Intinti Gruhalakshmi Today Episode: బస్సులో పాడుపని.. తులసికి ప్రాబ్లం ఉందని.. లాస్య కొత్త నాటకం

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు మూడేళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో ఉన్న వాళ్లందరినీ ప్రసన్నం చేసుకోవాలని అనుకున్న లాస్య అత్తయ్య అది కావాలా? ఇది కావాలా? అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. కానీ, వాళ్లు మాత్రం సహకరించరు. దీంతో భాగ్య.. లాస్యను రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. అనంతరం సామ్రాట్, తులసి బస్సులో వెళ్తారు.

ఆ సమయంలో సామ్రాట్ 2 వేల రూపాయల నోట్ ఇవ్వగా కండక్టర్ సీరియస్ అవుతాడు. అనంతరం అభికి ఒక బ్యాగ్ కొనాలని అనుకుంటారు. దానికోసం కోఠీకి వెళ్తారు. ఆ సమయంలో తులసి 2 వేల రూపాయల బ్యాగ్‌ను 500లకే కొనుగోలు చేస్తుంది.

రోజ్ మిల్క్ కోసం సామ్రాట్ పాట్లు

రోజ్ మిల్క్ కోసం సామ్రాట్ పాట్లు

షాపింగ్‌కు వెళ్లిన తులసి, సామ్రాట్ సరదాగా తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో తులసి 'నాకు రోజ్ మిల్క్ తాగాలని అనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. అందుకే ఇంత రష్ ఉంది' అంటుంది. దీంతో సామ్రాట్ నేను వెళ్తా అంటూ బయలుదేరుతాడు. కానీ, కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆ జనాలను చూసి భయపడిపోతాడు.

అయినప్పటికీ పరువు పోతుందని వాళ్లను నెట్టుకుంటూ వెళ్లి రోజ్ మిల్క్‌ను తీసుకుని బయటకు వస్తాడు. అప్పుడు తులసిని పిలిచి వాటిని చూపిస్తాడు. కానీ, వాటిలో రోజ్ మిల్క్ ఉండదు. దీంతో తులసి రోజ్ మిల్క్ ఏదని అడగ్గా.. పక్కన ఉన్న ఓ వ్యక్తి ఇక్కడుంది అంటూ తన షర్ట్‌ను చూపిస్తాడు. ఆ తర్వాత ఆ షర్ట్ విప్పేసి అక్కడ పడేసి వెళ్లిపోతాడు. ఇదంతా ఎంతో సరదాగా సాగుతుంది.

భాగ్యను సలహా చెప్పమన్న లాస్య

భాగ్యను సలహా చెప్పమన్న లాస్య

ఇంట్లో వాళ్లను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించి విఫలం అవుతోన్న లాస్య.. తనకోసం వచ్చిన భాగ్యను సలహా ఉంటే చెప్పమని అంటుంది. అప్పుడామె 'ఇంటి వాటా ఎక్కడ అడుగుతానో అని ఇన్ని రోజులు దూరం పెట్టావు. ఇప్పుడు నా అవసరం వచ్చి నన్ను అడుగుతున్నావు కదా. ఇంట్లో అందరి దృష్టిలో నువ్వు ఒక మోసగత్తెగా ముద్ర పడిపోయావు. ఆ మరక చెడగొట్టుకోవాలి. నీ చెవిని ఒకసారి ఇలా పడేయ్' అంటూ భాగ్య ఓ ప్లాన్‌ను చెబుతుంది.

అది విన్న వెంటనే లాస్య ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. అంతేకాదు, నీ ప్లాన్ నా కొంప ముంచేలా ఉంది అంటుంది. దీంతో భాగ్య 'ఈ ప్లాన్ రివర్స్ అయితే ఈ జన్మలో నా ముఖం నీకు చూపించను. ప్లాన్ సక్సెస్ అయితే ఓకే' అంటుంది. దీనికి లాస్య సరే.. వెంటనే ఈ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేస్తా అంటుంది.

బస్సులో పాడు పని.. తులసి క్లాస్

బస్సులో పాడు పని.. తులసి క్లాస్

ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు తులసి, సామ్రాట్ ఇద్దరూ బస్సు ఎక్కుతారు. అప్పుడు సామ్రాట్ 'వామ్మో బస్సులో సీటు దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఏది ఏమైనా ఈరోజు నేను నా చాలెంజ్ లో గెలిచి తీరాలి' అంటాడు. ఇద్దరూ బస్సులో వెళ్తుండగా ముందు ఒ అమ్మాయిని ఓ యువకుడు వేధిస్తుంటాడు. తరచూ ఆమెను కావాలని తాకుతూ ఉంటాడు. అతడిని చూసిన తులసి బస్సు ఆపు అంటుంది.

ఆ తర్వాత ఆ కుర్రాడి చేష్ఠలను చూపిస్తూ ఆ హీరోకు అందరూ ప్రోత్సహించి చప్పట్లు కొట్టండి అంటుంది. అందరూ చప్పట్లు కొట్టిన తర్వాత.. అతడిని తిడుతుంది. దీంతో ఆ కుర్రాడు తులసికి దండం పెడతాడు. దీంతో నాకు దండం పెట్టడం కాదు. ఆ అమ్మాయికి సారీ చెప్పు అనగానే క్షమించమని అడుగుతాడు.

తులసిలో ప్రాబ్లమ్ ఉందని చెప్తూ

తులసిలో ప్రాబ్లమ్ ఉందని చెప్తూ

ఆ తర్వాత తులసి, సామ్రాట్.. ఇద్దరూ కలిసి బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు సామ్రాట్ 'మీతో ఒక ప్రాబ్లమ్ ఉంది తులసి గారు. అది మామూలు ప్రాబ్లమ్ కాదు. ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదు. మీరేమో మిమ్మల్ని పొగడొద్దు అని రెస్ట్రిక్షన్ పెట్టారు.

కానీ, మీరు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని పొగడకుండా ఉండలేం. ఎవ్వరితో గొడవ పెట్టుకోకుండా భలేగా డీల్ చేశారు. జీవితంలో మీరు గెలిచారు తులసి గారు' అని ప్రశంసిస్తుంటాడు. దీంతో తులసి నేను ఏం చేసినా ఆహ ఓహో అనాలంటే నేను ఏం చేయలేనంటుంది. తర్వాత తులసి మనం ఇంకా షాపింగ్ చేయాలి. దానికి మియాపూర్ వెళ్లాలి అంటుంది.

భాగ్య ప్లాన్ అమలు చేసిన లాస్య

భాగ్య ప్లాన్ అమలు చేసిన లాస్య

ఇక, అనసూయ, పరందామయ్య ఇద్దరూ కలిసి చెస్ ఆడుతుంటారు. దీంతో పరందామయ్య చెస్ వద్దు అనసూయ.. కావాలంటే క్యారమ్ బోర్డ్ ఆడుదాం అంటాడు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. వచ్చీ రావడమే ఆమె 'నన్నెందుకు పరాయిదానిలా చూస్తున్నారు మామయ్య. నన్ను కూడా మీ దానిలా అనుకోవచ్చు కదా' అని అడుగుతుంది. దానికి పరందామయ్య అందుకు మా మనసు ఒప్పుకోవాలి కదా అంటాడు. ఇంతలో అనసూయ అక్కడి నుంచి వెళ్లబోతుండగా మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అత్తయ్యా అంటుంది. ఇంతలోనే ఇంట్లో వాళ్లు అందరూ వస్తారు.

అందుకే ఇంటిని రాయించానని

అందుకే ఇంటిని రాయించానని

ఆ తర్వాత ఇంట్లో వాళ్లు అందరూ చూస్తుండగా లాస్య 'ఈ ఇంట్లో అందరికీ నా మీద కోపంగా ఉందని తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ క్షణం నుంచి ఈ ఇంటి డాక్యుమెంట్స్‌కు నాకు సంబంధం లేదు. ఈ ఇంటి మీద హక్కును పూర్తిగా వదులుకుంటున్నాను మామయ్య. ఇది మీ కష్టార్జితంతో కొన్న ఇల్లు.

మీ ఇల్లు మామయ్యా. మీరు ఎవరి పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయించమంటే వాళ్ల పేరు మీద వెంటనే చేయిస్తాను. కేవలం ఇన్‌సెక్యూరిటీ వల్లనే ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకున్నాను. కానీ, దాని మీద ఆశతో కాదు' అంటుంది.

దేనిమీదా నాకు హక్కు లేదంటూ

దేనిమీదా నాకు హక్కు లేదంటూ

అనంతరం లాస్య 'ఇంట్లో ఎవరి మీద, దేని మీద నాకు ఎలాంటి హక్కు లేదనిపించింది. అందుకే నన్ను ఎప్పుడు బయటికి తరిమేస్తారో అని టెన్షన్‌గా ఉండేది. సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే నాకోసం నేనే ఏదో ఒకటి చేసుకోవాలనిపించింది. అందుకే ఇంటిని నా పేరు మీదికి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాను' అంటూ ఏడుస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X