Intinti Gruhalakshmi Today Episode: గాయత్రికి అభి షాక్.. కెఫే మూయించాలని.. అందరికీ నిజం చెప్పడంతో!

ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ్ తన తల్లి తులసికి గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటాడు. ఆ తర్వాత కెఫేలో అందరూ పార్టీ చేసుకుంటారు. ఆ సమయంలోనే లాస్య తనకు నందూ నెక్లెస్ ఇస్తాడని అనుకుంటూ ఉంటుంది. అలాగే, నందూ.. తులసికి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటాడు.

అంతలో సామ్రాట్ అక్కడకు వస్తాడు. ఇక, సాయంత్రం పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు తనకు నందూ నెక్లెస్ కొన్నాడని లాస్య అందరికీ చెబుతుంది. దీంతో నందూ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆమె మెడలో ఆ నెక్లెస్‌ను అలంకరిస్తాడు.

నెక్లెస్ ఇవ్వగానే కాళ్లపై పడి

నెక్లెస్ ఇవ్వగానే కాళ్లపై పడి

నందూ జేబులో ఉన్న నెక్లెస్‌ను బయటకు తీయమన్న లాస్య 'నీ చేతితోనే ఈ నెక్లెస్ నా మెడలో పెట్టు నందూ' అని అందరి ముందే అలంకరించుకుంటుంది. ఆ తర్వాత ఫొటోలకు ఫోజులు ఇచ్చి తెగ సంబరపడుతుంది. వెంటనే మొగుడు కాళ్లకు నమస్కారం చేస్తుంది.

అప్పుడు అనసూయ 'ఏమ్మా లాస్యా.. మెడలో నెక్లెస్ బరువు పడితేనే కానీ.. మొగుడు కాళ్లు పట్టుకోవడానికి నడుము ఒంగలేదన్నమాట' అని అంటుంది. దీంతో లాస్య అదేం లేదు అత్తయ్యా అంటుంది. ఆ తర్వాత ప్రేమ్, శృతి చీటీ తీసి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటారు.

శృతికి మర్చిపోని గిఫ్ట్ ఇచ్చి

శృతికి మర్చిపోని గిఫ్ట్ ఇచ్చి

శృతిపై ప్రేమను వ్యక్త పరిచిన ప్రేమ్.. ఆ వెంటనే చాలా కాలం క్రితం ఆమె పోగొట్టుకున్న వాళ్ల నాన్న బంగారు కడియాన్ని ఆమెకు గిఫ్టుగా ఇస్తాడు. అది చూసి శృతి బాగా ఎమోషలన్ అవుతూ కన్నీరు పెట్టుకుంటుంది.

అప్పుడు ప్రేమ్ 'నా శృతి కోసం ఆర్నెళ్లు కష్టపడి దీన్ని తీసుకుని వచ్చాను' అని అంటాడు. దీంతో వెంటనే ఆమె అతడిని హగ్ చేసుకుని సంతోషిస్తుంది. అలాగే, వాళ్లను చూసి తులసి కూడా పొంగిపోతుంది. ఆ వెంటనే 'ఇక అయిపోనట్టే కదా.. నేను వెళ్లి భోజనానికి ఏర్పాట్లు చేస్తాను' అని అంటుంది. కానీ, ప్రేమ్ నువ్వు కూడా చీటీ తీయాలి అంటాడు.

తులసికి ఎవరు ఉన్నారని

తులసికి ఎవరు ఉన్నారని

తులసిని అందరూ చీటీ తీయమని అడుగుతారు. అప్పుడు లాస్య 'మాకంటే లైఫ్ పార్టనర్స్ ఉన్నారు. చీటీలు తీశాం.. మరి తులసికి ఎవరు ఉన్నారు' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'లాస్యా.. నువ్వు ఆపుతావా' అని అరుస్తాడు. దీంతో లాస్య డౌట్ వచ్చింది.. అడిగాను అంతేకదా అంటుంది. ఆ తర్వాత తులసి 'నాకు లైఫ్ పార్టనర్ లేరని ఎందుకు అనుకుంటున్నావు? నాకూ ఉన్నారు' అంటుంది.

తర్వాత సామ్రాట్ వైపే చూస్తుంది. దీంతో నందూ 'కొంపతీసి.. సామ్రాట్ పేరు చెప్తుందా' అని కంగారు పడిపోతాడు. ఇంతలో తులసి వెళ్లి చీటీ తీస్తుంది. అందులో 'మీ పార్టనర్‌కు గులాబీ పువ్వు ఇవ్వాలి' అని రాసి ఉంటుంది. ఆ తర్వాత తులసి చాలా సీన్ క్రియేట్ చేసి ఇంట్లోని వాళ్లందరూ నా పార్ట్‌నర్స్ అంటూ వాళ్లకు ఇస్తుంది.

అభికి సన్మానం చేయాలి

అభికి సన్మానం చేయాలి

ఇక, గాయత్రి దగ్గర డబ్బు తీసుకుని అమెరికా వెళ్లాలనుకున్న అభికి గత ఎపిసోడ్‌లో తులసి క్లాస్ పీకుతుంది. దీంతో అతడికి బుద్ధి వస్తుంది. ఆ వెంటనే గాయత్రి దగ్గరకు వెళ్లిన అభి సైలెంట్‌గా ఉంటాడు. అది చూసిన అత్త 'ఏంటి అభి.. కాబోయే ఎన్ఆర్ఐ డాక్టర్‌వు.. అలా డల్‌గా ఉంటే ఎలా? మళ్లీ ఇంట్లో ఏదైనా గొడవ అయిందా? ఆ ఇల్లు వదిలే వరకూ నీకు ఈ తిప్పలు తప్పవు.

మా అమ్మాయిని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదనుకున్నా.. అంకిత బతుకు ఆ ఇంటికే అంకితం అనుకున్నా.. కానీ కథలో భలే ట్విస్ట్ ఇచ్చావు. నా కూతుర్ని ఒప్పించి.. యూఎస్ తీసుకెళ్తున్నావు. మొగుడిగా సాధించావు. నీకు సన్మానం చేయాల్సిందే అల్లుడూ' అని అంటుంది.

గాయత్రికి షాకిచ్చిన అభి

గాయత్రికి షాకిచ్చిన అభి

గాయత్రి ఎంత మాట్లాడుతున్నా అభి మౌనంగానే ఉంటాడు. దీంతో ఆమె 'అభి.. డబ్బు ఏమైనా కావాలా? మొహమాట పడకు. ఎంత కావాలో చెప్పు అల్లుడూ' అని అంటుంది. దీనికి అభి.. 'నేను డబ్బు కోసం రాలేదు ఆంటీ. మీ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అని వచ్చాను.

ఇది పది లక్షలు లెక్కపెట్టుకోండి' అని షాకిస్తాడు. దీంతో గాయత్రి ఎమైందని అడుతుంది. అప్పుడతను 'ఒక పుణ్య కార్యం పాపపు డబ్బుతో చేస్తే పుణ్యం రాదని తెలుసుకున్నాను. మమ్మల్ని మా ఫ్యామిలీ నుంచి దూరం చేయడానికి మీరు ఇచ్చిన ఈ పాపపు డబ్బు నాకొద్దు' అంటాడు.

చేతబడి చేశారా అంటూ

అభి ఇచ్చిన ట్విస్టుకు షాకైన గాయత్రి 'నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎప్పుడొచ్చాయి అల్లుడూ' అని వెటకారంగా అడుగుతుంది. దీంతో అభి 'ప్రతి మంచి పనికి.. ఒక టైం వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చింది' అంటాడు. అప్పుడామె 'నీకు ఎవరో చేతబడి చేసినట్టు ఉన్నారు.. అందుకే ఇలా మాట్లాడుతున్నావు' అంటుంది. దీంతో అభి 'చేతబడి చేయలేదు.. నాలుగు మంచి మాటలు చెప్పారు. మీరు మా భార్యాభర్తల్ని విడగొట్టే మాటలు చెప్పారు. వాళ్లు మా భార్యాభర్తలు కలిసి ఉండే మార్గం చూపించారు' అని అంటాడు.

దీంతో గాయత్రికి కోపం వచ్చి 'నువ్వు ఎప్పటికీ యూఎస్ వెళ్లలేవు' అంటుంది. దీంతో నేను కష్టపడిన డబ్బుతో అంకితను తీసుకెళ్తా అని అంటాడు. తర్వాత గాయత్రి కెఫేను మూయించే ప్లాన్లు చేస్తానంటుంది.

అంకితకు క్షమాపణ చెప్పి

అంకితకు క్షమాపణ చెప్పి

గాయత్రి దగ్గర నుంచి ఇంటికి వెళ్లిన అభి తాను డబ్బు తీసుకున్న విషయాన్ని అందరికీ చెప్తాడు. అనంతరం 'నీ దగ్గర అబద్ధం చెప్పాను అంకితా.. మీ అమ్మ ఇచ్చిన డబ్బులతో మనం యూఎస్ వెళ్లాలని ప్లాన్ చేశాను. మా అమ్మ నాకు బుద్ది వచ్చేట్టు చేసింది. అందుకే మీ అమ్మ ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేశాను. నన్ను క్షమించు అంకితా' అని అంటాడు.

దీంతో అతడిని అంకిత క్షమించి హగ్ చేసుకుంటుంది. తన మాటలకు కొడుకు మారడంతో తులసి తెగ పొంగిపోతుంది. తర్వాత ప్రేమ్ 'మీరు లవ్ బర్డ్స్‌లా అమెరికాకి ఎగిరిపోతున్నారన్న మాట. వెళ్లేటప్పుడు ఇద్దరు.. వచ్చేటప్పుడు ముగ్గురు' అంటూ జోక్స్ చేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X