Intinti Gruhalakshmi Today Episode: అభిని వెతకడంలో నందూ ఫెయిల్.. తులసికి ఎస్సై బంపర్ ఆఫర్

చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి ఎక్కడున్నా తెలుసుకోవాలని తులసి నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ఉదయాన్నే రెడీ అయి వెళ్తుంటుంది. అప్పుడు నందూ ఆమెను అడ్డుకుంటాడు. అతడికి అంకితతో పాటు ఇంట్లో వాళ్లంతా మద్దతు తెలుపుతారు. తులసిని ఇంట్లోనే ఉండమని చెబుతారు. కానీ, ఆమె మాత్రం అస్సలు వినకుండా వెళ్లిపోతుంది. అంతేకాదు, పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి.. అక్కడ దర్నా చేయాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం ఏర్పాట్లు చేస్తుండగా ఎస్సై వస్తాడు. ఆ సమయంలో ఆయనతో తులసి వాదనకు దిగి సవాల్ చేస్తుంది.

అభి కోసం నందూ ప్రయత్నం ఫ్లాప్

అభి కోసం నందూ ప్రయత్నం ఫ్లాప్

అభిని వెతకడంలో తన ప్రయత్నం తాను చేస్తానని చెప్పిన నందూను పరందామయ్యతో పాటు ఇంట్లో వాళ్లు ఏమైందని అడుగుతారు. దీనికతడు 'సీఐకి కాల్ చేశాను.. ఆయన కాల్ గురించే ఆలోచిస్తున్నాను' అని సమాధానం చెబుతాడు. దీనికి పరందామయ్య మరొకసారి నువ్వైనా ఫోన్ చేయిరా అంటాడు. మనమే చేయడం మంచిది కాదేమో అని నందూ బదులిస్తాడు. ఇంతలో సీఐ నందూకు ఫోన్ చేసి 'సారీ నందూ.. నేను నీకు ఈ పని చేయలేకపోతున్నాను. మీరు ఈ కేసు విషయంలో పట్టించుకోవద్దంటూ నాకు మెత్తగా వార్నింగ్ ఇచ్చాడు ఆ ఎస్సై' అని చెబుతాడు.

తులసితో వెళ్లేందుకు అంకిత రెడీ

తులసితో వెళ్లేందుకు అంకిత రెడీ

సీఐ ఫోన్ చేసి తన వల్ల కాదు అని చెప్పడంతో నందూకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అదే సమయంలో దీని గురించి విన్న ఇంట్లో వాళ్లు కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు అంకిత 'నిజంగా అభి తప్పు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి కానీ.. ఇలా చేయడం ఏంటి' అంటుంది. అప్పుడు శృతి 'అభిని విడిపించడంలో మన ప్రయత్నం ఫలించలేదని తులసి ఆంటికి చెప్పాలి కదా' అంటుంది. కానీ, లాస్య వాళ్లకు అడ్డు చెబుతుంది. అప్పుడు అంకిత 'నేను తప్పు చేశాను.. తులసి ఆంటితో పాటు అభిని వెతకడానికి నేను కూడా వెళ్లాల్సింది' అంటుంది.

మీడియా ముందు తులసి బాధగా

మీడియా ముందు తులసి బాధగా

కనిపించకుండా పోయిన కొడుకు కోసం పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేస్తున్న తులసి దగ్గరకు మీడియా ప్రతినిధులు వస్తారు. 'మీ అబ్బాయి.. మర్డర్ కేసులో తప్పించుకొని తిరుగుతున్నాడు కదా' అని అడుగుతారు. దీనికామె 'లేదు.. ఎస్సై అరెస్ట్ చేసి నా కొడుకును కళ్లకు చూపించడం లేదు. నా కొడుకును కళ్లకు చూపించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి' అంటుంది. ఇదంతా చూసిన కానిస్టేబుల్ 'బయట టెంట్ దగ్గర మీడియా హడావుడి ఎక్కువ ఉంది సార్' అని ఎస్సైకు చెబుతాడు. కానీ, ఆయన మాత్రం అభిని అరెస్ట్ చేయలేదు కదా అని లైట్ తీసుకుంటాడు. అంతేకాదు, 'ఈ రవీందర్ ఎప్పటికీ వెనకడుగు వేయడు.. ఆ అభి గాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని అనుకుంటాడు.

 అభి పొరపాటు చేశాడన్న నందూ

అభి పొరపాటు చేశాడన్న నందూ

ఇక, తన ప్రయత్నం విఫలం అవడంతో నందూ.. తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అనసూయ వచ్చి నీతో ఒక విషయం మాట్లాడొచ్చా అని అడుగుతుంది. ఆ తర్వాత 'అభి కనబడకుండా పోయాడని ఇంట్లో అందరం కంగారు పడుతున్నాం. తండ్రివి అయి ఉండి కూడా ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? ఇంట్లో కూర్చోవడం కాదు.. బయటికి వెళ్లు ఏదో ఒకటి చేయి. అభి ఎక్కడున్నా నిన్నే తలుచుకుంటూ ఉంటాడు. వెళ్లరా వెళ్లి వాడిని కాపాడు' అంటుంది. దీనికి నందూ 'తప్పు చేసిన వాడు ఎస్సై కాళ్లు పట్టుకోవాలి కానీ.. కాలర్ పట్టుకోవడం ఏంటి? అందుకే ఆ ఎస్సై వాడిని కనిపించకుండా చేశాడు' అంటాడు.

అభి శవం కనిపించినా నీకు చాలా

అభి శవం కనిపించినా నీకు చాలా


దీక్ష చేస్తున్న తులసి దగ్గరికి వచ్చిన ఎస్సై 'అలసిపోయావా మదర్ ఇండియా' అని అడుగుతాడు. దీనికామె ఆడదానికి ఓపిక ఎక్కువ సార్ అంటుంది. అప్పుడు ఎస్సై 'మగాడికి పొగరు ఎక్కువ. అందులోనూ నాలాంటి మగాడికి అది ఇంకాస్త ఎక్కువ. మీడియా వాళ్లు నీ మొహం మీద మైకులు పెట్టేసరికి అది నీ గొప్పదనం అనుకోకు' అంటాడు. దీనికి తులసి 'నా కొడుకు కోసం నేను ఇదంతా చేస్తున్నాను' అని చెబుతుంది. దీనికి ఎస్సై 'వాడు ప్రత్యక్షంగా కనిపించాలా? లేక వాడి శవం కనిపించినా చాలా' అంటాడు. దీంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఎస్సైకు తులసి ఆఫర్.. రిటర్న్ గిఫ్ట్

ఎస్సైకు తులసి ఆఫర్.. రిటర్న్ గిఫ్ట్

ఎస్సై మాట్లాడిన తర్వాత తులసి 'మీకొక ఆఫర్ ఇద్దామని అనుకుంటున్నాను సార్' అంటుంది. దీనికాయన ఏంటి ఆ ఆఫర్ అంటాడు. అప్పుడామె 'ఇప్పుడు అభిని పట్టుకున్నానని చెప్పి తీసుకొని అరెస్ట్ చేయండి. నేను ఇక మీ జోలికి రాను' అంటుంది. దీంతో ఎస్సై 'నాకే ఆఫర్ ఇస్తున్నావా. చూడు మదర్ ఇండియా.. పెద్ద మనసుతో నువ్వు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చావు. నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అందుకే అరగంటలో నువ్వు టెంట్ తీసేసి వెళ్లిపో. రెండు రోజుల్లో నీ అభిని మీడియా ముందు నిలబెడతా' అంటూ తులసికి మరో ఆఫర్ ఇస్తాడు.

నన్ను నేనే నమ్ముకుంటానంటూ

నన్ను నేనే నమ్ముకుంటానంటూ

ఎస్సై ఇచ్చిన ఆఫర్‌ను తులసి అస్సలు నమ్మదు. పైగా 'దానికి రెండు రోజులు ఎందుకు.. ఇప్పుడే తీసుకురండి' అంటుంది. అప్పుడు ఎస్సై 'నేను నీకు భయపడి ఈ ఆఫర్ ఇవ్వడం లేదు. నమ్మకం నీది.. ఆఫర్ నాది.. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం' అంటాడు. దీంతో 'నేను మిమ్మల్ని నమ్మడం కన్నా.. నన్ను నేను నమ్ముకోవడమే బెస్ట్' అని అంటుంది తులసి. ఆ తర్వాత తులసికి అంకిత ఫోన్ చేస్తుంది. అప్పుడు తులసి 'నాకు ఈ రాత్రికి రావడం కుదరదు. ఇంట్లో వాళ్లకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. అభి గురించి దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X