Intinti Gruhalakshmi Today Episode: నందూకు దెబ్బ మీద దెబ్బ.. తులసి సలహా వృథా.. చివరకు రక్తపాతం
ఇండియా మొత్తంలో ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఎంతో బాధను దిగమింగుకుని దివ్యను ఢిల్లీకి పంపిస్తారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత తులసి ఫోన్‌లో ఫొటో చూసి బాధ పడుతూ ఉంటుంది. అదే సమయంలో నందూ గార్డెన్ ఏరియాలో గునపంతో తవ్వుతూ ఉంటాడు. ఇది చూసి షాకైన తులసి అతడిని ప్రశ్నించగా.. కోపంతోనే ఇలా చేస్తున్నానని చెప్తాడు. దీంతో అతడికి క్లాస్ పీకుతుంది. ఇక, అందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే పరందామయ్య భూమి కబ్జాకు గురైన భూమి విషయంలో కోర్టులో గెలిచినట్లు లెటర్ వస్తుంది. అది చూసిన నందూ, లాస్య దానిపై కన్నేస్తారు. కానీ, ఆయన తులసి సలహాలు అడుగుతాడు.

తులసి సహాయం కోరిన మావయ్య
తులసి దగ్గరకు వెళ్లి ఆస్తి గురించి మాట్లాడిన పరందామయ్య 'నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు. కాబట్టి ఈలోపే నిర్ణయం తీసుకోవాలి' అని అంటాడు. దీనికామె 'మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఆ ఆస్తిపై ఆశపెట్టుకున్న వాళ్లు బాధపడొచ్చు. వాళ్లు మీకు శత్రువులుగా మారొచ్చు' అని అంటుంది. దీంతో పరందామయ్య 'నిజమే తులసి.. డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డదని నాకూ తెలుసు. అలాగని నిర్ణయం తీసుకుకోకుండా ఉండలేను కదా' అంటాడు. అప్పుడు తులసి.. 'మీరు మీ శక్తి ఇంట్లో ఉన్న వాళ్లందరికీ సాయం చేశారు' అని అంటుంది.

పరందామయ్యకు తులసి సలహా
ఆ తర్వాత తులసి 'నాకు తెలిసి మీ మనమల్లు, మనవరాలుకు మాత్రమే ఏమీ చేయలేకపోయారు. వాళ్లకి మీరంతే ఎంతో ప్రేమ. కలిసి వచ్చిన ఆస్తిని ఆ ముగ్గురు పేరు మీద రాస్తే మీ గుర్తుగా ఉంచుకుంటారు. భవిష్యత్‌లో వాళ్లకి ఇది ఉపయోగపడొచ్చు' అని సలహా ఇస్తుంది. ఇది పరందామయ్యకు నచ్చడంతో ఆయన ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు, 'చాలా మంచి సలహా చెప్పావమ్మా. నాకు ఈ ఆలోచన రానేలేదు. వాళ్ల నాన్న వాళ్ల కోసం ఏం చేయలేదు. భవిష్యత్‌లో చేయాలనుకున్నా లాస్య చేయనీయదు. కాబట్టి వాళ్ల నాన్న చేయలేని పనిని నేను చేస్తాను' అని అంటాడు. ఆ మాటతో తులసి కూడా సంతోషిస్తుంది.

ఆస్తి కావాలని కోరుకున్న నందూ
ఆ తర్వాత లాస్య బలవంతం మేరకు పరందామయ్యను ఆస్తి అడగడానికి నందూ వస్తాడు. ఆ సమయంలో తండ్రిని అడిగేందుకు అతడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక, చివరికి మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చా నాన్నా అంటాడు. దీనికాయన నేను కూడా నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నారురా అంటాడు. దీంతో నందూ 'ఖచ్చితంగా నాన్న ఆస్తిని నా పేరున రాస్తాననే చెప్తారు' అని అనుకుని సంతోషిస్తూ ఉంటాడు. కొంత సస్పెన్స్ తర్వాత 'దేవుడి దయతో నాకు ఆస్తి కలిసి వచ్చింది.. దాన్ని ఏం చేయాలో నా బుర్రకి ఆలోచన తట్టలేదు. తులసిని పిలిచి అడిగాను. చాలామంది సలహా ఇచ్చింది. ఆస్తి మొత్తం నీ పిల్లలకు ఇవ్వమని చెప్పింది' అని అంటాడు. ఆ మాట వినగానే నందూ, లాస్య షాక్ అయిపోతారు.

నందూనందూకు షాక్ ఇచ్చేసిన తండ్రికు షాక్ ఇచ్చేసిన తండ్రి
అసలు విషయం చెప్పేసిన తర్వాత పరందామయ్య 'నువ్వేదో చెప్పాలని వచ్చావు కదా.. అదేంటో చెప్పు' అని అడుగుతాడు. దీంతో నందూ 'నేను నా కాళ్లపై నిలబడటానికి ట్రై చేస్తున్నా. బిజినెస్‌కు డబ్బు సమకూరడం లేదు. అనుకోకుండా మీకు డబ్బు కలిసి వచ్చింది. ఆ ఆస్తిని నా పేరున రాస్తే బాగుంటుంది' అని అడుగుతాడు. దీంతో పరందామయ్య 'నేను నిర్ణయం తీసేసుకున్నాను. వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు. అయినా నేను రాసేది నీ పిల్లలకే కదా' అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దీంతో లాస్య, నందూ కోపంతో ఊగిపోతూ ఉంటారు.

లాస్యకు ఝలక్ ఇచ్చిన నందూ
పరందామయ్య ఆ మాట చెప్పగానే లాస్య 'ఏంటి నందూ తులసి ఇలా చేస్తుంది? మీ ఆస్తితో తులసికి సంబంధం ఏంటి? కొడుకు కష్టాల్లో ఉన్నా కోడలి మాటే వింటున్నాడు. తులసి సలహా ఇస్తే అది దేవుడి తలరాతలా ఫీల్ అయిపోతున్నాడు' అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో నందూ 'తులసి తన స్వార్ధం గురించి ఆలోచించలేదు. తన పిల్లల కోసం ఆలోచించింది. అంటే మా పిల్లల గురించి ఆలోచించింది. వాళ్ల భవిష్యత్ కోసం ఆలోచించింది. అందులో తప్పేం ఉంది. నేను చేయలేని పని తులసి చేసింది. అందుకు మెచ్చుకోవాలి. మనం సమస్యలో ఉన్నాం కాబట్టి మనవైపు నుంచి ఆలోచిస్తే తులసి ఇచ్చిన ఆలోచన తప్పుగా కనిపిస్తుంది. కానీ తులసి తప్పు చేయలేదు' అని ఝలక్ ఇస్తాడు. దీంతో లాస్య ఆ తులసిని వెళ్లి అడుగు అని సలహా ఇస్తుంది.

తులసికి రిక్వెస్ట్.. మీ ఇష్టం అని
లాస్య సలహా మేరకు నందూ.. తులసి దగ్గరకు వెళ్తాడు. అప్పుడతను 'చెట్టు బలంగా కొమ్మలు బలంగా ఉంటాయి. ఆ ఆస్తి నాకు ఇప్పిస్తే నేను బిజినెస్ చేస్తాను. నువ్వు పిల్లలతో మాట్లాడి.. ఆ ప్రాపర్టీ నాకు ఇప్పిస్తే బాగుంటుంది. నేనేం పర్మినెంట్‌గా ఆ ఆస్తిని తీసుకోను. జస్ట్ మూడేళ్లలో తాకట్టుపెట్టుకుంటానంతే. ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. ఆస్తిని వాళ్లకి తిరిగి ఇచ్చేస్తాను' అని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో తులసి 'ఏం చూసి మిమ్మల్ని నమ్మాలి. మీరు మూడేళ్ల తర్వాత ఆస్తిని విడిపించకపోతే.. మిమ్మల్ని నమ్మి జీవితంలో చాలా కోల్పోయాను. ఇదే ప్రశ్న నా పిల్లలు నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పను. తాకట్టు పెట్టుకోవడానికి నన్ను గ్యారంటీ అడుగుతారు. అందుకే వాళ్లను ఆస్తిని ఇవ్వమని చెప్పను.. వద్దని చెప్పను. ప్రాపర్టీ పిల్లల పేరున రాయమని సలహా ఇచ్చిందే నేను. మీరు వాళ్లను అడగండి' అని చెబుతుంది.

నందూకు కొడుకులు షాకిచ్చేసి
తులసి చెప్పగానే కొడుకుల దగ్గర ఉన్నప్పుడు నందూ తనకు ఆస్తి తాకట్టు పెట్టుకోడానికి ఇవ్వమని అడుగుతాడు. దీంతో అభి నేను ఇవ్వలేను డాడీ.. మీలాగే నాకూ అవసరాలు ఉన్నాయి అంటాడు. తర్వాత ప్రేమ్ 'ప్రాపర్టీ మీకు ఎంత అవసరమో.. నాకూ అంతే అవసరం. మీపైన మీ పక్కనున్న ఆమెపైన నాకు నమ్మకం లేదు. ప్రాపర్టీ ఇవ్వలేను. అంత గతిలేకపోతే అమ్మ చూపించిన జాబ్ చేసుకోవాలి.. అప్పుడు రెచ్చిపోయి ఇప్పుడు ఆస్తి ఇవ్వమంటే ఎలా ఇస్తాం' అంటాడు. దీంతో నందూ కోపంతో వెళ్లి.. గార్డెన్‌లో గులాబీ మొక్కకు ఉన్న ముళ్లను చేతికి గుచ్చుకుంటాడు. అప్పుడు తులసి వెళ్లి క్లాస్ పీకుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











