Intinti Gruhalakshmi Today Episode: తులసి కోసం రంగంలోకి జీకే.. కమిషనర్‌ ఎంట్రీతో కథలో బిగ్ ట్విస్ట్

భారతదేశంలోని అన్ని భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభిని ఎస్సై ఎక్కువగా కొట్టిస్తూ ఉంటాడు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్స్‌‌తో తులసి దీక్ష చేసే టెంట్‌ను తీసేయమని చెబుతాడు. కానీ, అప్పుడు మీడియా ప్రతినిధులు రావడంతో వాళ్లంతా వెనక్కి తగ్గుతారు.

ఆ విషయం ఎస్సైతో చెప్పడంతో ఆయనకు షాక్ తగులుతుంది. ఇక, అభి గురించి ఇంట్లో చర్చ జరుగుతుంది. అనంతరం ఎస్సైతో తులసి తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతుంది. అనంతరం తులసి దీక్ష గురించి టీవీలో చూసిన గాయత్రి.. లాస్యకు ఫోన్ చేసి ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

నిజం తెలిసి తులసిపై కోప్పడ్డ నందూ

నిజం తెలిసి తులసిపై కోప్పడ్డ నందూ


గత ఎపిసోడ్‌లో అభి కోసం తులసి పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేస్తుందని లాస్యకు ఫోన్ చేసి చెబుతుంది. దీంతో ఆమె కాల్ కట్ చేయగానే లాస్య కూడా మొబైల్‌‌లో ఆమెకు సంబంధించిన వీడియోలను చూస్తుంది. వెంటనే ఈ విషయాన్ని నందూకు చెబుతుంది. దీంతో అతడికి కోపం వస్తుంది. అంతేకాదు, మన కుటుంబ పరువును బజారుకు ఈడ్చిందని రెచ్చగొడుతుంది. దీంతో ఇప్పుడే వెళ్లి ఆమెను లాక్కొస్తాను అని అంటాడు నందూ. దీంతో వద్దు.. అది కూడా లైవ్ లోనే కనిపిస్తుంది అంటుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో చెబుతానంటే వద్దంటుంది లాస్య.

వీడియో చూసిన జీకే.. తులసికి హెల్ప్

వీడియో చూసిన జీకే.. తులసికి హెల్ప్


అక్షర తండ్రి జీకే టీవీలో తులసి దీక్ష చేస్తున్న విజువల్స్‌ను చూస్తాడు. ఆ వెంటనే కమిషనర్‌కు ఫోన్ చేస్తాడు. న్యాయం కోసం తులసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేస్తుందని చెబుతాడు. దీంతో ఆ పోలీస్ అధికారి 'అవును.. ఆ కేసును నేను చూశాను. తన కొడుకును దాచిపెట్టి పోలీస్ స్టేషన్ ముందు తనే దీక్ష చేస్తుందని మా వాళ్లు చెప్పారు' అంటాడు. అప్పుడు జీకే.. తులసి గురించి, ఆమె మంచితనం, నిజాయితీ గురించి ఆయనకు వివరించి చెబుతాడు. దీంతో 'ఈ కేసును నేను పర్సనల్‌గా టేకప్ చేస్తాను' అని ఆయనకు చెబుతాడు కమిషనర్.

గాయత్రి ఎంట్రీ.. తులసితో గొడవ పడి

గాయత్రి ఎంట్రీ.. తులసితో గొడవ పడి


దీక్ష చేస్తున్న తులసి దగ్గరికి గాయత్రి ఎంతో కోపంగా వెళ్తుంది. అక్కడ ఆమె పట్టుకున్న బోర్డును పడేస్తుంది. అంతేకాదు, 'ఎందుకు ఇలా నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు? నా అల్లుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని నాకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? ఎప్పుడూ నా కూతురుకు సంబంధించిన వార్తను పరాయి వాళ్లు చెబితే తెలుసుకోవాల్సిందేనా? గాల్లో దీపం పెట్టి ఆశగా చూస్తూ కూర్చోలేం తులసి. ఇది చేతగాని వాళ్లు చేసే పని. నేను ఎస్సై గారికి ఫోన్ చేస్తే చాలు.. వణుకుతూ నా ముందు అభిని నిలబెడతారు. రచ్చ చేయకు. టెంట్ పీకేసి ఇంటికి పదా. నువ్వు చూస్తూ ఉండు. నీ కళ్ల ముందే అభిని తీసుకొస్తాను' అంటూ గాయత్రి సీరియస్ అవుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

గాయత్రికి వార్నింగ్ ఇచ్చిన పోలీసు

గాయత్రికి వార్నింగ్ ఇచ్చిన పోలీసు


తులసితో మాట్లాడిన వెంటనే స్టేషన్ లోపలికి వెళ్లి ఎస్సైపై గాయత్రి విరుచుకుపడుతుంది. 'ఏమనుకుంటున్నారు మీరు నా గురించి. నేను, మా వారు ఇద్దరం ఈ సిటీలో ఫేమస్ డాక్టర్లం. మా అభి ఎక్కడ ఉన్నాడు' అంటుంది. దీనికాయన 'అయితే ఏంటి? మేము అతడి కోసమే వెతుకుతున్నాం. అభి దొరకగానే కబురు పెడతాం. ఇక్కడి నుంచి వెళ్లిపోండి. అభి.. అల్లుడు అంటూ ఇంకోసారి మాట్లాడితే లాకప్ వేస్తా. మళ్లీ బయటికి రాకుండా చేస్తా' అంటాడు ఎస్ఐ. దీంతో గాయత్రి మాట్లాడుతూ 'ఇప్పుడు వెళ్తున్నా. మళ్లీ వదిలిపెట్టేదే లేదు' అంటుంది.

నువ్వు దీక్ష చేసినా ఉపయోగం లేదు

నువ్వు దీక్ష చేసినా ఉపయోగం లేదు

ఎస్సైను భయపెడతానని గంభీరంగా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన గాయత్రి.. ఆయన వార్నింగ్ ఇవ్వడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడి నుంచి తులసి దగ్గరికి వస్తుంది. వచ్చీ రావడమే 'ఈ ఎస్సై మొండోడిలా ఉన్నాడు. ఆయనను డీల్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తోంది. అసలు ఏం చేసినా భయపడే వాడిలా కనిపించడం లేదు. అయినా దేనికీ లొంగని వాడు నీ దీక్షకు లొంగుతాడని ఎలా అనుకుంటున్నావు? నీకు ఇప్పటి వరకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఎలా సాధిస్తావు? నీ దీక్ష చూసి పోలీస్ కమిషనర్ దిగి వస్తాడని అనుకున్నావా' అని అంటుంది.

కమిషనర్ ఎంట్రీ.. వివరించిన తులసి

కమిషనర్ ఎంట్రీ.. వివరించిన తులసి


గాయత్రి మాట్లాడుతోన్న సమయంలోనే పోలీస్ కమిషనర్ కారు వచ్చి ఆగుతుంది. ఆయన కారు దిగి తులసి దగ్గరికి వస్తాడు. అప్పుడు తులసి 'సార్.. నేను ఒక సగటు తల్లిని. ఏ వ్యవస్థ మీద పోరాటం చేసే శక్తి, ఆసక్తి నాకు లేదు కమిషనర్‌ గారు. ఏ ఒక్కరి మనసు అయినా కరిగి సాయం చేయకపోతారా అనే చిన్న ఆశ మాత్రమే ఉంది. నా కోరిక అల్లా ఒక్కటే. ఒక్కసారి నా బిడ్డను చూపించండి. తప్పు చేస్తే చట్ట పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకోండి' అంటుంది. ఆ తర్వాత అసలు ఎస్సైతో అభికి ఏం జరిగిందో కమిషనర్‌కు వివరించి చెబుతుంది.

తులసికి హామీ... పారిపోయిన ఎస్సై

తులసికి హామీ... పారిపోయిన ఎస్సై


తులసి మాటలు విన్న తర్వాత కమిషనర్.. 'మీరు నాతో పాటు స్టేషన్‌లోకి రండి. ఎస్సై ముందే మ్యాటర్ తేల్చేద్దాం' అంటాడు. కానీ, తులసి మాత్రం 'నా బిడ్డను చూసేవరకు దీక్షను కొనసాగిస్తానని మాట తీసుకున్నాను సార్.. అందుకే స్టేషన్ లోపలికి రాలేను' అంటుంది. దీంతో 'సరే.. నేను మీ అబ్బాయిని చూపించే ప్రయత్నం చేస్తా' అని హామీ ఇస్తాడాయన. మరోవైపు కమిషనర్ గారు వచ్చారని కానిస్టేబుల్.. ఎస్సైకు చెబుతాడు. దీంతో తెగ టెన్షన్ పడతాడు. అప్పుడు కానిస్టేబుల్ 'మీ ఉద్యోగానికే ఎసరు వచ్చేటట్టుంది. వెంటనే తప్పు ఒప్పుకోండి సార్' అంటాడు. కానీ.. ఎస్సై అలా చేయనని పారిపోతాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ తులసికి అసలు విషయం చెప్పాలని అనుకుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X