Intinti Gruhalakshmi Today Episode: తులసి పిచ్చి ప్రవర్తన.. ఇంట్లో వాళ్లను అలా చేయమని అడుగడంతో!

ఇండియాలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అద్వైత కృష్ణతో మాట్లాడుతోన్న సమయంలో తులసి తన ఆరోగ్యం గురించి నిజం తెలుసుకుంటుంది. అప్పుడు అద్వైత కృష్ణ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తాడు. కానీ, తనకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఒంటరిగా నడుచుకుంటూ రైలు పట్టాల వైపు వెళ్లిపోతుంది.

అప్పుడు ఇంట్లో వాళ్లు అందరి గురించి ఆలోచిస్తుంది. అనంతరం ఇంట్లో వాళ్లు తులసి కోసం పిండి వంటలు రెడీ చేస్తారు. చాలా సేపు పట్టాలపై కూర్చుని ఏడ్చిన తర్వాత తులసి ఇంటికి చేరుకుంటుంది. కానీ, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది.

ఇంట్లో వాళ్లందరికీ షాకిచ్చిన తులసి

ఇంట్లో వాళ్లందరికీ షాకిచ్చిన తులసి

క్యాన్సర్ ఉందని తెలుసుకుని వచ్చిన తులసి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఆ తర్వాత అందరూ తనపై చూపిస్తోన్న ప్రేమను చూసి తులసికి కోపం వస్తుంది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక చూస్తూ ఉండిపోతుంది. కొద్ది సేపటికి ఆ కోపంలో వాళ్లను ఏమీ అనలేక పగలబడి నవ్వుతూ ఉంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు తులసి 'అదేంటి.. అందరూ నవ్వకుండా ఆపేశారు. నవ్వండి నవ్వండి. ఇదే కదా మీరు చేసింది. నేను నవ్వడం కోసమే కదా మీరంతా చేసింది. ఇప్పుడెందుకు అలా ఉన్నారు?' అని అడుగుతుంది.

ఏం చేయాలో చెప్పండంటూ పిచ్చిగా

ఏం చేయాలో చెప్పండంటూ పిచ్చిగా

తన కోసం పిండి వంటలు చేసినది చూసిన తులసి 'అత్తయ్య మీకేం కావాలి? మీరు చేసిన స్వీటు నేను తినాలి. నా ముఖంలో మీరు సంతోషం చూడాలి. అంతే కదా.. తినిపించండి' అంటూ స్వీట్లను తింటుంది. తర్వాత 'దివ్య.. నా బంగారు తల్లి. నా కోసం ఏం చేశావమ్మా? జింజర్ టీ కదా తాగేస్తాను.. మొత్తం తాగేస్తాను' అంటుంది. అనంతరం 'అమ్మా అంకిత.. నాకోసం ఏం చేశావు తల్లి.. పానీపూరీ కదా తినేస్తాను. మొత్తం తినేస్తాను. ఇంకా ఏం చేయాలి? అభి నా కోసం కష్టపడి పాత సినిమాలన్నీ డౌన్ లోడ్ చేశావు కదా చూసేద్దాం. సినిమాలన్నీ చూసేద్దాం' అంటుంది.

మీ అబ్బాయి నా ఇష్టాలు మరవలేదు

మీ అబ్బాయి నా ఇష్టాలు మరవలేదు

అందరినీ అన్న తర్వాత తులసి నందూ దగ్గరకు వస్తుంది. అప్పుడు 'ఏమండి నాకు ఆరుబయట వెన్నెల్లో భోజనం చేయడం నాకు ఇష్టం అని మీకు ఇంకా గుర్తుందా? చూశారా మామయ్య.. మీ అబ్బాయికి నేనంటే ఇష్టం లేకపోయినా నా ఇష్టాలను ఇంకా మరిచిపోలేదు. అవును.. శృతి నువ్వు నాకోసం ఏం చేశావమ్మా? ప్రేమ్ నువ్వేం చేశావురా? మీరంతా నాకోసం నా సంతోషం కోసం నేను నవ్వుతూ ఉండటం కోసం ఏం చేశారో చెప్పండి' అంటూ అందరినీ ప్రశ్నిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. అసలు తులసి ఎందుకిలా చేస్తుందో అని అనుకుంటారు.

ప్రశ్నించిన నందూ.. తులసి ఆగ్రహం

ప్రశ్నించిన నందూ.. తులసి ఆగ్రహం

తులసి వింతగా ప్రవర్తిస్తుండడంతో నందూ 'తులసి ఏంటి ఇదంతా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్?' అని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'నాకు ఏమైందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ, మీరు నాకేమైందని నన్నే అడుగుతున్నారా? మీకు మీకు మీకు అందరికీ తెలుసు. తెలియనిదల్లా నాకు ఒక్కదానికే. నేనే పిచ్చిదాన్ని. ఇన్నిరోజులు మా ఆయనే నన్ను మోసం చేశాడని అనుకున్నా. కానీ, ఈరోజు మీరంతా ఆయనతో చేరిపోయారు' అంటూ చప్పట్లు కొడుతుంది. తర్వాత తన మెడికల్ రిపోర్టు గురించి ఎందుకు దాచారు అంటూ నందూను సూటిగా ప్రశ్నిస్తుంది.

ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ

ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ

నందూను అడిగిన తర్వాత 'ఒరేయ్ ప్రేమ్.. నాకు క్యాన్సర్ ఉందని ఎందుకు దాచిపెట్టావు? అలా చేసే హక్కు నీకెవరు ఇచ్చారు? నేను చచ్చిపోతానన్న నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? పైగా అస్సలు అందరూ ఎన్నిరోజులు ఆ నిజాన్ని దాచాలని అనుకున్నారు? దాచిపెట్టి లాభమేంటి? క్యాన్సర్ ఏమైనా మన బంధువా పట్టించుకోకపోతే పారిపోవడానికి. అసలు మీరేమనుకున్నారు? నాకు క్యాన్సర్ అన్న విషయాన్ని దాచిపెడితే నా చావు వాయిదా పడుతుందనుకున్నారా' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. దీంతో నందూ ఒక్కసారిగా షటప్ అంటూ అరుస్తాడు.

నీ చావు గురించి మాట్లాడితే అంటూ

నీ చావు గురించి మాట్లాడితే అంటూ

తులసిని ఆపిన నందూ 'నీ చావు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే.. నువ్వు చావడం లేదు. నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. మా అందరినీ బాధపెడుతున్నావు. ఇప్పటి దాకా నీ గుండెల్లో బాధ బయటికి వచ్చేస్తే నీ మనసు తేలికపడుతుందని చూస్తూ ఊరుకున్నా. కానీ, నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు. దయచేసి నీ చావు గురించి మాత్రం మాట్లాడకు. అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు. ఇంకా నీ ఫైనల్ రిపోర్ట్స్ రావాలి. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేస్తే ఎలా? నీ ఫైనల్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఇవన్ని మాటలు మాట్లాడకు' అంటాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
దయచేసి మీరలా చేయకండి అని

దయచేసి మీరలా చేయకండి అని

నందూ మాట్లాడిన తర్వాత తులసి ప్రేమ్‌తో 'మీ నాన్నకు ఎలా కనిపిస్తున్నానురా నేను? నాకెవ్వరి సానుభూతి అక్కర్లేదు. ఎవ్వరూ నా విషయంలో వివరణ ఇచ్చే అవసరం లేదు. ఒకప్పుడు ఈ తులసి బలహీనురాలు కావచ్చు కానీ, ఇప్పుడు కాదు. మీరందరూ నావాళ్లు. నా ప్రాణం. ఈ విషయం మీకు తెలుసు. మీరందరూ ఈ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు. నా కోసం బాధపడుతున్నారు. మీరందరూ నాకోసం ఏదైనా చేయాలనుకుంటే దయచేసి ఒక్కటి చేయండి. ఈ ప్రాణం లేని నవ్వులు, ప్లాస్టిక్ నవ్వులు ఆపేయండి' అని వాళ్లను ప్రాధేయపడుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X