Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌కు షాకిచ్చిన తులసి.. నందూ నిర్ణయంతో ఫ్యామిలీ హ్యాపీ
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనకు దక్కిన ఆస్తిని ఏం చేయాలని పరందామయ్య.. తులసిని అడగ్గా.. ఆమె తన పిల్లల పేరు మీద పంచమని సలహా ఇస్తుంది. కానీ, అప్పుడు నందూ వచ్చి తనకు ఆస్తి కావాలని అంటాడు. దీనికి పరందామయ్య కుదరదని అనడంతో తులసిని అడుగుతాడు. అప్పుడామె పిల్లలనే అడగమని అతడికి చెప్తుంది. దీంతో నందూ వాళ్లను అడగ్గా ఒప్పుకోరు. అంతేకాదు, ప్రేమ్ మరీ దారుణంగా అవమానిస్తూ మాట్లాడతాడు. దీంతో నందూకు కోపం వస్తుంది. ఆ వెంటనే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి గులాబీ మొక్కను చేతికి గుచ్చుకుంటాడు.

నందూకు క్లాస్ పీకిన తులసి
గులాబీ ముళ్లను గుచ్చుకుని నందూ తన చేతికి గాయం చేసుకోవడంతో తులసికి కోపం వస్తుంది. అప్పుడామె 'రాను రానూ ఎందుకండీ ఇలా తయారవుతున్నారు? మిమ్మల్ని మీరు ఎందుకు హింసించుకుంటోన్నారు? ఎవరి సానుభూతి కోసం ఇలా చేస్తున్నారు? ఎవరిని బెదిరించడం కోసం చేస్తున్నారు? అసలు స్పృహలో ఉండే ఇలా చేస్తున్నారా? అసలు మీ మైండ్ పని చేస్తోందా లేదా' అని ప్రశ్నిస్తుంది. అతడు వెళ్లిపోతుండగా 'ఆగండి.. ఎక్కడికి పారిపోతున్నారు? నాకు సమాధానాలు చెప్పిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి' అని ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది.

మన మధ్య బంధం లేదని
తులసి మాటలకు నందూ 'నా చేతి నుంచి కారే రక్తమే కనిపిస్తుంది.. నా గుండె నుంచి కారే రక్తం కనిపించడం లేదు' అంటాడు. ఆ తర్వాత 'తులసి ఆ చేతికి కట్టు కడుతుంది. మీ చేతికి గాయం చేసుకుంటే.. గుండెల్లో గాయం మానిపోతుందా? నొప్పి తగ్గిపోతుందా? సమస్య తీరుతుందా? మొన్న ఇలాంటి పనే చేశారు. వద్దని చెప్పా.. తప్పని చెప్పా.. మళ్లీ ఏంటిది' అంటుంది. దీనికి నందూ 'నా ఏడుపేదో నన్ను ఏడవనీ తులసి' అంటాడు. అప్పుడు తులసి 'మీ మీద ప్రేమతో కట్టు కట్టడం లేదు. మన మధ్య ఏదో బంధం ఉందని బాధ పడకండి' అంటుంది.

సహాయం చేస్తేనే పిల్లలా?
ఆ తర్వాత తులసి 'మన పాతికేళ్ల కాపురాన్ని ఎప్పుడో వదిలేశాను. నా సానుభూతి మీకు అవసరం లేదు అనుకుంటే.. మీ ఆవిడను పంపిస్తాను. పక్కన కూర్చుని ఓదార్చుతుంది. కన్నీళ్లు తుడుస్తుంది' అని అంటుంది. దీంతో నందూ 'నాకంతా అయోమయంగా ఉంది.. ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు' అంటాడు. దీనికామె 'మీరంతా తెలిసే చేస్తున్నారు. అయినా మీ పిల్లల కోసం ఆలోచించరా' అని అంటుంది. దీంతో నందూ 'వాళ్లు నన్ను కన్న తండ్రిలా చూడట్లేదు. నాకు సహాయం చేయడం లేదు' అంటాడు. దీంతో తులసి 'మీ అసలు బాధ అది. అయినా సహాయం చేస్తేనే పిల్లలు అవుతారా? అసలు ఇప్పటి వరకూ మీరు మీ పిల్లలకు ఏమైనా ఇచ్చారా' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ తలదించుకుని బాధ పడతాడు.

తులసి సలహా.. లాస్య గరం
నందూకు ఎంతగానో వివరించిన తర్వాత తులసి అతడికి సలహా ఇస్తుంది. 'మీకు వీలుపడే పనే చేసుకోండి. మీరు కొన్ని రోజులు కెఫేలో పని చేశారు కదా మర్చిపోయారా? అందులో అనుభవం కూడా సంపాదించారు కదా. స్వయంగా మీరే కెఫే పెట్టుకోవచ్చేమో ఆలోచించండి. దేవుడు తెలివి ఇచ్చింది ఆలోచించి నిర్ణయాలు తీసుకోడానికి. సరైన దిశలో ఆలోచించడానికి' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతలో ఆమెకు లాస్య ఎదురవుతుంది. అప్పుడు లాస్య 'సలహాలు ఇవ్వడం నువ్వు మానవా. కెఫే పెట్టమని అంటున్నావు' అంటూ ఆమెతో గొడవకు దిగుతుంది. దీంతో తులసి 'కావాలంటే వెళ్లి మీ ఆయనకు చెప్పుకో' అంటూ క్లాస్ పీకుతుంది. అయినా లాస్య వినదు. దీంతో తులసి 'ముందు నీ ఛాలెంజ్ మీద దృష్టి పెట్టు' అని అంటుంది.

ప్రేమ్‌ను ఇరికించిన తల్లి
తులసి సలహా ఇచ్చిన వెంటనే నందూ అందరూ కూర్చుని ఉండగా అక్కడకు వచ్చి 'నేను కెఫే పెడుతున్నాను' అని చెబుతాడు. దీనికి అందరూ సంతోషిస్తారు. తర్వాత అనసూయ 'ఆలోచన మంచిదే కానీ కేఫే పెట్టాలి అంటే డబ్బులు ఉండాలి కదా' అంటాడు. అలాగే, అభి 'స్థలానికి ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయాలి' అని అంటాడు. అప్పుడు తులసి 'అందరు స్థలం గురించి ఆలోచిస్తున్నారు కదా ప్రేమ్‌కు తాతయ్య ఇచ్చిన స్థలంలో స్టూడియో పెట్టుకోగా కొంచెం ప్లేస్ మిగులుతుంది. అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది' అని చెబుతుంది.

లాస్యకు షాకిచ్చిన నందూ
తులసి ఆ మాట చెప్పగానే అంతా ఓకే అంటారు. కానీ, లాస్య మాత్రం ఈ ప్రపోజల్ నచ్చలేదు అని అంటుంది. అంతేకాదు, 'నీ ప్రొఫెషన్ ఏంటి నువ్వు ఎందుకు కేఫ్ పెట్టాలనుకుంటున్నావు' అంటుంది. దీంతో నందూ 'నన్ను ఆపకు లాస్య. నేను అన్ని ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. నా వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నువ్వు సైలెంట్‌గా ఉండు' అంటాడు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక, తన ప్రమేయం లేకుండా స్థలాన్ని నందూకు ఇస్తానని అనడంతో ప్రేమ్ వెంటనే తన గదిలోకి వెళ్లి కోపంతో రగిలిపోతుంటాడు.

తులసి క్లాస్.. వాళ్లు టెన్షన్
ప్రేమ్ పరిస్థితిని అర్థం చేసుకుని తులసి అతడి దగ్గరకు వచ్చి 'ఎప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి ఆవేశపడకూడదు. మీ నాన్న నీ స్టూడియో పక్కన పెట్టుకోవడం ఇష్టం లేదా లేక మీ నాన్న ఇష్టం లేదా' అని అడుగుతుంది. దీంతో నందూపై తనకున్న కోపాన్ని ప్రేమ్ ప్రదరిస్తాడు. దీంతో అతడికి తులసి, శృతి సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు చూసి పరందామయ్య, అనసూయ టెన్షన్ పడుతుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











