twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: ఇంట్లో వాళ్లకు తులసి బిగ్ షాక్.. పది లక్షలకు మోసపోయిన అభి

    |

    ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బును తులసి తీసుకోడానికి ఇష్టపడదు. అంతేకాదు, అది ఎక్కడిది అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత మాధవి దగ్గర తీసుకున్న డబ్బుల గురించి కూడా మాట్లాడుతుంది. దీంతో అభి ఆ డబ్బులు తీసుకెళ్లి అంకిత ముందు అరుస్తాడు. మరోవైపు, తులసి డబ్బుల లెక్కలు అడుగుతుందని లాస్య కోప్పడుతుంది.

    దీంతో నందూకు, ఆమెకు మధ్య డిస్కర్షన్ జరుగుతుంది. అనంతరం తన దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలంటూ శశికళ తులసి దగ్గరకు వస్తుంది. వడ్డీతో కలిపి రూ. 80 లక్షలు అడుగుతుంది.

    DJ Tillu Twitter Review: డీజే టిల్లుకు షాకింగ్ టాక్.. ప్లస్ మైనస్‌లు అవే.. ఫైనల్ రిపోర్ట్ ఇదేDJ Tillu Twitter Review: డీజే టిల్లుకు షాకింగ్ టాక్.. ప్లస్ మైనస్‌లు అవే.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

    అభి, లాస్యపై తులసి తీవ్ర ఆగ్రహం

    అభి, లాస్యపై తులసి తీవ్ర ఆగ్రహం

    శశికళ దగ్గర చేసిన అప్పు నీకు సంబంధించిందే తులసిని నిందించడంతో ఆమె ఫైర్ అవుతుంది. 'సిగ్గుండాలి మీ అందరికీ ఇలా మాట్లాడటానికి. ఈ అప్పు ఎవరి కోసం తీసుకున్నానో.. ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నానో మీకు తెలియదా?' అని సీరియస్ అవుతుంది. లాస్య మీద కూడా తులసి విరుచుకుపడుతుంది.

    'సడెన్‌గా మామయ్య గారికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ లేదు. నీ అకౌంట్‌లో పది లక్షలు ఉన్నాయి. అయినా నువ్వు రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు నీ నోరు లేస్తుంది ఏంటి' అని ఆమెను ప్రశ్నిస్తుంది తులసి.

    ఇంట్లో వాళ్లకు షాకిచ్చేసిన తులసి

    ఇంట్లో వాళ్లకు షాకిచ్చేసిన తులసి

    లాస్యపై కోప్పడిన తర్వాత అభితో 'ఏరా అభి.. నువ్వు చేసిన పని ఏంటి? అప్పుడు డాక్టర్‌గా నువ్వు చేసిన పనికి కేసు అయితే నా కాళ్ల మీద పడ్డావు. నీ పని అయిపోయిన తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయావు. మామయ్య గారి కోసం తీసుకున్న అప్పు అది. అందుకే ఆ అప్పును అందరూ సమానంగా పంచుకోవాల్సిందే' అంటుంది తులసి.

    దీంతో లాస్య ఆమె మాటకు ఒప్పుకోదు. పైగా 'అప్పుడు అప్పు తీరుస్తా అని నువ్వే కదా ఒప్పుకుంది. ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నావా' అని అంటుంది. దీంతో లాస్య, తులసి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ ప్రారంభం అవుతుంది.

    హనీమూన్‌లో హాట్‌గా సీరియల్ హీరోయిన్: దారుణమైన ఫోజులతో కొత్త పెళ్లికూతురు రచ్చహనీమూన్‌లో హాట్‌గా సీరియల్ హీరోయిన్: దారుణమైన ఫోజులతో కొత్త పెళ్లికూతురు రచ్చ

    శశికళ వార్నింగ్.. తులసి కండీషన్

    శశికళ వార్నింగ్.. తులసి కండీషన్

    లాస్య, తులసి గొడవ పడుతుండగా మధ్యలో వచ్చిన శశికళ 'మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వారం రోజుల్లో రూ. 80 లక్షలు కట్టండి. లేదంటే ఈ ఇంటి ముందు నా బోర్డు పెట్టుకుంటా' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో తులసి 'అందరూ విన్నారు కదా. నా వాటాగా నేను 20 లక్షలు ఇచ్చేస్తాను. మిగితా వాళ్లు కూడా మీ డబ్బు తీసుకురండి' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు ఎవరి రూమ్‌లోకి వాళ్లు వెళ్లిపోతారు. అంతేకాదు, అందరూ తమ వాటా కింద కట్టాల్సిన డబ్బుల గురించి లెక్కలు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.

    అభి కోపంగా.. డబ్బు తీసుకొస్తానని

    అభి కోపంగా.. డబ్బు తీసుకొస్తానని

    అంకిత దగ్గరికి వెళ్లిన అభి.. 'చూశావా అంకిత.. అమ్మ చేసిన తప్పును నువ్వు తెలుసుకున్నావా? ముందు తను ఇస్తానని ఒప్పుకుని.. ఇప్పుడు అందరికి పంచి పెట్టింది కదా' అని అడుగుతాడు. దీనికామె 'ఇప్పుడు అవన్నీ ఎందుకు అభి? ముందు మన అప్పు ఎలా తీర్చాలో ఆలోచిద్దాం. ఇప్పటికిప్పుడు 20 లక్షలు అంటే మనం ఎలా తీసుకొస్తాం.

    పోనీ.. మా అమ్మను ముందు అడ్వాన్స్‌గా అడుగుదామా. అదొక్కటే మార్గం ఉంది' అని అంటుంది. దీంతో అభి 'వద్దు.. మీ అమ్మ దగ్గర అయితే అస్సలు వద్దు. నేనే ఎలాగోలా డబ్బు తీసుకొస్తా' అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

    టాప్ లేపి చూపించిన నందినీ రాయ్: అద్దం ముందు హాట్ హాట్ ఫోజుతో రచ్చటాప్ లేపి చూపించిన నందినీ రాయ్: అద్దం ముందు హాట్ హాట్ ఫోజుతో రచ్చ

    తులసి బాధ.. వాళ్లు ఇద్దరూ వచ్చి

    తులసి బాధ.. వాళ్లు ఇద్దరూ వచ్చి

    తులసి తన ఫ్యాక్టరీ మేనేజర్‌కు ఫోన్ చేసి మన అకౌంట్‌లో డబ్బు ఎంతుంది అని అడుగుతుంది. దీనికాయన కేవలం 4 లక్షలు మాత్రమే ఉన్నాయి అంటాడు. దీంతో సరే అని ఫోన్ కట్ చేస్తుందామె. ఇంతలో అనసూయ వచ్చి 'తప్పు చేశావు తులసి. ఆయన నీ పేరు మీద ఇల్లు రాసింది కనీసం ఇలా అయినా అందరూ కలిసి ఉంటారని' అంటుంది.

    ఇంకా ఏదో అనబోతుండగా పరందామయ్య వచ్చి తులసిని ఏమనొద్దని అంటాడు. అంతేకాదు, 'తను ఆరోజు ఆ పని చేయకపోయి ఉంటే.. ఇప్పుడు నేను బతికి ఉండేవాన్ని కాదు. ఆరోజు తను అందుకే శశికళ పెట్టిన అన్ని కండిషన్లను ఒప్పుకుంది. లేదంటే ఈరోజు నీ నుదుటి మీద బొట్టు ఉండేది కాదు' అంటాడు. దీంతో అనసూయ మౌనంగా ఉండిపోతుంది.

    అప్పు చేసి ఇరుక్కుపోయిన అభి

    అప్పు చేసి ఇరుక్కుపోయిన అభి

    తనకు ఉన్న అప్పును తీర్చుకునేందుకు అభి.. ఓ సేటు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు 'నాకు 10 లక్షల అప్పు కావాలి. తాకట్టుగా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇస్తా. అలాగే, చెప్పిన సమయానికి డబ్బు ఇస్తా' అని చెబుతాడు. దీంతో అతడు ఒప్పుకోగా.. 10 లక్షలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ సమయంలో 'నేను అడగకుండానే నా అప్పు తీర్చాలి లేకపోతే మాత్రం నేను మంచోడిని కాదు' అని సేట్ అభిని హెచ్చరిస్తాడు. ఇక, ఆ డబ్బులు తీసుకొని వెళ్లిన అభి.. తన స్నేహితుడికి ఇచ్చి షేర్ మార్కెట్‌లో పెట్టమని అడుగుతాడు. అప్పుడు మాయ మాటలు చెప్పిన అతడు.. ఏదో ప్లాన్ వేసినట్లు కనిపిస్తాడు.

    బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!

    తులసికి నందూ సపోర్ట్ చేయడంతో

    తులసికి నందూ సపోర్ట్ చేయడంతో

    మరోవైపు, 'అప్పు తీర్చడానికి మన వాటా డబ్బులు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నావా నందూ' అని లాస్య అతడిని అడుగుతుంది. దీంతో అవును లాస్య అంటాడు. దీనికామె 'సిగ్గు ఉండాలి నీకు.. తులసి చేసిన అప్పును మనం ఎందుకు తీర్చాలి? తను చేసిన అప్పు 20 లక్షలు మాత్రమే కదా. మిగితా 80 లక్షల బాధ మనకెందుకు? హక్కుల సంగతి గుర్తొచ్చేసరికి వాళ్లు తులసి మాత్రమే గుర్తొస్తుంది.

    అప్పులు అనే సరికి మాత్రం మనం గుర్తొస్తాం. నీ కెఫెలో నీకు పది లక్షల లోన్ ఎక్కడ పుడుతుంది? నిన్న కాక మొన్న జాయిన్ అయ్యాను. ఏ నమ్మకంతో వాళ్లు నాకు లోన్ ఇస్తారు' అంటుంది. దీంతో నందూ 'అదేంటి లాస్య అలా అంటావు. మరి తులసి మాత్రం ఏం చేస్తుంది చెప్పు' అంటాడు. దీంతో ఆమె కోప్పడుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 554: Tulasi Fired on Family Members about Shashikala Money. Then Lasya Angry on Nandhu for Supporting Tulasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X