For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి చావు ఆయన చేతుల్లోనే.. రైలు పట్టాలపై ఆమెకు ఏం జరిగిందంటే!

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వెల్‌నెస్ సెంటర్‌లో ఉన్న అందరూ తులసి ఉన్న కాటేజ్‌కు వెళ్లాలని అనుకుంటారు. అప్పుడా విషయాన్ని నందూకు చెబుతారు. లాస్యతో కలిసి ఉండలేమని, అందుకే వెళ్లిపోతున్నామని అంటారు. అనంతరం వాళ్లంతా తులసి దగ్గరకు వెళ్లి సర్‌ప్రైజ్ చేస్తారు. అనంతరం తులసికి క్యాన్సర్ ఉందని అందరూ తెలుసుకుని బాధ పడతారు. ఆ తర్వాత అద్వైత కృష్ణ కూడా తులసికి క్యాన్సర్ ఉన్న విషయాన్ని ఆమెకే చెప్పేస్తాడు. దీంతో ఎన్ని రోజులు బతుకుతానని అడుగుతుంది. దీనికి తమ ప్రయత్నం చేస్తామని అంటాడు.

  జబర్ధస్త్‌‌కు సుధీర్ టీమ్ షాక్: ఇలా జరుగుతుందని అనుకోలేదు.. మమ్మల్ని క్షమించండంటూ ఏడుస్తూ!

  నీ చావు ఎప్పుడన్నది ఆయనకే తెలుసు

  నీ చావు ఎప్పుడన్నది ఆయనకే తెలుసు

  తులసితో మాట్లాడుతున్న సమయంలోనే డాక్టర్ అద్వైత కృష్ణ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావిస్తాడు. అప్పుడే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు చెబుతాడు. దీంతో తులసి తట్టుకోలేక బాధ పడుతుంది. అనంతరం 'నేను చనిపోతున్నానా? దానికి ఇంకా ఎంత సమయం ఉంది' అని అడుగుతుంది. దీనికి అద్వైత కృష్ణ 'చావు అనేది రావాల్సినప్పుడే వస్తుంది. మనం రావాలనుకున్నప్పుడు రాదు. ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు. అదా కృష్ణుడికే తెలుసు. నిరాశతో నీ ప్రాణాల మీద ఆశ వదులుకోకు. ఆశ వదులుకుంటే అన్నీ వదులుకున్నట్టే' అంటాడు.

  నీకు దేవుడు అన్యాయం చేశాడు తులసి

  నీకు దేవుడు అన్యాయం చేశాడు తులసి

  తులసికి నిజం చెప్పిన తర్వాత అద్వైత కృష్ణ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. చాలా రకాలుగా ఆమెను ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ, తులసి మాత్రం తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. అలా కొద్దిసేపు అయిన తర్వాత ఆమె నిరాశతోనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ సమయంలో 'నాకు తెలుసు తులసి. నువ్వు ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచించడం లేదు. నీ వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు. అదే నీ గొప్పదనం. నిజంగా నీకు ఆ దేవుడు అన్యాయం చేశాడు. నీకు మంచే జరగాలని కోరుకుంటున్నా' అని మనసులో అనుకుంటాడు అద్వైత కృష్ణ.

  సంచలనంగా కత్రినా పెళ్లి ఖర్చులు: ఆ ఒక్క దానికే 7 లక్షలు.. ఆమె పెట్టుకునే మెహందీ ప్రత్యేకత ఏంటంటే!

  బాధతో వాళ్ల గురించి ఆలోచించుకుంటూ

  బాధతో వాళ్ల గురించి ఆలోచించుకుంటూ

  అద్వైత కృష్ణ క్యాన్సర్ గురించి చెప్పిన తర్వాత ఏదో కోల్పోయిన దానిలా తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 'నాకు క్యాన్సర్ అన్న విషయాన్ని ఎవరూ ఎందుకు చెప్పలేదు? దీన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? ప్రేమ్ ఇంకా సెట్ కాలేదు. దివ్య చాలా చిన్నది. ఇప్పుడు నేను లేకుంటే వీళ్లు ఏం కావాలి? దివ్య బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? దాని పెళ్లి ఎవరు జరుపుతారు? అంకిత, శృతికి ఇంకా ఇంటి బాధ్యత తెలియదు. వాళ్లు ఇంకా ప్రతి దానికి నా మీద ఆధారపడుతుంటారు. ఇప్పుడు వీళ్లందరి పరిస్థితి ఏంటి' అంటూ తనలో తానే అనుకుంటుంది తులసి.

  రైలు పట్టాలపై తులసి... తల బాదుకుని

  రైలు పట్టాలపై తులసి... తల బాదుకుని

  తనకు క్యాన్సర్ వచ్చి ఏదైనా జరిగితే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందా అని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది తులసి. అలా అలా రైలు పట్టాలు ఎక్కుతుంది. రైలు పట్టాల నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. అన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది. అప్పుడు తనకు ఏం చేయాలో అర్థం కాదు. లాస్య గురించి కూడా ఆలోచిస్తుంది. నందూను గుర్తుకు తెచ్చుకుంటుంది. రైలు పట్టాల మీద వేగంగా పరిగెడుతుంది. అలసిపోయే వరకు పరిగెత్తి ఒక చోట కూర్చుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ తల బాదుకుంటుంది. తర్వాత గట్టిగా అరుస్తుంది.

  Akhanda Day 6 Collections: బాక్సాఫీస్‌పై బాలయ్య పంజా.. 6 రోజుల్లోనే అన్ని కోట్లా.. ఇదేం స్పీడు సామీ

  తులసి గురించి టెన్షన్ పడ్డ కుటుంబం

  తులసి గురించి టెన్షన్ పడ్డ కుటుంబం

  తులసి అలా బాధ పడుతూ ఉండగా.. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం తెగ సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో అనసూయ 'పూల కోసం వెళ్లిన తులసి ఇంకా రాలేదేంటి' అని శృతితో అంటుంది. అప్పుడామె 'ఆంటికి ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఆంటి ఈ ప్లేస్‌ను వదిలి ఎక్కడికీ వెళ్లదు' అంటుంది. తర్వాత అందరూ తులసికి నచ్చిన స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అదలా జరుగుతూ ఉండగా ప్రేమ్ తన తల్లి ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడతను బయటకు వెళ్లబోతుండగా తులసి లోపలకి వచ్చేస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఇంట్లో హడావిడిగా.. తులసి మౌనంగానే

  ఇంట్లో హడావిడిగా.. తులసి మౌనంగానే

  తులసి కోసం పిండి వంటలు చేసిన కుటుంబ సభ్యులు.. ఆమె ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. కానీ, ఆమె మాత్రం నోరు మెదపకుండానే ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అందరూ కలిసి రెడీ చేసిన పిండి వంటలను తినమని అడుగుతారు. కానీ, తులసి మాట్లాడదు. అనంతరం తమ తమ వంటలు తినమని అందరూ కోరుకుంటారు. కానీ, ఆమె స్పందించదు. దీంతో అందరూ కలిసి తులసినే అల్లం టీ పెట్టమని అడుగుతారు. అయినా ఆమె సైలెంట్‌గానే ఉంటుంది. ఆ సమయంలోనే ఇంట్లో వాళ్లంతా చాలా బాగా నటిస్తున్నారని తనలో తానే అనుకుంటుంది తులసి. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 497: Tulasi Knows The Truth of her Health Condition. Then Family Members Prepares Tulasi's Favourite Food.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X