Intinti Gruhalakshmi Today Episode: మర్డర్ కేసులో చిక్కుకున్న అభి.. మనోజ్ చావుకు కారణం ఏంటంటే!

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్రెండ్ చేతిలో పది లక్షల రూపాయలకు మోసపోయిన అభి.. టెన్షన్ పడుతూ ఇంటికి వస్తాడు. దీంతో అతడిని చూసి అంకిత కంగారు పడుతుంది. అప్పుడు ఏమైందని అడుగుతున్నా అతడు నిజం చెప్పడు. ఆ తర్వాత తులసి వచ్చి అడిగినా చిరాకు పడతాడు. దీంతో తులసి.. నందూను అడగమని చెబుతుంది. కానీ, అతడు వినడు. ఇక, తన అప్పు గురించి సేట్ ఇంటికి వచ్చి గొడవ చేసినట్లు.. అంకిత వదిలేసి వెళ్లినట్లు అభి కల కంటాడు. దీంతో ఉలిక్కిపడి లేస్తాడు. అప్పుడు అంకిత అడిగినా ఏమైందో నిజం మాత్రం చెప్పడు.

అభి ఫ్రస్టేషన్‌తో అంకిత ఆందోళన

అభి ఫ్రస్టేషన్‌తో అంకిత ఆందోళన


అసలేమైందో చెప్పమని అంకిత పట్టి పట్టి అడగడంతో అభి ఆమెపై సీరియస్ అవుతాడు. 'నీ మాటలు వింటుంటే సగం చచ్చిపోయినట్టు అనిపిస్తోంది. మంచైనా చెడైనా.. కష్టమైనా.. సుఖమైనా నా తలనొప్పి నన్నే పడనీయండి. ఎవరి జాలి, ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేస్తే చాలు. మీకు పుణ్యం ఉంటుంది' అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత 'నా మెడ మా కత్తి వేలాడుతోంది. జాగ్రత్తగా డీల్ చేయకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉంది. జీవితాన్నే నష్టపోయేలా ఉన్నాను. ఏదోకటి చేయాలి' అనుకుంటాడు.

అభి గురించి తులసి బాధ.. దివ్యతో

అభి గురించి తులసి బాధ.. దివ్యతో

మరోవైపు.. తన కొడుకు ఏదో ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాడని తెలుసుకున్న తులసి.. దాన్ని ఎలా తెలుసుకోవాలి అనుకుంటుంది. అంతేకాదు, 'వాడు నా మాట వినేలా చేసుకోకపోవడం వాడి మొండితనమా. ఇప్పటికే కష్టాల్లో ఇరుక్కున్నాం. కొత్త కష్టాలు ఇవ్వకు తండ్రి' అని అనుకుంటుంది. ఇంతలో దివ్య ఏడుస్తూ ఆమె దగ్గరకు వస్తుంది. దీంతో ఏమైందమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది తులసి. దీంతో 'మామ్.. రేపో మాపో మనం రోడ్డు మీద పడబోతున్నామట కదా. ఈ ఇల్లు లాగేసుకుంటారట కదా' అని ఏడుస్తూ చెబుతుంది దివ్య.

తండ్రిపై దివ్య ఆగ్రహం.. తల్లి ఇలా

తండ్రిపై దివ్య ఆగ్రహం.. తల్లి ఇలా

దివ్య మాటలకు భయపడిన తులసి.. అసలు ఎవరు చెప్పారని అడుగుతుంది. అప్పుడు దివ్య.. లాస్య ఫోన్‌లో మాట్లాడుతుంటే విన్నానని అంటుంది. దీంతో తులసి ఆమె గురించి తెలిసిందే కదా పట్టించుకోవద్దని చెబుతుంది. ఆ తర్వాత దివ్య 'నీకు ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు కదా అమ్మ. నేను చూస్తున్నాను కదా. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా అమ్మ. ఒప్పుకోవడానికి మనసు రావడం లేదు అంతే కదా. డాడీ కోసం నువ్వు ఎంత చేశావు. అయినా ఆయనకు నీ మీద ప్రేమ లేదు. ఫ్యామిలీ పట్ల బాధ్యత లేదు' అంటుంది. దీనికి తులసి 'తప్పమ్మా అలా అనకూడదు. ఇది వరకు మీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకున్నది ఆయనే కదా. చేతుల్లో డబ్బులు లేవు. ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నారు' అని వెనకేసుకుని వస్తుంది.

మనోజ్‌ను పట్టుకున్న అభి.. గొడవ

మనోజ్‌ను పట్టుకున్న అభి.. గొడవ

మరోవైపు, అభి రోడ్డ మీద వెళ్తుంటాడు. ఇదే ఆలోచించుకుంటూ బైక్ మీద వెళ్తుంటాడు. ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఇంతలో ఓ జ్యూస్ షాపు వద్ద అతడికి మనోజ్ కనిపిస్తాడు. దీంతో వెంటనే మనోజ్ అంటూ తన దగ్గరికి వెళ్లబోతాడు. కానీ, అతడి బైక్ స్టార్ట్ కాదు. తనను పట్టుకోవడానికి పరిగెడతాడు. మనోజ్ కూడా అభికి దొరకకుండా పరిగెడతాడు. అలా అతడిని చాలా సేపు వెంబడించి పట్టుకుంటాడు. ఆ సమయంలో క్షణికావేశంలో ఉన్న అభి.. మనోజ్‌పై దాడి చేస్తుంటాడు. అయినప్పటికీ అతడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో రచ్చ జరుగుతుంది.

చనిపోయిన మనోజ్.. అభి పరార్

చనిపోయిన మనోజ్.. అభి పరార్

మనోజ్‌ను పట్టుకున్న అభి.. అతడిని ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు మనోజ్ వదలమంటాడు. దీనికి అభి 'ఏంట్రా వదిలేది. ఊపిరి ఆడటం లేదు కదా. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది కదా. నువ్వు మోసం చేసినప్పుడు కూడా అలాగే అనిపించిందిరా. అసలు నువ్వు నా ఫ్రెండ్‌వేనా ఛీ' అంటూ ముందుకు నెట్టేస్తాడు. దీంతో అక్కడే ఉన్న పగిలిన బీరు సీసా మనోజ్‌కు గుచ్చుకొని ప్రాణాలు విడుస్తాడు. దీంతో ఏం చేయాలో అభికి అర్థం కాదు. వెంటనే అక్కడి నుంచి అతడు పారిపోతాడు. అదంతా అక్కడ ఉన్న ఓ మహిళ చూస్తుంది.

అభి గురించి అంకిత, తులసి బాధ

అభి గురించి అంకిత, తులసి బాధ


అభి ఎంతకీ రాకపోయే సరికి అంకిత అతడి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తులసి వచ్చి ఏమైంది అమ్మా అని అడుగుతుంది. దీనికామె 'ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది ఆంటి. అభి ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు. పొద్దున వెళ్లాడు.. ఇప్పటి వరకు రాలేదు. నిన్నటి నుంచి మనిషి మనిషిగా లేడు' అని చెబుతుంది. అప్పుడు తులసి నేను అడిగినా కూడా ఏం చెప్పడం లేదు అంటుంది. అప్పుడే నందు వెళ్తుండగా పిలిచిన తులసి.. అభి ఇంకా రాలేదు అని చెబుతుంది. దీనికతడు 'వాడు ఏనాడు తొందరగా ఇంటికి వచ్చాడని. వాడేం చిన్నపిల్లాడు కాదు తప్పిపోవడానికి. వాడికి ఏదైనా అయితే.. మనకే ముందు ఇన్ఫామ్ చేస్తారు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తులసి ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ

తులసి ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ

మనోజ్ చనిపోవడంతో అభి భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంటాడు. ఓ టీ కొట్టు దగ్గర మంచినీళ్లు తాగి ఒక చాయ్ చెబుతాడు. ఇంతలో అక్కడ ఉన్నవాళ్లు ఫ్రెండ్‌నే మర్డర్ చేసి పారిపోయాడట అంటూ మాట్లాడుకుంటారు. దీంతో అభి భయపడిపోతాడు. మరోవైపు, అభి ఇంకా రాకపోయే సరికి ఇంట్లో వాళ్లు టెన్షన్ పడుతుంటారు. అంతేకాదు, పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటారు. అంతలో పోలీసులే అక్కడకు వస్తారు. వచ్చి అభి గురించి ఆరా తీస్తారు. దీంతో తులసి తన కొడుకు గురించి మర్యాదగా మాట్లాడమని సీరియస్ అవుతుంది. అప్పుడు ఆ పోలీస్ అభి మర్డర్ చేసి పారిపోయాడని నిజం చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X