Intinti Gruhalakshmi Today Episode: దివ్యను చూసి తులసి షాక్.. రావడమే లాస్య ఝలక్.. అభి అలా అడగడంతో!
ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటింటి గృహలక్ష్మి కథను మూడేళ్లు ముందుకు తీసుకు వెళ్లారు. ఇందులో కెఫేలో వచ్చే లాభాల్లో తులసికి వాటా ఇస్తానని నందూ అంటాడు. కానీ, దీనికి ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఆ తర్వాత ఇంట్లోని వాళ్లంతా కూర్చుని ఉండగా.. నందూకు ప్రేమ్ వాటర్ తెచ్చి ఇవ్వడంతో అతడు ఎమోషనల్ అవుతాడు. అనంతరం డాక్టర్ చదివేందుకు వెళ్లిన దివ్య తిరిగి వస్తుందని తెలుస్తుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. తులసి ఏకంగా గుడిలో 108 కొబ్బరి కాయలు కొడుతుంది. తర్వాత అందరూ కలిసి ఆమె కోసం ఎయిర్‌పోర్టుకు వెళ్తారు.

కుర్రాళ్లకు బుద్ది చెప్పిన దివ్య
ఎయిర్‌పోర్టులో ఓ పాప బెలూన్స్ ఎగిరిపోవడంతో దివ్య వాటిని పట్టుకుని ఆ చిన్నారికి ఇస్తుంది. అంతేకాదు, తన దగ్గర ఉన్న కొన్ని వస్తువులు కూడా ఆ పాపకు ఇస్తుంది. అనంతరం ఆ బెలూన్స్ ఎగిరిపోయేలా చేసిన కుర్రాళ్ల దగ్గరకు వెళ్లి క్లాస్ పీకుతుంది. మీకు ఆ దేవుడు ఏదో ఒక బుద్ది చెబుతాడు అనగానే వాళ్లు నవ్వుతారు. దీంతో దివ్య వాళ్లకు మళ్లీ క్లీస్ పీకుతుంది. అంతేకాదు, ఓ డాక్టర్ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చి 'వెళ్లి ఆ డాక్టర్ని కలవండి లేదంటే సైకోలు అయిపోతారు.. ముఖ్యంగా నువ్వు ఏ1 సైకోలా ఉన్నావు' అంటుంది. దీంతో పక్కనున్న కుర్రాళ్లు భయంతో వెళ్లిపోతారు.

తులసికి సర్‌ప్రైజ్ ఇచ్చింది
తులసి, లాస్య కారులో ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అలాగే, తులసి కూడా స్కూటీలో అక్కడకు వస్తుంది. వాళ్లంతా బయట ఆమె కోసం వేచి చూస్తుంటారు. అప్పుడు దివ్య.. తులసికి ఫోన్ చేస్తుంది. 'అమ్మా ఎక్కడున్నావు? మూడేళ్ల తర్వాత నేను వస్తున్నానని ముందే వచ్చి ఉంటావనుకున్నా. నువ్వు ఇప్పుడు నన్ను ఎలా గుర్తు పడతావు' అని అంటుంది. ఆ వెంటనే తులసిని చూసి 'అమ్మా నేను బయటకు వచ్చేశా' అంటుంది. దీంతో తులసి వెతుకుతూ ఉండగా.. దివ్య ఆమెను గట్టిగా పిలిచి సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇదంతా వెనకాలే ఉన్న నందూ చూస్తుంటాడు.

లాస్యకేమో షాకిచ్చేసిన దివ్య
దివ్యను చూసిన తులసి షాక్ అవుతుంది. అంతేకాదు, 'ఇంతలా మారిపోయావమ్మా. అస్సలు గుర్తు పట్టలేదు' అని అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య 'నాకోసం నువ్వు గంట ముందే వస్తావు అనుకున్నాను. ఇంత లేటుగా వచ్చావేంటి' అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి 'నువ్వు వస్తున్నావని నీకోసం పూజ చేయించడానికి గుడికి వెళ్లాను' అని చెబుతుంది. ఆ తర్వాత దివ్య నందూను చూసి ప్రేమగా పలకరిస్తుంది. అప్పుడు లాస్య పలకరిస్తుండగా దివ్య మాత్రం పట్టించుకోకుండా తులసితోనే మాట్లాడి షాకిస్తుంది.

నందూతో రానని చెప్పడంతో
దివ్యను చూసిన నందూ 'చిన్నప్పుడు అది కొని పెట్టు.. ఇది కొని పెట్టు అని ప్రాణాలు తీసేదానివి. ఇప్పుడు ఒకరి ప్రాణాలు పోసే దానివి అయ్యావు. ఎంత పెద్ద దానివి అయ్యావు దివ్య' అంటాడు. దీంతో దివ్య 'మూడేళ్లు మీకు దూరంగా ఉండే సరికి చాలా మిస్ అయ్యాను' అని అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి కారు దగ్గరికి వెళ్తారు. అప్పుడు లాస్య 'దివ్యకు నీ మీద ఉన్న ప్రేమ తగ్గలేదు కాదనను.. కానీ దివ్య స్టేటస్ పెరిగింది బైక్ నుంచి కారుకు వెళ్ళింది. ఇప్పుడు తను నీతో అస్సలు రాదు' అని అంటుంది. కానీ, దివ్య మాత్రం లగేజ్ మొత్తం కారులో పెట్టి తులసితో కలిసి స్కూటీ మీద వెళ్తానని అంటుంది. దీంతో లాస్య షాక్ అవుతుంది.

లాస్యపై నందూ సీరియస్‌గా
ఆ తర్వాత దివ్య 'నేను అమ్మ మధ్యలో చాలా విషయాలు మాట్లాడుకుంటూ బైక్ మీద వస్తాము. మీరు వెళ్లిపోండి నాన్న' అంటుంది. దీంతో లాస్య 'మనం లగేజ్ మోయడానికి తప్ప దేనికి పనికిరామా. నీకంటే తనకి తన అమ్మే ఎక్కువ అయిపోయిందా నందూ' అంటూ దివ్యపై నందూను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో నందూకు కోపం వచ్చి 'దివ్యకు నాకంటే వాళ్ల అమ్మ అంటేనే ఇష్టం. ఈ విషయం తెలుసు కదా. ఎక్కువ చేయొద్దు వెళ్ళిపోదాం పద' అని సీరియస్ అవుతాడు. దీంతో లాస్య కుళ్లుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

దివ్యకు హారతులు.. సందడి
ఇక, మూడేళ్ల తర్వాత దివ్య ఇంటికి రావడంతో తులసి హారతి ఇచ్చి లోపలికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు దివ్య లోపలికి వెళ్లి.. అనసూయ పరంధామయ్యలతో కలిసి చిందులు వేస్తూ ఉండగా అది చూసి అందరూ సంతోష పడుతుంటారు. తర్వాత పరంధామయ్య ఆరోగ్యం మీద అందరూ దివ్యకు కంప్లైంట్ ఇస్తారు. దీంతో ఆమె ఏంటి తాతయ్య ఎన్ని కంప్లైంట్స్ అని ప్రశ్నిస్తుంది. దీనికాయన అవి చూసి చూడనట్టు వదిలేయాలి అమ్మ అంటాడు. అప్పుడు దివ్య 'అవన్నీ నాకు కుదరపు.. మా అమ్మలా కాదు నేను.. వెంటపడి మరి వేధిస్తాను' అని ఆయనతో అంటుంది. తర్వాత దివ్య అందరితో సరదాగా మాట్లాడుతుంది. అంతేకాదు, ప్రేమ్‌తో నవ్వుకుంటూ గొడవలు పెట్టుకుంటుంది.

అభి ప్రశ్నలు.. సేవ చేస్తానని
మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిపోయిన అభి, అంకిత.. దివ్య వచ్చిందని తెలిసి వీడియో కాల్ చేస్తారు. అప్పుడు అభి దివ్య మీద సెటైర్లు వేస్తూ ఉండగా అంకితతో పాటు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అనంతరం అభి 'నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి దివ్య' అని సూటిగా ప్రశ్నిస్తాడు. దీనికి దివ్య 'అమ్మ చెప్పినట్టు మొదట్లో చిన్న క్లినిక్ పెట్టి తక్కువ ఖర్చులోనే పేద వాళ్ళకి వైద్యం చేయాలి అనుకుంటున్నాను. ఆ దిశగానే అడుగులు వేస్తాను' అని చెబుతుంది. దీంతో అంతా సంతోషిస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











