Intinti Gruhalakshmi Today Episode: నందూకు సామ్రాట్ హెల్ప్.. ప్లాన్ ప్రకారం అంకితను ఒప్పించిన అభి
తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూకు స్థలం ఇవ్వడానికి ప్రేమ్ అంగీకరించకపోవడంతో తులసి అతడిని సముదాయించే ప్రయత్నం చేస్తుంది. చాలా సేపు మంచిగా వివరించి చెప్పిన తర్వాత అతడు ఒప్పుకుంటాడు. కానీ, తనకు ఎవరూ సహకరించడం లేదని నందూ కెఫే పెట్టనంటాడు. దీంతో తులసి అందరి ముందే ప్రేమ్ ఒప్పుకున్నట్లు చెబుతుంది. అంతేకాదు, ఆ కెఫేకు లక్కీ పేరును పెడదామని కూడా అంటుంది. ఇక, గాయత్రి ఇంటికి వెళ్లిన అభితో అంకితను తన ఇంటికి తీసుకొచ్చేలా రెచ్చగొడుతుంది. అలాగే, ఓ అదిరిపోయే ప్లాన్‌ను కూడా వివరిస్తుంది.

అభి పరువు తీసేసిన గాయత్రి
అంకితను తన దారిలోకి తెచ్చుకునేందుకు అభికి గాయత్రి ప్లాన్ చెప్తుంది. అది విన్న వెంటనే అభి 'ఇదంతా వినడానికి ఎంత హాయిగా ఉంది ఆంటీ' అంటాడు. దీంతో గాయత్రి 'నువ్వు తీరిగ్గా కూర్చొని వినడానికి నేనేం హరి కథ చెప్పలేదు. వెళ్లి ఆ పని చూడు. అయినా పెళ్ళాన్ని కంట్రోల్‌లోకి తెచ్చుకోలేని మగాడివి నువ్వేం మగాడివి' అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో అభి 'ఏంటి ఆంటీ ఒకసారి అంతలా అనేసింది. అంకుల్ విషయంలో ఆమె చేసేది కూడా ఇదే కదా. అయినా తప్పదు కదా మాటలు పడాల్సిందే' అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అంకితకు ఇంట్లో వాళ్ల సపోర్ట్
ఇంట్లో అభి, అంకిత గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అది విన్న తులసి 'ఎందుకురా అంతలా అరుస్తున్నారు ప్రశాంతంగా మాట్లాడుకోలేరా' అని అంటుంది. దీంతో అభి తనే గట్టిగా అరుస్తుంది అని చెప్తాడు. అప్పుడు అంకిత 'చూడండి ఆంటీ వాళ్ల హాస్పిటల్‌లో పని చేయమని అడుగుతున్నారు. అది కార్పొరేట్ హాస్పిటల్. అక్కడ అంతా డబ్బు కోసమే ఆరాటం ఉంటుంది. ఇదంతా నాకు పడదు. అది ఈ మాట ఎప్పటి నుంచో చెబుతున్నాను' అంటుంది. దీంతో నందూ 'అప్పుడు ఇష్టం లేదు అన్నప్పుడు ఎందుకురా ఫోర్స్ చేస్తావు. ఇష్టం లేని దగ్గర ఎవరూ పని చేయలేరు' అని అంటాడు. అలాగే, పరందామయ్య, అనసూయ, తులసి కూడా అంకితను సపోర్ట్ చేసి మాట్లాడతారు.

తన బాధను చెప్పుకున్న అభి
అందరూ అంకితకు సపోర్ట్ చేయడంతో అభి 'చూడండి డాడ్ లైఫ్ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. తను ఒక హాస్పిటల్‌లో, నేను ఒక హాస్పిటల్‌లో పని చేస్తున్నాం. ఎప్పుడు వస్తున్నామో.. ఎప్పుడు వెళ్తున్నామో మాకే తెలియదు. కనీసం సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి కూడా టైం లేదు. పేరుకే భార్య భర్తలము.. ఇంట్లో ఉంటే మామ్ దగ్గర లేదా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. లైఫ్ అంటేనే విసుగువస్తోంది డాడ్. ఒకేచోట ఉంటే కనీసం కాసేపు కూర్చొని మాట్లాడవచ్చు. భార్యతో గడపడం తప్పా మామ్' అని తన బాధను చెప్పుకుంటాడు. అప్పుడు తులసి 'అభి మాటలు అర్థం చేసుకోమ్మా. వాడి బాధని అర్థం చేసుకుని వాడితో పాటు హాస్పిటల్‌కు వెళ్ళు' అని చెప్పడంతో అంకిత ఒప్పుకుంటుంది.

తులసి వల్ల సామ్రాట్ నిరాశ
ఇక, ఆఫీసులో సామ్రాట్, తులసి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో తులసి మూడీగా ఉండడం చూసి సామ్రాట్ ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడతను 'మీరు పెట్టే మెయిల్స్ చూస్తే నాకు సరదాగా ఉంటుంది అండి. మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి' అంటాడు. దీనికామె 'ఆ దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు' అంటుంది. అప్పుడు సామ్రాట్ 'మీరు లైఫ్‌లో అన్నీ పాజిటివ్‌గా తీసుకుంటారు కదా' అంటాడు. దీంతో తులసి 'అందుకే నేను వెనుకబడిపోయాను' అంటుంది. ఆమె మాటలకు సామ్రాట్ నిరాశగా ఉండిపోతాడు.

నందూ కోసం సామ్రాట్ ప్లాన్
తులసి బాధను పోగొట్టేందుకు సామ్రాట్ ఎంత ప్రయత్నించినా ఆమె నవ్వదు. తర్వాత నందూ కెఫే బిజినెస్ గురించి తెలుసుకున్న సామ్రాట్.. 'ఎలా అయినా నందూను ఒక దారిలోకి తెచ్చే ప్లాన్‌లో ఉన్నారన్న మాట' అంటాడు. దీంతో తులసి 'కథ ఇప్పుడే మొదలు పెట్టాను. పూర్తి అవ్వాలి అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం కదా సమస్యలు తప్పవు' అంటుంది. దీంతో సామ్రాట్ 'మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా ఫ్రెండ్ కేఫే మూసి వేసి బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నాడు. మీరు ఓకే అంటే వాడితో నేను మాట్లాడి సెట్ చేస్తాను' అంటాడు. సామ్రాట్ చెప్పిన దానికి తులసి ఆలోచనలో పడగా.. డబ్బు ఎలా కట్టినా మా ఫ్రెండ్ ఒప్పుకుంటాడు. మీరేం భయపడకండి అంటాడు.

పెట్టుబడి పెట్టడం గురించి
నందూ కెఫేకు పెట్టుబడి గురించి ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నందూ 'కేఫేలో ఫర్నిచర్ సెట్ చేసుకోవడానికి ఎంతలో ఎంతైనా ఐదు లక్షలు ఖర్చు అవుతుంది' అంటాడు. దీంతో లాస్య 'ఈడ్చి కొడితే మన దగ్గర 50 వేలు లేవు అంత లెక్క ఎలా సంపాదిస్తావు? అమ్ముకోవడానికి నా దగ్గర అత్తింటి వాళ్లు పెట్టిన నగలు కూడా లేవు' అంటుంది. ఇది విన్న అనసూయ 'అత్తింటి వాళ్ళు నేను ఇంట్లో ఉంచుకోవడమే గొప్ప మల్ల బంగారం పెట్టడం కూడానా' అని అంటుంది. ఆ తర్వాత అంకిత, అభి అక్కడకు వచ్చి ఏమైందని అడుగుతారు.

గాయత్రిని అడగమనడంతో
అభి అడగ్గానే పరందామయ్య మీ నాన్న కెఫేకు ఐదు లక్షలు అవుతుందట చెక్ ఇస్తావు క్యాష్ ఇస్తావో చెప్పురా అభి అంటే.. నా దగ్గర లేవు అంటాడు. వెంటనే లాస్య 'నీ దగ్గర డబ్బులు లేవు నీకు పిల్లనిచ్చిన అత్తగారి దగ్గర ఉన్నాయి కదా. నువ్వు అడిగితే ఇవ్వను అంటాదా ఏంటి. ఐదు లక్షలు కాదు 50 లక్షలైన ఎడమ చేతితో ఇస్తుంది కాదంటావా' అంటుంది. దీంతో అభి 'నా నోట్లో నుంచి మాట రావడమే ఆలస్యం వెంటనే డబ్బులు ఇస్తుంది కాకపోతే ఒక ఒక కండిషన్ ఉంది. నేను అడిగినంత డబ్బు ఇవ్వాలి అంటే ఆవిడ చెప్పిన విధంగా నేను అంకిత వేరే ఇంట్లో కాపురం పెట్టాలి' అంటాడు. దీనిపై వాళ్లంతా చర్చించుకుంటారు. అప్పుడే వచ్చిన తులసి అవి విని సామ్రాట్ ప్లాన్ గురించి చెప్తుంది. దీనికంతా ఒప్పుకుంటారు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











