Intinti Gruhalakshmi Today Episode: అంకితను టార్గెట్ చేసిన లాస్య.. అభిని నిలదీయడంతో మరో గొడవ

వేరే భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకిత తాను చెప్పిన ఉద్యోగంలో చేరకపోయే సరికి గాయత్రి ఆమెపై ఫైర్ అవుతుంది. అంతేకాదు, తులసితో పాటు ఇంట్లో వాళ్లను సైతం నిందిస్తూ గొడవ చేస్తుంది. ఆ తర్వాత అంకిత అందరికీ క్షమాపణ చెబుతుంది. ఆ తర్వాత అందరూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతారు.

తులసి స్కెతస్కోప్ గిఫ్టుగా తీసుకొచ్చి ఇవ్వగా.. ఆమె చాలా సంతోషిస్తుంది. అనంతరం తులసి, నందూ మాట్లాడుకుంటూ ఉండగా.. లాస్య వచ్చి ఇద్దరినీ తిడుతుంది. చివర్లో శృతి.. ప్రేమ్‌కు కాల్ చేయగా.. అతడు లిఫ్ట్ చేయకపోవడంతో ఇద్దరికీ గొడవ జరుగుతుంది.

శృతి ప్రేమ్ విషయంలో తులసి బాధ

శృతి ప్రేమ్ విషయంలో తులసి బాధ

అంతకు ముందు గొడవ జరగడంతో ప్రేమ్, శృతి దూరం దూరంగా ఉంటారు. అది చూసిన తులసి ‘వీళ్లిద్దరూ ఎందుకు దూరంగా ఉంటున్నారా? గొడవ జరిగిందా ఏంటి?' అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత శృతి దగ్గరకు వెళ్లి ‘మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా?' అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీనికి శృతి ‘గొడవ కాదు ఆంటి.. చిన్న అపార్థం జరిగింది' అంటుంది. అప్పుడు ‘అటువంటి అపార్థాలు మరోసారి రాకుండా చూసుకో అమ్మా. దెబ్బతిన్నదానిలా చెబుతున్నాను' అంటుంది తులసి. తర్వాత అందరి గురించి తలచుకుని బాధ పడుతుంది.

అభితో మాధవి గురించి చెప్పిన తల్లి

అభితో మాధవి గురించి చెప్పిన తల్లి

ఇంట్లో ఒక్కొక్కరికీ గొడవలు జరుగుతుండడంతో అందరి జీవితాలు ఇలా మారిపోయాయి ఏంటి అని అనుకుంటుంది తులసి. ఇంతలో అభి ఇంటికి వస్తాడు. ఇప్పటి దాకా ఎక్కడికి వెళ్లావురా అని అడుగుతుంది. హాస్పిటల్‌లో ఆపరేషన్ ఉంటే వెళ్లా అని అంటాడు. మరి ఆపరేషన్ చేస్తే అంత హుషారుగా ఉన్నావు ఏంటి అలసిపోవాలి కదా అని అడుగుతుంది.

ఆ తర్వాత మాధవి వచ్చి వెళ్లిందని చెబుతుంది. దీంతో కంగారు పడిన అభి అవునా.. ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. ఊరికే నన్ను కలిసిపోవడానికి వచ్చింది అని అంటుంది. అంతేనా అని వెళ్లిపోతాడు.

లాస్యకు కన్నింగ్ ప్లాన్ చెప్పిన భాగ్య

లాస్యకు కన్నింగ్ ప్లాన్ చెప్పిన భాగ్య

ఇక, ఇంట్లో తనకన్నీ వ్యతిరేకంగా జరుగుతుండడంతో లాస్యకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అప్పుడే నందూ కూడా తనను ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదని తనలో అనుకుంటుంది. ఇంతలో భాగ్య వస్తుంది. ‘పేరుకు మాత్రమే నీకు ఇక్కడ కోడలు హోదా ఉందా? నాకు ముందే ఈ విషయం చెప్పాల్సింది. ఈ ఇంట్లో ధర్మయుద్ధం కలిసి రాదు. వెన్నుపోటు రాజకీయం చేయాల్సిందే. వాళ్లను విడగొట్టి చెడగొట్టు అని సలహా ఇస్తుంది. ఎవరైనా బాధలో ఉంటే వెళ్లి వాళ్లను ఓదార్చు. అప్పుడు వాళ్లు నీ కీలుబొమ్మలా అవుతారు' అంటూ కన్నింగ్ ప్లాన్ చెబుతుంది.

అంకితకు అత్త విలువైన సలహాలు

అంకితకు అత్త విలువైన సలహాలు

మరోవైపు, అంకిత వంట పనులు చేస్తూ ఉంటుంది. దీంతో తులసి అక్కడకు వెళ్లి ‘నువ్వు వంట పని చేయొద్దని చెప్పా కదా' అని అడుగుతుంది. దీనికి అంకిత ‘నేను వంట నేర్చుకోవద్దా ఆంటి' అని అడుగుతుంది. అప్పుడు తులసి ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఇల్లును ఎలా మెయింటైన్ చేయాలో అంకితకు చెబుతుంది తులసి. అంతేకాదు.. ‘ఆత్మాభిమానం పోగొట్టుకోవడం అంటే బతికున్న శవంతో సమానం అని అనిపించింది. నా గతం అంకుల్ రూపంలో ప్రతి రోజు నా కళ్ల ముందే తిరుగుతుంది' అంటుంది. దీంతో అంకిత సలహాలు పాటిస్తానని చెబుతుంది.

శృతి గురించి వాకబు చేసిన ప్రేమ్

శృతి గురించి వాకబు చేసిన ప్రేమ్

అంకితతో మాట్లాడిన తర్వాత శృతి గురించి అడుగుతుంది తులసి. దీంతో తనకు తలనొప్పి ఉందని, అందుకే ఇంకా లేవలేదని చెబుతుంది. మరోవైపు శృతికి బాగా తలనొప్పి ఉంటుంది. బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఆ సమయంలో ‘నేను లేవకున్నా కూడా ప్రేమ్ నన్ను అడగడు ఏంటి' అని అనుకుంటుంది శృతి. మరోవైపు ప్రేమ్ కూడా అదే అనుకుంటాడు. ఆ తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి ఏంటి ఇంత సేపు పడుకున్నావు ఏమైంది అని అడుగుతాడు. జ్వరం వచ్చింది. రాత్రంతా తలనొప్పి అని చెబుతుంది శృతి. దీంతో ప్రేమ్ టాబ్లెట్ తీసుకొచ్చి ఆమెకు ఇస్తాడు.

అంకితను టార్గెట్ చేసేసిన లాస్య

అంకితను టార్గెట్ చేసేసిన లాస్య

భాగ్య సూచన మేరకు లాస్య ఎవరినైనా టార్గెట్ చేయాలని అనుకుంటుంది. అందుకు అనుగుణంగానే ముందుగా అంకితను బుట్టలో వేసుకోవాలని భావిస్తుంది. సరిగ్గా అప్పుడే కిచెన్‌లో పని చేసుకుంటున్న అంకిత దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ‘వయసుకు మించిన బాధ్యత మోస్తున్నావు అంకిత అభి హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడే నీకు కిచెన్‌లో పని ఉండేది. ఇప్పుడు జాబ్ చేస్తూ కిచెన్ పని చేస్తున్నావు. నీకు భారంగా అనిపించడం లేదా. అయినా జాబ్ చేసే నువ్వు ఇంటి పనులు ఎందుకు చేయాలి. ముందు నీ జాబ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయ్' అని కన్నింగ్ ప్లాన్ ఇస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
అభిని నిలదీసిన తులసి.. గొడవ

అభిని నిలదీసిన తులసి.. గొడవ

అభి మీద కోపంతో ఉన్న తులసి ‘అభి.. నిన్న హాస్పిటల్‌లో సర్జరీలో ఉన్నావు కదా. ఆ సంగతి నీ హాస్పిటల్ వాళ్లకు తెలియదా. నిన్నేరా అడిగేది' అని అంటుంది. దీనికి అభి తెలియకుండా ఎలా ఉంటుంది మామ్.. నువ్వు మరీను అంటాడు. అప్పుడు ‘మరి.. నువ్వు హాస్పిటల్‌కు రాలేదు అని మీ వాళ్లు ఎంక్వయిరీ చేస్తూ ఫోన్ చేశారు' అని చెబుతుంది. దీంతో ‘ఈ మాట రాత్రే నన్ను ఎందుకు అడగలేదు? మామ్.. అది వేరే హాస్పిటల్‌లో ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తుంటే చెప్పకుండా వెళ్లాను' అంటాడు.

దీంతో కొడుక్కి రాత్రికి రాత్రే ఎదగాలనుకోవడం చాలా తప్పంటూ క్లాస్ పీకుతుంది. అప్పుడు లాస్య, నందూ కూడా తులసిని ఎందుకలా నిలదీస్తున్నావని అడుగుతారు. దీంతో ఆమె టెన్షన్ పడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X