Intinti Gruhalakshmi Today Episode: తులసిని ఒప్పించిన నందూ.. తెలిసిన విక్రమ్ గతం.. కథలో ట్విస్ట్
ఇండియాలోని చాలా భాషాల కంటే తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దిగాలుగా ఉన్న విక్రమ్‌ను రాజ్యలక్ష్మి పిలిచి ఏమైందని అడుగుతుంది. అప్పుడతను ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవట్లేదని, ఆ ఆస్పత్రిని మూసేయాలని అంటాడు. అనంతరం దివ్య కోసం ఇంట్లో వాళ్లందరూ వేచి చూస్తుంటారు.
ఆమె రాగానే లాస్య స్వీట్ ఇచ్చి పెళ్లి సంబంధం గురించి చెబుతుంది. దీంతో దివ్యకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత విక్రమ్‌కు ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చిన టీచర్ కాస్త ఓవర్ చేస్తుంది. అప్పుడతను ఎలాగోలా ప్లాన్ చేసి ఆమె నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు.

తులసే సెటిల్ చేసిందన్న లాస్య
దివ్య పెళ్లి విషయంపై తులసితో లాస్య, నందూ మాట్లాడుతుంటారు. అప్పుడు లాస్య 'నువ్వు అనుకుంటే జరగనిది ఏదీ లేదు తులసి. నందూకు కెఫే పెట్టించి తన లైఫ్‌ను సెటిల్ చేశావు. అలాగే దివ్యతో కూడా మాట్లాడి చూడు తప్పకుండా ఒప్పుకుంటుంది. ఏమంటావ్ నందూ' అని అంటుంది.
అప్పుడు నందూ 'అవును.. అంతా నీ ప్లానింగ్ వల్లే అందరూ సెటిల్ అయ్యారు' అనగా తులసి థాంక్యూ అంటుంది. తర్వాత నందూ 'ఆ మిగిలిన ఒకటి కూడా తీసేస్తే మన బాధ్యతలు తీరి పోతాయి. అయితే, పిల్లల మనసు మల్లెతీగ లాంటివి. స్మూత్‌గా డీల్ చేయాలి' అంటాడు.

మేము చెబితే ఒప్పుకోదు తులసి
లాస్య, నందూ మాటలకు తులసి 'పెళ్లి ఊసు ఎత్తగానే దివ్య ఏమనిందో విన్నారు కదా' అని అంటుంది. దీంతో నందూ 'దివ్య ఏదో తెలిసి తెలియక మాట్లాడుతోంది. నచ్చ చెబితే ఒప్పుకుంటుంది' అంటాడు. దీంతో తులసి అయితే మీరే చెప్పి చూడండి నాకేం అభ్యంతరం లేదు అని అంటుంది. దీంతో నందూ 'నేను చెప్పగలిగితే.. మా వల్ల అయ్యే పని అయితే.. ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది.
దివ్య మాట్లాడితే ఒప్పుకోదు. నువ్వు చెబితే ఒప్పుకుంటుంది. దివ్య నచ్చి వాళ్లే ఏకంగా స్వయంగా వచ్చి ఎంతో మర్యాదపూర్వకంగా అడిగారు' అంటాడు.

బిజినెస్ కోసం నాశనం చేయాలా
నందూ మాటలకు తులసి ఆలోచనలో పడుతుంది. తర్వాత లాస్య 'వాళ్లది బిజినెస్ ఫ్యామిలీ. వాళ్ళ బ్యాగ్రౌండ్ కూడా బాగా ఉంది. బిజినెస్ కూడా బాగుంటుంది' అంటుంది. దీంతో తులసి 'మన బిజినెస్ కోసం వాళ్లతో వియ్యం అందుకోమంటున్నారు అంతేనా. బిజినెస్ విషయం కోసం దివ్య లైఫ్‌ను నాశనం చేయమంటారా' అని ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య 'కాదు తులసి.. పెళ్లిచూపుల్లా కాకుండా మాములుగా వచ్చి వెళ్తామా అని చెప్పారు కదా. ఆ విషయం గురించి ఒకసారి ఆలోచించు' అని అంటుంది. దీంతో తులసి ఆలోచనలో పడగా వాళ్లిద్దరూ వెళ్లిపోతారు.

నడవలేని స్థితిలో విక్రమ్ తండ్రి
ఇంట్లో ఉన్న విక్రమ్ దగ్గరకు పనిమనిషి వచ్చి 'నాన్నగారు అసలు భోజనం చేయడం లేదు. టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు' అని చెబుతారు. దీంతో అతడు తండ్రికి తినిపించడం కోసం భోజనం తీసుకొని వెళ్తాడు. అప్పుడు విక్రమ్ 'నీ కన్నీళ్లను కూడా నువ్వు తుడుచుకోలేని పరిస్థితిని కొని తెచ్చుకున్నావు. ప్రేమగా చూసుకునే అమ్మను అవమానించావు ఆవేశపడ్డావు. ఇప్పుడు చూసావా ఎలా జరిగిందో' అని అంటాడు.
అప్పుడు విక్రమ్ వాళ్ళ నాన్న గతంలో జరిగిన విషయాలు తలచుకొని 'నష్టం ఎవరికో కాదు నాన్న నీకే. అదే విషయాన్ని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను' అంటూ రాజ్యలక్ష్మి మంచిది కాదని తన మనసులోనే అనుకుంటాడు.

నువ్వు మహారాజువు కాదు నాన్న
ఆ తర్వాత విక్రమ్ 'నాకు దేవత లాంటి అమ్మను ఇచ్చావు' అనగా వాళ్ల నాన్న 'అది దేవత కాదురా రాక్షసి' అనుకుంటాడు. తర్వాత విక్రమ్ ఎందుకు తిండి తినడం మానేసావ్ చెప్పు అనడంతో.. ఆయన కళ్ళ ముందు జరిగే ఘోరం చూడలేక తిండి మానేశాను అని మనసులోనే అనుకుంటాడు. తర్వాత మందులు వేసుకోవడం కూడా మానేశావు నాకు ఇది నచ్చడం లేదు నాన్న అని ఎమోషనల్ అవుతాడు. అంతేకాదు, విక్రమ్ 'నేను మహారాజుల బతుకుతుంటే నువ్వు మాత్రం ఏంటి నాన్న ఇలా ఇదంతా' అంటాడు. దీంతో వాళ్ల నాన్న 'నువ్వు మహారాజుల బతుకుతున్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒక అనాధవి రా ఆ విషయం నీకు ఎలా చెప్పాలి' అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు.

విక్రమ్ కోసమే తండ్రి రెండో పెళ్లి
చివరికి విక్రమ్ 'నాకోసం తిను నాన్న. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా లేకపోతే నేను ఎలా ఉండాలి' అని ఏడుస్తూ తండ్రికి తినిపిస్తూ ఉంటారు. తర్వాత ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చూపిస్తారు. చిన్నప్పుడు విక్రమ్ ఒక చోట కూర్చొని చనిపోయిన తల్లి కోసం బాధ పడుతూ ఉంటాడు. అంతేకాదు, తండ్రి మీద ధ్వేషం పెంచుకుంటూ ఉంటాడు.
ఆ సమయంలో తండ్రి సలహా మేరకు విక్రమ్ వాళ్ల నాన్న రాజ్యలక్ష్మిని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆమె వచ్చినప్పటి నుంచి విక్రమ్‌ను కన్నకొడుకులా చూసుకుంటుంది. అయినా ఆమె అంటే అతడికి నచ్చదు. ఓ సారి విక్రమ్‌కు ఒంట్లో బాలేకపోతే దేవుడికి పూజ చేసి బ్రతికిస్తుంది. అది చూసిన తర్వాత విక్రమ్ మారిపోయి రాజ్యలక్ష్మిని ఇష్టపడుతుంటాడు.

ఆస్తి కోసం.. విక్రమ్‌పై ప్లాన్ చేసి
అంతా మంచిగా సాగిపోతోన్న సమయంలో రాజ్యలక్ష్మికి కొడుకు పుడతాడు. అయినా ఆమె విక్రమ్‌ను మంచిగానే చూసుకుంటుంది. ఆ సమయంలో రాజ్యలక్ష్మి సోదరుడు వచ్చి 'ఆస్తి మొత్తం విక్రమ్ పేరు మీదే ఉందట. వాడు సంతకం పెడితేనే దాన్ని బదిలీ చేయడం కుదురుతుంది. నువ్వు వీడిని మంచిగా పెంచుతూ చదివిస్తే తెలివితేటలు పెరిగి మనల్ని ఇబ్బంది పెడతాడు' అని రెచ్చగొడతాడు. దీంతో ఆమె విక్రమ్‌ను చదువు మాన్పించేలా ప్లాన్ చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











