Intinti Gruhalakshmi Today Episode: తులసికి షాకిచ్చిన పోలీసులు.. ఇంట్లో వాళ్ల వల్ల కొత్త కష్టాలు

దేశంలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

 బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. టెన్షన్‌గా ఉన్న అభిని చూసి ఏమైందని ప్రశ్నించిన అంకితపై అతడు ఫైర్ అవుతాడు. ఆ తర్వాత బయటకు వెళ్లిన అభికి మనోజ్ కనిపిస్తాడు. దీంతో అతడిని వెంబడించి మరీ పట్టుకుంటాడు. అంతేకాదు, ఇద్దరి మధ్యా పెనుగులాట జరగ్గా.. మనోజ్‌కు పగిలిపోయిన బీర్ సీసా గుచ్చుకుని ప్రాణాలు కోల్పోతాడు. దీంతో అభి అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు, అభి గురించి అంకిత, తులసి ఆందోళన చెందుతుంటారు. సరిగ్గా అప్పుడే పోలీసులు వచ్చి అభి మర్డర్ చేశాడని చెబుతారు. దీంతో అందరూ షాక్ అయిపోతారు.

 తులసి కుటుంబానికి పోలీసులు షాక్

తులసి కుటుంబానికి పోలీసులు షాక్

పోలీసులు వచ్చి అభి కోసం వెతుకుతుండగా.. నందూ, తులసి కంగారుగా ఏమైందని అడుగుతారు. అప్పుడు ఆ ఎస్సై ‘మీ వాడు డబ్బుల కోసం గొడవపడి ఫ్రెండ్‌ను పొడిచి పారిపోయాడు' అని చెబుతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు తులసి ‘లేదు ఎస్సై గారు.. మా అభి ప్రాణాలు పోసే డాక్టర్.. ప్రాణాలు తీసే వాడు కాదు' అంటుంది. దీనికాయన ‘అవునో.. కాదో వాడినే అడిగితే చెబుతాడు. కానిస్టేబుల్స్.. ఇల్లంతా వెతకండి. ఎక్కడున్నాడో చూడండి అని' సెర్చ్ చేయిస్తాడు. కానీ, అతడు మాత్రం ఇంటి లోపల కనిపించడు.

అభికి యావజ్జీవ కారాగార శిక్ష అంటూ

అభికి యావజ్జీవ కారాగార శిక్ష అంటూ

పోలీసులు వెతుకుతున్నా తులసి ఇంట్లో వాళ్లు మాత్రం అభి మర్డర్ చేశారంటే నమ్మరు. దీంతో ఎస్సై ‘చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు.. మీ వాడు మర్డర్ చేసి పారిపోతుంటే చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. మీ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారు. మీ వాడు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి లొంగిపోవాలని చెప్పండి. మీ వాడు పొడిచిన వాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడు పొరపాటున చావాలి కానీ.. మీవాడికి యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అందరూ ఏం జరిగిందో అని ఆందోళన చెందుతారు.

స్పృహ తప్పిన అంకిత.. తులసిపైనే

స్పృహ తప్పిన అంకిత.. తులసిపైనే

అభి గురించి తెలుసుకున్న అంకిత స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత మేల్కొన్న ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ‘నాకు అభి కావాలి. ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు' అంటుంది. ఇంతలో నందూ కలగజేసుకుని ‘తులసి వల్లే అభికి ఈ గతి పట్టింది. నువ్వు ప్రెజర్ పెట్టడం వల్లనే వాడు ఇలా తయారయ్యాడు' అంటాడు. దీంతో తులసి ‘అవకాశం దొరికింది కదా అని బురద జల్లడానికి ప్రయత్నించకండి' అంటుంది. అప్పుడు లాస్య ‘చూశావా అంకిత.. నీ ఆంటి ఇలాంటి మాటలే మాట్లాడుతుంది' అని అంకితను మరింత రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుంది.

తులసికి అత్తమామలు సపోర్ట్ చేస్తూ

తులసికి అత్తమామలు సపోర్ట్ చేస్తూ

తర్వాత లాస్య ‘తులసి వల్లనే ఇప్పుడు అంకితకు ఈ గతి పట్టింది. రేపు జరగకూడనిది జరిగి హాస్పిటల్‌లో ఉన్నవాడు పోతే ఇంకేముంది.. అంకిత, అభి విడిపోయి బతకాల్సిందే కదా. దానికి కారణం ఎవ్వరు తులసినే కదా' అంటుంది. దీనికి తులసి ‘ఇంట్లో అందరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలిసి కూడా ఇలా మాట్లాడటానికి బుద్ధి లేదా' అంటుంది. దీనికి లాస్య ‘రేపు ఏదైనా జరగరానిది జరిగితే తులసే కారణం అని చెబుతాను. కోర్టులో కూడా అదే చెబుతాను' అంటుంది. దీంతో అనసూయ, పరందామయ్య.. తులసికి సపోర్టు చేయడానికి ముందుకు వస్తారు.

నందూపై తండ్రి ఫైర్.. తులసి హామీ

నందూపై తండ్రి ఫైర్.. తులసి హామీ

తులసిని నిందిస్తోన్న నందూతో ‘నీకు బాధ్యత మోయడం చేతగాక తులసి మీద అరుస్తున్నావా? నువ్వు నా కొడుకుగా ఏం చేశావురా' అని ప్రశ్నిస్తాడు పరందామయ్య. దీనికి నందూ ‘మళ్లీ మళ్లీ అంటాను. అభి విషయంలో తులసిదే తప్పు. తనే మనల్ని కాకుండా చేస్తోంది. తీరిగ్గా కూర్చొని ఆలోచించండి అప్పుడు అర్థం అవుతుంది' అంటాడు. మరోవైపు, అంకిత ఏడుస్తూనే ఉంటుంది. అభిని మనం అందరం అవమానించాం.. అందుకే అభి దూరం అయ్యాడు అంటుంది. దీనికి తులసి ‘అభి మనకు ఎప్పటికీ దూరం కాడు. నా బిడ్డ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డం వేసి అయినా సరే కాపాడుకుంటాను' అని హామీ ఇస్తుంది.

 ఫ్రెండ్ ఇంటికి అభి.. పోలీసుల రాక

ఫ్రెండ్ ఇంటికి అభి.. పోలీసుల రాక

పారిపోతోన్న అభి.. తన ఫ్రెండ్ రాజు ఇంటికి వెళ్తాడు. అక్కడ ఈ రాత్రికి షెల్టర్ కావాలంటాడు. దీంతో సరే అంటాడు. అంకితతో గొడవ పడి వచ్చాను అంటాడు. దీంతో రాత్రికి అక్కడ ఉండేందుకు ఓకే అంటాడు రాజు. రాజు ఫోన్ తీసుకొని అంకితకు ఫోన్ చేస్తాడు అభి. కానీ, అంకిత ఫోన్ రూమ్‌లో ఉండటంతో తను లిఫ్ట్ చేయదు. ఇంతలో అడ్వకేట్‌కు కాల్ చేసి అసలు విషయం చెబుతుండగా రాజు భార్య వింటుంది. వెంటనే రాజు భార్యకు చెప్పి పోలీసులకు ఫోన్ చేయమంటుంది. దీంతో అతడు ఫోన్ చేయగా.. పోలీసులు వస్తారు. దీంతో అభి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రోడ్డు మీద వెళ్తుండగా పోలీస్ వ్యాన్ కనిపిస్తుంది. అప్పుడు ఆటో ఎక్కి తప్పించుకుంటాడు. అప్పుడు ఆటో డ్రైవర్ అభిని అవమానిస్తాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : ఏంటీ ముద్దు పెట్టేశాడా? పిచ్చోళ్లు లా బిహేవ్ చేసారు..! || Filmibeat Telugu
మాధవి ఎంట్రీ.. తనవల్లే బాధలంటూ

మాధవి ఎంట్రీ.. తనవల్లే బాధలంటూ

ఇంట్లో అందరూ బాధ పడుతూ ఉండగా మాధవి వస్తుంది. వచ్చీ రావడమే ఇదంతా ఏంటి వదిన అని తులసిని అడుగుతుంది. దీనికామె మా తలరాత అంటూ సమాధానం చెబుతుంది. అప్పుడు మాధవి ‘నేను ఆరోజు లక్ష రూపాయలు ఇవ్వడం వల్లే అలా జరిగింది' అంటుంది. అప్పుడు తులసి ‘అలా ఏం కాదు. మన తలరాత బాగాలేనప్పుడు ఏం చేసినా ఏంటి ఉపయోగం' అని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X