Intinti Gruhalakshmi Today Episode: గులాబీ ఇచ్చి తులసికి ప్రపోజ్.. అందరి ముందే నెక్లెస్ ఇవ్వడంతో!
చాలా ఏళ్లుగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ పాకెట్‌లో నెక్లెస్ తనకు ఇవ్వడానికే తెచ్చాడని అనుకున్న లాస్య అతడిని ఉడికించేలా మాట్లాడుతుంది. కానీ, నందూ మాత్రం దాని గురించి బయట పెట్టడు. దీంతో లాస్య వాలంటైన్స్ డేన ఇస్తాడేమో అనుకుంటుంది.
కానీ, నందూ మాత్రం తులసికి నెక్లెస్ ఇవ్వడానికి తిప్పలు పడుతుంటాడు. అప్పుడామెను క్యారమ్స్ ఆడడానికి రమ్మనగా అందరూ వస్తారు. ఇక, ఉదయాన్నే ఇవ్వాలని అనుకోగా సామ్రాట్ వస్తాడు. ఇక, కెఫేలో ప్రేమ్ వాళ్ల బ్యాచ్ వచ్చి డెకరేషన్ చేస్తుంది. అనంతరం అక్కడ వాలంటైన్స్ డే జరుపుతారు.

తులసికి ప్రపోజ్ చేసిన ప్రేమ్
వాలంటైన్స్ డే పార్టీలో తులసి 'ప్రేమికుల రోజు అంటే కేవలం ప్రేమికుల కోసం మాత్రమే కాదు.. తల్లి కొడుకుల కోసం. ప్రతి ఏడాది వాలెంటైన్స్ డే కి గులాబీ పువ్వు ఇచ్చే వాడివి. కానీ ఇప్పుడు ఏమయిందో ఈ అమ్మ ప్రేమ చేదు అయిందేమో' అని ప్రేమ్‌తో అంటుంది.
దీనికతడు అలా మాట్లాడకు అమ్మా అంటూ గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అమ్మ అంటాడు. దీంతో తులసి 'నేనేదో సరదాగా అన్నాను రా. నువ్వు సీరియస్‌గా తీసుకోకు' అంటుంది. ఆ తర్వాత ప్రేమ్ పాటలు పాడుతూ ఉండగా అంతా ఆస్వాదిస్తుంటారు. కానీ, నందూ, తులసి మాట్లాడుతుంటారు.

లాస్య ఫోకస్.. నందూ మాత్రం
ఒకవైపు అందరూ వాలంటైన్స్ డే పార్టీలో ఉండగా.. లాస్య మాత్రం నెక్లెస్ గురించే ఆలోచిస్తుంటుంది. అప్పుడామె 'పాకెట్‌లో నెక్లెస్ పెట్టుకొని నందూ ఎంతసేపు ఇవ్వకుండా నన్ను ఊరిస్తూ ఉంటాడు' అని అనుకుంటాడు. ఇక, నందూ మాత్రం 'కెఫేలో ఇంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇదంతా నీ ప్లాన్ వల్లే తులసి' అని ఆమెను పొగుడుతూ ఉంటాడు. అంతేకాదు, 'ఎవరూ చూడడం లేదు కదా. నెక్లెస్‌ను ఇప్పుడే తులసికి ఇచ్చేస్తాను' అనుకుంటాడు. అంతలోనే అక్కడకు లాస్య వస్తుంది. దీంతో నా ప్లాన్ పాడైపోయింది అని అనుకుంటాడు.

సామ్రాట్ ఎంటర్... తులసితో
నందూ దగ్గరకు వచ్చిన లాస్య 'ప్రేమ్ పాటలు బాగా పాడుతున్నాడు కదా. నాకోసం ఒక పాట పాడమని చెప్పు' అంటుంది. దీంతో నందూ నువ్వే వెళ్లి అడుగు అంటాడు. అప్పుడామె 'నేను చెబితే పాట పాడడు. ఇప్పుడు నా కోసం నాది నక్కిలేసు గొలుసు పాట పాడమని చెప్పు' అని అంటుంది.
దీంతో నందూ వెంటనే ప్రేమ్ దగ్గరికి వెళ్లగా.. ఇంతలో అక్కడికి సామ్రాట్ వచ్చి కేఫేను పొగుడుతూ ఉంటాడు. తర్వాత తులసి, నందూ అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు. అనంతరం తులసి ప్లాన్ తెలుసుకుని సామ్రాట్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వగా నందూ కుళ్లుకుంటాడు.

లాస్య పాట్లు.. నందూ కోపంగా
సామ్రాట్ వచ్చి తులసితో క్లోజ్‌గా ఉండడంతో నందూకు కోపం వస్తుంటుంది. అప్పుడు ఏదేదో చేస్తూ ఉంటాడు. అనంతరం సామ్రాట్ వెళ్తాను అనడంతో నందూ కాఫీ తెస్తానంటూ వెళ్తాడు. కానీ, అతడికి కాఫీ చేయడం రాదు. దీంతో ఏం చేయాలో తెలియక తులసి వైపు చూస్తూ ఉంటాడు.
అంతలో లాస్య అక్కడకు వస్తుంది. అంతేకాదు, తరచూ నెక్లెస్ గురించి ఆలోచించు అన్నట్లుగా అతడితో ఇండైరెక్టుగా అంటుంది. కానీ, నందూ మాత్రం ఏమీ తెలియనట్లే ఉంటాడు. అప్పుడు లాస్య 'నందూ.. నేను నీకో గిఫ్ట్ ఇస్తా. నువ్వు నాకు ఇవ్వాలి' అనగా ఇప్పుడే వస్తా అని వెళ్తాడు.

వాలంటైన్స్ డే పార్టీకి పిలుపు
సామ్రాట్ కోసం నందూ కాఫీ తీసుకుని వెళ్తాడు. దీంతో అతడు ఒకటే తెచ్చారేంటి.. సరేలే మేమిద్దరం షేర్ చేసుకుంటాము అంటూ సాసర్‌లో కొంచెం పోసుకుని తులసికి ఇస్తాడు. వాళ్లిద్దరూ అలా నవ్వుతూ ఉండడం నందూకు నచ్చదు. ఆ సమయంలో కూడా సామ్రాట్, తులసి నందూ గురించే మంచిగా మాట్లాడుతుంటారు.
అనంతరం సామ్రాట్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. లాస్య వచ్చి సాయంత్రం పార్టీ ఉంది తప్పుకుండా రావాలి అంటుంది. అందుకు అనుగుణంగానే సాయంత్రం కాగానే అందరూ పార్టీలో జాయిన్ అవుతారు. వాళ్లకు తులసి డ్రింక్స్ ఇస్తుంది.

పార్టీలో టాస్కులు.. ఫన్నీగానే
ఇక, పార్టీలో ప్రేమ్, శృతి ఇద్దరు యాంకరింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో అంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా.. లాస్య మాత్రం నందూ తెచ్చిన నెక్లెస్ గురించే మనసులో అనుకుంటూ ఉంటుంది. లాస్య అతి ప్రేమను గమనించిన నందూ 'ఈవిడకు నా మీద ప్రేమ ఎక్కువ అయింది. నన్ను ఒకటి బిక్కిరి చేస్తుంది' అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత గేమ్ మొదలవుతుంది.
ఇందులో ముందుగా అభి, అంకిత మొదటి చీటీ ఇవ్వగా అంకితను బ్రతిమలాడాలి అని టాస్క్ రావడంతో వాళ్ళిద్దరూ దాన్ని పూర్తి చేస్తారు. అనంతరం పరందామయ్య, అనసూయ పాత పాటకు డ్యాన్స్ చేయాలని వస్తుంది. దీంతో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తారు.

లాస్యకు నెక్లెస్ ఇచ్చేశాడుగా
పార్టీలో నందూ, లాస్య చీటీ తీయగా 'నాది నక్కిలీసు గొలుసు' అనే పాటకు డ్యాన్స్ చేయాలి అని వస్తుంది. దీంతో వాళ్లిద్దరూ సరదాగా డ్యాన్స్ చేసి అందరినీ అలరిస్తారు. నందూ మాత్రం తన పాకెట్‌లో ఉన్న నెక్లెస్ కింద పడకుండా జాగ్రత్త పడుతుంటాడు. అనంతరం లాస్య.. నందూ గురించి మాట్లాడుతూ.. 'నేనంటే నందూకు చచ్చేంత ఇష్టం.
నాకోసం నందు గిఫ్ట్ తీసుకుని వచ్చాడు. రెండు రోజుల నుంచి జోబులోనే పెట్టుకున్నాడు' అని చెబుతుంది. దీంతో నందూ అఇష్టంగానే దాన్ని బయటకు తీస్తాడు. అనంతరం అందరి ముందే ఆమె మెడలో దాన్ని అలంకరిస్తాడు. అది చూసి లాస్య సంతోషిస్తుండగా.. నందూ మాత్రం బాధపడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











