Intinti Gruhalakshmi Today Episode: దివ్యకు సర్జరీ టెస్ట్.. తులసి నిరసన.. కొత్త హీరో రాకతో ట్విస్ట్

చాలా కాలంగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభితో వీడియో కాల్ మాట్లాడుతోన్న సమయంలో అమ్మ కోరిక తీర్చడానికి క్లినిక్ పెడతాను అని దివ్య అంటుంది. దీంతో లాస్య వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు నందూ నిజంగా దివ్య చెప్పిన లాంటి పనే చేస్తానంటూ షాకిస్తాడు. అనంతరం దివ్య.. రాజ్యలక్ష్మీ అనే ఆస్పత్రికి ఇంటర్వ్యూకు వెళ్తుంది. అక్కడ వాళ్లు పక్కా కమర్షియల్‌గా ఆలోచిస్తూ ఉంటారు. అనంతరం దివ్య ఇంటర్వ్యూకు వచ్చిందని ఓ వ్యక్తి చెప్తాడు. దీంతో ఎండీ రాజ్యలక్ష్మి ఆమెను సీక్రెట్‌గా ఇంటర్వ్యూ చేయండి.. నేను మానిటర్‌లో నుంచి చూస్తాను అని చెప్తుంది.

దివ్యను సర్జరీ చేయమని టెస్ట్

దివ్యను సర్జరీ చేయమని టెస్ట్

దివ్య ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలోనే ఆస్పత్రిలో పని చేస్తోన్న ఓ వ్యక్తి వచ్చి ఎండీ రాజ్యలక్ష్మితో ఒకరికి సర్జరీ చేయాలి అని చెబుతాడు. అప్పుడామె మనోహర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి.. ఇంటర్వ్యూకు వచ్చిన దివ్యను ఆ పేషెంట్‌కు సర్జరీ చేయమని చెప్పు అంటుంది. దీనికాయన 'రిస్క్ ఏమో మేడం. తను ఫ్రెషర్ కదా. పేషెంట్‌కు ఏమైనా ప్రమాదం ఉంటుందేమో' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'చెప్పాలింది నేను. చేయించాల్సింది నువ్వు. ఏదైనా జరిగేది పేషెంట్ తలరాత మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ చేతిలో కాదు. ముందు చెప్పింది చేయండి' అంటుంది.

దివ్య పనికి షాకైపోయిన తల్లి

దివ్య పనికి షాకైపోయిన తల్లి

పక్కనే ఉండి దివ్య వాళ్ల మాటలను చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి.. దివ్య ఈ ఆపరేషన్ చేయలేను అంటే ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోమని చెప్పు అంటుంది. దీంతో ఆమె లైన్‌లోకి వచ్చి లేదు మేడం నేను చేస్తాను అంటుంది. దీంతో 'వెరీగుడ్ దివ్య. పెళ్లి సర్జరీ మొదలుపెట్టు ఇంతలో సీనియర్ డాక్టర్ వచ్చి జాయిన్ అవుతారు' అని చెప్తుంది. ఆ వెంటనే దివ్య తులసి దగ్గరికి వెళ్లగా.. ఏమైందమ్మా అని అడుగుతుంది. దీంతో దివ్య 'నువ్వు అనుకున్నట్టుగా గొడవపెట్టారు. అయితే వెళ్ళిపోమని కాదు.. సర్జరీ చేయమని గొడవ పెట్టారు. అందుకే ఒప్పేసుకున్నాను' అంటుంది. దీంతో తులసి ఇంటర్వ్యూ రోజే సర్జరీ ఏంటి దివ్య అనడంతో కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి సర్జరీకి ఒప్పుకున్నాను అమ్మ అంటుంది.

తులసి బ్లెస్సింగ్స్.. గొడవతో

తులసి బ్లెస్సింగ్స్.. గొడవతో

తులసి మాటలకు దివ్య 'యూనివర్సిటీలో చదువుకున్నప్పుడే నేను సర్జరీలో పర్ఫెక్ట్ అయ్యాను' అని చెబుతుంది. దీంతో తులసి 'ఒకసారి ఆలోచించు దివ్య. పొరపాటు ఏదైనా జరిగితే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం' అంటుంది. అప్పుడు దివ్య తులసి పాదాలకు నమస్కరించుకొని నన్ను దీవించు అమ్మ అని అంటుంది. తర్వాత ఆపరేషన్ చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక పేషెంట్‌కు ఆపరేషన్ చేయమంటే ముందు డబ్బు కట్టమని ఆస్పత్రి సిబ్బంది గొడవ చేస్తూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి వచ్చి గొడవలో భాగం అవుతుంది.

ఆస్పత్రి వాళ్లకు తులసి క్లాస్

ఆస్పత్రి వాళ్లకు తులసి క్లాస్

డబ్బు లేకుండా ఆపరేషన్ చేయనన్న సిబ్బందితో తులసి 'సర్జరీ చేయండి.. ఈ లోపు డబ్బు కడతారు కదా' అంటుంది. దీనికి వాళ్లు ఒప్పుకోరు. అప్పుడు పెద్దాయన 'అయ్యా నా మాట వినండి అయ్యా' అని డాక్టర్ కాళ్లు పట్టుకుంటారు. దీంతో తులసి 'లేవండి పెద్దాయన. రాక్షసుల కాళ్ళ మీద పడితే మనసు కలుగుతుందేమో.. ఇలాంటి వాళ్ళ కాళ్ళ మీద పడితే ఏమీ రాదు. డాక్టర్లు దేవుడితో సమానం.

కనిపించని దేవుడు ప్రాణం పోస్తే కనిపించే ఈ డాక్టర్ దీవులు పున: జన్మను ఇస్తారు. మీరు అన్నట్టు ఈలోపు వాళ్ళ కొడుకు వచ్చేలోపు ఆ ముసలావిడ ప్రాణాలు పోతే ఆ డబ్బు కట్టించుకుని ప్రాణాలు పోస్తారా' అంటుంది. అప్పుడు తులసి మాటలను రాజ్యలక్ష్మి, ఆమె కొడుకు ఇద్దరు వింటూ ఉంటారు.

తులసి నిరసన.. ఎండీ ప్లాన్

తులసి నిరసన.. ఎండీ ప్లాన్

ఆస్పత్రి వాళ్లు ఎంతకీ వినకపోవడంతో తులసి అక్కడే కూర్చుని దీక్ష చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి రాజ్యలక్ష్మి వస్తుంది. పరువు పోతుందని గ్రహించిన ఆమె ఉద్దేశపూర్వకంగానే అక్కడే ఉన్న ఒక అతను చెంప పగలగొడుతుంది. అంతేకాదు, 'అంతా చూస్తున్నాను.. అంతా వింటున్నాను. డాక్టర్ వృత్తికే కలంకం తెప్పిస్తావా. మీకు మనిషి ప్రాణాలు కంటే డబ్బు ఎక్కువా? ఈ హాస్పిటల్ నాది ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సింది నేను నువ్వు కాదు. ఇప్పుడే వెళ్లి ఆ పేషెంట్‌కు ఆపరేషన్ మొదలు పెట్టు' అని యాక్టింగ్ చేయగా.. అందరూ తులసికి క్లాప్స్ కొడతారు.

తులసి టార్గెట్.. దివ్య సెలెక్ట్

తులసి టార్గెట్.. దివ్య సెలెక్ట్

రాజ్యలక్ష్మి నాటకం ఆడుతుందని తెలియని తులసి.. ఆమెను పొగుడుతూ ఉంటుంది. అప్పుడామె 'మీరు ఎవరు? ఏ పేషెంట్ తాలూకా' అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి నిజం చెప్పబోతుండగా ఆమెకు ఫోన్ వస్తే మాట్లాడుతూ వెళ్లిపోతుంది. అనంతరం రాజ్యలక్ష్మి 'మరొకసారి ఆమె ఈ హాస్పిటల్‌కు రావడానికి వీల్లేదు. ఆమెనే కాదు ఆమె తరపున ఎవరు రావడానికి వీల్లేదు. తను మన శత్రువు' అని చెబుతుంది. ఆ తర్వాత సంజయ్, రాజ్యలక్ష్మి ఇద్దరు జరిగిన విషయాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత మనోహర్ వచ్చి 'మీరు కరెక్ట్‌గా ఆలోచించారు మేడం దివ్య చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది' అని చెబుతుంది. ఆ తర్వాత దివ్యను పిలిచి 'కంగ్రాట్స్ దివ్య.. నువ్వు ఈ జాబ్‌కు సెలెక్ట్ అయ్యావు' అని చెప్తుంది.

 దివ్య ముందు మరో నాటకం

దివ్య ముందు మరో నాటకం

తనను సెలెక్ట్ చేసిన తర్వాత దివ్య థాంక్స్ అమ్మ అని అనుకుంటుంది. దీంతో మీ అమ్మ అంటే అంత ఇష్టమా అని ఆమె ప్రశ్నించగా.. ప్రాణం అని అంటుంది. తర్వాత రాజ్యలక్ష్మి ఆస్పత్రి రెగ్యూలేషన్స్ గురించి చెప్తూ.. 'పేషెంట్లను పంపిస్తే మీకు నెలకి వేళ్లలో లక్షలు జీతాలు ఎవరు ఇస్తారు? పేషెంట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నవి లేనివి అన్ని కలిపి నాలుగు ఐదు టెస్టులు రాసి వేలల్లో కుదిరితే లక్షల్లో డబ్బులు గుంజాలి. అవసరం ఉన్నా లేకపోయినా ఆ పేషెంట్‌కు ప్రమాదం ఉంది అని చెప్పి సీన్ క్రియేట్ చేసి వాళ్ళు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేలా చేయాలి' అంటుంది. దీంతో దివ్య నేనలా చేయలేను అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి మాట మార్చి నిన్ను టెస్ట్ చేశా అంటుంది. ఇక, ఇందులోకి కొత్త హీరో ఎంటరయ్యాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X