Intinti Gruhalakshmi Today Episode: నెక్లెస్ చూసి లాస్య షాక్.. తులసితో నందూ జాలీగా.. జంటకు షాకిచ్చి!

ఇండియా మొత్తంలో తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కెఫే బిజినెస్ సక్సెస్ అవడంతో నందూ.. ఇంట్లోని వాళ్లందరికీ గిఫ్టులు తెచ్చి ఇస్తాడు. ఆ సమయంలో తులసికి కూడా చీరను ఇస్తాడు. దాన్ని ఆమె తీసుకోవడంతో అందరూ సంతోషిస్తారు. అనంతరం మరో రెండు చోట్ల కూడా కెఫే బిజినెస్ పెడుతున్నట్లు తులసి చెబుతుంది.

తర్వాత లాస్య తనకు నెక్లెస్ కావాలని అడుగుతుంది. ఇక, తన ఫ్రెండ్ ముందు తులసిపై నందూ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. అంతేకాదు, ఆమెకు నెక్లెస్ తీసుకున్నట్లు చెప్తాడు. చివర్లో తమను విడగొట్టాలని ప్రయత్నిస్తుందని తులసిని అభి నిందిస్తాడు.

నిజం తెలిస్తే వచ్చేస్తుందంటూ

నిజం తెలిస్తే వచ్చేస్తుందంటూ

అభి తన అత్తగారి దగ్గర డబ్బులు తీసుకున్నాడని తెలుసుకున్న తులసి అతడికి క్లాస్ పీకుతుంది. ఆ సమయంలో 'ఏదో ఒక రోజు నువ్వు మారతావన్న ఆశతో అంకిత ఆశగా ఎదురు చూస్తోంది. కానీ, నీ గురించి అసలు నిజం తెలిసిన రోజు మీరిద్దరూ అమెరికాలో ఉన్నా నిన్ను విడిచి ఇండియాకు వచ్చేస్తుంది.

ఈ అమ్మ మీద నీకు కోపం ఉండవచ్చు. కానీ, ఏ తల్లి కూడా బిడ్డకు శత్రువు కాదు. ఏ లోకంలో ఉన్న ఆ తల్లి బిడ్డ సంతోషమే కోరుకుంటుంది. నేనూ అదే చేస్తున్నాను. ఒక్కసారి నేను చెప్పిన మాటలు గురించి ఆలోచించుకో అభి' అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

నెక్లెస్ చూసి లాస్య సంతోషంగా

నెక్లెస్ చూసి లాస్య సంతోషంగా

ఇక, కెఫేకు వెళ్లడం కోసం లాస్య రెడీ అవుతూ ఉంటుంది. ఇందుకోసం బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ 'ఈ మధ్య నందూ నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు. నాకు దూరంగా ఉంటున్నా పర్లేదు కానీ, ఆ తులసికి మాత్రం దగ్గర కాకూడదు' అని అనుకుంటుంది. తర్వాత ఒక చీరను తీసుకుని 'ఈరోజు కెఫేకు ఇది కట్టుకుని వెళ్దాం.. నందూకు కూడా నేనే సెలెక్ట్ చేస్తాను' అనుకుంటుంది. ఆ వెంటనే ప్యాంట్ చూడగా అది బరువుగా ఉంటుంది.

ఏంటా అని పాకెట్‌లో చూడగా.. అందులో ఓ నెక్లెస్ కనిపిస్తుంది. అది చూసి లాస్య తనకేనేమో అని సంతోషిస్తుంది. అంతేకాదు, 'వాలెంటైన్స్ డే వస్తుంది కదా నా కోసం తెచ్చాడు అనుకుంటా. దీన్ని నందూ చేతుల మీదుగానే తీసుకుంటాను' అని అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది.

తులసికి నెక్లెస్ ఇచ్చేలా ప్లాన్

తులసికి నెక్లెస్ ఇచ్చేలా ప్లాన్

ఆ తర్వాత తులసి బయట స్కూటీ కడుక్కుంటూ ఉండగా.. ఇంతలో అక్కడికి నందూ వస్తాడు. అప్పుడు అతడు 'తులసికి నెక్లెస్ ఎలా ఇవ్వాలి? ఇంట్లో అందరూ ఉన్నారు. తులసితో పాటు బైక్ మీద వెళితే దారిలో ఇవ్వచ్చు' అనుకుంటూ కారు తుడుస్తుంటాడు. అప్పుడు తులసి 'పదేపదే చేసిన పని చేసే వారిని ఏమంటారు' అని అడుగుతుంది. దీంతో నందూ ముసలోడు లేదా మతిమరిపోడు అంటారు అంటాడు. దీనికి తులసి అయితే మీకు మతిమరుపు అంటుంది. దీంతో నందూ అదేంటి తులసి అనడంతో మార్నింగ్ కారు క్లీన్ చేశారు కదా మళ్లీ ఎందుకు అంటుంది.

కారు చెడిపోయేలా చేసేశాడు

కారు చెడిపోయేలా చేసేశాడు

తులసి అడిగిన దానికి ఏం చెప్పాలో నందూకు అర్థం కాదు. దీంతో కాసేపు మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత నందూ 'ఎలా అయినా కారు చెడిపోయేలా చేసి తులసి బైక్ మీద వెళ్లాలి' అనకుంటూ ఉంటాడు. అంతలో అంకిత అక్కడికి వచ్చి కాఫీ ఇస్తుంది.

ఇప్పుడు ఎలా అయినా కారు చెడగొట్టాలి అనుకుంటూ నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. అనంతరం అతడు కారు చెడిపోయేలా చేసి ఆనందంగా వెళ్తాడు. గదిలోకి వెళ్లిన నందూ ఆనంద పడుతుంటాడు. ఆ తర్వాత లాస్య బట్టలు సెలెక్ట్ చేయడం చూసి.. ఆమెను తనతో రాకుండా చేయాలని అనుకుంటాడు.

లాస్య చీరపై టీ పోసిన నందూ

లాస్య చీరపై టీ పోసిన నందూ

తులసికి కలిసి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న నందూ.. లాస్యను కూడా తనతో రాకుండా చేయాలని అనుకుంటాడు. అందుకోసం లాస్య కట్టుకోవడానికి అక్కడ పెట్టుకున్న చీరను టీలో పడేలా చేస్తాడు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన లాస్య అది చూసి బాధ పడుతుంది.

అప్పుడు నందూ 'లాస్య నువ్వు ఇప్పుడు ఒక పని చెయ్. చీర సెలెక్ట్ చేసుకుని నిదానంగా రా. నేను వెళ్ళిపోతాను' అని సంతోషంగా బయటకు వస్తాడు. ఆ వెంటనే కారులో కూర్చుని తులసి వచ్చే సరికి ప్లాన్‌ను అమలు చేయాలని అనుకుంటాడు. తర్వాత ఆమె రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.

ప్లాన్ ప్రకారమే తులసితో వెళ్లి

ప్లాన్ ప్రకారమే తులసితో వెళ్లి

ఇక, తులసి కెఫేకు వెళ్లేందుకు బయటకు రాగానే నందూ తాను ముందుగానే వేసుకున్న ప్లాన్‌ను అమలు చేస్తుంటాడు. 'తులసి నా కారు ట్రబుల్ ఇచ్చింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కావడం లేదు. ఈరోజుకు నేను కూడా నీ బైక్ మీద వస్తాను' అని అడుగుతాడు. దీంతో తులసి సరే అంటుంది. ఆ వెంటనే అతడు బైక్ ఎక్కి వెళ్లిపోతాడు.

ఇది చూసిన లాస్య బాగా కుళ్లుకుంటూ ఉంటుంది. ఇక, తులసితో కలిసి వెళ్తున్న నందూ తన దగ్గర ఉన్న నెక్లెస్‌ను ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాదు, బైక్ మీద ఉన్నప్పుడే ఆమెకు అందించాలని అనుకుంటాడు.

వాళ్లకు క్లాస్.. ఆగిపోయిన నందూ

వాళ్లకు క్లాస్.. ఆగిపోయిన నందూ

తులసి, నందూ బైకుపై వెళ్తోన్న సమయంలోనే ఇద్దరు లవర్స్ రోడ్డుపై గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు. అది చూసిన తులసి వాళ్ల దగ్గరకు వెళ్లి 'ఒక చోట నిలబెట్టి ఇలా చేస్తే ఆక్సిడెంట్ అవుతాది అన్న కామన్ సెన్స్ లేదా' అంటూ క్లాస్ పీకుతుంది. దీంతో నందూకు భయం వేసి తన గిఫ్ట్‌ను తులసికి ఇవ్వకుండా దాచుకుంటాడు. తర్వాత తులసి నందూను పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

దీంతో నందూ ఆ గిఫ్ట్ ఇవ్వడానికి తిప్పలు పడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి లాస్య వస్తుంది. తర్వాత తులసి కెఫేను వాలంటైన్స్ డేకు స్పెషల్‌గా రెడీ చేయిస్తూ ఉంటుంది. దీంతో నందూ సమయం కోసం వేచి చూస్తుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X