Intinti Gruhalakshmi Today Episode: తులసికి ఎదురు తిరిగిన కుటుంబం.. యుద్ధం మొదలు పెట్టడంతో!
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి ఎక్కడున్నడో తెలుసుకునేందుకు ఎస్సైను బ్రతిమాలాలని తులసి అనుకుంటుంది. అందుకోసం అతడు బార్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్తుంది. అక్కడ అందరూ వింత చూపులు చూస్తుండగా అతడితో మాట్లాడుతుంది. అప్పుడా ఎస్సై ఆమెను అవమానిస్తాడు. అనంతరం ఇంటికి వచ్చిన తులసిని నందూ కూడా నిందిస్తాడు.
దీంతో ఆమె ఫైర్ అవుతుంది. ఇక, అభిని పోలీసులు కొట్టి చంపినట్లు కల కంటుంది తులసి. ఆ తర్వాత తన కొడుకును విడిపించడం కోసం ఎంతకైనా తెగించాలని నిర్ణయం తీసుకుంటుంది.

నా ముందు నిలబెట్టేలా చేస్తానంటూ
అభి విషయంలో అందరూ తనను నిందిస్తుండడంతో తులసి తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు ‘ఏమడిగినా.. ఏం చేసినా అది వాడి మంచి కోసమే. వాడు బాగుపడాలనే. సంవత్సరం తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుందో డాక్టర్ చెప్పలేను అన్నారు. ఏమైనా కావొచ్చు అన్నారు. ఆ భయంతోనే నేను పోయాక వాడి జీవితం దారి తప్పకూడదని వాడితో మొండిగా ప్రవర్తించాను. ఎవరు నన్ను ఏమనుకున్నా తల్లిగా నా బాధ్యత నెరవేర్చుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఆ ఎస్సై నిన్ను నా ముందు నిలబెట్టేలా చేస్తాను' అని అనుకుంటుంది.

తులసి మరింత కాంప్లికేట్ చేస్తుంది
ఉదయం అవగానే తులసి ఎక్కడికో బయలుదేరుతుంది. అప్పుడు ‘అత్తయ్య, మామయ్య నేను బయటికి వెళ్తున్నాను. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు.. నాకోసం ఎదురు చూడకండి' అని చెబుతుంది. ఇంతలో నందూ అక్కడికి వస్తాడు. ‘ఎక్కడికి వెళ్తున్నావు మళ్లీ పోలీస్ స్టేషన్‌కేనా' అంటాడు. దీంతో తులసి ‘మీకు నిన్ననే చెప్పాను. అడిగే అధికారం మీరు.. చెప్పాల్సిన అవసరం నాకు లేదు' అంటుంది. అప్పుడు నందూ ‘ఒక్క పద్ధతి ప్లాన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ అభి ఇష్యూను తులసి మరింతగా కాంప్లికేట్ చేస్తోంది' అని నిందిస్తాడు.

నందూకు సపోర్టు చేసిన కుటుంబం
తులసి మాట వినకపోయే సరికి నందూ ‘తులసికి మాట్లాడి నచ్చజెప్పుదామని చూస్తే నా మాట వినడం లేదు. నేను ఇఫ్పటికే హయ్యర్ అఫిషియల్స్‌తో మాట్లాడా. వాళ్లు ఎస్సైతో మాట్లాడుతా అన్నారు. ఇదే సమయంలో నువ్వు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ ఎస్సైతో మళ్లీ గొడవ పెట్టుకుంటావా? అప్పుడు ఆయన మరింత రెచ్చిపోతాడు. కొడుకంటే నీకే కాదు.. నాకూ ప్రేమ ఉంది. అభి నాకు కూడా కొడుకే అని ఆమెకు గుర్తు చేయండి' అంటాడు. దీంతో ‘నందూ ప్రయత్నాన్ని చేయనిద్దాం.. ఏ పుట్టలో ఏ పాము ఉందో' అని అందరూ తులసికి నచ్చజెప్పాలని చూస్తుంటారు.

నందూపై నమ్మకం లేదన్న తులసి
నందూ మాట్లాడిన తర్వాత అంకిత కూడా తులసిని దూరంగా ఉండమని అంటుంది. ఆ తర్వాత పరందామయ్య ‘అభిని కాపాడే బాధ్యత ఇక నీదే. తులసి ఎక్కడికీ వెళ్లదు' అంటాడు. దీంతో తులసి ‘నిజంగా మీ కొడుకు మీద ఇంత నమ్మకం ఉందా? నాకు మాత్రం ఆయన మీద ఏ మాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఆయన బాధితురాలిని కాబట్టి.. ఆయనకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి. వేదమంత్రాల సాక్షిగా నా మెడలో మూడు ముళ్లు వేస్తూ మీరు ఏ ప్రమాణం చేశారు గుర్తు తెచ్చుకోండి. నాతో జీవిత ప్రయాణం మొదలు పెట్టి ఆ తర్వాత ఏం చేశారు. మిమ్మల్ని నమ్మి నేను మీతో కలిసి వచ్చాను కానీ.. నన్ను మాత్రం మీరు గాలికి వదిలేశారు.. మీ అమ్మానాన్న మిమ్మల్ని నమ్మినా నేను మాత్రం అస్సలు నమ్మను' అంటుంది.

తులసిని చులకన చేసేసిన లాస్య
తులసి అన్నీ చెప్పిన తర్వాత అంకిత ‘ఆంటి.. అభి మీకు కొడుకే కావచ్చు.. నాకు భర్త కూడా. నా బాధ కూడా పట్టించుకోండి' అంటుంది. నందూ కూడా అదే అంటాడు. అయినా ఆమె వినకపోయే సరికి ‘సరే ఆంటి.. అసలు మీ స్ట్రాటజీ ఏంటి? పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఏం చేయబోతున్నారు చెప్పండి. మేము కూడా వస్తాం. మీకు సాయం చేస్తాం' అంటుంది. అప్పుడు లాస్య ‘ఇంకేం చెబుతుంది మామయ్య గారు. మళ్లీ వెళ్లి ఆ ఎస్సై కాళ్లు పట్టుకుంటుంది. అంతకు మించి ఇంకేం చేయగలదు' అంటూ తులసిని మరింత చులకన చేసి మాట్లాడుతుంది.

ఎవరి మాట వినకుండా తులసి ప్లాన్
ఎవరు ఏం చెప్పినా తులసి మాత్రం ‘నేను ఎవ్వరి మాట వినదల్చుకోలేదు. నా దారిలో నేను వెళ్తాను. నా కన్న కొడుకును నేను కాపాడుకుంటాను. నా ప్రయత్నాల్లో మీ కొడుకును ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి. ఆయన ప్రయత్నాల్లో నేను ఇన్వాల్వ్ కాను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అందరికీ ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు లాస్య ‘నందూ.. తులసి ఆవేశంగా వెళ్లింది కానీ, అభిని కాపాడే విషయంలో నీ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టు' అంటుంది. మరోవైపు, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలని తులసి ప్లాన్ చేసుకుంటుంది.
Recommended Video

ఎస్సైకు లాస్య సవాల్.. యుద్ధం స్టార్ట్
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎస్సై ఆ టెంట్ ఏంటి అని అడుగుతాడు. ఇంతలో తులసి అక్కడ బోర్డులను పెడుతూ ఉంటుంది. అరెస్ట్ చేసిన నా కొడుకుని చూపించండి.. అంటూ బోర్డులు పెడుతుంది. చేతిలో ఒక ప్లకార్డ్ పట్టుకొని అక్కడ కూర్చొని దీక్ష చేస్తుంటుంది. దీంతో కోపంతో ఎస్సై ఆమె దగ్గరికి వస్తాడు. ‘నీకు ధైర్యం చాలా ఎక్కువనుకుంటా. నా మీద యుద్ధం చేస్తున్నావా' అని అడగ్గా.. ‘నా బిడ్డను రక్షించుకోవడానికి పెనుగులాడుతున్నాను. ఇది నీ మీద యుద్ధం కాదు. దగాపడ్డ ఒక తల్లి చేస్తున్న న్యాయపోరాటం' అంటుంది. అలా ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరుగుతుంది. ఆ సమయంలో ఎస్సైకు తులసి సవాల్ విసురుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











