Intinti Gruhalakshmi Today Episode: అతడి సాయంతో అభిని కనిపెట్టిన తులసి.. అంతలోనే వాళ్లకు మరో షాక్

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభిని వెతుక్కుంటూ తులసి ఇంటికి వచ్చిన పోలీసులు.. మొత్తం తనిఖీ చేస్తారు. కానీ, అతడు మాత్రం కనిపించడు. దీంతో ఎస్సై.. మనోజ్ పరిస్థితి విషమంగా ఉందని, అతడికి ఏదైనా జరిగితే అభికి కఠిన శిక్ష పడుతుందని హెచ్చరిస్తాడు. అప్పుడు అంకిత కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో లాస్య, నందూ.. తులసి వల్లే ఇలా జరిగిందని నిందిస్తారు. మరోవైపు, అభి.. తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటానికి వెళ్తాడు. కానీ, అతడి గురించి తెలిసి.. పోలీసులకు ఫోన్ చేస్తారు. దీంతో అభి అక్కడి నుంచి కూడా పారిపోతాడు.

దొరక్కుండా ఆటోలో దాక్కున్న అభి

దొరక్కుండా ఆటోలో దాక్కున్న అభి

పోలీసులను చూసి పారిపోతోన్న అభి ఓ ఆటోలో ఎక్కుతాడు. దీంతో డ్రైవర్ దిగమని అరుస్తాడు. కానీ, అభి అతడిని బ్రతిమాలి పోలీస్ వ్యాన్ వెళ్లే వరకూ అందులో కూర్చుంటాడు. ఆ తర్వాత ఆటోలో నుంచి దిగి కంగారు పడుతుంటాడు. అప్పుడు డ్రైవర్ 'బాబాయ్‌లను చూసి భయపడి ఆటో ఎక్కావా? ఏం చేశావు.. రేప్ చేశావా.. మర్డరా.. చూస్తే గొప్పింటి పిల్లోడిలా ఉన్నావు. ఇలాంటి పనులు ఎందుకు చేశావు' అని అడుగుతాడు. దీనికి అభి 'నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ, పొరపాటున ఇబ్బందులు కొని తెచ్చుకున్నా' అని అతడికి వివరిస్తాడు.

 అభికి సహాయం చేసిన ఆటో డ్రైవర్

అభికి సహాయం చేసిన ఆటో డ్రైవర్

ఆటో డ్రైవర్‌కు అసలు విషయాన్ని వివరించిన తర్వాత అభి 'అన్నా.. ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇస్తావా' అని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో అతడు ఫోన్ ఇవ్వను అంటాడు. అప్పుడు అభి డబ్బులు ఇస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని తులసికి ఫోన్ చేస్తాడు. తులసితో మాట్లాడుతాడు. నేను ఏ తప్పు చేయలేదంటాడు. అంతేకాదు, 'ఇంటికి రావాలని ఉంది.. నిన్ను చూడాలని ఉంది. నీ మాటలు విననందుకు నన్ను క్షమించు మామ్' అంటాడు. అవన్నీ సరే.. ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అడుగుతుంది తులసి. తను ఎక్కడున్నాడో చెప్పబోతాడు. ఇంతలో పోలీస్ వ్యాన్ వస్తుంటుంది. దీంతో ఫోన్ కట్ చేసి ఆటో డ్రైవర్‌కు ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోతాడు.

నందూను రెచ్చగొట్టాలని లాస్య ప్లాన్

నందూను రెచ్చగొట్టాలని లాస్య ప్లాన్

ఇంట్లో ఉన్న నందూ.. తన కొడుకు అభి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య 'మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. ఈ ఇంట్లో వాళ్లకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదు నందూ. తులసి వల్లే కదా అభి ఇలా తయారయ్యాడన్నావు. అప్పుడే మరిచిపోయావా? ఏంటి నోరు జారాను అంటావా' అంటూ రెచ్చగొడుతుంది. దీనికి నందూ అభి తప్పు చేశాడని అంటాడు. అప్పుడు లాస్య అవును మర్డర్ చేయడం ఏంటి అంటుంది. దీనికి నందూ 'ప్రతిసారి మర్డర్ అని అనకు లాస్య. వాడి ఫ్రెండ్ ఇంకా బతికే ఉన్నాడు. చనిపోతేనే మర్డర్ అంటారు' అంటాడు.

 మనోజ్‌ను కాపాడాలని నందూ ప్లాన్

మనోజ్‌ను కాపాడాలని నందూ ప్లాన్

నందూ మాటలకు లాస్య 'కానీ, చావు బతుకుల మధ్య ఉన్నాడు కదా. వాడు చస్తే మర్డర్ అనే అంటారు. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు' అంటుంది. దీనికి నందూ 'మనం అభిని కాపాడుకోవాలంటే.. అభి ఫ్రెండ్ చావకుండా కాపాడుకోవాలి' అంటాడు. దీంతో లాస్య 'వచ్చే శాలరీ మొత్తం తీసుకెళ్లి తులసి చేతుల్లో పెడుతున్నాం. ఇప్పుడు అభి ఫ్రెండ్‌ను ఎలా కాపాడుతావు' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'ఓవైపు శశికళ అప్పు.. మరో వైపు అభి సమస్య.. రెండూ రెండే.. ఏం జరుగుతుందో.. ఎలా బయటపడతామో' అని అనుకుంటాడు.

ఆటో డ్రైవర్‌కు తులసి ఫోన్ చేయగా

ఆటో డ్రైవర్‌కు తులసి ఫోన్ చేయగా

అభి గురించి ఆలోచిస్తూ తులసి ఇంటి ముందే పడుకుని ఉంటుంది. ఉదయాన్నే శృతి చూసి లేపుతుంది. అప్పుడామె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఆ తర్వాత శృతి అభి రాలేదని చెప్తుంది. దీంతో తులసి 'నిద్రపోయాను కానీ.. రాత్రంతా వాడే కలలోకి వచ్చాడు. వాడి మాటలే గుర్తొస్తున్నాయి. ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తిన్నాడో లేదో. ఈ అమ్మ మాట విని ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావు. ఇప్పుడు ఏం చేయాలో.. వాడిని ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదు. ఒకపని చేస్తా.. రాత్రి ఫోన్ చేసిన నెంబర్‌కు ఫోన్ చేస్తా' అని డ్రైవర్‌కు కాల్ చేస్తుంది. రాత్రి ఈ ఫోన్ నుంచి మా అబ్బాయి ఫోన్ చేశాడు అని అడుగుతుంది. దీంతో రాత్రంతా నా ఆటోలోనే పడుకున్నాడు. ఇప్పుడే వెళ్లిపోయాడు అని చెబుతాడు. అశోక్ నగర్ ప్రాంతంలో వెతికితే దొరకొచ్చు అంటాడు.

నందూను అలా ప్రశ్నించిన తండ్రి

నందూను అలా ప్రశ్నించిన తండ్రి

అభి కేసును ఎస్సై చాలెంజింగ్‌గా తీసుకుంటాడు. అతడిని పట్టుకునేందుకు వెతకడం ప్రారంభిస్తాడు. మరోవైపు అభి, లాస్య ఇద్దరూ ఆఫీసులకు వెళ్తుంటే ఆపిన పరందామయ్య 'ఏరా నందూ.. వాడు నీ కొడుకు కాదా.. అభి గురించి పట్టించుకోవా' అని ప్రశ్నిస్తాడు అంటాడు. దీంతో 'నాకు అభిని కాపాడాలని ఉంది. అందుకే పోలీసులు అరెస్ట్ చేస్తే.. నా కొడుకును కాపాడటానికి తెలిసిన వారితో కూడా మాట్లాడాను' అని చెప్పి బయటికి వస్తాడు. అతడు మాట్లాడినవి లాస్యకు నచ్చదు. దీంతో 'నందూ ఏంటో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు' అని అనుకుంటుంది.

తులసికి కనిపించిన అభి.. అంతలో

తులసికి కనిపించిన అభి.. అంతలో

ఆటో డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం అభిని తులసి వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆమెకు కొడుకు కనిపిస్తాడు. అభి అని పిలుస్తుంది. వెంటనే అభి వెళ్లి తల్లిని హత్తుకుంటాడు. అప్పుడు 'అయ్యో అభి ఏంటి నాన్నా ఇది. నీకు ఇంత కష్టం వచ్చిందిరా' అని అంటుంది. అప్పుడతను ఏదో చెప్పాలని అనుకుంటాడు. ఇంతలోనే పోలీసులు అక్కడికి వస్తాడు. దీంతో తన తల్లిని నెట్టేసి అభి అక్కడి నుంచి పరిగెత్తబోతుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X