For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి నందూ సర్‌ప్రైజ్.. అతడు చేసిన పనికి లాస్యకు మరో దెబ్బ

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రిపోర్టులు అని తీసుకుని వచ్చిన ప్రేమ్.. ఆమెకు ఎలాంటి సమస్య లేదని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత తులసి కడుపు నొప్పి వస్తుందని బాధ పడుతుంది. అయితే, కాసేపటికే అది అబద్ధం అని చెబుతుంది.

  కానీ, నిజం తెలిసిన ప్రేమ్ ఎంతగానో ఏడుస్తుంటాడు. తర్వాత తన తల్లిని తీసుకెళ్లి ఓ కాటేజ్‌లో ఉండమని చెబుతాడు. ఇప్పటి నుంచైనా నీ గురించి నువ్వు ఆలోచించుకొని సంతోషంగా ఉండమంటాడు. ఇక, నందూ కూడా తులసిని మంచిగా చూసుకోవాలని డిసైడ్ అయిపోతాడు.

  Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్‌తో పాటు ర్యాంకులు.. టాప్‌లో అతడు లాస్ట్ ఆమె.. అందరికీ షాక్

  తులసికి నందూ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి

  తులసికి నందూ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి

  తులసికి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులంతా ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రేమ్ ఆమెకు కాటేజ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో తులసి అందులోనే ఉంటుంది. ఇక, ఇప్పుడు తులసి ఇష్టాఇష్టాల గురించి తెలిసిన నందూ గార్డెన్ ఏరియాలో పసుపు రంగు గులాబీ మొక్కను చూస్తాడు. అదంటే తులసికి ఎంతో ఇష్టం అని గ్రహించిన అతడు.. అనంతరం దాని దగ్గరకు ఆమెను తీసుకుని వెళ్తాడు. ఇది చూసిన తులసి ఎంతగానో సంతోష పడుతుంది. అది చూసి నందూ కూడా తనలో తానే మురిసిపోతాడు.

  గులాబీ మొక్క ఎందుకు ఇష్టమంటే

  గులాబీ మొక్క ఎందుకు ఇష్టమంటే

  తులసికి నందూ పసుపు రంగు గులాబీ మొక్కను చూపించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇది చూసిన శృతి, దివ్య ఎందుకంత ఇష్టం అని అడుగుతారు. అప్పుడు తులసి 'చిన్నప్పటి నుంచి నా బాధలు గులాబీ చెట్టుకు చెప్పుకునే అలవాటు ఉంది. పెళ్లయ్యాక దాన్ని మా ఇంట్లోనే వదిలేసి వచ్చాను. పెళ్లయ్యాక ఒక తోడు దొరికింది కదా.. అని అనుకున్నాను. కానీ, ఇప్పుడు నాకు నిజంగా మళ్లీ ఆ మొక్క అవసరం ఉంది అనిపించింది. అందుకే దాన్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది' అని వాళ్లకు వివరిస్తుంది.

  మాల్దీవుల్లో సినీ జంట రొమాన్స్: సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో మేటర్ లీక్.. పెళ్లి కాకున్నా ఆ పనులు

  తులసికి హారతి ఇచ్చిన అనసూయ

  తులసికి హారతి ఇచ్చిన అనసూయ

  అక్కడ మాట్లాడి లోపలికి వెళ్తోన్నప్పుడు అనసూయ హారతి పళ్లెంతో కనిపిస్తుంది. అప్పుడు 'అమ్మా తులసి హారతి తీసుకుందువు రా' అంటూ ఇస్తుంది. అప్పుడు తులసి 'నాకు చాలా ఇబ్బందిగా ఉంది అత్తయ్య' అంటుంది. దీనికి అనసూయ 'నువ్వు పాతికేళ్ల క్రితం మా ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పుడు నేను కనీసం హారతి కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు హారతి ఇచ్చి నేను లోనికి ఆహ్వానిస్తున్నాను' అంటుంది. దీంతో 'ఇప్పుడు నేను మీ కోడలును కాదు కదా' అని తులసి అనగా.. 'నువ్వు అంతకంటే ఎక్కువమ్మా. నా కూతురువి' అంటుంది అత్త.

  నందూ విసెష్.. తులసి ఆనందంలో

  నందూ విసెష్.. తులసి ఆనందంలో

  అత్తగారి మాటలకు తులసి భావోద్వేగానికి లోనవుతుంది. ఆ తర్వాత ఆమెతో పాటు అందరూ లోపలికి వెళ్తారు. ఆ ఇంట్లో తులసి గతంలో కుట్టిన మిషన్‌తో పాటు ఆమెకు ఇష్టమైన వస్తువులన్నీ కనిపిస్తాయి. దీంతో ఆమె ఎంతగానో సంతోష పడుతుంది. ఆ తర్వాత తులసి నాకు పెద్దగా ఆశలు లేవు.. ఆశయాలు లేవు. కానీ, మీరంతా నాకు అండగా నిలిచారు' అంటూ చెబుతుంది. ఇంతలో నందూ అక్కడకు వచ్చి తులసికి శుభాకాంక్షలు చెబుతాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చిన తులసి అది అందరికీ చూపించగా నందూ తీసుకుంటాడు. దీంతో అప్పుడే వచ్చిన లాస్య అది చూస్తుంది.

  Bigg Boss: షణ్ముఖ్ నేషనల్ రికార్డ్.. బిగ్ బాస్‌లో చరిత్రలో తొలిసారి.. అదే జరిగితే విన్నర్ అతడే!

  తులసిలో మొదలైన అనుమానాలు

  తులసిలో మొదలైన అనుమానాలు

  హారతి తీసుకున్న తర్వాత తులసి.. 'అంతా బాగానే ఉంది కానీ ఎవ్వరూ మనస్పూర్తిగా ఉన్నట్టు అనిపించడం లేదు. అందరిలోనూ ఏదో దిగులు. నా ముందు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది' అని అనుకుంటుంది. అక్కడే ఉన్న లాస్య 'వీళ్లకేమన్నా పిచ్చి ఎక్కిందా? ఇదేమన్నా వాళ్ల పర్మినెంట్ ఇల్లు అనుకుంటున్నారా? వారం రోజుల కోసం ఇదంతా ఎందుకు? అయినా ఇల్లు మారినా కూడా అదే బాధ.. అదే టెన్షన్.. అందరూ కలిసిపోయారు. నన్ను ఒక్కదాన్నే వదిలేశారు. ఇలా జరగడానికి వీల్లేదు' అని అనుకుంటుంది లాస్య. మరోవైపు ఫ్యామిలీ అంతా ఖుషీగా ఉంటుంది.

  నందూ షాక్.. లాస్య సూటి ప్రశ్నలు

  నందూ షాక్.. లాస్య సూటి ప్రశ్నలు

  ఇంట్లో వాళ్లంతా డ్యాన్సులు చేయడం చూసిన లాస్య కుళ్లుకుంటూ ఉంటుంది. అంతలో ఆమెను నందూ చూస్తాడు. అప్పుడు లోపలికి రమ్మని పిలుస్తుంది. అతడు అలా రాగానే 'కంగ్రాట్స్ నందూ.. తులసితో కలిసి ఉండటానికి నీకు మరో కారణం దొరికింది. నాకు కావాల్సింది నీ రియాక్షన్ కాదు. నీ సమాధానం. తులసి అనారోగ్యాన్ని సాకుగా చూపించి తనతో ఉందామని అనుకుంటున్నావా?' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ 'అది సాకు కాదు లాస్య నిజం. తులసి మెడికల్ రిపోర్ట్స్ గురించి నీకు చెప్పాను కదా' అని ఆమెకు సమాధానం చెబుతాడు.

  హాట్ షోలో హద్దు దాటిన మలైకా: ప్రైవేటు పార్టులు చూపిస్తూ అలా.. 48 ఏళ్ల వయసులో అవసరమా!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నేను తులసితో.. వెళ్లిపోయిన లాస్య

  నేను తులసితో.. వెళ్లిపోయిన లాస్య

  నందూ మాటలకు లాస్య స్పందిస్తూ 'తులసి ఆరోగ్యానికి మన పెళ్లికి సంబంధమేంటి?' అని అడుగుతుంది. దీనికి నందూ 'ఇప్పుడు ఏం చేయమంటావు? తులసి అనారోగ్యంతో ఉన్నా.. నేను, లాస్య పెళ్లి చేసుకుంటున్నాం అని అందరికీ చెప్పమంటావా?' అంటాడు. అప్పుడు లాస్య 'మన పెళ్లి జరగకుండా ఉండటానికి నీకు అడ్డొస్తున్న కారణం ఏంటి? తులసికి అందరు ఉన్నారు కానీ, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అంటుంది లాస్య. నువ్వు ఎప్పుడు తులసి గురించే ఆలోచిస్తున్నావు' అంటుంది. దీనికి తను నేను తాళి కట్టిన భార్య అని బదులిస్తాడు నందూ. దీంతో లాస్య వెళ్లిపోతుంది. అప్పుడు నందూ ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు నేను తులసితోనే ఉండాలి అని అనుకుంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 495: Tulasi Shares her Childhood Memories with Her Children. After That Nandhu Denied Lasya Proposal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X