Don't Miss!
- News ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Intinti Gruhalakshmi Today Episode: అభితో కలిసి గాయత్రి ప్లాన్.. చివరి నిమిషంలో మాట మార్చిన నందూ
చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్లో జరిగిందిదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్లో.. నందూ గాయం చేసుకుని బాధ పడుతుంటే తులసి అతడికి క్లాస్ పీకుడుతుంది. అంతేకాదు, కెఫే పెట్టుకోమని అతడికి సలహా కూడా ఇస్తుంది. దీంతో నందూ ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. కానీ, లాస్య మాత్రం నందూ కెఫే పెట్టడం తనకు ఇష్టం లేదని చెబుతుంది.
ఆ తర్వాత ప్రేమ్‌కు పరందామయ్య ఇచ్చిన స్థలంలో నందూ కెఫే పెట్టుకోడానికి కొంచెం ఇవ్వమని తులసి అంటుంది. దీంతో అతడు ఎంతగానో నిరాశ చెందుతాడు. అప్పుడు తులసి తన కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది.
Pawan Kalyan: పెళ్లిళ్లపై పెదవి విప్పిన పవన్.. అందుకే ఆ ఇద్దరికీ విడాకులు.. అంత మాట అనేసిన బాలయ్య
ప్రేమ్ పారిపోతున్నాడు అంటూ
నందూ కెఫే పెడుతున్నాడని లాస్య కోపంతో ఇంట్లోని సామాన్లు అన్నీ విసిరేస్తుంటుంది. అందులో ఒకటి వెళ్లి అనసూయకు తగులుతుంది. దీంతో ఆమె లాస్యకు క్లాస్ పీకుతుంది. మరోవైపు, శృతికి తులసి అన్న తినిపిస్తూ ఉండగా ప్రేమ్ చూసీ చూడనట్లుగా వెళ్లిపోతాడు.
దీంతో శృతి 'ఆంటీ ఏంటి? ప్రేమ్ అలా వెళ్లిపోతోన్నాడు' అంటుంది. దీంతో తులసి 'ఎందుకంటే ఈ అమ్మ ముఖం, ఈ అమ్మ మాటలు వాడికి నచ్చట్లేదు. అమ్మ అమ్మలా ఉండకూడదట.. వాళ్ల నాన్నలా ఉండాలట.. వాళ్ల నాన్నలా ప్రవర్తించాలట. అందుకే పారిపోతున్నాడు' అని అంటుంది.
నా ముఖం చూపించలేనమ్మా
తులసి మాటలకు ప్రేమ్ 'పారిపోవడం కాదమ్మా.. నీకు నా ముఖం చూపించలేకపోతున్నానంతే' అంటాడు. దీంతో తులసి పారిపోతే సమస్యలు తీరిపోవురా.. ఏదొక నిర్ణయం తీసుకోవాల్సిందే అని అంటుంది. దీంతో ప్రేమ్ 'నువ్వు ఆయనకి సాయం చేయాలి అనుకున్నప్పుడు ఆయన అడిగినప్పుడే ఈ ఇంటిని రాసిచ్చేయాల్సింది. మరి ఎందుకు వెనక్కి తగ్గావు' అని అంటాడు. దీంతో తులసి 'నాకు ఇష్టం లేక కాదు.. ఆస్తినో డబ్బునో ఆయన చేతిలో పెడితే లాస్య ఆయన మనసుని కలుషితం చేస్తుంది.
డబ్బును వేస్ట్ చేయిస్తుంది. అందుకే ఆగాను. ఇప్పుడు మనం ఆస్తి ఇవ్వడం లేదు.. డబ్బు ఇవ్వడం లేదు.. చిన్న చోటు మాత్రమే ఇస్తున్నాం. అది అమ్ముకునే అవకాశం ఉండదు కదా. బతుకుతెరువు చూపిస్తున్నాం అంతే' అని అంటుంది.
వాటి సైజ్ పెంచుకోమన్నారు.. పెద్దగా కనిపించేందుకు అవి వాడేదాన్ని: సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మనం తప్ప ఎవరు ఉన్నాము
తులసి చెప్పిన మాటలకు ప్రేమ్ 'కానీ కేఫే అంటే స్థలం ఒక్కటే కాదు కదమ్మా.. డబ్బు కావాలి కదా' అంటాడు. దీంతో తులసి 'దానికి కూడా నా దగ్గర ఉపాయం ఉంది. అందరం కలిసి ఏం కావాలో ఎంత కావాలో డిసైడ్ చేద్దాం. ఆయన పేరునే అప్పుగా తీసుకుందాం.. తీర్చే బాధ్యత ఆయనిదే' అని అంటుంది. దీనికతడు అది అంత ఈజీ కాదమ్మా.. ఆయనకి చాలా ఇగో ఉంటుంది అని అంటాడు.
అప్పుడామె 'ప్రతి దాన్ని నెగిటివ్‌గా ఆలోచించకురా.. ముందు ఆయన నా భర్త అనే విషయాన్ని నీ మైండ్‌లో నుంచి తీసేయ్. నీ మనసు అక్కడే ఆగిపోయింది. ఒక్కసారి ఆయన గురించి ఆలోచించు. చూస్తుంటే జాలి వేస్తుంది. ఆయనకి మనం తప్ప ఎవరు ఉన్నాం. ప్రేమించినా ద్వేషించినా మనమే కదా. ఆలోచించరా' అని బ్రతిమాలుతుంది.
ప్రేమ్ కూల్.. లాస్యకు ఝలక్
ఆ తర్వాత తులసి 'నాకు భర్త అవసరం లేదు. కానీ, నా పిల్లలకు తండ్రి కావాలి. ఆశించి సాయం చేయకూడదురా. మీ నాన్నకి సపోర్ట్‌గా నిలబడటం అంటే మనకి మనం సపోర్ట్ చేసుకున్నట్టే. ఆయన సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. నా కొడుకులో ఈ తల్లి సంస్కారం ఉందని అనుకుంటున్నా.
నా ఆశని నిరాశ చేయకు' అని వివరిస్తుంది. దీంతో ప్రేమ్ కూల్ అవుతాడు. మరోవైపు లాస్య ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవడానికి డిక్షనరీ వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఇంతలో నందు వచ్చి క్లాస్ పీకుతాడు. అంతేకాదు, పరమ చెత్తగా చేస్తున్నావని తిడతాడు.
టూ పీస్ బికినీలో ప్రగ్యా సోకుల విందు: హాట్ షోతో ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!
ప్లేట్ ఫిరాయించేసిన నందూ
మరోవైపు నందూ ఫోన్లో మాట్లాడుతూ 'కేఫే స్టార్ట్ చేసే ఆలోచన విరమించుకున్నా.. ఎక్కడైనా జాబ్ ఉంటే చెప్పు' అని ఫ్రెండ్‌తో అంటాడు. అది తులసి, పరంధామయ్య, అనసూయలు వింటారు. ఆ వెంటనే తులసి 'కేఫే స్టార్ట్ చేయడం లేదు అంటున్నారు. మాకు ఏ విషయం చెప్పలేదు. కారణం చెప్పడం లేదు ఎందుకు' అని ప్రశ్నిస్తుంది.
దీంతో నందు 'కేఫే పెట్టాలని నాకూ ఉంది కానీ.. ప్రేమ్ స్థలం ఇవ్వడానికి ఒప్పుకోలేదు కదా? ఇటు ప్రేమ్ వద్దంటున్నాడు. లాస్య కూడా వద్దంటున్నాడు. అందుకే విరమించుకున్నా' అని అంటాడు. ఇంతలో ప్రేమ్ వచ్చి.. 'నేను ఒప్పుకుంటున్నా.. అమ్మ చెప్పింది కాబట్టి.. అమ్మ ఇష్టమే నా ఇష్టం' అని అంటాడు. అలాగే, లాస్య కూడా నాకు కూడా ఇష్టమే కానీ మూడు నెలల్లో లాభాలు చూపించాలి అంటుంది.
తులసి పేరు.. కాదు లక్కీ అని
అంతా అయిపోయిన తర్వాత కెఫెకు ఏ పేరు పెట్టాలని అనుకుంటారు. అప్పుడు పరందామయ్య 'తులసి పేరు పవిత్రమైనది' అని చెప్తాడు. దీంతో లాస్య 'తులసి పేరు పవిత్రం అంటే.. నా పేరు అపవిత్రమా? మనం ఇల్లు పెట్టి పక్కింటి వాళ్ల పేర్లు పెట్టినట్టు.. నందూ కేఫేకు తులసి పేరు పెట్టడం ఏంటి? అయినా కేఫ్ అంటే ట్రెండీగా ఉండాలి' అని అంటుంది.
దీంతో లాస్యనే పేరు చెప్పమంటారు. చివరికి తులసి కల్పించుకుని.. 'ఈ ఇంట్లో అందరి కంటే చిన్నవాడు లక్కీ.. వాడిపేరే పెడదాం.. ఆపరేషన్ లక్కీ కేఫ్ స్టార్ట్' అంటుంది. దీంతో అంతా సంతోషిస్తారు.
శృంగార తారలా మారిన బిగ్ బాస్ దివి: వాటిని చూపిస్తూ అందాల ఆరబోత
అభికి ప్లాన్ చెప్పిన గాయత్రి
ఇక, గాయత్రి కోసం అభి అక్కడకు వెళ్తాడు. అప్పుడామె 'మీ నాన్న ది గ్రేట్ నంద గోపాల్.. కేఫే పెడుతున్నాడనే విషయం నాతో చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. నా ముందు తలవంచుకున్నావు. సమాజంలో నీ పరిస్థితి ఏంటి? మీ నాన్న కేఫే నడుపుతున్నాడంటే నీకు సిగ్గుగా లేదా' అంటుంది. ఆ మాటతో అభి.. 'ఏం చేయను ఆంటీ.. ఇంట్లో వాళ్లంతా డాడ్కే సపోర్ట్ చేస్తున్నారు.
నా మాటని లెక్క చేయడం లేదు' అని అంటాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ సమయంలో గాయత్రి 'అంకిత నీ దారిలోకి రాకపోతే.. నువ్వే తన దారిలోకి వెళ్లు. తనను ఎలాగైనా మార్చేసి ఇక్కడకు వచ్చేలా చెయ్' అని ప్లాన్ వివరిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.