Intinti Gruhalakshmi Today Episode: కెఫేకు అలాంటి రిపోర్టు.. గాయత్రికి చందూ షాక్.. అదిరిన ట్విస్ట్
జనరేషన్లు మారుతున్నా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఇంట్లో పూజకు అంతా సిద్ధం అవుతుంది. కానీ, ఆమె మాత్రం ఈసారి గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. నేను పూజ చేయను అంటుంది. అప్పుడే లాస్య వచ్చి పూజ చేస్తానని అనడంతో నందూ ఆమెను పద్దతిగా లేవని అంటాడు.
ఆ సమయంలోనే నందూ కెఫేలోకి ఫుల్ ఇన్‌స్పెక్టర్లు రావడంతో నందూ, లాస్య, తులసి అక్కడికి వెళ్లిపోతారు. తర్వాత శాంపిల్స్ తీసుకుని వెళ్తూ తేడా వస్తే కెఫే మూసేస్తాం అంటారు. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత లాస్య.. నందూ, తులసిపై నోటికొచ్చినట్లు మాట్లాడి గొడవకు దిగుతుంది.

తులసి టెన్షన్... ఓదార్చినా
కెఫేలోని వంటకాల శాంపిల్స్‌కు ఎలాంటి రిపోర్ట్ వస్తుందో అని తులసి ఆలోచిస్తుంటుంది. ఈ క్రమంలోనే దేవుడికి హారతి ఇస్తూనే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు నందూ కింద కూర్చుని తులసికి ధైర్యం చెప్పాలి అనుకుంటాడు. అప్పుడామె మీరు నాకు ధైర్యం చెప్పాలి అనుకుంటున్నారు కదా అంటుంది. ఇంతలో పరందామయ్యా నీకెందుకు అమ్మ అంత భయంగా ఉంది అని అడుగుతాడు.
దీంతో ఏమో తెలియదు మామయ్య మనసులో ఏదో తెలియని అనుమానం అంటుంది. దీనికి నందూ 'కెఫేను కన్నబిడ్డలా చూసుకుంటున్నావు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్‌గానే మాట్లాడుకున్నారు మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు తులసి' అని ప్రశ్నిస్తాడు. తర్వాత ఆమెను అందరూ ఓదార్చే ప్రయత్నం చేస్తారు.

తులసికి కోసం నందూ కాఫీ
తులసి పరిస్థితిని చూసిన నందూ 'నీకు ఎవరి మీద అనుమానంగా ఉందో చెప్పు' అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. అప్పుడు ప్రేమ్ 'అమ్మా.. చేసిన పూజలు చాలు నీ నిజాయితీ ఏంటో ఆ దేవుడికి తెలుసు. అంతా మంచే జరుగుతుంది వెళ్లి రెస్ట్ తీసుకోమ్మా' అంటాడు. దీంతో నందూ 'అవును తులసి పండగ రోజు నువ్వు ఇలా దిగాలుగా ఉండడం అసలు బాగోలేదు' అంటాడు.
అప్పుడు తులసి 'లేదు నాకు ఆ దేవుడు పెడుతున్న పరీక్ష మీరందరూ వెళ్లి పడుకోండి నన్ను ఒంటరిగా వదిలేయండి' అంటుంది. అప్పుడు నందూ వెళ్లి తులసి కోసం కాఫీ తీసుకుని వస్తాడు. నేను ఈరోజు ఉపవాసంలో ఉన్నాను నేను ఏమి తీసుకోను అని అంటుంది.

నేను నీకోసం దీక్షలో ఉన్నా
తులసి కాఫీ తాగకపోవడంతో నందూ 'నువ్వు కేఫీ కోసం దీక్షలో ఉన్నావు నేను నీకోసం ఉన్నాను. పూజ కానివ్వు' అంటాడు. అప్పుడు అందరూ అక్కడ అలాగే కూర్చుని నిద్రపోతూ ఉండగా తులసి మాత్రం తెల్లవార్లు దేవుడికి పూజ చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత పరందామయ్య 'రాత్రంతా అలాగే ఉన్నావు. నీకు నువ్వు శిక్ష వేసుకుంటున్నావా తులసి' అని అడుగుతాడు. దీనికామె 'అదేం లేదు మామయ్య.
ఇంకొద్ది సేపట్లో ఆ దేవుడు నా జీవితాన్ని డిసైడ్ చేయబోతున్నాడు' అంటుంది. దీంతో నందూ 'ఎందుకు ఇంత మొండితనం తులసి. కేఫే విషయంలో నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు. నేను కెఫే పెట్టకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు కదా' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసి ఏడుస్తుంది.

పాజిటివ్ రిపోర్టు రావడంతో
ఆ తర్వాత అభి అతనికి ఫోన్ చేద్దాము అంటాడు. దీంతో తులసి 'ఎవరు ఎవరికి ఫోన్ చేయవద్దు. రిపోర్టు వచ్చేవరకు వెయిట్ చేద్దాం' అని అంటుంది. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి 'ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు. రిపోర్టు వచ్చిందా? అనుకున్నంత అయిపోయిందా' అని వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో నందూ కాస్త మంచిగా మాట్లాడొచ్చు కదా అంటాడు.
అనసూయ 'దాన్ని వదిలేయ్‌రా. దానితో మాట్లాడితే బురదలో రాయి వేసినట్లే' అంటుంది. అప్పుడే ప్రేమ్ మెయిల్ వచ్చిందని దాన్ని చదువుతాడు. తర్వాత కెఫేకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని చెప్తాడు. దీంతో అంతా సంతోషిస్తారు. అప్పుడు తులసి పూజ పూర్తి చేసి హారతి ఇస్తుంది.

లాస్య వెటకారం.. కొట్టాలని
కెఫేకు పాజిటివ్ రిపోర్టు రావడంతో నందూ 'ఈ సమస్య నుంచి బయటపడ్డామంటే అందుకు నీ పూజలే కారణం తులసి. అవే ఈరోజు మనల్ని బయటపడేసాయి' అంటాడు. ఇంట్లో వాళ్లు కూడా తులసినే పొగుడుతారు. దీంతో లాస్య 'ఈ ఇంట్లో ఏ మంచి జరిగినా అంతా తులసి వల్లే జరిగింది అంటారు. ఈ ఇంట్లో అందరికీ చేతబడి చేసింది' అంటుంది. దీంతో నందూ లాస్య అని కోపంగా అరిచి కొట్టడానికి చేయి లేపుతాడు. తర్వాత 'నిన్ను కొట్టడానికి సిగ్గుగా ఉంది.
నిన్నటి నుంచి నీ మీద కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. పిల్లల ముందు కొట్టకూడదని ఆగుతున్నాను. ప్రతిదానికి నువ్వు తులసిని నిందించడం లేదా. రిపోర్ట్ పాజిటివ్గా రావాలని రాత్రంతా జాగారం చేసింది తులసి కానీ నువ్వు ఫుల్ గా తిని పడుకుని నిద్రపోయావు' అంటాడు.

గాయత్రికి షాకిచ్చిన చందు
నందూ కెఫేకు పాజిటివ్ రిపోర్టు రావడంతో చందూకు గాయత్రి ఫోన్ చేస్తుంది. అప్పుడామె 'నమ్మకద్రోహి.. డబ్బులు ఇప్పించుకొని మోసం చేస్తావా? ఎందుకురా చెప్పిన పని చేయలేదు' అని తిడుతుంది. దీంతో తులసి తనకు సాయం చేసిన విషయాన్ని ఆమెకు చెప్తాడు. దీంతో గాయత్రి 'ఆ డబ్బులు ఏవో నన్ను అడిగితే నీ మొఖాన విసిరి కొట్టే దాన్ని కదా' అంటుంది. దీంతో అతడు 'తులసి మేడం ప్రేమగా చేతిలో పెట్టింది. పైగా మీది పాపిష్టి డబ్బు ఆ డబ్బు తీసుకొని మా అమ్మకు ట్రీట్మెంట్ చేయించిన బతికేది కాదేమో. దేవత లాంటి తులసి మేడమ్‌కు వెన్నుపోటు పొడవడం తప్పనిపించింది అందుకే ఇలా చేశాను' అంటాడు. దీంతో ఆమె కాల్ కట్ చేస్తుంది.

అభి బాంబ్.. లాస్య ప్రశ్నలు
టికెట్స్ పట్టుకుని వచ్చిన అభి 'మేము అమెరికాకు వెళ్తున్నాము టికెట్స్ బుక్ అయ్యాయి' అని చెప్తాడు. దీంతో తులసి కొద్ది రోజులు ఉండొచ్చు కదా.. అంకిత నువ్వైనా చెప్పు అంటుంది. కానీ, ఆమె మాత్రం టికెట్స్ బుక్ అయిపోయాయి కదా అంటుంది. ఆ తర్వాత యూఎస్ వెళ్లేముందు అంతా పార్టీ చేసుకుందాం అంటారు. ఇక, తులసికి నందూ దగ్గరవుతున్నాడని లాస్య అతడినే సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











