twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: తులసికే నందూ జై.. లాస్యకు దెబ్బ మీద దెబ్బ.. అంకితకు అభి షాక్

    |

    సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

     బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన అభిని తులసి ఆరా తీస్తుంది. అంతేకాదు, మాధవి వచ్చి వెళ్లిందని చెబుతుంది. దీంతో అతడు ఎంతగానో భయపడిపోతాడు. మరోవైపు, ఇంట్లో ఒంటరిగా బాధ పడుతోన్న లాస్యకు భాగ్య విలువైన సలహాలు ఇస్తుంది. అంతేకాదు, వీక్‌గా ఉన్న వాళ్లను టార్గెట్ చేసి తన వైపునకు తిప్పుకోమని చెబుతుంది. అందుకు అనుగుణంగానే అంకితతో లాస్య మాట్లాడుతుంది. ఇక, చివర్లో అభిని తులసి మరోసారి నిలదీస్తుంది. దీంతో నందూ, లాస్య అతడికి అండగా మాట్లాడతాడు. దీంతో ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది.

    <strong>బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!</strong><br />బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!

    తులసిపై ఎదురుదాడితో పెద్ద గొడవ

    తులసిపై ఎదురుదాడితో పెద్ద గొడవ

    తప్పుడు దారిలో వెళ్తోన్న అభిని నిలదీయాలని డిసైడ్ అయిన తులసికి లాస్య రూపంలో సమస్య వస్తుంది. ఆమె ‘అసలు ఎందుకు అభిని అడుగుతున్నావు? ఏదైనా తప్పు చేశాడా? చేస్తే అందరి ముందే చెప్పాలి కానీ, ఇలా చేస్తారా' అంటుంది. దీంతో తులసి సైలెంట్‌గా ఉండిపోతుంది. అప్పుడు అంకిత ‘ఏ తల్లి అయినా బిడ్డ ఎదుగుదలే కోరుకుంటుంది. అందుకే ఆంటీ అడుగుతున్నారేమో' అని అంటుంది. దీనికి లాస్య ‘ఒక్క తులసి తప్ప' అని అంటుంది. అంతేకాదు, తన పిల్లలను గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటుందంటూ తులసిని నిందిస్తుంది.

     అభికి లాస్య హెల్ప్.. అంకితతో కలిసి

    అభికి లాస్య హెల్ప్.. అంకితతో కలిసి

    తులసి అడిగిన మాటలకు అభి ముఖం నీరుగారిపోతుంది. అంతేకాదు, తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. అదే సమయంలో తల్లి అడిగిన ప్రశ్నలక ఎలాంటి సమాధానాలు చెప్పాలా అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే లాస్య తులసితో చెప్పిన మాటలకు అభి సంతోష పడతాడు. ‘నాకు మధ్యలో వచ్చి మంచి పని చేసింది లాస్య. తన ఫోటోకు పాలాభిషేకం చేయాలి' అని మనసులో అనుకుంటాడు. ఆ వెంటనే దొరికిందే ఛాన్స్ అనుకుని అంకితను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి. దీంతో ఈ గొడవకు అప్పటితో పుల్‌స్టాప్ పడిపోతుంది.

    <strong>యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!</strong><br />యంగ్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ నైట్ పార్టీ: ఇద్దరూ అలా దొరికిపోవడంతో కలకలం!

     లాస్యకు మరోసారి షాకిచ్చిన నందూ

    లాస్యకు మరోసారి షాకిచ్చిన నందూ

    ఏదేదో మాట్లాడుతూ ఉన్న లాస్యతో నందూ ‘ఇక చాలు.. వెళ్దాం పదా. అవును నాకు లంచ్ బాక్స్ తయారు చేశావా' అని అడుగుతాడు. దీనికి లాస్య ‘చేయించాను.. రాములమ్మతో' అంటుంది. తర్వాత రాములమ్మ బాక్స్ తీసుకొస్తుంది. అప్పుడు ‘ఆ బాక్స్ పెట్టింది రాములమ్మే కానీ.. అందులో ఉన్న వంటలు వండింది మాత్రం తులసినే' అంటుంది అనసూయ. దీంతో లాస్య ‘మనకు అవసరం లేదు రా నందు.. మనం లంచ్ బయట తిందాం' అంటుంది. కానీ, నందూ మాత్రం ‘ఎన్నాళ్లిలా? నువ్వు నాకు వండి పెట్టేంతవరకు నేను తులసి వండిందే తింటా' అని చెప్పి ఆ బాక్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో లాస్య బాక్స్ కింద పడేయబోగా.. అలా చేస్తే తిండి దొరకదు అంటూ వార్నింగ్ ఇస్తుంది తులసి.

     అభితో రోడ్డు మీదే గొడవ పడ్డ అంకిత

    అభితో రోడ్డు మీదే గొడవ పడ్డ అంకిత

    మరోవైపు, అభి, అంకిత బైక్ మీద వెళ్తుంటారు. ఇంతలో అతడికి ఫోన్ వస్తుంది. అప్పుడు సరే.. వెంటనే వస్తున్నా అని చెప్పి అంకితను ఆటోలో వెళ్లమంటాడు. దీంతో ఆమె ‘అదేంటి.. నీ హాస్పిటల్‌కు వెళ్లే రూట్‌లోనే కదా నా హాస్పిటల్' అంటుంది. దీనికి అతడు తనకు వేరే పని ఉందని చెబుతాడు. అప్పుడు అంకిత ‘మళ్లీ ఈరోజు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావు' అని నిలదీస్తుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడతను ‘నేను ఏం చేస్తున్నానో ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. అలాగే నేను ఎవ్వరినీ మోసం చేయడం లేదు' అని చెప్పి ఆమెను వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

    Pushpa మూవీపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు: వాడు హీరోలా బిల్డప్.. బన్నీ అలా అనొచ్చా అంటూ ఘాటుగా!Pushpa మూవీపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు: వాడు హీరోలా బిల్డప్.. బన్నీ అలా అనొచ్చా అంటూ ఘాటుగా!

     తులసిని హెచ్చరించిన మామగారు

    తులసిని హెచ్చరించిన మామగారు

    తులసి ఫ్యాక్టరీకి వెళ్లబోతుండగా పరందామయ్య ఆమెను పిలుస్తాడు. అప్పుడు ‘మనకు మంచిరోజులు కావాలమ్మా. మనకు దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడమ్మా. నీ ముఖంలో ఏదో కలవరం కనబడుతుంది. అభి భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా' అని అడుగుతాడు. దీనికి తులసి ‘అలాంటిదేం లేదు మామయ్య అంటుంది. వాడు నీ చేతుల్లో లేడు తులసి. వాడు ఎప్పుడు మన చేతులు జారిపోతాడేమోనని భయంగా ఉంది' అంటుంది. దీనికాయన ‘వాడి కాళ్లు భూమ్మీద ఉన్నా.. ఆలోచనలు ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి జాగ్రత్త' అని హెచ్చరిస్తాడు.

    సారీ చెప్పిన ప్రేమ్.. నవ్వేసిన శృతి

    సారీ చెప్పిన ప్రేమ్.. నవ్వేసిన శృతి

    శృతి దగ్గరకు వెళ్లిన ప్రేమ్ ‘ఇంకా తగ్గలేదా? టాబ్లెట్లు ఎందుకు వేసుకోలేదు' అని అడుగుతాడు. దీనికామె. ‘జ్వరం తగ్గడానికి నాకు కావాల్సింది ట్యాబ్లెట్లు కాదు.. డబ్బు. నాకు డబ్బు పిచ్చి పట్టింది కదా. డబ్బు చూస్తే కానీ నాకు జ్వరం తగ్గదు' అంటుంది. దీంతో ప్రేమ్ ‘హాస్పిటల్‌కు వెళ్దాం పదా' అంటాడు. అప్పుడామె‘నాకు ఏడవడం తప్ప ఏమీ చేతకాదు.. అదే కదా చెప్పేది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అంతేకాదు.. ‘అంకుల్ నన్ను అనాథ అన్నప్పుడు.. నాకు ప్రేమ్ ఉన్నాడని అరిచి చెప్పాలనిపించింది. కానీ, ఇప్పుడు నేను మళ్లీ అనాథనే అనిపిస్తోంది. నా ప్రేమ్ కూడా అందరి లాంటి మగాడే అని తెలిశాక.. నిజంగానే నేను ఇప్పుడు ఒంటరిదాన్నే అనిపిస్తోంది అంటుంది శృతి. దీంతో అతడు సారీ చెప్పి ఆమెను నవ్విస్తాడు.

    NTR30: ఎన్టీఆర్ - కొరటాల సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. కథతో పాటు హీరో పాత్ర వివరాలు లీక్NTR30: ఎన్టీఆర్ - కొరటాల సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. కథతో పాటు హీరో పాత్ర వివరాలు లీక్

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    అభికి 30 వేలు లాభం.. అంకిత కోపం

    అభికి 30 వేలు లాభం.. అంకిత కోపం

    అభి తనకు లాభంగా వచ్చిన డబ్బులతో మళ్లీ స్టాక్ మార్కెట్‌‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. దీంతో అతడికి రూ. 30 వేల లాభం వస్తుంది. అప్పుడు అతడి ఫ్రెండ్ ‘ఇప్పటికైతే లాభం వచ్చింది కానీ.. సాయంత్రం లోపు ఉన్న షేర్స్ అన్నీ అమ్మేయాలి. లేకపోతే ఉన్నదంతా పోతుంది' అంటాడు. మరోవైపు, అంకిత హాస్పిటల్ నుంచి అప్పుడే వస్తుంది. దీంతో లాస్య ‘ఏమైంది.. జాబ్ ఎలా ఉంది' అని అడుగుతుంది. అప్పుడు అంకిత ‘జూనియర్ డాక్టర్ కదా.. అక్కడ నర్సు చేసే పనులు కూడా చేయాల్సి వస్తోంది' అంటుంది. ఇంట్లోకి రాగానే అనసూయ వచ్చి తాతగారికి చపాతీలు చేసి పెట్టమని అడుగుతుంది. దీంతో అంకిత సరేనంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 546: Parandhamaiah Warned Tulasi About Abhi Behaviour. After That Prem Said Sorry to Shruthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X