Intinti Gruhalakshmi Today Episode: తులసి ఇంటికి వచ్చిన సేటు.. అభికి అంకిత బ్రేకప్.. అంతలో ట్విస్ట్
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. డబ్బులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదంటూ నందూ, లాస్యతో చెబుతాడు. అంతేకాదు, ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే అమ్మానాన్నల పరిస్థితి ఏంటని అంటాడు. మరోవైపు, తన గురించి బాధపడుతోన్న అత్తమామలను ఓదార్చి అన్నం పెడుతుంది తులసి. అప్పుడే లాస్య వచ్చి అన్నం ఎలా తినబుద్ది అవుతుంది అంటూ పెద్ద గొడవ చేస్తుంది. ఇక, పది లక్షల రూపాయలు తీసుకుని అభి ఫ్రెండ్ మనోజ్ పరారవుతాడు. ఫోన్ చేయగా మోసం చేశానని చెబుతాడు. అనంతరం అభి డబ్బు కోసం సేట్ తులసి ఇంటికి వచ్చి రచ్చ చేస్తాడు.

మనోజ్ మోసం.. బాధతో వచ్చిన అభి
ఇన్వెస్ట్ చేయమని ఇచ్చిన డబ్బులు తీసుకుని మనోజ్ పారిపోతాడు. దీంతో అతడు మోసం చేశాడని తెలుసుకొని తీవ్రంగా బాధపడతాడు అభి. అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. దీనంగా ఏదో కోల్పోయిన వాడిలా మొహం పెట్టి రావడంతో అతడిని అంకిత గమనిస్తుంది. 'ఏమైంది అభి? మనిషి ఇక్కడ ఉన్నావు కానీ.. మనసు ఎక్కడో ఉంది. మొహంలో ఏదో తెలియని కలవరం. మొహం మీద ఆ చెమటలు ఏంటి అభి? ఒంట్లో బాగోలేదా?' అని అడుగుతుంది. దీనికతడు బాగానే ఉంది అంటాడు. కానీ, ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది.

అంకితపై అభి కోపం.. వెళ్లిపోవడంతో
అభి అబద్ధం చెబుతున్నట్లు గ్రహించిన అంకిత.. ఏమైందో చెప్పమని అడుగుతూ ఉంటుంది. దీంతో అతడు 'మనీ కోసం ట్రై చేస్తున్నాను. దాని కోసమే టెన్షన్ పడుతున్నా' అంటాడ. దీంతో అంకిత 'సారీ అభి.. భోజనం చేద్దువు గానీ పదా. నీకోసమే వెయిట్ చేస్తున్నా' అని అంటుంది. కానీ, అభి మాత్రం 'నాకు ఆకలి లేదు. నా బదులు కూడా నువ్వే తిను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అంకిత ఎంతగానో బాధ పడుతుంది. అంతేకాదు, అసలు అభికి ఏమైంది? ఎందుకు అంత టెన్షన్‌గా ఉన్నాడు? ఏం జరిగింది? అని తనలో తానే అనుకుంటుంది.

అభిని బ్రతిమాలిన తల్లి... చిరాకుగా
ఇక, ఒంటరిగా ఉన్న అభి దగ్గరకు తులసి వస్తుంది. 'ఏం జరిగిందిరా? చెప్పు నాన్న.. నేను నీ శత్రువును కాదు అమ్మను. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు' అని అడుగుతుంది. దీనికతడు 'అలా చేసింది నువ్వు. నాకు ఇఫ్పుడు ఎవరితో మాట్లాడే మూడు లేదు. నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నారు' అంటాడు. దీంతో 'నా బిడ్డ ఇలా ఉండటం నేను చూడలేను' అంటుంది తులసి. అప్పుడు 'నిన్ను ఎవరు చూడమన్నారు? నాకు మాట్లాడాలని లేకపోతే మీరు ఎంత వెంటపడ్డా నేను మాట్లాడను. నేను ఎదైనా చెప్పాలి అనుకుంటే.. నీకు ఇష్టం లేకపోయినా వెంటపడి మరి చెబుతాను' అని అరిచి మరీ చెబుతాడు అభి.

తులసి మాటను విననన్న నందూ
అభి అరుస్తూ మాట్లాడుతుండగా.. 'అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. ఈ అమ్మ ఉన్నది నీకు సహాయం చేయడానికే కానీ విసిగించడానికి కాదు' అంటుంది తులసి. దీంతో అభి 'మరి నిన్ను నువ్వు చేసింది ఏంటి మామ్. అడుగడుగునా అవమానించలేదా. మామ్.. నన్ను ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్' అని నమస్కరిస్తాడు. అప్పుడే నందూ వస్తాడు. దీంతో తులసి 'ఏమండి.. అభి ఏదో టెన్షన్‌లో కనబడుతున్నాడు. నేను ఎంత అడిగినా కారణం చెప్పడం లేదు. బాగానే ఉన్నానంటూ బుకాయిస్తున్నాడు' అంటుంది. దీనికి నందూ 'ఈ సోది అంతా నాకు ఎందుకు చెబుతున్నావు? నా తలనొప్పులు నాకున్నాయి' అంటాడు. దీంతో ఒక్కసారి తన మాట వినమంటుంది. అప్పుడు నందూ.. శశికళ డబ్బు కోసం రోడ్డంతా తిరుగుతున్నా అంటాడు.

ఇంటికి వచ్చేసిన సేట్.. అభి షాక్
అభి ప్రవర్తనకు భయపడిపోయిన అంకిత.. అతడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తులసి వచ్చి 'ఏం చేస్తున్నాడు వాడు. వాడిలో వాడే బాధపడితే సమస్య ఏంటో మనకు ఎలా తెలుస్తుంది. మనకు చెప్పాలి కదా' అంటుంది. ఇంతలో సేట్ వచ్చి అభి బయటికి రా అంటాడు. దీంతో సేటు ఏంటి డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేశాడు అని అనుకుంటాడతను. అప్పుడు నందూతో పాటు మిగిలిన వాళ్లంతా వస్తారు. నందూ అసలు ఏమైందని అడగ్గా.. అభి అప్పు తీసుకున్న దాని గురించి అందరికీ నిజం చెప్పేస్తాడు సేట్. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.

అభిని వదిలేసిన అంకిత... ట్విస్ట్
సేట్ గొడవ చేస్తుండగా ఇంతలో అభి వచ్చి మీరు ఇంటికి ఎందుకు వచ్చారు అని అంటాడు. దీనికాయన అప్పు ఎలా రాబట్టాలో నాకు తెలుసంటాడు. అంతేకాదు, నీ ఫ్రెండ్ డబ్బులు తీసుకొని పారిపోయిన విషయం నాకు తెలుసు. ముందు నా డబ్బు నాకు ఇచ్చేయ్ అంటాడు. అప్పుడు తులసి 'అసలు నువ్వు 10 లక్షలు నువ్వు ఎందుకు తీసుకున్నావురా' అంటూ చెంపదెబ్బ కొడుతుంది. ఆ తర్వాత అంకిత వచ్చి 'ఆంటి మాటలు విను అంటే అస్సలు నువ్వు పట్టించుకోలేదు. నీకు చేతగాని పనుల్లో చేయి పెట్టడం ఎందుకు.. కాల్చుకోవడం ఎందుకు. ఎందుకు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు నన్ను కూడా అందరి ముందు తలదించుకునేలా చేస్తున్నావు' అంటూ అతడిని వదిలేసి వెళ్లిపోతానంటుంది. ఇంతలో అభి నిద్రలో నుంచి మేల్కోంటాడు.

ఆంటీతో మాట్లాడదామన్న అంకిత
అంకిత అని అరుస్తూ అభి నిద్ర లేవడంతో పక్కనే ఉన్న భార్య తెగ కంగారు పడుతుంది. అప్పుడు 'నీ మొహంలో ఏదో బాధ ఉంది. ఏదో కంగారు ఉంది. అసలు విషయం ఏంటో చెబితే నీకు సపోర్ట్‌గా నిలబడతాం కదా' అంటుంది. దీంతో అభి 'అసలు విషయం తెలిస్తే సపోర్ట్‌గా ఉండటం కాదు. నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోతావు' అని అనుకుంటాడు. అప్పుడు అంకిత 'శశికళకు ఇవ్వాల్సిన 20 లక్షల కోసమేనా నీ బాధ. అదే అయితే ఆంటితో మాట్లాడుదాంలే' అంటుంది. ఇంతలో అభికి కోపం వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.


Click it and Unblock the Notifications











