Intinti Gruhalakshmi Today Episode: తులసి కొత్త ప్లాన్ సక్సెస్.. అంతలోనే ఇంట్లో గొడవ.. ప్రేమ్ పనితో!
చాలా భాషలను పోల్చుకుని చూస్తే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కెఫే ఓపెనింగ్ అయిన తర్వాత కస్టమర్లు రావడం లేదని అంతా అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో తులసి ఓ ప్లాన్ వేస్తుంది. దీంతో అది వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఓ జంట వచ్చి ఒక ఆర్డర్ ఇస్తుంది. కానీ, అది చేయడం ఎవరికీ రాదని అంటారు. అప్పుడు తులసి అది రెడీ చేసి ఇస్తుంది. మొదటి అది బాలేదన్నట్లుగా కలరింగ్ ఇచ్చి సూపర్ ఉందని వాళ్లు అంటారు. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ, లాస్య మాత్రం కుళ్లుకుంటూ ఉంటుంది. ఇక, కెఫే ప్రమోషన్ కోసం తులసి సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తుంది.

కెఫే కోసం తులసికి కొత్త టెన్షన్
తులసి రాత్రి అయినా పడుకోకుండా పేపర్‌లో ఏదో రాస్తూ ఉంటుంది. అప్పుడు అంకిత వెళ్లి ఆఫీస్ వర్క్ చేస్తున్నారా అని అడుగుతుంది. దీంతో తులసి లేదమ్మా కేఫే వర్క్ అంటుంది. అప్పుడు అంకిత ఆల్రెడీ కెఫే స్టార్ట్ అయింది కదా.. ఒక అడుగు కూడా వేశాం కదా అంటుంది. దీంతో తులసి 'కేఫె పెట్టమని ఆలోచన ఇచ్చింది నేనే. మరి దాన్ని సక్సెస్ అయ్యేలా నేను కూడా చూడాలి కదా' అంటుంది. అప్పుడు అంకిత 'మీ ముఖంలో ఎందుకు ఆంటీ టెన్షన్ కనిపిస్తోంది? మీ మాటల్లో భయం కూడా కనిపిస్తోంది. ఎందుకిలా సీరియస్‌గా తీసుకుంటున్నారు' అంటుంది.

రాత్రంతా దాని గురించే రాస్తూ
అంకిత ప్రశ్నలకు తులసి 'జీవితంలో ఓడిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. ఆ ఒంటరితనం నాకు ఎలా బతకాలో నేర్పించింది. కానీ, కేఫె విషయంలో మాత్రం అలా ఉండను అంకిత. పబ్లిసిటీ విషయంలో ఒక ఆలోచన చేశాను. అదేంటో ఇప్పుడు చెప్పను. కానీ, మార్నింగ్ లేచిన తర్వాత నీకే తెలుస్తుంది' అని అంటుంది. ఇక, ఉదయాన్నే అందరూ లేచి వస్తారు. అప్పుడు తులసి ఏదో చేస్తూ ఉంటుంది. దీంతో అంకిత రాత్రంతా మీరు మేలుకొని ఉన్నారా ఆంటీ అని అడగ్గా.. నిద్ర పట్టలేదు అంటుంది. అప్పుడు ప్రేమ్ ఏం రాస్తున్నావమ్మా అని అడుగుతాడు. పరంధామయ్య కూడా ఇదంతా ఏమి, అసలు అర్థమయ్యేలా చెప్పు తులసి అంటాడు.

కెఫే కోసం తులసి నయా ప్లాన్
ఇంట్లో వాళ్లు ప్రశ్నించడంతో తులసి 'మన మధ్య ఉన్న కొందరు చెప్పినా కెఫేకు ఎవరు వస్తారు? అసలు ఇది ఇక్కడ ఉందని ఎలా తెలుస్తుంది? అని మాట్లాడారు కదా' అంటుంది. దీంతో అనసూయ ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు అని అంటుంది. దీనికి తులసి 'రాత్రంతా కూర్చుని మన పబ్లిసిటీ గురించి ఆలోచించాను' అని చెప్తుంది. దీంతో లాస్య దీనికోసం రాత్రంతా కూర్చోవాలా అని వెటకారంగా అడుగుతుంది. అప్పుడు తులసి 'నందగోపాల్ గారు మనం పబ్లిసిటీ స్టార్ట్ చేద్దాం' అని ప్లాన్ ఇస్తుంది. దీంతో లాస్య 'ఏం చేస్తారు? సీరియల్స్ మధ్యలో యాడ్స్ చేస్తారా' అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో ఆమెపై నందూ సీరియస్ అవుతాడు. అప్పుడు లాస్య లేకపోతే ఏంటి నందు ఆవిడ గారు చెప్పడం మీరు వినడం అని అంటుంది.

పాంప్లెట్ల ప్లాన్.. అభి సీరియస్
ఆ తర్వాత తులసి పాంప్లెట్లు పంచుదాము అంటుంది. దీంతో లాస్య ఇలాంటి చెత్త చెత్త ఆలోచనలు ఇవ్వకు అని అంటుంది. అప్పుడు నందూ నీ ఆలోచన నాకు నచ్చింది తులసి అని నందు అనడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు ఇంట్లో అందరూ మాకు కూడా నచ్చింది అంటారు. దీంతో లాస్య ఎందుకు నచ్చదు తులసి చెప్పింది కదా అంటుంది. అనంతరం ఇంట్లో వాళ్లు పాంప్లెంట్స్ పంచడానికి కుర్రాళ్ళు అవసరం కదా అంటారు. దీంతో తులసి అవసరం లేదు మనమే పంచాలి అని అంటుంది. అప్పుడు అభి 'ఇప్పటికే కేఫ్ పెట్టించి కుటుంబం పరువుని బజారుకి ఈడ్చావు. ఇప్పుడు మళ్లీ ఏంటి మామ్ ఇది? అసలు ఎందుకు నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి' అని సీరియస్ అవుతాడు.

అభితో గొడవకు దిగిన అంకిత
అభి మాటలకు పరందామయ్య 'ఇప్పుడు కోట్లలో బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ ఒకప్పుడు ఎంతో కష్టపడిన వాళ్ళే' అంటాడు. అప్పుడు ప్రేమ్ పాంప్లెట్ పంచడానికి మేము రెడీ అనడంతో పేపర్ కూడా రెడీగా ఉంది వెళ్లి పాంప్లెట్‌లు ప్రింట్ చేయించుకుని రా అని చెబుతుంది. ఆ తర్వాత అభి హాస్పిటల్‌కు బయలుదేరు అనడంతో నేను రావడం లేదు అని అంకిత వెళ్లిపోతుంది. దీంతో అభి 'నేను మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ నిలబడు. నువ్వు కూడా ఆ గొర్రెల మందతో కలిసి రోడ్డు మీద పాంప్లెట్లు పంచడానికి వెళ్తున్నావా' అంటాడు. దీంతో అంకిత 'మైండ్ యువర్ లాంగ్వేజ్ అభి. అసలు ఇంట్లో వాళ్లకి గౌరవం ఇవ్వని వాడితో మాట్లాడటం వేస్ట్' అంటూ గొడవకు దిగుతుంది.

నీ వల్ల నాకు అదే జరిగిందని
అంకిత మాటలకు అభి నేను నీ భర్తని ఆ విషయం గుర్తుందా అంటాడు. దీంతో అంకిత 'మనం భార్యాభర్తలమే కానీ అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలం కాదు' అంటుంది. అప్పుడు అభి 'నాకు భార్య అవ్వడం వల్లే నువ్వు ఇంటికి కోడలివి అయ్యావు' అంటుంది. దీంతో అంకిత నీ వల్ల నాకు అదొక్కటే మంచి జరిగింది అంటుంది. అప్పుడు అభి 'కేఫే విషయంలో నువ్వు కలుగజేసుకోకు ఆ బురద నువ్వు అంటించుకోకు. వాళ్ళను వదిలేయ్' అని అంటాడు. దీంతో సేమ్ డైలాగ్ నీకు అదే చెబుతున్నాను అని అంటుంది. దీనికి అభి నాకంటే నా కుటుంబం ఎక్కువయిందా అనగా.. ఇది మన కుటుంబం అని అభికి బుద్ధి చెబుతుంది.

ప్రేమ్ సాయం.. నందూ హ్యాపీ
ఇక, ప్రేమ్ ఆ పాంప్లెట్లు తీసుకుని వస్తాడు. ఆ తర్వాత అందరూ అతడి కెఫే కోసం మాట్లాడుతూ ఉండడంతో నందూ ఎమోషనల్ అవుతాడు. దీంతో ప్రేమ్ ఏమైంది నాన్న అని అడుగుతాడు. దీంతో నందూ 'ఇనాళ్లూ ఒంటరి వాడిని అని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తుంటే ఆనందంగా ఉంది' అంటాడు. దీంతో నందూను ప్రేమ్ హత్తుకుని సంతోషిస్తాడు. ఆ తర్వాత అందరూ పాంప్లెట్లు పంచుతారు. ఇక, అవి చూసి కెఫేకు చాలా మంది కస్టమర్లు వస్తారు. వాళ్లకు లాస్య కూడా సర్వ్ చేస్తుంది. అనంతరం తులసి, నందూ కెఫే గురించి ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. అది చూసి ఇంట్లో వాళ్లు సంతోషించగా.. లాస్య కుళ్లుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











