Intinti Gruhalakshmi Today Episode: తులసి ఇంట్లో మరో ముసలం.. గాయత్రికి లాస్య అలా చెప్పడంతో!
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య ఎంత రెచ్చగొట్టినా తులసి మాత్రం అభి గురించి నిజం చెప్పదు. ఆ తర్వాత నందూ.. లాస్యను లంచ్ బాక్స్ రెడీ చేయమంటాడు. కానీ, ఆమె చేయకపోవడంతో తులసి చేత్తో వండినవే అతడు తీసుకెళ్తాడు. అంకితను మధ్యలోనే దింపేసిన అభి.. ఆమెతో గొడవకు దిగుతాడు. అలా ఇద్దరి మధ్య భీకరమైన వార్ జరుగుతుంది. మరోవైపు, శృతికి జ్వరం తగ్గకపోవడంతో ప్రేమ్ అడుగుతాడు. ఆ తర్వాత అతడు సారీ చెప్పి ఆమెను కూల్ చేసేస్తాడు. ఇక, అభి ప్రవర్తన గురించి పరందామయ్య.. తులసిని హెచ్చరిస్తాడు.

అంకితకు ఆ పని చెప్పిన అనసూయ
అప్పుడే ఆస్పత్రి నుంచి వచ్చిన అంకితతో పరందామయ్యకు చపాతీలు చేసి ఇవ్వమని అడుగుతుంది అనసూయ. దీంతో సరే అమ్మమ్మ నేను చేసి పెడతాను అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న లాస్య ‘నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి నిన్ను అడిగారు. నువ్వు లేకపోతే ఏం చేసేవాళ్లు. బయటి నుంచి తెచ్చుకునేవాళ్లు కదా' అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడామె తాతయ్యకు బయటివి పడవు.. అందుకే తినరు అంటుంది. దీంతో లాస్య ‘ఏది ఏమైనా మీ తాతయ్యకు తులసి చేతి వంట తప్పించి ఇంకొకరి వంట తినడం తెలియదు' కదా అంటుంది.

చపాతీలకు వంక పెట్టిన అనసూయ
లాస్య మాటలను పట్టించుకోని అంకిత అక్కడి నుంచి వెళ్లి చపాతీలు చేసి పరందామయ్య, అనసూయకు తీసుకొచ్చి పెడుతుంది. అయితే, వాటిని చూసి షాక్ అవుతాడాయన. చపాతీలు మొత్తం మాడిపోతాయి. వాటిని చూసి తినలేకపోతారు. ఉప్పుగా ఉన్నాయి.. కషాయంలా ఉంది అంటుంది అనసూయ. అంతేకాదు, ‘ఏమిటే చపాతీలలో ఉప్పు ఇంత తగలేశావు. నువ్వు డాక్టర్‌వు ఆ మాత్రం తెలియదా' అంటుంది. మధ్యలో లాస్య కలుగజేసుకొని పాపం చిన్నపిల్ల వదిలేయండి అత్తయ్య అంటుంది. దీంతో ‘దాన్ని కూడా నీలాగా చేయమంటావా.. ఇప్పటి నుంచి పద్ధతిగా అన్ని నేర్పిస్తేనే తులసిలా పనిచేస్తుంది' అంటూ పంచ్ వేస్తుంది.

తులసిని చూసి నేర్చుకో అంటూనే
చపాతీలు బాలేవని చెప్పడంతో ఈ సారి మంచిగా చేస్తానని అంటుంది అంకిత. ఆ తర్వాత ఆమెను టీ తెమ్మంటారు. అది కూడా బాగోదు. దీంతో అనసూయ ‘నీకు చాయ్ చేయడం కూడా రాదా. అంకిత పని చేస్తే మనసు పెట్టి కుదురుగా పనిచేయి.. లేకపోతే చేయకు' అని అంటుంది. దీంతో అంకిత ‘నాకు టైమ్ లేదు కదా అమ్మమ్మ. నోర్మూసుకొని పనిచేస్తేనే ఇన్ని మాటలు అంటున్నారు. చేయకపోతే ఇంకెన్ని మాటలు అంటారో' అంటుంది. దీంతో అనసూయ వంట విషయంలోనే ఇలా ఉంటే.. ఇంటికి పెద్ద కోడలుగా బాధ్యత ఎలా చూసుకుంటావు? తులసిని చూసి నేర్చుకో' అంటుంది.

తులసితో పోలికలు.. అంకిత కోపం
మాట్లాడితే తులసి పేరు ఎత్తడంతో అంకితకు కోపం వస్తుంది. అప్పుడు ‘నేను అంకితను.. తులసిని కాదు. తులసి అలా చేస్తుంది.. తులసి ఇలా చేస్తుంది ఎంత సేపు ఇదే క్యాసెట్టేనా? ఆంటికి అన్ని విషయాల్లో తనకు అనుభవం ఉంది. తను ఏళ్ల నుంచి చేస్తోంది. ఆంటి పొద్దున అనగా వెళ్లి రాత్రి ఎప్పుడో వస్తుంది.. ఆంటి చాలా బిజీ. కానీ, నేను ఖాళీగా లేను కదా అమ్మమ్మ. నేనూ జాబ్ చేస్తున్నా కాదా. మీ లెక్కలో అది పనికి రాదా. నేను ఎంత బిజీగా ఉన్నా.. మీటింగ్ హడావుడి ఉన్నా మీరు చెప్పిన పని చేస్తాను. చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ, మీరు ఇంత చిన్న విషయాన్ని ఇలా చేస్తే ఎలా? మాటి మాటికి తులసి ఆంటితో పోల్చుతున్నారు. దయచేసి నన్ను తులసి ఆంటితో పోల్చొద్దు' అని చెప్పి వెనక్కి తిరుగుతుంది అంకిత. ఆ పక్కనే తులసి అన్నీ వింటుంది.

అంకితకు అలా క్లాస్ పీకిన తులసి
అంకిత మాటలకు లాస్య తనలో తానే పొంగిపోతుంది. అంతేకాదు, అప్పుడు ‘వావ్.. ఇన్ని రోజులు తులసి ఆంటి అన్నావు.. ఇప్పుడు తులసిగా మారిపోయిందా' అంటుంది. అక్కడే ఉన్న తులసి మాట్లాడడం మొదలెడుతుంది. అప్పుడు ‘నేను నీ వంట గురించి మాట్లాడటం లేదు. నీ సంస్కారం గురించి. వాళ్ల మీద ఎందుకు అలా అరుస్తున్నావు' అంటూ అంకితకు క్లాస్ పీకుతుంది. అప్పుడు లాస్య నాకు తెలిసి అంకిత తప్పేం లేదు అంటుంది. దీంతో తులసి అగ్నిలో ఆజ్యం పోయకు లాస్య అంటుంది. దీనికి అంకిత ‘ఆంటి మీరు చెప్పేది కరెక్టే కానీ.. నేను చెప్పేది కూడా అర్థం చేసుకోండి. అందరూ మీలా పర్‌ఫెక్ట్‌గా ఉండరు కదా. ఈ ఇంట్లో ఉండే ప్రతి కోడలును మీతో కంపేర్ చేయొద్దు' అంటుంది.

గాయత్రిని రెచ్చగొట్టేసిన లాస్య
అంకిత మాటలను తనకు అనకూలంగా మలచుకోవాలని లాస్య అనుకుంటుంది. అందుకు అనుగుణంగానే ‘ఈ ఇష్యూను ఇక్కడితో వదిలేయకూడదు. ఈ ఇంట్లో ముసలం పుట్టేలా చేయాలి. జరిగిందంతా గాయత్రికి చెబితే.. మిగితా విషయాలన్నీ తనే చూసుకుంటుంది' అని అనుకొని వెంటనే ఆమెకు ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ‘మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. మీ ఎక్స్ వియ్యంకురాలు తెగ హడావుడి చేస్తుంది. నీ కూతురు ఆకాశంలో ఎగురుతున్న తులసిని కిందికి వచ్చేలా చేసింది. మనం కలలో కూడా ఊహించని పనిచేసి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఒకేసారి వాళ్ల అత్తగారికి మా అత్తగారికి మొహం వాచేలా సమాధానం చెప్పింది' అంటుంది లాస్య.
Recommended Video

అంకిత మాటలకు తులసి బాధ
ఇక, అంకిత తనను ఎదురించి మాట్లాడడంపై తులసి బాధ పడుతుంది. అప్పుడు పరందామయ్య వెళ్లగా ‘జీవితంలో నేను ఓడిపోయాను మామయ్యా. అంకితకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను. నేను ఏదైతే జరగకూడదని అనుకుంటున్నానో అవే జరుగుతున్నాయి. అంకిత నావైపు చూసే చూపులకు సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు కోపం రావడం న్యాయమే కదా మామయ్యా' అని బాధపడుతుంది. దీనికాయన తప్పు నీది కాదమ్మా పరిస్థితులదే అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.


Click it and Unblock the Notifications











