Intinti Gruhalakshmi Today Episode: అరెస్ట్ అయిన అభి మాయం.. తులసికి మరో కోలుకోలేని షాక్
వేరే భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కొడుకును వెతుక్కుంటూ వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. దీంతో అతడిని పిలిచి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుందామె. అప్పుడు అసలు తాను ఏ తప్పూ చేయలేదని తల్లికి వివరిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో పోలీసులు అక్కడకు వస్తారు. దీంతో అభి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తులసిని పట్టుకుని అభిని బెదిరించడంతో అతడు వచ్చి లొంగిపోతాడు. ఆ తర్వాత పోలీసులు తులసిని అవమానిస్తారు. ఇక, బాధగా ఇంటికి వెళ్లిన తులసి.. అభి అరెస్ట్ అయ్యాడన్న విషయాన్ని అందరికీ చెబుతుంది.

ఇంట్లో వాళ్లను నిరాశ పరిచిన లాస్య
అభి గురించి తులసి మాట్లాడుతుండగా లాస్య.. ‘ఆకాశంలో చందమామను చూపించి.. మురిపించి చిన్నపిల్లలకు అన్నం పెట్టినట్టు కథలు బాగానే చెబుతున్నావు. నీ కథలు నమ్మడానికి అంకిత చిన్నపిల్లేమీ కాదు. నా కొడుకు మంచోడు అని నువ్వు బోను ఎక్కి అరిస్తే వాళ్లు వదిలేయరు. ముందు హాస్పిటల్‌లో ఉన్నవాడు బతకాలి. ఆ తర్వాత నిజం చెప్పాలి. వాడు నిజం చెప్పాలంటే వాడికి గట్స్ ఉండాలి. వాడు నోరు తెరవడు. తెరవకే ఏం అవుతుందో ఊహించలేం' అంటుంది. దీంతో శృతి ‘నీకు అభి బయటికి రావడం ఇష్టం లేనట్టు ఉంది ఆంటి' అంటుంది.

ఫ్యామిలీ మొత్తానికి నందూ వార్నింగ్
శృతి ఆ మాట అనగానే లాస్య ‘అభిని కన్నది తులసే అయినప్పటికీ.. తన మీద నాకే ఎక్కువ అభిమానం ఉంది. అసలు ఈ ఇంట్లో పెత్తనాన్ని తులసికి ఇచ్చి తప్పు చేశారు. పగ్గాలు నువ్వే తీసుకోవాల్సింది నందూ. ఇప్పుడు తులసి.. అభిని ఏం చేస్తుందో ఏమో' అంటుంది. దీంతో నందూ ‘ఈ ఇంట్లో అందరూ తులసి మాటలే వింటారు లాస్య. నా మాట ఎవ్వరూ ఖాతరు చేయరు. చూద్దాం.. అభి విషయంలో తులసి ఎంత దూరం వెళ్తుందో. ఒకవేళ ఆమె విఫలమైతే అప్పుడు నేనే ఇంటి పగ్గాలు తీసుకుంటా. ఏం చేస్తుందో చూస్తా. పరిస్థితి చేయి దాటి పోతే ఇక ఎవరి మాట వినను' అంటూ సీరియస్ అవుతాడు.

ధైర్యం చెప్పిన మాధవి.. తులసి అలా
అభి అరెస్ట్ అవడంతో పాటు ఇంట్లో వాళ్లు తన తప్పు అన్నట్లు నిందిస్తూ ఉండడంతో తులసి తెగ బాధ పడుతూ ఉంటుంది. అంతలో మాధవి ఆమె దగ్గరకు వస్తుంది. ‘అందరికీ ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే దిగులు పడితే ఎలా. నీ బిడ్డ గురించి నువ్వు ఒంటరి పోరాటం చేయాల్సిందే. బయట శత్రువులతో పాటు ఇంట్లోని శత్రువులతో కూడా పోరాటం చేయాల్సిందే' అంటుంది. దీంతో ‘నా బిడ్డ కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు మాధవి. నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను. సమయానికి అన్నయ్య పక్కన లేకపోవడం పెద్ద లోటుగా ఉంది' అంటుంది.

మాధవి గుడ్ న్యూస్.. దివ్య బాధగా
తులసి.. మోహన్ గురించి మాట్లాడగానే మాధవి.. ‘ఆయన లేకుంటేనేం.. నేను అన్నీ చెప్పాను. తన కొలిగ్‌కు చెప్పాడట. ఆయన కూడా మంచి లాయరేనట. రేపు బెయిల్ పేపర్స్ సిద్ధం చేస్తా అని చెప్పాడట' అంటుంది. దీంతో తులసి కాస్త కుదుటపడుతుంది. మరోవైపు, దివ్య తన రూమ్‌లో వెక్కి వెక్కి ఏడుస్తుంది. అప్పుడు శృతి ‘పొద్దున్నుంచి ఇలాగే కూర్చొని ఏడుస్తున్నావు. మేము కూడా బాధను దిగమింగుకొని బతుకుతున్నాం. నువ్వు కూడా నీ బాధను దిగమింగుకొని ఉండాలి దివ్య' అంటుంది. దీంతో ‘నా వల్ల కావట్లేదు వదిన.. వాడిని జైలులో పెట్టడం ఏంటి' అని అంటుంది. తర్వాత దివ్యను ఓదార్చి భోజనానికి తీసుకెళ్తుంది శృతి.

అభికి బెయిల్ రెడీ చేసిన లాయర్
ఉదయాన్నే అభికి బెయిల్ ఇప్పించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి తులసి రెడీ అవుతుంది. దీంతో అంకిత ‘నేను కూడా వస్తాను ఆంటి. అభిని చూడకుండా ఉండలేకపోతున్నాను' అని అంటుంది. దీంతో తులసి ‘నువ్వేమీ కంగారు పడొద్దు. వెంటనే వస్తామమ్మా. అభికి ఏం కాదు' అంటుంది. ఇంతలో లాయర్ కూడా ఇంటికి వచ్చి నమస్తే మేడమ్ అంటాడు. దీంతో తులసి ‘బెయిల్ ఖచ్చితంగా వస్తుంది కదా' అని అడుగుతుంది. దీనికి ‘ఈ బెయిల్ పేపర్స్ చూడగానే ఖచ్చితంగా వెంటనే బెయిల్ ఇవ్వాల్సిందే' అని సమాధానం చెబుతాడు.

స్టేషన్‌లో తులసికి షాకిచ్చిన ఎస్సై
లాయర్‌ను తీసుకుని తులసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. అప్పుడు వాళ్లిద్దరూ ఎస్సై కోసం ఎదురు చూస్తుంటారు. కొద్ది సేపటి తర్వాత ఆయన వస్తాడు. అప్పుడు తులసి ఎస్సైను పిలుస్తుంది. కానీ, ఆయన వినపడనట్లు నటిస్తాడు. ఆ తర్వాత గట్టిగా పిలవగా ‘చెప్పండి.. మీకు మేము ఏవిధంగా సాయపడగము' అంటాడు. వెంటనే లాయర్ మాట్లాడుతూ ‘అభిని రిలీజ్ చేయడానికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాం' అంటూ ఆయనకు ఇస్తాడు. దీంతో వాటిని చూసి ‘పేపర్లు ఓకే.. ఇంతకీ అభి ఎవరు' అని ఎస్సై అడుగుతాడు. దీంతో తులసితో పాటు లాయర్ షాక్ అయిపోతారు.
Recommended Video

స్టేషన్‌లో అభి మాయం.. తులసి ఫైర్
ఎస్సై మాటలకు తులసి ‘అదేంటి సార్.. అప్పుడే మరిచిపోయారా. నిన్న మా అబ్బాయిని అరెస్ట్ చేశారు కదా' అని అడుగుతుంది. దీంతో ‘అసలు మీరు ఎవరు.. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే.. అసలు మీ అబ్బాయి ఎవరు. నాకు కొంపదీసి అల్జీమర్స్ వచ్చిందా' అని అనుకుంటాడయన. అంతేకాదు, ‘నేను అబద్ధం చెబుతున్నానని అనుకుందాం. నాతో పాటు కానిస్టేబుల్స్ కూడా ఉంటారు కదా. వాళ్లను వెళ్లి అడుగు' అంటాడు. దీంతో కానిస్టేబుల్స్‌ను వెళ్లి అడుగుతుంది తులసి. కానీ, ఎవ్వరూ మాకు తెలియదు అంటారు. దీంతో ఎస్సై ‘మీకు ఇంకా నమ్మకం రావడం లేదా.. అయితే అరెస్ట్ చేస్తే ఎక్కడ పెడతాం సెల్‌లోనే కదా. వెళ్లి చూసుకోండి. మీకే నమ్మకం వస్తది' అంటాడు. అక్కడ వెతికినా అభి కనిపించడు. దీంతో ఎస్సైపై తులసి ఫైర్ అవుతుంది. అంతేకాదు, అభి కనిపించే వరకూ ఇక్కడే ఉంటానంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











