For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తల పగలగొట్టుకున్న లాస్య.. నందూతో తులసి సీక్రెట్ మీటింగ్

  |

  ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అత్తమామలకు ఇంటి డాక్యూమెంట్లను అందించిన తర్వాత లాస్య ఏడుస్తూ యాక్టింగ్‌ను మొదలు పెడుతుంది. అలా ఏడుస్తూ వాళ్లను పడేసే ప్రయత్నం చేస్తుంది. కానీ, పరందామయ్య మాత్రం అవి వద్దని ఆమెకే ఇచ్చేస్తాడు.

  అనంతరం నందూను బుట్టలో వేసుకునేందుకు లాస్య ప్లాన్ చేస్తుంది. కానీ, అతడు మాత్రం ఆమెతో గొడవ పడుతూ సీరియస్ అవుతాడు. మరోవైపు, సామ్రాట్, తులసి షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు. ఆ తర్వాత తులసి.. పరందామయ్య ఇంటికి వస్తుంది. దీంతో అందరూ బాగా సంతోషిస్తారు.

  పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

  మీకు నేనున్నాను అన్న తులసి

  మీకు నేనున్నాను అన్న తులసి

  తులసి అభి, ప్రేమ్ కోసం షాపింగ్ చేసి ఆ వస్తువులను తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు వాటిని వాళ్లకు అందజేస్తుంది. ఆ సమయంలో అభి 'నువ్వు వేరే ఉంటున్నావు. నీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. మా కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నావు మామ్' అని ప్రశిస్తాడు.

  దీంతో తులసి 'నాకు మీరే ప్రపంచం. మిమ్మల్ని కాదనుకున్న రోజు నేనుండను. మీకు నేనున్నాను అని గుర్తుచేయడం కోసమే ఇదంతా చేస్తున్నా. ఇందులో నా స్వార్థం కూడా ఉంది' అంటుంది. దీంతో అభి సారీ మామ్ అంటాడు. దీనికి తులసి ఇంత దానికే సారీ ఎందుకు నాన్నా అంటుంది.

  పెళ్లెందుకు చేసుకుంటారో అని

  పెళ్లెందుకు చేసుకుంటారో అని

  తులసి వాళ్లు హాల్‌లో మాట్లాడుకుంటూ ఉండగా.. నందూ, లాస్య గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఆ మాటలు వీళ్లకు వినిపిస్తుంటాయి. అప్పుడు నందూ 'గట్టిగా అరిచినంత మాత్రాన నేను నీ మాట వింటానని అనుకుంటున్నావేమో.. నేను ఇదివరకు నందూను కాదు' అని అంటాడు.

  దీంతో లాస్య ఇప్పుడు గట్టిగా ఎందుకు అరుస్తున్నావు నందూ అంటుంది. అప్పుడతను 'ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలుసా? మంచి బంధం దొరుకుతుందని. కానీ, నువ్వు ఆ బంధాన్ని దిగజారేలా చేశావు. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి' అని ఫైర్ అవుతాడు.

  యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!

  లాస్య మాటలను వినకుండానే

  లాస్య మాటలను వినకుండానే

  నందూ మాటలకు లాస్య ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల అలా చేశాను అని బదులిస్తుంది. దీంతో నందూ 'ఇక ఆపు లాస్య. మనం చివరి సారిగా ఎప్పుడు సరదాగా ఉన్నాం చెప్పు' అని అడుగుతాడు. దీంతో లాస్య తులసికి ఒక రూల్.. నాకు ఒక రూలా అంటుంది. దీనికి నందూ 'అవును. తులసితో 25 ఏళ్లు కాపురం చేశాను. కానీ, నీతో ప్రేమ బంధం ఉంది. చుట్టూ జనం మన ప్రేమను అప్పుడు తప్పు పట్టారు. కానీ, నేనెప్పుడూ ఆ కామెంట్స్‌ను పట్టించుకోలేదు. ఎందుకంటే నాది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి' అంటాడు. దీంతో తప్పులు అందరూ చేస్తారు అంటుంది.

  ఇప్పుడు నావల్ల కావడం లేదు

  ఇప్పుడు నావల్ల కావడం లేదు

  లాస్య చెప్పిన సమాధానానికి నందూ 'అవును తప్పులు అందరూ చేస్తారు. కానీ, నువ్వు ఏం చేశావు మా ఫ్యామిలీని బాధపెట్టావు. మాకు మనశ్శాంతి లేకుండా చేశావు' అని తిడతాడు. దీంతో లాస్య ఇల్లు తిరిగి ఇచ్చేస్తా అని అంటుంది. కానీ, నందూ మాత్రం అస్సలు వినడు. పైగా 'అలసిపోయాను. నీతో గొడవ పడి గొడవ పడి అలసిపోయాను. నా మనసు అర్థం చేసుకునేలా నిన్ను మార్చుకోలేకపోయాను. వినడానికి నీకు బాధగా ఉండొచ్చు.

  కానీ, నాకు చెప్పడానికి కూడా చాలా బాధేస్తోంది. నీకు దూరం అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ, నీతో అడ్జెస్ట్ అవుదామని చాలా సార్లు అనుకున్నా. ఇప్పుడు నావల్ల కావడం లేదు. చాలా కష్టంగా ఉంది లాస్య. మన మధ్య బంధం లేదు' అంటాడు.

  క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!

  తులసి ప్రస్తావన తీసుకొస్తూనే

  తులసి ప్రస్తావన తీసుకొస్తూనే

  ఆ తర్వాత నందూ 'తులసి విషయంలో మా మధ్య ఎప్పుడూ ప్రేమ లేదు. కానీ, గౌరవం ఉండేది. నేను దానికి ఎప్పుడూ విలువ ఇచ్చేవాడిని కాదు. కానీ, గౌరవం ఉండేది. కానీ, మన మధ్య అటు ప్రేమ లేదు. గౌరవం లేదు. ఇక నుంచి నీ జీవితం నీది.. నా జీవితం నాది. లోకం దృష్టిలో మాత్రమే నువ్వు, నేను భార్యాభర్తలం. నాలుగు గోడల మధ్య నువ్వు ఎవరో.. నేను ఎవరో' అని అంటాడు. దీంతో లాస్య 'నీ ప్రేమను నేను దూరం చేసుకోలేను. నువ్వు నా వాడివి. నా వాడివి గానే ఉండిపోవాలి. నేను చచ్చిపోతాను నందూ' అంటూ అతడిని బెదిరించే ప్రయత్నాలు చేస్తుంది.

  తల పగలగొట్టుకుంటా అంటూ

  తల పగలగొట్టుకుంటా అంటూ

  లాస్య బెదిరించే సరికి నందూ 'నీ కారణంగా నా మనసు కూడా ముక్కలు అయింది. కానీ, నేను చచ్చిపోలేదు కదా. నువ్వు కూడా చచ్చిపోలేవు లాస్య' అంటాడు. తర్వాత లాస్య వద్దు అన్నా వినకుండా ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటినీ పడేస్తుంది. దీంతో నందూ 'నువ్వు ఎంత హంగామా చేసినా కూడా లొంగేది లేదు.

  మళ్లీ మోసపోయే ప్రసక్తి లేదు' అంటాడు. అప్పుడు లాస్య నా మాట విను లేకపోతే తల పగులకొట్టుకుంటాను అంటుంది. కానీ నందూ మాత్రం వినడు. దీంతో లాస్య 'నాకు ఏదైనా జరగకూడనిది జరిగితే బాధ్యత' అని తలపై గట్టిగా కొట్టుకుంటుంది.

  Bigg Boss: భార్య కాకుండా ఎవరైనా ఉన్నారా? పెళ్లికి ముందు ఆ పని చేయలేదా? మగాళ్లతో శ్రీ సత్య అసభ్యంగా!

  తులసి ఎంట్రీ.. ఇద్దరితో చర్చ

  తులసి ఎంట్రీ.. ఇద్దరితో చర్చ

  ఆ తర్వాత ఇద్దరూ కిందకు వచ్చి గొడవ పడుతుండగా పరందామయ్య తిడతాడు. అప్పుడు తులసి లాస్యను పైకి తీసుకెళ్లి 'నువ్వే మధ్యలో నన్ను లాగుతున్నావు. నీ మొగుడిని నీ దగ్గర కట్టేసి ఉంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు లాస్య. మనసు పెట్టు' అంటూ సలహాలు ఇస్తుంది.

  తర్వాత నందూ దగ్గరికి కూడా వెళ్లి 'నేను మీతో రాజీ పడినా మీకు నేను నచ్చలేదు. చదువు లేదు. పల్లెటూరు మొద్దు అన్నారు. చదువుకున్న పట్నం పిల్ల లాస్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తను ఇప్పుడు మీకు నచ్చడం లేదు అంటున్నారు. తను నచ్చకపోయినా భరించాలి. మనసుకు నచ్చజెప్పుకోవాలి' అంటుంది. కానీ, నందూ మాత్రం వినడు. మా మధ్య ఇప్పుడు ప్రేమ లేదు తులసి. కర్పూరంలా ఆరిపోయింది అంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 810: Lasya hurts her Self as Nandhu Refuses to trust her. After That Tulasi Points out a Suggestion to the Duo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X