For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్య ఆత్మహత్యయత్నం.. డాక్యూమెంట్లు ఆమె చేతికే.. షాకిచ్చిన నందూ

  |

  మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి అడిగిందని సామ్రాట్ రోజ్ మిల్క్ తీసుకు రావడానికి వెళ్తాడు. కానీ, తోపులాటలో అంతా పోగొట్టేసి వట్టి గ్లాసులతో బయటకు వస్తాడు. అనంతరం తన దగ్గరకు వచ్చిన భాగ్యను ఏదైనా సలహా చెప్పమని లాస్య అడుగుతుంది.

  దీంతో ఆమె ఏదో చెబుతుంది. ఆ తర్వాత లాస్య తన దగ్గర ఉన్న ఇంటి డాక్యూమెంట్లను పరందామయ్యకు ఇచ్చేస్తుంది. మరోవైపు, సామ్రాట్, తులసి బస్సులో వెళ్తుండగా.. ఓ కుర్రాడు అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. దీంతో తులసి అతడికి బుద్ధి చెబుతుంది. అప్పుడు సామ్రాట్ అవాక్కవుతాడు.

  యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!

  చేయి కోసుకోబోయిన లాస్య

  చేయి కోసుకోబోయిన లాస్య

  అత్తమామలకు ఇంటి డాక్యూమెంట్లను అందించిన తర్వాత లాస్య ఏడుస్తూ యాక్టింగ్‌ను మొదలు పెడుతుంది. అప్పుడే 'ఇప్పటికైనా నన్ను నమ్మండి మామయ్య. నేను మారిపోయాను. నిజంగానే నేను రాక్షసిని అయితే ఈ ఇల్లు దక్కింది చాలు అని పండుగ చేసుకునేదాన్న కదా. ఇలా కన్నీళ్లు పెట్టుకునే దాన్ని కాదు' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'ఇవి నిజమైన కన్నీళ్లు కావు తాతయ్యా. అవి మొసలి కన్నీళ్లు' అంటాడు. దీంతో లాస్య 'నేను ఏం చేస్తే నమ్ముతారు. గొంతు కోసుకుంటే నమ్ముతారా? అయితే ఆగండి' అంటూ చాక్ తెచ్చుకొని చేయి కోసుకోబోతుంది.

  లాస్యకే తిరిగిచ్చేసిన మామ

  లాస్యకే తిరిగిచ్చేసిన మామ

  లాస్య ఆత్మహత్య చేసుకోబోతుండగా అందరూ కలిసి ఆమెను ఆపుతారు. అప్పుడు పరందామయ్య 'నీ మీద మాకు కోపం ఉన్నమాట నిజమే. కానీ, నువ్వు ఇలా అఘాయిత్యం చేసుకుంటుంటే చూడలేం' అంటాడు. దీంతో ప్రేమ్ తాతయ్య మళ్లీ మోసపోతున్నారు అంటాడు. అప్పుడాయన 'మోసపోవడం తప్పు కాదు.. మోసం చేయడం తప్పు. ఏ ఆస్తి వల్ల ఈ ఇల్లు ముక్కలు అయిందో.. ఆ ఆస్తి మాకు అక్కర్లేదు. ఈ ఇల్లు కోడలు పేరు మీదే ఉండాలని అనుకుంటున్నాం. ఇదే దైవ నిర్ణయం అనుకుంటున్నాం' అని అంటూ ఆ డాక్యుమెంట్లను లాస్యకే ఇచ్చేసి వెళ్లిపోతారు.

  క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!

  లాస్యకు తోడికోడళ్లు క్లాసు

  లాస్యకు తోడికోడళ్లు క్లాసు

  ఆ తర్వాత లాస్య వాటిని తీసుకుని లోలోపల సంతోషిస్తూ పైకి ఆశ్చర్యపోయినట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు శృతి, అంకిత వచ్చి 'తాతయ్య నిర్ణయం విని షాక్ అయ్యావా? గొడవలు వద్దు అనుకొని, ప్రశాంతంగా ఉండాలని మనసును చంపుకొని నిన్ను కోడలుగా ఒప్పుకున్నారు. గెలిచింది నువ్వు కాదు.. తాతయ్య. ఆయన మంచితనం. ఈ ఇంటి కోడలు స్థానానికి ఒక విలువ ఉంది. ఆ విలువ దిగజారేలాగా ప్రవర్తించకు' అంటూ క్లాస్ పీకుతారు. తర్వాత అందరూ ఆమెను వదిలేసి వెళ్లిపోతారు. దీంతో ఇల్లు మళ్లీ తనకే దక్కిందని లాస్య తెగ సంతోషిస్తూ ఉంటుంది.

  ఆడవాళ్లకు జోహార్లు అంటూ

  ఆడవాళ్లకు జోహార్లు అంటూ

  ఇక, షాపింగ్‌కు వెళ్లిన సామ్రాట్, తులసి గిటార్ రిపేర్ చేయించుకుని ఇంటికి బయలుదేరుతారు. అప్పుడు సామ్రాట్ తనకు ఓపిక లేదని అంటాడు. ఆ సమయంలోనే తులసి ఈ అనుభవం ఎలా ఉంది అని అడుగుతుంది. దీనికతడు ఇప్పుడు కాదు కానీ.. కాస్త ఓపిక తెచ్చుకున్నాక తర్వాత చెబుతా అంటాడు. ఇంతలో వాళ్ల ఇల్లు వస్తుంది. అలా లోపలికి వెళ్లగానే సామ్రాట్ నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడు. దీంతో తులసి మీరు చాలెంజ్ గెలిచారు అంటుంది. అప్పుడు సామ్రాట్ 'ఈ గెలుపు గెలుపే కాదు. మధ్యతరగతి ఆడవాళ్లకు జోహార్లండి' అని అంటాడు.

  Bigg Boss: భార్య కాకుండా ఎవరైనా ఉన్నారా? పెళ్లికి ముందు ఆ పని చేయలేదా? మగాళ్లతో శ్రీ సత్య అసభ్యంగా!

  సామ్రాట్‌కు తులసి సలహా

  సామ్రాట్‌కు తులసి సలహా

  సామ్రాట్ మాటలకు తులసి నిజంగా అంటున్నారా? లేక వెటకారం చేస్తున్నారా? అంటుంది. దీనికతడు 'ఉన్న సంపాదనలో సర్దుకుంటూ సంసారం చేయడం మామూలు విషయం కాదండి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కుప్పకూలిపోవడమే. ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికే అనడం లేదు' అంటాడు. అప్పుడు తులసి 'మధ్యతరగతి ప్రజల జీవితం అంటే త్రిశుంఖ స్వర్గం. అటూ ఇటూ ఊగులాడుతుంది. పాత సబ్బు ముక్కను కొత్త సబ్బు ముక్కతో కలిపి వాడుకోవడం, పాత న్యూస్ పేపర్ అమ్మి దానితో అవసరాలు తీర్చుకోవడం, చివరి వరకు పిల్లల స్కూల్ ఫీజులు కట్టకపోవడం.. ఇలా మధ్యతరగతి ప్రజల జీవితాలే ఇలా ఉంటాయి' అంటుంది. దీంతో అలా బతకాలని ఉందని సామ్రాట్ అనగా.. మీరు మీలాగే ఉండండి అని తులసి చెబుతుంది.

  బావగారిని తిప్పుకో అంటూ

  భాగ్య ఇచ్చిన సలహా మేరకు ప్లాన్ అమలు చేసినా వర్కౌట్ కాకపోవడంతో లాస్య ఆమెతో మాట్లాడుతుంటుంది. అప్పుడు 'ఇల్లు ఇస్తా తీసుకోండి అంటే కూడా ఎందుకు తీసుకోవడం లేదు' అని అంటుంది. దీంతో భాగ్య 'అసలు ఆ ఇంట్లో నీవైపు మాట్లాడేవాళ్లు ఒక్కరైనా ఉన్నారా? నువ్వు ఈ ఇంటిని తిరిగి ఇస్తానంటూ ప్రపోజల్ పెట్టడం వల్ల నీకు ఎంత మేలు జరిగిందో తెలుసా? . ఇప్పుడు నువ్వు చేయాల్సింది బావ గారిని నీవైపునకు తిప్పుకోవడం. ఎఫ్పుడైతే ఆయన ఓటు నీకు పడితే నీకే ప్లస్ అవుతుంది. ముందు ఆ పనిలో ఉండు' అంటూ లాస్యకు సలహా ఇస్తుంది.

  Bigg Boss Elimination: తొలిరోజే ఓటింగ్‌లో సెన్సేషన్.. ఇనాయాకు షాక్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!

  లాస్యపై నందూ ఆగ్రహం

  లాస్యపై నందూ ఆగ్రహం

  ఇక, ఉదయమే నందూ నిద్ర లేస్తాడు. ఇంతలో లాస్య కాఫీ తీసుకొచ్చి ఇవ్వగా అతడు తీసుకోడు. దీంతో లాస్య 'నందూ ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు. కనీసం నా వైపు కూడా చూడటం లేదెందుకు' అంటూ నందూను టచ్ చేస్తుంది. దీంతో అతడు డోంట్ టచ్ అంటూ అరుస్తాడు. అప్పుడు లాస్య 'నందూ నేను ఏం చేసినా మన మంచి కోసమే కదా. మనం సుఖంగా ఉండాలనే కదా. మన ఫ్యూచర్ కోసమే కదా' అంటుంది. దీనికతడు 'మన ఫ్యూచర్ అని అనకు. నీ ఫ్యూచర్ అని చెప్పు. నీకోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నేను ఎంతో కోల్పోయాను. కానీ.. నువ్వు చేసిందేంటి. నా ప్రేమకు బదులుగా నువ్వు ఇచ్చింది అశాంతి. ఇప్పటికీ నేను అది ఫీల్ అవుతూ అనుభవిస్తున్నాను' అంటూ ఫైర్ అవుతాడు.

  తులసిని చూసి సంతోషం

  తులసిని చూసి సంతోషం

  ఆ తర్వాత తులసి అక్కడకు వస్తుంది. అప్పుడామె మనసులో 'ఇది నేను అల్లుకున్న గూడు. కానీ, ఆ గూటిలో నేను లేను. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు' అని అనుకుంటుంది. తర్వాత పిల్లల కోసం చేసి వస్తువులను తీసుకొస్తుంది. కానీ, ఎవరూ కనిపించరు. ఆ తర్వాత దివ్య చూసి అందరినీ పిలుస్తుంది. దీంతో ఇంట్లోని వాళ్లంతా అక్కడకు వస్తారు. ఆమెను చూసి సంతోషంగా ఫీల్ అవుతారు. మరోవైపు నందూ, లాస్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 809: Nandhu Fires on Lasya When She Tries to mend her Relationship with Him. After That Family Feels Happy As Tulasi Visits Them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X