Intinti Gruhalakshmi Today Episode: దివ్య ప్రేమలో విక్రమ్.. ఆ హీరో ఆమె కొడుకే.. పెళ్లికి తులసి ఓకే
తరాలు మారుతున్నప్పటికీ తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రికి ఇంటర్వ్యూకు వెళ్లిన దివ్యను ఓ పేషెంట్‌కు సర్జరీ చేయమని అడుగుతారు. ఈ విషయం తులసితో చెప్పగా ఆయన ఆశీర్వదించి పంపిస్తుంది. అనంతరం అదే ఆస్పత్రిలో బిల్ కట్టలేదని సర్జరీ చేయకపోవడంతో తులసి వాళ్లకు ఎదురు తిరుగుతుంది.
అంతేకాదు, అక్కడే కూర్చుని నిరసన తెలుపుతుంది. దీంతో ఎండీ రాజ్యలక్ష్మి దిగొచ్చి మంచి నటిస్తూ నాటకం ఆడుతుంది. అనంతరం దివ్య సర్జరీ కరెక్టుగా పూర్తి చేయడంతో ఆమెకు ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత సీరియల్‌లో కొత్త కుర్రాడిని పరిచయం చేశారు.

అమ్మాయికి క్లాస్ పీకిన విక్రమ్
విక్రమ్ సీరియల్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఓ అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని తన తల్లితో రోడ్డు మీదనే గొడవ పడుతుంటుంది. దీంతో వాళ్ల అమ్మ 'వద్దమ్మా.. నేను చెప్పేది విను. వీడు అస్సలు మంచోడు కాదు. నీ మంచి కోసమే చెప్తున్నాను' అని బ్రతిమాలుతుంది.
కానీ, ఆ అమ్మాయి మాత్రం అతడినే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపడుతుంది. ఇంతలోనే విక్రమ్ అక్కడికి వచ్చి 'ఏంటి వీడిని ప్రేమించావా' అని ప్రశ్నిస్తాడు. దీనికా అమ్మాయి 'వీడిని కాదు అతన్ని ప్రేమించాను' అని అంటుంది. దీంతో విక్రమ్ 'వీడు అంటే కోపం వచ్చింది.. మరీ మీ అమ్మను బొమ్మ అన్నప్పుడు రాలేదా' అని ఆమెకు క్లాస్ పీకుతాడు.

మోసం బయటపెట్టిన విక్రమ్
ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత విక్రమ్ ఆ కుర్రాడితో 'ఏంటి తమ్ముడూ నిజంగానే ఈ అమ్మాయిని ప్రేమించావా' అని అడుగుతాడు. దీనికతడు 'తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను' అంటాడు. దీంతో విక్రమ్ వెంటనే కత్తిని పట్టుకుని వచ్చి అతడి మెడపై పెడతాడు.
అంతేకాదు, 'ఈ క్షణం నుంచి ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తానంటే.. ఈ క్షణమే ప్రాణాలు తీసుకుంటాను ఇచ్చేయ్ బాసు' అంటాడు. దీంతో ఆ కుర్రాడు 'ఇది ఉద్యోగం చేస్తే తిని కూర్చుందాం అనుకున్నాను.
కానీ దీని కోసం ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ నా దగ్గర లేదు' అని చెప్తాడు. దీంతో ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఆ తర్వాత విక్రమ్ ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోమంటాడు.

తల్లికి ఫోన్... కాపాడిన దివ్య
ఇంటర్వ్యూతో పాటు సర్జరీ టెస్టులో పాసైన దివ్యకు రాజ్యలక్ష్మి ఉద్యోగం ఇస్తుంది. ఆ వెంటనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దివ్య 'నాకు ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి' అని ఆమెకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెబుతుంది. దీంతో తులసి ఆనంద పడుతూ ఉంటుంది.
ఆ తర్వాత తులసిని ఎక్కడ ఉన్నావ్ అమ్మ అనగా 'మీ నాన్న ఎందుకో ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు. అందుకే వచ్చేసాను' అని అంటుంది. ఆ తర్వాత దివ్య ఇంటికి వెళ్తుండగా స్కూల్ పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. కానీ, అంతలోనే ఓ కారు వేగంగా దూసుకొస్తుంది. అప్పుడు ఆ పిల్లలపై మురికి నీళ్లు పడకుండా దివ్య కాపాడుతుంది.

దివ్యను చూసి ఫ్లాటైన హీరో
పిల్లలపై నీళ్లు పడకుండా కాపాడిన తర్వాత దివ్య కారు డ్రైవర్‌తో గొడవకు దిగుతుంది. అప్పుడు అదే కారులో ఉన్న విక్రమ్ ఆమెను అలా చూస్తూ ఉండిపోతాడు. అలా చాలా సేపు సీన్‌ను సాగదీశారు. అనంతరం పిల్లలు సంతోషంతో దివ్యను హగ్ చేసుకోవడంతో ఆమె పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది.
అది చూసి విక్రమ్ సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య ఆటో ఎక్కి వెళ్లిపోవడంతో విక్రమ్ దాని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ, ఆమె మాత్రం దొరకదు. అప్పుడు 'అందమైన అమ్మాయి అలా కనిపించింది ఇలా వెళ్ళిపోయింది' అనుకుంటూ ఉంటాడు.

దివ్యకు పెళ్లి సంబంధంతో
నందూ ఫోన్ చేయడంతో వెళ్తున్న తులసి ఎందుకు ఈయన నన్ను తొందరగా రమ్మని పిలిచారు అనుకుంటూ కెఫే దగ్గరికు వెళ్తుంది. అప్పుడు నందూ.. తులసిని వాళ్ళ ఫ్రెండ్‌కు ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు లాస్య 'నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి తులసి. దివ్య మ్యారేజ్ సెట్ అయింది. వాళ్ళ అబ్బాయితోనే తాంబూలాలు పుచ్చుకోవడమే' అని చెబుతుంది.
దీంతో తులసి షాక్ అవుతుంది. అప్పుడామె 'ఏంటి దివ్య తో మాట్లాడకుండా.. పెళ్లిచూపులు జరగకుండా.. నాకు చెప్పకుండా అలా ఎలా సెటిల్ చేస్తారు' అని ప్రశ్నిస్తుంది. దీంతో శరత్ 'ఆవిడ ఏదో జోక్ చేస్తుంది మేడం. మేము మీ అమ్మాయిని ఢిల్లీలో చూసాము. మీ అమ్మాయి మా ఇంటి కోడలు అయితే బాగుంటుందని అనుకున్నాము' అని అంటాడు.

దివ్య పెళ్లికి తులసి సిగ్నల్
శరత్ మాటలకు తులసి 'దివ్య మొన్ననే చదువు పూర్తి చేసింది. అప్పుడే పెళ్లా? ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తోంది. ఉద్యోగం చేస్తే తనకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది' అంటుంది. అప్పుడు శరత్ 'దివ్య తల్లిగా మీ మాటను గౌరవిస్తున్నాము. మా అబ్బాయి మీ ఇంటికి పిలుచుకుని వస్తాము. నచ్చితేనే చూడండి.
కానీ, పెళ్లి చూపులకు కాదు జస్ట్ గెట్ టుగెదర్‌లా ప్లాన్ చేద్దాము' అని అంటాడు. దీంతో తులసి ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో ఆమె ఏం చెప్తుందో అని అంతా ఆసక్తిగా చూస్తారు. ఇక, తులసి సరే అనడంతో అందరూ సంతోషిస్తారు.

రాజ్యలక్ష్మి కొడుకే ఈ విక్రమ్
ఇక, దివ్య ఆలోచనలతో ఇంటికి వెళ్లిన విక్రమ్ వాళ్ళ అత్తయ్య మామయ్య మాట్లాడుకుంటూ ఉండగా వెళ్లి వాళ్లతో సరదాగా గడుపుతాడు. ఆ తర్వాత లోపలికి వెళ్తాడు. ఆ సమయంలో తల్లి రాజ్యలక్ష్మి (దివ్య ఆస్పత్రి ఎండీ) అక్కడ కూర్చుని ఉంటుంది. ఆమె ఉన్నా విక్రమ్ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. దీంతో ఏమైందని ప్రశ్నిస్తుంది. కానీ, ఏమీ చెప్పకుండానే కాళ్లకు నమస్కరించి వెళ్లిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











