Intinti Gruhalakshmi Today Episode: మూడేళ్లు ముందుకెళ్లిన కథ.. తండ్రైన ప్రేమ్‌.. దివ్య రీఎంట్రీ!

ఓవరాల్‌గా అన్ని బుల్లితెరలతో పోల్చుకుంటే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కెఫేలోని ఫుడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన తర్వాత తులసి చాలా టెన్షన్‌గా కనిపిస్తుంది. అంతా మంచే జరగాలని ఆమె పూజ చేసి ఉపవాసం ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే శాంపిల్స్‌కు పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. దీంతో చందూను గాయత్రి ఫోన్ చేసి తిడుతుంది. దీంతో తనకు తులసి సహాయం చేసిందని ఆమెకు చెప్పి షాకిస్తాడు.

ఇక, అభి, అంకిత అమెరికా వెళ్లిపోడానికి సిద్ధం అవుతూ ఉంటారు. అది తెలిసినప్పటి నుంచి తులసి బాధగా ఉంటుంది. మరోవైపు, తులసికి దగ్గరవుతున్నాడని నందూను లాస్య ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది.

తులసికి లాభాలు ఇస్తావా అని

తులసికి లాభాలు ఇస్తావా అని

తులసితో నందూ క్లోజ్ అవుతుండడంతో అతడిని లాస్య ప్రశ్నిస్తుంటుంది. అప్పుడు 'ఆ తులసి నిన్ను కెఫే లాభాలలో షేర్ ఇవ్వమంటే ఇస్తావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ చూద్దాంలే అని అంటాడు. దీనికామె 'చూద్దాంలే అంటే అర్థం ఏమిటి' అంటుంది. దీంతో నందూ 'నువ్వు అన్నట్టు ఒకవేళ తులసి లాభాలు అడిగితే కచ్చితంగా ఇస్తాను.

ఎందుకంటే నాకంటే కెఫే కోసం తనే ఎక్కువగా కష్టపడుతుంది' అంటాడు. ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. దీంతో లాస్య రా తులసి నీ గురించే మాట్లాడుకుంటున్నాము అంటుంది. దీనికి తులసి నా గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అనగా.. నీది లక్కీ హ్యాండ్ అని చెబుతున్నాను తులసి అని చెప్తుంది.

ఎప్పటికీ ఇలాగే ఉంటానంటూ

ఎప్పటికీ ఇలాగే ఉంటానంటూ

తులసి మాటలకు నందూ నువ్వు నాతో కలిసి పని చేయొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు లాస్య నేను పక్కన ఉన్నా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏంటిది అనుకుంటుంది. అంతేకాదు, లాభాలలో 50% నీకు ఇస్తాను అనడంతో లాస్య షాక్ అవుతుంది. దీంతో తులసి 'నాకు అటువంటి ఆలోచన లేదు. కెఫే దారికి వచ్చేవరకు బాధ్యతగా తీసుకోవాలి అనుకున్నాను తీసుకున్నాను అంతే.

నా సొంత కాళ్ల మీద నిలబడాలి అనుకున్నాను. ఇప్పుడు కాదు ఎప్పటికీ అలాగే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో లాస్య సంతోషిస్తుంది. ఆ వెంటనే లాస్య 'ఏంటి బాబూ.. తులసితో బిజినెస్ చేద్దామని అనుకుంటున్నావా' అని ప్రశ్నించగా.. నేను నీకోసమే అలా చెప్పా అని వెళ్లిపోతాడు.

ప్రేమ్‌ను హత్తుకున్న నందూ

ప్రేమ్‌ను హత్తుకున్న నందూ

తర్వాత అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నందూ 'చాలా సంతోషంగా ఉంది. ఎన్నో కష్టాలు ఒడిదుడుకుల తర్వాత నా ఫ్యామిలీ నాకు తోడుగా ఉంది. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను' అని అనుకుంటూ ఉంటాడు.

అప్పుడు లాస్య 'నీకు మళ్ళీ తులసి పిచ్చి పట్టినట్టు ఉంది' అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి సరదాగా గేమ్ ఆడుతూ ఉండగా నందూకు విపరీతంగా దగ్గు వస్తుంది. దీంతో ప్రేమ్ ప్రేమగా నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు. దీంతో నందూ అతడిని ప్రేమగా హత్తుకుని ఎమోషనల్ అవగా లాస్య కుళ్లుకుంటుంది.

దివ్య రాబోతుందని చెప్పగానే

దివ్య రాబోతుందని చెప్పగానే


ఫోన్ మోగుతూ ఉండగా అనసూయ, పరంధామయ్య లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు శృతి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మన దివ్య ఇంటికి రాబోతోంది అని చెప్తుంది. దీంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్ ఆడుకుంటూ ఉండగా ఇంతలో శృతి అక్కడికి వచ్చి మీ చెల్లెలు వస్తుంది అనగా బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తే నమ్ముతాను అంటాడు.

దీంతో ఆమె బాబుకు ముద్దు పెట్టి చెబుతుంది. తర్వాత బాబును శృతికి ఇచ్చేసిన ప్రేమ్ రెడీ అవడానికి వెళ్తాడు. ఆ వెంటనే లాస్య వచ్చి చూడగా ఇంట్లో ఎవరూ కనిపించరు. దీంతో ఆమె టెన్షన్ పడుతుంది.

లాస్యకు విషయం చెప్పగానే

లాస్యకు విషయం చెప్పగానే

లాస్య అంతా వెతుకుతూ ఉండగా అనసూయ ఎదురుగా వస్తుంది. అప్పుడు ఏమైంది? ఎవరూ కనిపించడం లేదేంటి అని అడుగుతుంది. దీంతో అనసూయ 'దివ్య డాక్టర్ చదువు పూర్తి చేసుకుని ఇంటికి రాబోతోంది. అందుకే అందరూ కలిసి అక్కడికి వెళ్లారు' అని ఉంటుంది. ఇక, తులసి సంతోషంతో గుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంది.

అప్పుడు రాములమ్మ '108 కొబ్బరికాయలు కొట్టాము. నా పని అయిపోయిందమ్మా. ఇక నేను చేయలేను' అని అంటుంది. పూజారి అక్కడికి వచ్చి ఏంటి తులసి అంత ఆనందంగా ఉన్నావు అనడంతో రాములమ్మ 'తులసి అమ్మ కూతురు దివ్య మూడేళ్ళ తర్వాత చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వస్తోంది. అందుకే ఇంత సంతోషంగా ఉంది' అని చెప్తుంది.

దివ్య కోసం వెళ్లమన్న లాస్య

దివ్య కోసం వెళ్లమన్న లాస్య

ఆ తర్వాత తులసి.. దివ్య పేరు మీద గుడిలో అమ్మవారికి అర్చన చేయిస్తుంది. అప్పుడు పూజారి 'తొందరగా వెళ్ళు తులసి.. నువ్వు వెళ్లకపోతే నీ కూతురు అలాగే ఫ్లైట్ ఎక్కి అలాగే వెళ్ళిపోతుంది' అనడంతో వెంటనే సంతోషంగా బయలుదేరుతుంది. ఇక, ఇంట్లో నందూ జుట్టుకు రంగు వేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య వచ్చి చిటపటలాడుతూ ఉంటుంది. అప్పుడామె ఎందుకు ఇదంతా చేస్తున్నావు అనడంతో దివ్య వస్తుంది కదా అంటాడు.

దీంతో లాస్య తను వస్తుందని నాకెందుకు చెప్పలేదు అంటుంది. దీంతో నందూ నీకు తెలుసు అనుకున్నాను అంటాడు. అప్పుడామె సరే దివ్యను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళండి అని అంటుంది.

దివ్య ఎంట్రీ.. కొత్త ముఖంతో

దివ్య ఎంట్రీ.. కొత్త ముఖంతో


లాస్య చెప్పగానే నందూ.. తులసి వెళ్లింది కదా అంటాడు. దీనికామె 'దివ్య.. తులసికి మాత్రమే కాదు. నీకు కూడా కూతురే. అందులోనూ దివ్య ఇప్పుడు డాక్టర్ చదువు పూర్తి చేసి వస్తోంది. నా మాట విని బయలుదేరు నందూ' అంటూ అతడిని తీసుకుని వెళ్తుంది. ఇక, ఒక పాప బెలూన్లతో ఆడుకుంటూ ఉండగా కొందరు ఆకతాయి కావాలని ఆ బెలూన్స్ని పాపకు అందకుండా కట్ చేయడంతో దివ్య (కొత్త నటి) ఎంట్రీ ఇస్తుంది. ముఖమే కాదు.. వ్యవహార శైలిలోనూ ఆమె కొత్తగా కనిపిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X