  హాట్ షోలో హద్దు దాటిన మలైకా: ప్రైవేటు పార్టులు చూపిస్తూ అలా.. 48 ఏళ్ల వయసులో అవసరమా!

  తులసికి అలా అబద్ధం చెప్పిన ప్రేమ్

  తులసికి అలా అబద్ధం చెప్పిన ప్రేమ్

  తులసి రిపోర్టులు తీసుకుని వచ్చిన ప్రేమ్.. అవి ఎవరికీ ఇవ్వకుండా ఆడుకుంటాడు. ఆ తర్వాత కాసేపు అందరినీ ఏడిపించి.. వాటిని తీసుకుని తల్లికి ఇస్తాడు. అప్పుడు తులసి ఆ రిపోర్టులన్నీ చూస్తుంది. అందులో ఫన్నీ ఎమోజీలు మాత్రమే ఉంటాయి. దీంతో తులసి 'అరేయ్ ఏంట్రా ఇది? రిపోర్టుల్లో ఏముందో అని ఒకపక్క టెన్షన్‌గా ఉంటే నీ తమాషాలు ఏంట్రా? అసలు నా హెల్త్ రిపోర్టుల్లో ఏముందో చెబుతావా లేదా' అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు ప్రేమ్ 'నిజం చెబుతున్నా అమ్మా.. నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు' అని చెప్తాడు. దీంతో అంతా కూల్ అయిపోతారు.

  కడుపు నొప్పి డ్రామాలు ఆడిన తులసి

  కడుపు నొప్పి డ్రామాలు ఆడిన తులసి

  రిపోర్టుల విషయంలో ప్రేమ్ తమాషాగా ఉండడంతో తులసి కూడా అదిరిపోయే ప్లాన్ వేస్తుంది. అంతలోనే తులసికి భరించలేనంత కడుపు నొప్పి వస్తుంది. దీంతో అందరూ తెగ కంగారు పడుతూ ఏమైందని అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఇదంతా ఉత్తదే.. ప్రేమ్ చేసినట్లే నేను కూడా మిమ్మల్ని ఆటపట్టించాను' అని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత 'నాకేమీ లేదని, నవ్వుతూ ఉండమని డాక్టర్ చెప్పారన్నావుగా.. మరి ఇప్పుడెందుకు భయపడుతున్నావ్' అని ప్రేమ్‌ను ప్రశ్నించగా.. నీకు అబద్ధం చెప్పే ధైర్యం ఉందా అంటాడు.

  బట్టలు లేకుండా ఇలియానా ఫోజులు: అదొక్కటే అడ్డుగా పెట్టి.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  తల్లిని పట్టుకుని బాగా ఏడ్చేసిన ప్రేమ్

  తల్లిని పట్టుకుని బాగా ఏడ్చేసిన ప్రేమ్

  తులసి యాక్టింగే చేసినా.. ఆమెకు నిజంగానే క్యాన్సర్ ఉందని తెలిసిన ప్రేమ్ బాగా బాధ పడుతుంటాడు. అప్పుడు తులసి 'నా చుట్టూ నా వాళ్లు ఉన్నంత కాలం నాకెలాంటి సమస్య ఉండదు. ఎందుకురా ఆ కన్నీళ్లు కడుపులో నొప్పి అన్నాననా? ఇంకెప్పుడూ సరదాకు కూడా అలా చెప్పను.. ఎవ్వరినీ బాధపెట్టను సరేనా' అంటుంది. దీంతో ప్రేమ్ తట్టుకోలేకపోతాడు. తల్లిని హత్తుకుని గుక్కపెట్టి ఏడుస్తాడు. కొద్ది సేపటికి తేరుకున్న కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆడుతూ కనిపిస్తారు. కానీ, తులసి గురించి తెలిసిన నందూ, ప్రేమ్ మాత్రమే బాధ పడుతుంటారు.

  తులసి కోసం నందూ కీలక నిర్ణయం

  తులసి కోసం నందూ కీలక నిర్ణయం

  తులసికి గర్భాశయ క్యాన్సర్ ఉందని తెలుసుకున్నప్పటి నుంచి నందూ తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. అంతేకాదు, ఎలాగైనా తులసిని రక్షించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే 'ఈరోజు వరకు నీకు నేను బాధను మాత్రమే ఇచ్చాను. ఇక నుంచి సంతోషాన్ని మాత్రమే ఇస్తాను. ఏది ఏమైనా సరే దాని కోసం ఏదైనా చేస్తాను.

  నువ్వు బాగుండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు బతకాలి తులసి' అంటూ తనలో తాను అనుకుంటాడు నందూ. అనంతరం ఆమె కోసం ఏదైనా చేయాలని మనస్పూర్తిగా కీలక నిర్ణయం తీసుకుంటాడు.

  Bigg Boss Elimination: మరోసారి ఊహించని ఎలిమినేషన్.. పింకీకి వాళ్ల మద్దతు.. టాప్ కంటెస్టెంట్‌ ఔట్!

  ఫ్యాక్టరీ టెన్షన్‌.. తల్లికి ప్రేమ్ సర్‌ప్రైజ్

  ఫ్యాక్టరీ టెన్షన్‌.. తల్లికి ప్రేమ్ సర్‌ప్రైజ్

  ఫ్యాక్టరీలో జరుగుతోన్న పనుల గురించి తులసి ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటుంది. స్టాఫ్‌కు ఎక్స్‌పోర్ట్‌లో, కుట్టే బట్టల్లో ఎటువంటి సమస్యలు రాకూడదు అని చెబుతుంది. అంతలో అక్కడికి వచ్చిన ప్రేమ్ ఎవరికమ్మా క్లాస్ తీసుకుంటున్నావు అని అడుగుతాడు. దీనికి తులసి నా భయం నాకు ఉంటుంది కదరా అంటుంది. అప్పుడు ప్రేమ్ 'సరే కానీ, నిన్ను ఇప్పుడు ఒకరి ఇంటికి తీసుకెళ్తున్నాం. నువ్వంటే ఇష్టమైన వాళ్లు. కానీ నువ్వు వాళ్లను తరుచూ కలుసుకోవు. ముందు నువ్వు కళ్లు మూసుకొని కళ్లు తెరవమనే దాకా తెరవద్దు' అంటూ కళ్లు మూసి తీసుకుని వెళ్తాడు.

   నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా

  నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా

  తులసి కళ్లు మూసి ప్రేమ్ ఒక ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు తులసి ఇది ఎవరి ఇల్లు అని అడుగుతుంది. దీనికి ప్రేమ్ 'ఇది మా అమ్మ ఇల్లు. నీకు ఇష్టమైన వ్యక్తివి నువ్వే అమ్మ. కానీ నీ గురించి నువ్వు ఎప్పుడూ పట్టించుకోవు. నీకు నువ్వు ఎప్పుడూ అపరిచితురాలివే. కనీసం ఈ ఇంట్లో అయినా నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ గురించి పట్టించుకో. నేను చిన్నతనం నుంచి చూస్తున్నా నువ్వు ఎప్పుడూ బానిసలా బతుకుతున్నవు. అది నాకు ఇష్టం లేదు. మా అమ్మకంటూ ఒక సొంతమైన ఇల్లును నిర్మించాలనుకున్నా. కనీసం ఈ కాటేజ్‌ను కొన్ని రోజులు అయినా నీ ఇంటిగా అనుకొని ప్రశాంతంగా ఉండు' అంటాడు ప్రేమ్. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 494: Prem Lies to Tulasi about her Health Condition and Advises her not Stress Over Her Job.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X