Intinti Gruhalakshmi Today Episode: తులసికి ఊహించని వ్యక్తుల సపోర్ట్.. గాయత్రికి నిజం తెలియడంతో!

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నందూ చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతాయి. దీంతో అంకిత.. తులసితో వెళ్లినా పని జరిగేదని అనుకుంటుంది. మరోవైపు, పోలీస్ స్టేషన్ ముందు తులసిని మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారు. ఆ సమయంలో తన కొడుకును అరెస్ట్ చేసి.. ఎక్కడో దాచి పెట్టారని ఎస్సైపై ఆరోపణలు చేస్తుంది. ఆ తర్వాత ఆమె దగ్గరకు వచ్చిన ఎస్సై.. దీక్షను విరమిస్తే రెండు రోజుల్లో అభిని తీసుకొస్తానని చెబుతాడు. కానీ, దీనికి తులసి అంగీకరించదు. తనపై తనకు నమ్మకం ఉందని చెబుతుంది.

అభిని మరింతగా కొట్టించిన ఎస్సై

అభిని మరింతగా కొట్టించిన ఎస్సై

అంకితకు సర్ధి చెప్పిన తులసి పోలీస్ స్టేషన్ ముందు దీక్షను కంటిన్యూ చేస్తుంటుంది. ఇక, అభిని బంధించిన ఎస్సై అతడిని తీవ్రంగా కొట్టిస్తాడు. అంతేకాదు, 'ఏరా బంగారం.. నీకు ఇంకా పొగరు తగ్గినట్టు లేదే. వీడికి మసాజ్ సరిపోవట్లేదు. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. కొడుకు ఇక్కడ ఏడుస్తున్నాడు. దీక్ష చేస్తూ నీ తల్లి స్టేషన్ ముందు ఏడుస్తుంది' అని అభితో చెబుతాడు. దీనికి అతడు 'మా మామ్ దీక్ష చేస్తుందంటే నీకు మూడిందని అర్థం. నన్ను వదిలే వరకు తను నిన్ను వదలదు. ఎప్పటికైనా నువ్వు తలొగ్గాల్సిందే' అని అంటాడు.

తులసిని దెబ్బకొట్టాలని ఎస్సై ప్లాన్

తులసిని దెబ్బకొట్టాలని ఎస్సై ప్లాన్

అభితో మాట్లాడిన తర్వాత ఎస్సై 'అవునా.. మీ అమ్మ నన్ను అంత ఇబ్బంది పెడుతుందా? సరే ఉండు.. ఇప్పుడే దాని టెంట్ పీకించి దాన్ని అక్కడి నుంచి తరిమేయిస్తా చూడు' అని కానిస్టేబుల్ కు ఫోన్ చేస్తాడు. అప్పుడు 'ఆ తులసి టెంట్ పీకించి.. అక్కడి నుంచి తరిమేయండి. దాన్ని వీడియో తీసి నాకు పంపించండి. దాని కొడుకుకు చూపిస్తా' అని చెబుతాడు. దీంతో దీక్ష మానుకొని ఇంటికి వెళ్లిపోండి అని కానిస్టేబుల్స్ తులసి టెంట్ దగ్గరికి వెళ్లి తనకు చెబుతారు. దీంతో నాకొడుకును చూపించేవరకు నేను ఇక్కడి నుంచి కదలను అంటుంది తులసి.

తులసికి అండగా మీడియా చానెళ్లు

తులసికి అండగా మీడియా చానెళ్లు

ఎంత చెప్పినా తులసి వినకపోయే సరికి ఆ కానిస్టేబుల్స్ 'మీ టెంట్ పీకి ఇక్కడి నుంచి పంపించాల్సి ఉంటుంది. మీకు రెండు నిమిషాలే టైమ్ ఉంది' అంటారు. దీనికి తులసి 'నా కొడుకును అప్పగించే వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు' అంటుంది. దీంతో టెంట్ పీకేసేందుకు అక్కడికి పోలీసులు రాబోతారు. వెంటనే మీడియా వాళ్లు అక్కడికి వస్తారు. దీంతో పోలీసులు భయపడి లోపలికి వెళ్లిపోతారు. అప్పుడు మీడియా వాళ్లంతా 'మీ పోరాటంలో మీకు మీడియా ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది' అని చెబుతారు. దీంతో తులసి సంతోషిస్తుంది. తర్వాత ఎస్సై ఫోన్ చేసి ఏమైందని అడగ్గా కానిస్టేబుల్లు అక్కడ జరిగిన విషయం చెబుతారు. దీంతో ఎస్సై కోపంగా కాల్ కట్ చేస్తాడు. అది చూసిన అభి సంతోషంగా నవ్వుతాడు.

లాస్య మాటను పట్టించుకోని అంకిత

లాస్య మాటను పట్టించుకోని అంకిత

మరోవైపు అంకిత ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య వస్తుంది. 'అభి గురించి టెన్షన్ పడకు. మీ అంకుల్ ఎలాగైనా అభిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైలేవల్‌లో మాట్లాడుతున్నారు. ఆ తులసి పేరుకే బయట తిరుగుతోంది కానీ.. వేస్ట్' అంటూ తులసిపై లేనిపోనివి చెప్పేందుకు తెగ ప్రయత్నిస్తుంది. కానీ, అంకిత అవేవీ వినదు. అప్పుడు అంకిత 'తులసి ఆంటి నాకు ఫోన్ చేసింది. రేపటికల్లా అభిని వెంట పెట్టుకొని తీసుకొస్తా అని చెప్పింది' అని అంటుంది. దీంతో 'నిన్ను ఓదార్చడం కోసం అవన్నీ ఊరికే చెబుతుంది' అంటుంది లాస్య. అప్పుడు అంకిత 'తులసి ఆంటి మీద నాకు నమ్మకం ఉంది' అని చెబుతుంది. దీంతో లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇంట్లో వాడివేడి చర్చ జరగడంతో

ఇంట్లో వాడివేడి చర్చ జరగడంతో

అభి గురించి ఏమీ తెలియకపోవడంతో ఇంట్లో వాళ్లంతా టెన్షన్‌గా కూర్చుంటారు. ఆ సమయంలో 'ఎప్పుడు ఫోన్ చేసినా.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తులసి ఆంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది' అంటుంది అంకిత. దీంతో నందూ 'బాధ్యత లేకపోవడం అంటే ఇదే. తనకేమైనా అయితే ఏమంటారు. మగాడివి ఇంట్లో ఉన్నవాడివి నువ్వు చూసుకోవా అంటారు' అని అంటాడు. అప్పుడు లాస్య 'లేకపోతే అభిని వెతుక్కున్నట్టే.. ఇప్పుడు తులసిని కూడా వెతుక్కోవాలి' అంటుంది. అప్పుడు అనసూయ 'అసలు నీకు తులసి గురించి మాట్లాడే హక్కు లేదు' అంటుంది.

ఎస్సైకు ధీటుగా బదులిచ్చిన తులసి

ఎస్సైకు ధీటుగా బదులిచ్చిన తులసి

ఉదయం కాగానే ఎస్సై పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. వెంటనే తులసి దగ్గరికి వెళ్తాడు. హేయ్.. పోనీలే కదా అని చూస్తుంటే హద్దు దాటుతున్నావు అంటాడు. దీంతో తులసి 'నేను దాటడం లేదు ఎస్సై గారు. మీరే దాటిస్తున్నారు. మీరు ఇంతలా మారిపోయారు ఏంటి? జీపు దిగగానే స్టయిల్‌గా స్టేషన్‌కు వెళ్లిపోయేవారు. ఇప్పుడేంటి జీపు దిగగానే నేరుగా నా వైపు వస్తున్నారు. కంగారు మొదలైందా? ఎస్ఐ గారు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీ పరువును నిలబెట్టుకోండి' అంటుంది. దీంతో 'నేను నీ ఆఫర్‌కు ఒప్పుకోవాలో.. నువ్వు నా ఆఫర్‌కు ఒప్పుకోవాలో.. ఇది విన్నాక చెప్పు' అంటాడు ఎస్సై.

నన్ను శాడిస్టుగా మార్చొద్దు అంటూ

నన్ను శాడిస్టుగా మార్చొద్దు అంటూ

అందులో అభిని కొడుతున్న వీడియో ఉంటుంది. అభి ఏడుస్తుండటం చూసి తులసి తట్టుకోలేకపోతుంది. అప్పుడు ఎస్సై 'ఎప్పుడో చిన్నప్పుడు విని ఉంటావు నీ కొడుకు ఏడుపు. నా పుణ్యమాని ఇప్పుడు వినే అదృష్టం దక్కింది. ఎలా ఉంది? ఇప్పటి వరకు నేను ఇగోయిస్టును. ఇప్పుడు శాడిస్ట్‌గా మారుస్తున్నావు. నువ్వు చీమవు. చీమలాగే ఉండు. పాములా బుసగొట్టకు. వెనక్కి తగ్గు' అంటాడు. దీనికి తులసి 'నేను ఈ స్టేజ్‌లో వెనక్కి తగ్గితే నా అభిని మరింత ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది. మంచికి ఎప్పుడూ ఓటమి లేదు. నా అభిని నా కళ్ల ముందు నిలబెట్టడానికి రెడీ అయిపోండి' అంటుంది. దీంతో చూద్దాం.. అదీ చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఎస్సై.

గాయత్రికి తెలిసిన అభి న్యూస్

గాయత్రికి తెలిసిన అభి న్యూస్

గాయత్రి ఆపరేషన్లు చేసి చిరాకు పడుతుంది. ఇంతలో తన రూమ్‌కు వెళ్లి టీవీ ఆన్ చేస్తుంది. అందులో తులసి స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతున్న వార్తను చూస్తుంది. ఇంత జరుగుతున్నా నాకు ఎవ్వరూ ఏం చెప్పలేదు ఏంటి అని అంకితకు ఫోన్ చేస్తుంది. కానీ.. అంకిత ఫోన్ కలవదు. ఆ తర్వాత లాస్యకు కాల్ చేస్తుంది. 'మీ ఇంట్లో పిల్లి పిల్లలు పెట్టినా ఫోన్ చేసి చెప్పేదానివి. నా అల్లుడు కనిపించకుండా పోతే మాత్రం ఆ విషయం చెప్పవా' అని సీరియస్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X