Intinti Gruhalakshmi Today Episode: పోలీస్ దెబ్బలకు అభి మృతి.. కొడుకు కోసం తులసి కీలక నిర్ణయం

దేశంలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పోలీస్ స్టేషన్‌లో అభి లేకపోవడంతో తులసి తన కొడుకును తీసుకొచ్చే వరకూ అక్కడే ఉంటానని గొడవ పడుతుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేస్తానని ఎస్సై బెదిరించడంతో లాయర్ తులసిని తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆమె హాస్పత్రికి వెళ్లి మనోజ్ పరిస్థితిని తెలుసుకుంటుంది. అనంతరం ఇంటికి వెళ్లిన ఆమెను అభి ఎక్కడున్నాడు అని అందరూ ప్రశ్నిస్తారు. ఆ సమయంలో గొడవ కూడా జరుగుతుంది. దీంతో తులసి కోపంగా బయటకు వచ్చేస్తుంది. అభిని కనుక్కోవడం కోసం ఎస్సైను బ్రతిమాలాలని అనుకుంటుంది.

ఎస్సై కోసం బార్‌కు వెళ్లిన తులసి

ఎస్సై కోసం బార్‌కు వెళ్లిన తులసి

తన కొడుకును దాచిన ఎస్సైను బ్రతిమాలాలని తులసి డిసైడ్ అవుతుంది. అందుకోసం అతడు బార్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ మందు తాగే వాళ్లు చాలా మంది ఆమెపై అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అయినా పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది. అంతలో వెయిటర్ వచ్చి 'మేడం ఇది మగవాళ్లు కూర్చుని తాగే రూమ్. మీకు ఫ్యామిలీ రూమ్ చూపిస్తాను రండి' అంటాడు. కానీ, ఆమె వినకుండానే వెళ్తుంది. ఇంతలో పక్క సీటులో ఎస్సై ఉంటాడు. సార్ అని పిలుస్తుంది. కానీ, అతడు మాత్రం ఆమెను పట్టించుకోడు.

తులసిని అవమానించిన పోలీసు

తులసిని అవమానించిన పోలీసు

ఎస్సై వినకపోయినా తులసి మళ్లీ మళ్లీ పిలుస్తుంది. దీంతో తులసిని చూసిన అతడు 'ఏంటి.. కొడుకు కనిపించడం లేదన్న బాధతో మందు కొడదామని బార్‌కు వచ్చావా?' అని చులకనగా మాట్లాడతాడు. దీంతో తులసి 'లేదండి.. మీ కోసమే వచ్చాను. ఎస్సై గారు మా అబ్బాయి మీ షర్ట్ పట్టుకోవడం తప్పే. దయచేసి మా అభి ఎక్కడున్నాడో చెప్పండి' అని బ్రతిమాలుతుంది. దీంతో ఎస్సై 'ఒక పని చేద్దాం. నువ్వు నా పక్కన కుర్చొని ఒక పెగ్ వేయ్. సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేద్దాం. అప్పుడైనా గుర్తొస్తుందేమో' అంటాడు. దీంతో పక్కనే ఉన్న వాళ్లు కూడా నవ్వుతూ ఉంటారు.

 ఎస్సైపై రేంజ్‌లో ఫైరైన తులసి

ఎస్సైపై రేంజ్‌లో ఫైరైన తులసి

ఎస్సై మాటలకు నీరుగారిపోయిన తులసి 'రాకూడని టైమ్‌లో రాకూడని మనిషి దగ్గరికి.. వచ్చినప్పుడే నేను సగం చచ్చిపోయాను. మీ వెటకారాలు సహిస్తూ.. ఓర్చుకొని పూర్తిగా చచ్చిపోయాను. ఒక తల్లి మానసిక క్షోభతో ఆడుకొని తప్పు చేశారు. ఒక ఆడదాన్ని ఆత్మాభిమానాన్ని చంపి ఇంకా తప్పు చేశారు. నా కన్నీళ్లతో మీ మనసు కరుగుతుందేమోనని ఆశతో వచ్చాను. ఇదంతా నా కొడుకును రక్షించుకోవాలన్న తాపత్రయంతోనే. ఒక తల్లి ఊసురు పోసుకొని మీరు ప్రశాంతంగా బతకలేరు' అంటూ ఫైర్ అవుతుంది. దీంతో అవునా.. నేను చచ్చిపోతానా అంటాడు ఎస్సై.

ఎస్సైకు ఛాలెంజ్ చేసిన తులసి

ఎస్సైకు ఛాలెంజ్ చేసిన తులసి

తులసి మాటలకు ఎస్సై మాట్లాడుతూ.. 'చూడు.. కన్నీళ్లకు కరిగిపోయే క్యారెక్టర్ కాదు నాది. నీ ఈగోను టచ్ చేసినందుకు నీ కొడుకు అనుభవిస్తున్నాడు. అది చల్లారితే కానీ.. ఏం చేయాలో డిసైడ్ చేయను' అంటాడు. దీనికి తులసి అంతే ధీటుగా 'నువ్వు నా కొడుకును ఏడు సముద్రాల అవతల దాచినా నా కొడుకును ఎట్టిపరిస్థితుల్లోనూ వెతికి పట్టుకుంటాను. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కోసం ఒక తల్లి ఏదైనా చేస్తుంది. అనుమానం ఉంటే మీ తల్లిని అడగండి. ఒక బిడ్డ కోసం ఏం చేయగలదో తనే చెబుతుంది' అంటుంది. దీంతో కోపంతో ఇంకా మందు ఎక్కువ తాగుతాడు.

 తులసిని హేళన చేసిన నందూ

తులసిని హేళన చేసిన నందూ


ఎస్సైతో మాట్లాడిన తర్వాత తులసి ఇంటికి వస్తుంది. అప్పుడు నందూ 'ఎక్కడికి వెళ్లావు? రోడ్ల మీద పడి వాడి కోసం తిరుగుతున్నావా' అని అంటాడు. దీంతో 'ఎస్సై ఉన్న బార్‌కు వెళ్లాను. ఆయనను బతిమిలాడాను. దాదాపు కాళ్లు పట్టుకున్నాను. అతడి మనసు మార్చడానికి ప్రయత్నించాను' అంటుంది తులసి. అప్పుడు నందూ 'చేసింది పనికిమాలిన పని.. పైగా గొప్పలు చెప్పుకుంటున్నావా' అని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'లేకపోతే మీలా తలుపులు వేసుకొని కూర్చోవాలా? నా ప్రాణాలు పణంగా పెట్టి పిల్లల్ని కన్నా. కానీ, మీరు చేసిందేంటి' అని ప్రశ్నిస్తుంది.

నందూను రెచ్చగొట్టేసిన లాస్య

నందూను రెచ్చగొట్టేసిన లాస్య

తులసి మాటలకు 'నీకు ఇప్పుడు కాదు.. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు నా గురించి తెలుస్తుంది' అంటాడు నందూ. అప్పుడు తులసి 'మీలా చేతులు ముడుచుకొని నేను చూస్తూ కూర్చోలేను. నిజంగా మీరు బాధ్యత గల తండ్రి అయితే ఏదో ఒకటి చేయండి.. అభి గురించి ఆలోచించండి.. నన్ను దెప్పిపొడవడం కాదు' అంటుంది. దీంతో నందూ తన రూమ్‌లోకి వెళ్లిపోతాడు. అప్పుడు లాస్య 'తులసి లాగ నీకు నేను మర్యాద ఇవ్వకుండా ప్రయత్నించలేను కదా. నిజంగానే నువ్వు చేతగాని వాడివని నిరూపించడం కోసం అలా అంటుంది. నేనే నీ ప్లేస్‌లో ఉంటే ముందు తులసిని మెడపట్టి గెంటేసేదాన్ని' అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

పోలీసుల దెబ్బలకు అభి మృతి

పోలీసుల దెబ్బలకు అభి మృతి


అభిని సీక్రెట్ ప్లేస్‌లో కట్టేసి తన మనషులతో కొట్టిస్తాడు ఎస్సై. కానిస్టేబుల్స్ చెప్పినా కూడా వినడు. పాపం తగులుతుంది సార్ అన్నా పట్టించుకోడు. దీంతో అభి ఉలుకూ పలుకు లేకుండా పడిపోతాడు. అప్పుడు కానిస్టేబుల్ చెక్ చేయగా.. అతడు చనిపోతాడు. అయితే, ఇదంతా తులసి కన్న కల మాత్రమే. కంగారుగా మేల్కొన్న తులసి 'ఆ ఎస్సై మరింత మూర్ఖంగా మారక ముందే.. తెగించక ముందే నేను తొందరపడాలి. నేనే ఏదో ఒకటి చేయాలి. ముందు అభి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఇంట్లో అందరూ తప్పు నాదే అంటున్నారు. నేను డబ్బు కోసం అభిని బలవంతం చేయబట్టే ఇలా జరిగింది అంటున్నారు' అని అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X