twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: తులసికి ఘోర అవమానం.. అభి గురించి నిజం తెలియడంతో!

    |

    దేశంలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పోలీసులు వెంబడిస్తుండడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన అభి.. ఓ ఆటోలో దాక్కుంటాడు. ఆ తర్వాత ఆ డ్రైవర్‌ను బ్రతిమాలుకుని తులసికి ఫోన్ చేస్తాడు. అంతలో మళ్లీ పోలీసులు రావడంతో కాల్ కట్ చేసి పారిపోతాడు.

    ఇక, అభి విషయాన్ని ప్రస్థావిస్తూ లాస్య నందూను మరింతగా రెచ్చగొడుతుంది. మరోవైపు, తులసి.. ఆ ఆటో డ్రైవర్‌కు కాల్ చేసి అడ్రెస్ కనుక్కొంటుంది. అనంతరం అభి కోసం వెతుకుతూ వెళ్తుంది. అప్పుడు అతడు కనిపిస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పోలీసులు రంగప్రవేశం చేస్తారు.

    హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

    తల్లిని కలిసిన అభి.. బతకాలంటే

    తల్లిని కలిసిన అభి.. బతకాలంటే

    కొడుకును వెతుక్కుంటూ వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. దీంతో అసలేమైందని అతడిని అడుగుతుంది. అప్పుడు అభి వెక్కి వెక్కి ఏడుస్తూ 'మామ్.. నాకోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇక నేను వాళ్లకు దొరికిపోతాను. తల్లి మాట వినకపోతే బిడ్డ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఇప్పుడు తెలిసివచ్చింది మామ్. ఇక నా వల్ల కావట్లేదు మామ్. నేను బతికున్నానో.. చచ్చానో నాకే అర్థం కావడం లేదు.

    నరకం చూస్తున్నాను. ఎప్పుడు ఏ వైపు నుంచి పోలీసులు వచ్చి పట్టుకుంటారేమోనన్న భయంగా ఉంది. ఎవరైనా నావైపు చూస్తుంటే భయమేస్తుంది. ఏమూలైనా దాక్కొని ఒక్క నిమిషం కళ్లు మూసుకుందామంటే భయంగా ఉంది. ఎవరైనా చావంటే భయపడతారు. నాకు బతకాలంటే భయమేస్తుంది మామ్' అంటాడు.

    పది లక్షల గురించి చెప్పిన అభి

    పది లక్షల గురించి చెప్పిన అభి

    భయంతో వణికిపోతూ అభి ఏడుస్తుండగా తులసి ఓదార్చుతుంది. 'నువ్వు భయపడకు నాన్న. ఇఫ్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు. నీ అమ్మ దగ్గర ఉన్నావు. నువ్వేం టెన్షన్ పడకు. అసలు ఏం జరిగిందో చెప్పు' అని అడుగుతుంది. దీనికి అభి 'నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నా మామ్.. నేను ఎవ్వరినీ చంపడానికి చూడలేదు.

    ఎవ్వరినీ చంపాలనుకోలేదు. నేను చేసిందల్లా 10 లక్షలు అప్పుగా తీసుకోవడమే. నా ఫ్రెండ్ మనోజ్ గాడికి 10 లక్షలు ఇచ్చి స్టాక్ మార్కెట్‌లో పెట్టమన్నాను. కానీ, ఆ డబ్బుతో వాడు పారిపోయాడు' అంటూ తల్లికి నిజం చెబుతాడు.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీబాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ

    తల్లికి జరిగినదంతా చెప్పిన అభి

    తల్లికి జరిగినదంతా చెప్పిన అభి

    ఆ తర్వాత అసలు మనోజ్‌కు అలా ఎలా జరిగిందో వివరిస్తూ.. 'డబ్బులు తీసుకుని పారిపోయిన మనోజ్‌ను పట్టుకొని నా డబ్బు నాకిచ్చేయమని గొడవ పెట్టుకున్నాను. ఆ సమయంలో వాడికి నాకు మధ్య చాలా సేపు డిస్కర్షన్ జరిగింది. నా డబ్బుల కోసం వాడిని ప్రశ్నించాను కానీ, వాడిని నేను చంపాలనుకోలేదు. అసలు మా మధ్య జరిగిన గొడవలో వాడికి ఎలా బీరు సీసా గుచ్చుకుందో అర్థం కాలేదు. ఆ తర్వాత నేను భయంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను' అని వివరిస్తాడు. ఇంతలో పోలీసు జీప్ వచ్చి అక్కడ ఆగుతుంది. దీంతో అభి, తులసి షాక్ అవుతారు.

    అభిని అరెస్ట్ చేసేసిన పోలీసులు

    అభిని అరెస్ట్ చేసేసిన పోలీసులు

    పోలీస్ జీప్ వచ్చి ఆగడంతో అభి 'మామ్ పోలీసులు వచ్చారు. నన్ను వదిలేసేయ్. నేను పారిపోతాను' అంటూ పారిపోబోతాడు అభి. అప్పుడు అడ్డుకోబోయిన తులసిని కూడా పక్కకు నెట్టేస్తాడు. దీంతో వద్దు అభి అని అరుస్తుంది తులసి. అప్పుడు ఎస్సై 'టెన్షన్ పడకు.. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. చల్' అంటూ జీప్ దగ్గరకు తులసిని లాక్కొస్తాడు. తర్వాత అభి 'ఒరేయ్.. పారిపోరా పారిపో. నువ్వు వచ్చేదాకా నీ అమ్మ లాకప్‌లో ఉంటది' అని చెబుతాడు. దీంతో అభి తిరిగి అక్కడికి వచ్చి ఎస్సై ముందు లొంగిపోతాడు.

    బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!

    తులసితో అసభ్యంగా ప్రవర్తిస్తూ

    తులసితో అసభ్యంగా ప్రవర్తిస్తూ

    ఎస్సై దగ్గరకు వచ్చిన అభిని తప్పించుకొని తిరుగుతావురా అంటూ చితకబాదుతాడు. అప్పుడు తులసి మా వాడు ఏ తప్పు చేయలేదు అంటుంది. కానీ, ఎస్ఐ మాత్రం వినడు. కానిస్టేబుల్స్ వాడిని జీప్ ఎక్కించండి అంటాడు. వద్దు అని ప్రాధేయపడుతుంది తులసి. అప్పుడు ఎస్సై 'అవును.. మదర్ ఇండియా నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు నీ మొగుడు ఏడి' అని అడుగుతాడు. దీనికి తులసి నాకు భర్త లేడని అంటుంది. అప్పుడాయన 'మెడలో తాళి ఉంది కదా. అవును.. మొగుడు లేడన్నావు మరి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు. కనీసం ఎవడికి పుట్టాడో అదైనా తెలుసా' అని అసభ్యంగా ప్రవర్తిస్తాడు.

     కాలర్ పట్టుకున్న అభి.. చివరికి

    కాలర్ పట్టుకున్న అభి.. చివరికి

    తన తల్లిని నోటికొచ్చినట్లు మాట్లాడుతుండగా అభి వెళ్లి ఎస్సై కాలర్ పట్టుకుంటాడు. అప్పుడాయన 'ఈ ఖాకీ యూనిఫాం నా ఒంటి మీదికి వచ్చి 20 ఏళ్లు అయింది. ఇప్పటి వరకు ఎవ్వడూ నా యూనిఫామ్‌ను టచ్ చేయలేదు. నువ్వు టచ్ చేసింది నా యూనిఫామ్‌ను కాదురా. నా యూనిఫాం వెనుక ఉన్న ఈగోను. నా ఈగోను టచ్ చేసి నీ సమాధికి నువ్వే పునాది వేసుకున్నావు' అని అభిని లాక్కెళ్లి పోలీస్ జీప్‌లో ఎక్కిస్తారు. తులసి ఎంతో బతిమిలాడుతుంది కానీ పోలీసులు వినరు. దీంతో 'నువ్వేం భయపడకురా. రేపటికల్లా నేనే బెయిల్ మీద తీసుకొస్తాను. నిన్ను కాపాడుకుంటాను అని అబికి భరోసా ఇస్తుంది.

    హాట్ షోతో షాకిచ్చిన ఈషా రెబ్బా: పైనుంచి చూపిస్తూ రెచ్చిపోయిన తెలుగు పిల్లహాట్ షోతో షాకిచ్చిన ఈషా రెబ్బా: పైనుంచి చూపిస్తూ రెచ్చిపోయిన తెలుగు పిల్ల

    ఇంట్లో వాళ్లకు చెప్పిన తులసి

    ఇంట్లో వాళ్లకు చెప్పిన తులసి

    కొడుకు అరెస్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తులసిని అభి కనిపించాడా అని అందరూ అడుగుతారు. అలా చాలా సేపు అడిగిన తర్వాత కనిపించాడని, అతడు క్షేమంగానే ఉన్నాడని, కాకపోతే పోలీసులు అరెస్ట్ చేశారని నిజం చెబుతుంది. దీంతో నందూ 'నేను చెబుతూనే ఉన్నా.. అభిని కలవడం మంచిది కాదని. ఇప్పుడు అనుకున్నదంతా జరిగింది' అంటాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందని అడుగుతాడు. దీంతో తులసి 'డబ్బు కోసం గొడవ జరిగిందట. కానీ తను మాత్రం చంపాలని అనుకోలేదని చెప్పాడు' అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 560: Abhi Gets Arrested Due To Murder Case on Him. Then Tulasi Went Back to Home With Free Hands.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X