For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్ ప్రవర్తనలో మార్పు.. నువ్వే జీవితాన్ని ఇచ్చావన్న తులసి

  |

  చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఊరిలో తిరిగి.. ఫ్రెండ్స్‌ను కలిసిన తర్వాత తులసి, సామ్రాట్ కారులో ఇంటికి బయలుదేరుతారు. ఆ సమయంలో తులసి తన విడాకుల గురించి బాధ పడుతుంది. దీంతో ఆమెను ఓదార్చిన సామ్రాట్.. ఇంట్లో సర్‌ప్రైజ్ ఉందని చెప్తాడు. అనంతరం ఆమె పరందామయ్యకు ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకుంటుంది. కానీ, లాస్య చేసే పనుల గురించి మాత్రం ఆయన చెప్పడు. మరోవైపు, సామ్రాట్ ముందుగానే చెప్పినట్లే తులసి కోసం ఆమె తల్లి ఇంటికి వస్తుంది. దీంతో సామ్రాట్‌కు ఫోన్ చేసిన తులసి థ్యాంక్స్ అని చెబుతుంది.

  నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!

  రుణం ఎలా తీర్చుకోవాలి అంటూ

  రుణం ఎలా తీర్చుకోవాలి అంటూ


  సరస్వతిని తులసి ఇంటికి చేర్చిన సామ్రాట్ కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తులసి అతడికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెబుతుంది. అంతేకాదు, 'మీరు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. అలా అని మీకోసం నేను ఏమీ చేసే దాన్ని కూడా కాదు' అని అంటుంది. అప్పుడు సామ్రాట్ 'నేను చేసింది మాట సహాయం మాత్రమే. దానికే రుణం తీర్చుకోవడం లాంటి మాటలు వద్దు. మీ అమ్మగారిని మీ దగ్గరకు చేర్చాను. నాతో టైం వేస్ట్ చేయకుండా ఆమెతో మీ సమయాన్ని చక్కగా గడుపుకోండి' అని అంటాడు.

  సామ్రాట్ తీరుతో బాబాయి డౌట్లు

  సామ్రాట్ తీరుతో బాబాయి డౌట్లు

  ఇంటికి వచ్చిన తర్వాత సామ్రాట్ హుషారుగా కనిపిస్తాడు. విజిల్ వేసుకుంటూ డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేసేందుకు కూర్చొంటాడు. తర్వాత అతడు కూడా తులసి వాళ్ల ఊరిలో తిరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ తనలో తానే నవ్వుకుంటాడు. ఇంతలో వాళ్ల బాబాయి అక్కడికి వచ్చి వీడికేమైంది అని అనుకుంటాడు. నీళ్లు ఇస్తే చేతులు కడుక్కొని ఏదో ఆలోచిస్తూ భోజనం పెట్టుకుంటాడు. తర్వాత అన్నం మాత్రమే తింటుంటాడు. అప్పుడాయ 'వెర్రి నవ్వు నవ్వుతున్నావు. నీకు పిచ్చి ఎక్కి అయినా ఉండాలి లేదంటే ప్రేమలో అయినా పడాలి' అంటాడు.

  Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్

  నీ అంతరాత్మకైనా నిజం చెప్పు

  నీ అంతరాత్మకైనా నిజం చెప్పు

  బాబాయి మాటలకు సామ్రాట్ 'ఏంటి బాబాయి.. నవ్వు వస్తే దానికి అర్థం ఏం ఉండదు' అంటాడు. దీనికాయన 'ప్రతి నవ్వు వెనుక ఒక భావం ఉంటుంది. తడబడకు.. నీ మనసులోని మాటను బయటపెట్టు' అంటాడు. దీంతో సామ్రాట్ ఇందాక తులసి, నేను అంటూ ఏదో చెప్పబోతుండగా బాబాయి మధ్యలో ఏదో డిస్టర్బ్ చేస్తాడు. దీంతో సామ్రాట్ ఆడు అని 'నేను, తులసి ఆఫీసు పని మీద బయటికి వెళ్లాం. దాన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుతున్నా' అంటాడు. దీంతో ఆయన 'ఉప్పు కారం తినాల్సిన వయసులో అన్నంలో ఏం వేసుకోకుండా ఉత్త అన్నం తింటున్నావు చూడు. దీన్ని ఏమనాలిరా. నాకు నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు. నీ అంతరాత్మకు అయినా నిజం చెప్పుకో. నన్ను అడగకుండా ఎప్పుడైనా తిన్నావా? నీకోసం చూస్తున్నా' అని చెబుతాడు.

  తల్లితో కష్టసుఖాలు చెప్పుకుని

  తల్లితో కష్టసుఖాలు చెప్పుకుని


  రాత్రి అయ్యాక తులసి, సరస్వతి తీరిగ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో తల్లి 'పోన్లే.. మన ఊరు వెళ్లి మన ఇంటిని చూసే అదృష్టం నాకు లేకపోయినా నీకు అయినా దక్కింది' అని అంటుంది. దీనికి తులసి 'ఆ ఇంటిని చూసి బాధపడాలో.. సంతోషపడాలో నాకు అర్థం కావడం లేదమ్మా' అంటుంది. అప్పుడు తల్లి 'ఏంటి అలా చూస్తున్నావు గీతోపదేశం చేస్తున్నానా' అని అడుగుతుంది. దీంతో తులసి 'అసలు నా చిన్నతనాన్ని నేనే వదులుకున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ వయసుకు దూరం అయ్యాను' అంటూ తన బాధను వ్యక్తపరుస్తుంది.

  కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం

  నువ్వే నాకు జీవితాన్ని ఇచ్చావు

  నువ్వే నాకు జీవితాన్ని ఇచ్చావు

  తులసి మాటలకు సరస్వతి మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది. దీంతో తులసి మళ్లీ అదే చిన్నతనానికి వెళ్తాను అంటుంది. అప్పుడామె 'నువ్వు మళ్లీ చిన్నతనానికి వెళ్లినా అదే నిర్ణయం తీసుకుంటావు. నీళ్లలో వేసిన కాగితపు పడవకు ఎటు వెళ్లాలో నిర్ణయించుకునే అవకాశం ఉండదు' అని అంటుంది. దీంతో తులసి 'నాన్న చనిపోయే సమయానికి కన్నీళ్లు పెట్టుకోవడం తప్పితే నాకు ఇంకేం తెలియలేదు. అమ్మానాన్నలా నువ్వే అయి మాకు జీవితాన్ని ఇచ్చావు. చిన్నపిల్లలమైనా నాన్న మీద దిగులుతో చాలా సార్లు ఏడ్చాం. నీకెందుకు కన్నీళ్లు రాలేదు. నాన్న అంటే నీకు కోపమా? ఇది నేను అడగాల్సిన ప్రశ్న కాదు కానీ.. అడిగా' అంటుంది.

  ఆయన కనిపించని దేవుడంటూ

  ఆయన కనిపించని దేవుడంటూ


  తులసి ప్రశ్నకు సరస్వతి 'అనుకోకుండా జీవితంలో అవిటితనం ఎదురైతే దాన్నే తలుచుకుంటూ బాధపడితే జీవితం అక్కడే ఆగిపోతుంది. దిగులుతో కన్నీళ్లు పెట్టుకొని కూర్చొంటే నా కారణంగా పిల్లల జీవితం నాశనం అవుతుంది. నా కన్నీళ్లు నా కనురెప్పలు దాటి బయటికి రాలేదు. లోలోపల నా గుండెలు పగిలేలా ఏడ్చాను. కన్నీళ్లు వస్తున్న ప్రతిసారీ నా కన్నీళ్లతో ముఖాన్ని తూడ్చుకొని కన్నీళ్లను దాచుకున్నాను తప్పితే నాన్న అంటే ఇష్టం లేక కాదు. ఆయన కనిపించని దేవుడు. నాతోనే ఉండే నా దేవుడు' అని చెప్పడంతో తులసి కూడా సంతోషిస్తుంది.

  Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్‌ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!

  వదినల సహాయం కోరిన దివ్య

  వదినల సహాయం కోరిన దివ్య


  ఇక, ఇంట్లో దివ్య ధీనంగా కూర్చుని ఉండడం చూసిన శృతి ఏమైందని ప్రశ్నిస్తుంది. తర్వాత కాఫీ చల్లారిపోయిందని చెప్పగా మర్చిపోయానని అంటుంది. అప్పుడు శృతి మరిచిపోతే నేను వేడి చేయలేను అంటుంది. దీంతో దివ్య నేను చేసుకుంటాలే అంటుంది. దీనికామె 'నువ్వు కూడా వేడి చేసుకోలేవు. ఆ లాస్య గ్యాస్ రెండు నెలలు రావాలి' అంటుంది. ఇంతలో అంకిత కూడా వచ్చి 'అంతేకాదు, ఆ లాస్య ఇంట్లో వాళ్లు కనీసం రోజుకు 20 సార్లు మాత్రమే ఊపిరి పీల్చుకోవాలి అన్నా అంటుంది' అని చెప్తుంది. దీంతో దివ్య భయంతో ఆ కాఫీనే తాగేస్తుంది. తర్వాత వదినలు 'ఇప్పుడు చెప్పు అసలు విషయం ఏంటి' అని అడగ్గా.. 'మా కాలేజీ యానివర్సరీకి మా ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ వేయాలి. ఇన్ని రోజులు అమ్మ నేర్పించింది. ఇప్పుడెలా' అని అంటుంది. దీంతో శృతి, అంకిత మేము నేర్పిస్తాం అంటారు. తర్వాత తులసి ఇంట్లో ముగ్గు వేస్తుండగా చిన్నప్పుడు వాళ్ల అమ్మ పాడిన పాట వినిపిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 820: Tulasi and Saraswathi Shares Their Worries with Each Other. After That Divya Seeks Ankitha and Shruthi Help.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X