Intinti Gruhalakshmi Today Episode: తులసికి నందూ సర్‌ప్రైజ్.. తల్లిపై అభి నిందలు.. లాస్యకు షాక్‌లు
మిగిలిన వాటి కంటే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ కెఫే ఓపెనింగ్ అయిన తర్వాత కస్టమర్లును మరింతగా ఆకట్టుకోవడం కోసం పాంప్లెట్లు పంచిపెట్టాలని తులసి ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం ఇంట్లో వాళ్లంతా సహకరించాలని కోరుతుంది. కానీ, అభి మాత్రం దానికి ఒప్పుకోడు. పైగా అంకితను కూడా సహాయం చేయొద్దని అంటాడు.
దీంతో ఆమెకు కోపం వచ్చి గొడవ పడుతుంది. ఇక, తులసి ప్లాన్ వర్కౌట్ అవడంతో కెఫేకు కస్టమర్ల తాకిడి పెరిగిపోతోంది. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇక, తులసి, నందూ దగ్గరవుతుండడంతో లాస్యకు అసహనం పెరిగిపోతూ ఉంటుంది.

ఇంట్లో వాళ్లకు నందూ గిఫ్టులు
ఉదయాన్నే నందూ రెడీ అవుతుండగా ఎక్కడికెళ్తున్నావని లాస్య అడుగుతుంది. దీంతో ఎందుకు అడుగుతున్నావని నందూ అంటాడు. దీనికి లాస్య ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అంటుంది. అప్పుడు నందూ 'ఈ మధ్య నీకు కోపం ఎక్కువ అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకో' అంటాడు. తర్వాత లాస్య బయటికి వెళ్దాం నందూ బోర్ కొడుతోంది అంటుంది. దీనికతడు నేను తులసి వేరే పని మీద బయటకు వెళ్తున్నాము అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నందూ కొత్త బట్టలు తీసుకుని రావడంతో అవి చూసి లాస్య తనకేనేమో అనుకుని సంతోషిస్తుంది.

తులసికి చీర కొనిచ్చిన నందూ
లాస్య తనకేనా అని అడగ్గానే నందూ ఇవి నీకు కాదు ఇంట్లో వాళ్లకి అని అంటాడు. అప్పుడు పరందామయ్య ఏ సందర్భంగా తెచ్చావురా అని ప్రశ్నించగా.. 'సందర్భం ఏమీ లేదు నాన్న. నేను సంతోషంగా ఉన్నాను అందుకే తీసుకువచ్చాను. బట్టలు తీసుకుని వచ్చాను.. ఎవరు కాదనద్దు' అంటూ అందరికీ ఇస్తాడు. ఆ సమయంలోనే నందూ తులసివైపు చూస్తూ ప్లీజ్ అంటూ బట్టలు ఇస్తుండగా తులసి అలాగే చూస్తూ ఉంటుంది.
అప్పుడు అందరూ తీసుకోండి ఆంటీ లేకపోతే మేము కూడా తిరిగిచ్చేస్తాము అంటారు. దీంతో ఆమె తీసుకుంటుంది. అప్పుడు తులసి మనసులో 'పాతికేళ్ల కాపురంలో ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు. ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత కొని పెడుతున్నారు' అనుకుని నవ్వుకుంటుంది.

నెక్లెస్ అడిగిన లాస్యకు ఝలక్
బట్టలు తీసుకున్న తర్వాత పరందామయ్య అందరికీ తెచ్చావు కదా.. మీ ఇద్దరికీ తీసుకోలేదే అని ప్రశ్నిస్తాడు. దీంతో నందూ 'లాస్యకి నా సెలెక్షన్ నచ్చదుజ అందుకే తనకు డబ్బులు ఇస్తున్నాను' అని ఇస్తాడు. దీంతో లాస్య సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుతుండగా సిటీలో మరొక రెండు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాము అని వాళ్లకు చెబుతుంది. దీంతో అంతా సంతోషిస్తారు. అంకాదు, పార్టీ ఇవ్వాలి అనడంతో ఏమేం కావాలో అడగండి అని నందూ అడుగుతాడు. దీంతో లాస్య నాకు నెక్లెస్ కావాలి అంటుంది. అప్పుడు తులసి 'అవన్నీ కాదు.. ముందు మీ కారు బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంది కదా. దాన్ని రిటర్న్ తెచ్చుకోండి' అని అంటుంది. దీంతో నైట్ అందరికీ ట్రీట్ ఇస్తానని నందూ అంటాడు.

తులసిపై నందూ ప్రశంసలు
నందూ పని చేసుకుంటూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. అప్పుడతను 'మా ఫ్రెండ్ బిజీగా ఉంటే చూద్దామని వచ్చాను' అంటాడు. దీంతో నందూ 'అవునా.. మా వాళ్ళందరూ నా వెనక నిలబడ్డారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏం చేయలేను అనుకుంటున్న సమయంలో నాకు ఐడియా ఇచ్చి కేఫే పెట్టమని సలహా ఇచ్చింది తులసే' అని చెబుతాడు. దీంతో అతడి ఫ్రెండ్ 'డివోర్స్ ఇచ్చిన భార్యలు మామూలుగా కోపంతో ఉంటారు. కానీ ఇలా చేస్తోంది అంటే తన గ్రేట్. ఈ విషయంలో నందూ చాలా అదృష్టవంతుడివిరా నువ్వు' అంటూ పొగుడుతాడు.

తులసిని అవమానించొద్దని
ఆ తర్వాత నందూ 'నేను తులసి కోసం ఏం చేయకపోయినప్పటికీ తను మాత్రం నాకు అండగా నిలబడింది. తనది చాలా గొప్ప మనసు' అంటుంది. దీనికి ఫ్రెండ్ 'అప్పుడంటే తనకు ఏమి ఇవ్వలేకపోయావు. మరి ఇప్పుడు ఏమి ఇస్తావు' అని ప్రశ్నిస్తాడు. దీంతో నందూ తన పాకెట్‌లో ఉన్న గోల్డ్ నెక్లెస్ చూపించి 'ఇది తులసి కోసం తీసుకున్నాను. ఇది నేను తులసికి మాజీ భర్తగా ఇవ్వట్లేదు.
నా కేఫే స్టార్ట్ చేసినందుకు ఒక ఫ్రెండ్‌గా ఇస్తున్నాను' అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ 'తులసిని ఇంకొకసారి ఎప్పుడూ అవమానించద్దు బాధ పెట్టొద్దు. అలా చేసావంటే నీకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నందూ ఆ నెక్లెస్ వైపు చూస్తూనే ఉంటాడు.

వాలంటైన్స్ డే స్పెషల్ ప్లాన్
అనంతరం తులసి కేఫే డెకరేషన్ గురించి ఫోన్లో మాట్లాడుతుండగా.. అక్కడికి అనసూయ, పరంధామయ్య వస్తారు. అప్పుడు ఆయన ఏం స్పెషల్ ఉంది తులసి అనడంతో 'ప్రేమికుల రోజు ఉంది మామయ్య. ఆరోజున ప్రేమికులు ఎక్కువ మొత్తంలో వస్తారు. అందుకే ఇలా డెకరేట్ చేస్తున్నాను' అంటుంది. దీంతో శృతి అప్పుడు కేఫేలో అందరూ ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. మన కేఫేకు కావాల్సిన పబ్లిసిటీ కూడా వస్తుంది' అని అంటుంది.
ఇంతలో నందూ అక్కడికి రావడంతో తులసి మీకు చెప్పకుండా ప్లాన్ చేశాను ఏమనుకోవద్దు అని అంటుంది. దీంతో నందూ 'నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ముందున్నావు అన్న ధైర్యంతోనే మేము వెనకాల వస్తున్నాము' అని అంటాడు. అప్పుడే లాస్య అక్కడకు వస్తుంది.

లాస్యకు అలా.. తులసికి ఇలా
నందూకు తెలియకుండా తులసి నిర్ణయాలు తీసుకోవడంతో లాస్యకు కోపం వస్తుంది. ఓనర్ అయిన నందూకు తెలియకుండా నువ్వెలా డిసైడ్ చేస్తావు అంటూ తులసిపై ఆమె ఫైర్ అవుతుంది. దీంతో నందూ లాస్యకు షాకిచ్చేలా తులసి వైపు మాట్లాడతాడు. దీంతో ఆమె సైలెంట్ అయిపోతుంది.
మరోవైపు, అంకితను అమెరికా తీసుకెళ్లాలనుకున్న అభి.. దానికి గాయత్రిని డబ్బులు అడుగుతాడు. అది తెలిసి తులసి ప్రశ్నించగా.. 'నువ్వు చెప్తే గాని ఈ విషయం అంకితకు తెలియదు. కానీ నువ్వే మా మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నావు' అంటూ నిందిస్తాడు. ఆ తర్వాత కూడా తులసిని తిడుతూ మాట్లాడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











